Pages

Monday, December 23, 2013

!!మేమే ఇండియన్స్!!
పోయొద్దు అన్న చోటే పోస్తాం.........................!
ఆపొద్దు అన్న చోటే ఆపుతాము............................................!
వెళ్లొద్దు అన్న చోటే వెళ్తాము...............................................!
ఇవ్వొద్దు అన్న చోటే ఇస్తాము.............................!
తాగొద్దు అన్నదే తాగుతాము...........................!
చేయొద్దు అన్నదే చేస్తాము........................!
వేయకూడదు అన్న వాడికే వోట్ వేస్తాము.......!
సత్యం పలికే హరిశ్చంద్ృులం...అవసరానికో అబద్దం............ మనకి ప్రతీదీ అవసరమే...!
నిత్యం నమాజు పూజలు చేస్తాం...రోజూ తన్నుకు చస్తాం...........మనకు మనుషులు కన్నా మతాలు కులాలు ముఖ్యం..!

గురూ ఇధి ఇండియా మేము మారము....ఎవ్వర్ని మారనివ్వం.

దేవాయాని...ఇప్పుడు టీవీ లలో పరిచయం అవసరం లేని పేరు. ఈ రోజే కొత్తగా మన దేశం పరువు అగ్రరాజ్యం ముందు పోయింధేమో అన్నట్లు కొత్తగా మాట్లాడుతుంది మన మీడీయ అండ్ మన నాయకులు. ఇప్పుడే కొత్తగా వీళ్ళకు పరువు గుర్తుకోచిందా.....? Dr. AP J అబ్దుల్ కలాం గార్ని, జార్జ్ ఫెర్నాండెజ్ ని US ఏర్‌పోర్ట్ లో అడ్డుకున్నప్పుడు గుర్తు లేదా...!

మనకి అలవాటు గా మారిపోయింది..ఏ పవర్ లేని వాడు లేక ఏ పైస లేని వాడే చట్టాలను గౌరవించాలి. అంతే కానీ పదవి లో ఉన్న వాళ్ళకి పైసలు ఉన్నవాళ్ళకి చట్టాలు చుట్టాలు లాంటివి. ఏ రాజకీయ నాయకూడినో ఏ కోటీశ్వరిడీనో మన దేశం లో తప్పు చేస్తే అరెస్ట్ చేసి కోర్ట్ మెట్లు ఎక్కించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఏ సామానయుడ్ని అడిగినా అర్డమవుతుంది.

కానీ అన్ని దేశాలు మనలా ఉండవు కదా మిత్రమా...!! న్యాయం దర్మం అనేవి అందరు మనలా త్వరగా మర్చిపోలేరు కధా....!! మనకంటే ఇవన్ని కొత్త కానీ పాపం వాళ్ళకి అలవాటె. అసలు దేవాయని కేస్ లో నిజ నిజాలెంతో తెల్సుకోకుండా ఈ న్యూస్ ని TRP రేటింగ్ కోసం ఒక మహిళకు అన్యాయం జరిగింది దేశం పరువు పోయింది అని బోడి గుండు కి మోకాలికి ముడి పెట్టడం అవసరమా...!

ముందు మన కల్ల ముందు మన మద్యలో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆపండి, లేకపోతే న్యాయం జరిగేలా చూడండి. మన వలన మన దేశం పరువు దిగజారకుండా చూడండి. మేము మారుతాం.......ఎదుటి వాళ్ళని మారుస్తాము.

అని ఆశిస్తూ. మీ....................................సతీష్.

Friday, December 6, 2013

!!బంద్!! ఆలోచించండి చేసే ముందు....!!కొన్ని రోజులుగా వార్తలు చదవడం బ్లాగులు రాయడం మానేసాను.ఈ రోజు ఒక ఆటో వాడి వల్ల మల్లి బ్లాగ్ ని ఓపెన్ చేసాను. చాలా రోజుల తరువాత ప్రజలు బంద్ అనే మాటను మర్చిపోతారేమో అనే భయం తో ఈ రోజు బంద్ ని ప్రకటించారు. బంద్ ఎందుకు అంటే సగం మందికి తెలీదు, మిగిలిన సగం మందికి ఆ ఇంకెందుకు ఏ తెలంగాణా గురించో అయి ఉంటుంది లే అని ఫిక్స్ అయిపోతున్నారు.నిజమే అస్సలు బంద్ ఎందుకు...ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నే...?

మామ రేపు బంద్ చేయాలంట అన్న ఫోన్ చేసిండు, సాయంత్రం షాప్ కి పోయి ఒక ఫుల్ బాటిల్ చికెన్ పట్టుకుని రా. అట్లనే బండి లో పెట్రోల్ లేదు ఫుల్ ట్యాంక్ కొట్టిచ్చు రేపు సిటీ మొత్తం తిరగాలి అన్న వెనకాల ర్యాలి లో. ఏ నా కొడుకన్నా షాప్ ఓపెన్ చేస్తే అద్దాలు పగలాలి సరేనా అని ఫోన్ పెట్టాసాడు ఒక అమాయకపు మూర్ఖుడు.

అరేయ్ నానా రేపు బంద్ అంట షాప్ తెరవకు మొన్ననే పది వేలు పెట్టి పగిలిన అద్దం వేపిచ్చాం, ఈ నెల షాప్ రెంట్ కట్టడమే కష్టం గా ఉంది, మల్లి ఆ అద్దం పగిలిందంటే ఇంకా అంతే మన పని జాగర్త అని ఫోన్ పెట్టేసాడు రెక్కాడితే గాని డొక్కాడని ఒక సామాన్యుడు.

ఒకప్పుడు ఏ కరెంటు చార్జీలు పెరిగినప్పుడో లేక నిత్య అవసర వస్తువుల ధరలు పెరిగినప్పుడో ప్రజలు స్వచ్చందం గా తమ నిరసనలు తెలియ చేసేవాళ్ళు. ఈ బందులు ఉద్యమాలు ఎప్పుడో ప్రజల చేతుల్లో నుండి స్వార్ద రాజకీయ నాయకుల చేతుల్లోకి జారిపోయాయి.ఒకడు నేనున్నాను అని చెప్పుకోడానికి, ఇంకొకడు తన ఉనికిని చాటుకోడానికి బందులను చేసే స్థితికి వచ్చారు. నాయకుడు చేయమంటే బందు చేయాలి వద్దు అంటే మానేయాలి.ఇలా ఎవడి అవసరాలకు వాడు బందు చేయమనే వాడే గాని ఎందుకు చేయాలో చేస్తే వచ్చే ప్రయోజనాలు ఏమిటో చెప్పే వాడు కాని చేసేవాడు కాని లేడు.

మామూలు రోజుల్లో రోడ్ మీద కానిస్టేబుల్ ని చూసి పోసుకునే వాడు కూడా బందు అనగానే రాళ్ళు కర్రలు పట్టుకుని బస్సు అద్దాలు షాప్స్ అద్దాలు పగలు కొట్టడానికి ఉరుకులు పెడుతుంటాడు. పోలీసులు చేతులు కట్టుకుని చూస్తూ ఉండిపోతారు ఎవడ్ని గెలికితే ఎవడొస్తాడో అని. కస్టపడి రూపాయి రూపాయి సంపాదించుకునే వాడికి తెల్సు ఒక్కరోజు తను పనికి పోకపోతే జరిగే నష్టమేమిటో అంతే కాని బంద్ చేపిచ్చే వాడికి ఏమి తెల్సు. ఎవడికి ఇష్టమయి వాడు చేస్తే దాన్ని నిరసన అంటారు కాని బలవంతం గా చేపిచ్చే దాన్ని ఏమంటారు.....?

బంద్ వల్ల జరిగేవి/ఒరిగేవి:


లీటర్ పెట్రోల్ బ్లాక్ లో 200 రూపాయలకు దొరుకుతుంది.

రోజు పది రూపాయలు తీసుకునే ఆటో వాడు 30 రూపాయలు తీసుకుంటాడు.

RTC బస్సు లకు రిపేర్ చేపిచ్చుకునే టైం దొరుకుతుంది

గవర్నమెంట్ ఉద్యోగులు రోజులా కాకుండా ఇంట్లోనే పడుకునే ఛాన్స్ దొరుకుతుంది.

కాలేజీ/స్కూల్ స్టూడెంట్స్ కి బుంక్ కొట్టే బాధ తప్పుతుంది.

మీడియా కి కాస్త ఎక్కువ టైం పాస్ దొరుకుతుంది.

ఫుల్ బాటిల్ రేట్ కి క్వార్టర్ బాటిల్ దొరుకుతుంది( క్వార్టర్ బాటిల్ కొనుక్కుని తాగి వాటర్ బాటిల్ దొరక్కుండా చేయడమే బంద్ అంటే)

ఇంతకన్నా బంద్ ల వల్ల ఒరిగేవి ఉంటె తెలియ చేయండి.   ఏదన్నా సాధించాలి అనుకుంటే మనల్ని నమ్ముకున్న సామన్యుడ్ని బాధ పెట్టకుండా మనం ఎన్నుకున్న కొంతమంది చేతకాని నాయకుల మీద పోరాటం చేయాలి అని ఆసిస్తూ.మీ.......................................సతీష్.

Sunday, September 15, 2013

ప్రశ్నిస్తే తప్పా……?


రాజకీయాలలో ప్రతి MLA తన వారసులను ఇంకో MLA చేయాలనుకుంటాడు, ప్రతి CM తన కొడుకిని నెక్స్ట్ CM గా చూడాలని అనుకుంటాడు. కాని ఏ పార్టీ కార్యకర్త కుడా తన కొడుకుని ఇంకో కార్యకర్తగా చూడాలి అనుకోడు. రాజకీయమంటే సేవ అదొక వరంగా చెప్పుకునే మన నాయకుల ఆలోచన ల లో ఇంత తేడా ఎందుకో మరి… MLA అయినా కార్యకర్త అయినా ఇద్దరు రాజకీయ నాయకులే కదా..! కాని ఇద్దరి ఆలోచనలలో ఇంత తేడా ఎందుకు. ఎందుకంటే MLA నో మంత్రిగా నో లేక CM గానో ఉంటె ప్రజల సొమ్ముని అడ్డంగా దోచుకోవచ్చు, ఈ దోచుకునే వారసత్వాన్ని వేరే వాళ్లకి పోనివ్వడం ఎవరికి మాత్రం ఇష్టముంటుంది చెప్పండి. అదే కార్యకర్త అయితే పార్టీ జెండా మోసి మోసీ బుజాలు కాయలు కాయటం తప్ప ఒరిగేదేమీ లేదు..ఆ బాధని తమ వారసులకు వద్దు అనుకోడంలోనూ తప్పు లేదు గా.

ఒక తల్లి తన బిడ్డని అందలం ఎక్కించడానికి తను ఎన్ని త్యాగాలు చేసినా తప్పు లేదు కాని, కన్న  తల్లి లాంటి దేశాన్నే ముక్కలు చేయాలనుకోవడం చాలా బాధాకరమ్. ఇన్ని రోజులు బుజాలు కాయలు కాసే లాగ మిమ్మల్ని  మోసిన ఈ పిచ్చి జనాల బుజాలనే మీరు నరకాలనుకోవడం మూర్కత్వం కాక ఇంకేమిటి....!! ఒక్కసారిగా ఆ పిచ్చి జనాలు ఎదురు తిరిగేలోపు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితికి వచ్చారు మీరు.  వెనకటికి ఎవడో తను కూర్చున్న కొమ్మని తనే నరుక్కున్నాడట అలా ఉంది ఇప్పుడు మీ పరిస్థితి. ఒక్కసారిగా ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి మిమ్మలను ప్రశ్నిస్తే తప్పా....!! 

ఒక ఇంటిలో ఇద్దరు అన్నా తమ్ముడు ఉన్నారు, వాళ్ళిద్దరికీ కలిపి 10 ఎకరాలు బూమి ఉంది. ఇద్దరు విడిపోదామని ఊరి పెద్ద దగ్గరకు వెళ్తే, 10 ఎకరాలను  పంచడం చాల కష్టం గా ఉంది 8 ఎకరాలును పెద్దమనిషి అయిన నాకు వదిలేసి మిగిలిన రెండు ఎకరాలను సమానం గా చేరికొకటి తీసుకోండి అన్నట్లు ఉంది మన ఢిల్లీ పెద్దల బాగోతం. వాళ్ళ కు రావాల్సిన MP సీట్స్ ని లెక్కలు కట్టి మన మధ్య పంపకాలను మొదలేశారు తప్ప ఏది మంచో ఏది చెడో అని ఏ ఒక్క క్షణం ఆలోచించకుండా నిర్ణయాలను తీసుకుని మనల్ని భళి పశువుల్లా ఆడిస్తుంటే మింగలేక కక్కలేక చస్తున్నారు మన నాయకులు. కుక్కల్లా మనకు కాపలా కాయాల్సిన ఈ నాయకులు ఢిల్లీ లో వేసే బిస్కట్లకోసం సొల్లు కార్చుకుంటూ ఇళ్లు వదిలేసి తిరుగుతున్నారు.... ప్రజలు రోడ్లు ఎక్కారని మీరనుకుంటున్నారు, కాని మీ బ్రతుకులను రోడ్లమీద కు ఈడ్చే రోజులు దగ్గరకి వచ్చాయి అని తెలుసుకోమని హెచ్చరిస్తూ.......... 

మీ.................................................. సతీష్. 

Friday, August 16, 2013

"అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వరాజ్యమందామా..!!"


ముందుగా ఒకింత నిస్పృహతో  అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఆగష్టు 15 వచ్చినప్పుడల్లా నిజం గా మూడ నమ్మకాలను నమ్మాలేమో అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే మనకు స్వాతంత్ర్యం  వచ్చింది అర్దరాత్రి అమావాస్య వలనేమో మన బ్రతుకులు ఇంకా చీకటిలోనే ఉన్నాయి. ఏ రోజు అయితే ఒక ఆడపిల్ల ఒంటరిగా అర్దరాత్రి తిరుగ గల్గుతుందో ఆ నాదే మనకు నిజమయిన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని మన మహాత్ముడు చెప్పారు. అర్దరాత్రి సంగతి పక్కన పెడితే మన దేశ రాజధాని నది బొడ్డులో మిట్ట మధ్యాహ్నం కూడా ఆడపిల్ల ఒంటరిగా తిరగలేని పరిస్థితి ఉంది.కార్పొరేట్ మాటల్లో చెప్పాలంటే ఒక ఫిమేల్ ఎంప్లాయ్ ని కాబ్ లో సెక్యూరిటీ గార్డ్ లేకుండా పంపలేని మనకి స్వేచ్చా స్వాతంత్ర్యం వచ్చినట్లా..రానట్లా..!!


"ఏ దేశమేగినా ఎందు కాలెడినా

ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా,

పొగడరా నీ తల్లి భూమి భారతిని,

నిలపరా నీ జాతి నిండు గౌరవము.

లేదురా ఇటువంటి భూదేవి యెందూ

లేరురా మనవంటి పౌరులింకెందు."
అని రాయప్రోలు గారు ఎలుగెత్తి చాటారు.ఇప్పుడున్న పరిస్థుతులలో మనం ఏ ధైర్యం తో "లేరురా మనవంటి పౌరులింకెందు" అని చెప్పగలమా..!! "నిలుపగాల్గుతున్నామా మన జాతి నిండు గౌరవాన్ని". ఒక్కరోజు త్రివర్నపు పతాకాన్ని ఎగురవేసి, మన విలువలను గాలోకి వదిలేసి, టీవీ ల లో దేశభక్తి సినిమా చూసి మనకి స్వాతంత్ర్యం వచ్చింది అని గుర్తు చేసుకునే దుస్థితికి వంద సంవత్సరాల పోరాటం అవసరమా..!


"దేశమంటే మట్టి కాదోయి దేశమంటే మనుషులోయి" అన్న గురజాడ గారి మాటలు వింటుంటే బాధ గా ఉంది. ఇప్పుడు ఆ మట్టికి ఇచ్చిన విలువ కూడా తోటి మనిషికి మనం ఇవ్వడం లేదేమో. మన స్వాతంత్ర్య సమరయోధులు ఏ ఆస్తులను, ఏ పదవులను అయితే లెక్క చేయకుండా మన దేశం కోసం నిస్వార్డం గా పోరాడారో, ఇప్పుడు నాయకులు అదే ఆస్తుల కోసం అవే పదవులకోసం అమ్ముడుపోయి మన దేశాన్ని స్వార్ధం కోసం పీడిస్తున్నారు.ఈ 67 సంవత్సరాలలో నేను భారతీయుడ్ని అని గర్వం గా చెప్పుకునే దగ్గరనుండి. నేను పలానా మతం, నేను పలానా కులం, నేను పలానా ప్రాంతం అని చెప్పుకునే అంత ఎదిగిపోయాం మనం.మనిషి సృష్టించుకున్న డబ్బు, పదవుల చేతుల్లో మనిషే కీలుబొమ్మలు గా మారి మనల్ని మనమే నాశనం చేసుకుంటూ, మన దేశాన్ని కూడా నాశనం చేసే అంత డెవలప్ అయ్యాం.

"పోరాటాల ఫలితాలను వృధా చేస్తూ..
ధన దాహాలకు చేతులు చాస్తూ..
కుల మతాలకు చిచ్చులు పెడుతూ..
అధికారానికి ఆరాటపడుతూ..
రోజు రోజు కి మ్రుగాలలా మారుతూ..
బానిస బ్రతుకలకు మళ్ళీ బాటలు వేస్తూ..."సిరివెన్నెల గారు అన్నట్లు "అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వరాజ్యమందామా..!!"

మీ...................సతీష్.

Friday, August 9, 2013

రాష్ట్రాలు రావణ కాష్టాలు
తెలంగాణా కి ఒక్క రూపాయి కుడా ఇవ్వను, ఏమి చేసుకుంటావో చేసుకో అని ఒకడంటాడు.మీకు ఇక్కడ ఉండే హక్కు లేదు మిమ్మల్ని ఉండనివ్వం అని ఒకడంటాడు.స్టేట్ ని విడదీయకపోతే నరుకుతా అని ఒకడంటే, విడదీస్తే నరుకుతా అని ఇంకొకడంటాడు.అస్సలు ఏమనుకుంటున్నారో వీళ్ళు,కుక్కలవలె నక్కలవలె సందులలో పందుల వలె. ఎవడి నోటికి వచ్చినంత వాడు వాగడం, ఎవడికి తోచినట్లు వాడు చేయడం అలవాటుగా మారింది మన నాయకులకు. సామాన్యుడికి రోజు అన్యాయం ఏదో ఒక రూపం లో జరుగుతూనే ఉంది, కాని ఇవేమీ ఏ ఒక్క నాయకుడికి కనపడవు ఏ రోజు వాటికోసం రోడ్ ఎక్కి పోరాడిన నాయకుడు ఒక్కడు లేడు. కాని ఈ రోజులు ఆస్తులు అంతస్తులు, పదవులను కాపాడు కోవడానికి మాత్రం రోడ్ మీదకు వచ్చి కొట్టుకు చస్తున్నారు.

దేశం లో ఎన్ని రాష్ట్రాలు కలిసి ఉన్నా, ఎన్ని రాష్ట్రాలు విడిపోయినా పేద వాడు పేద వాడిగానే ఉన్నాడు తప్ప సామాన్యుడికి ఒరిగిందేమీ లేదు.వీళ్ళని ఎన్నుకోవడం వల్ల ప్రజలకి ఒరిగిందేమీ లేదు, అలానే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ దొంగ రాజి నామాలు, ధర్నాలు వలన మళ్లీ ఇంకొకసారి ప్రజలకి నామాలు పెట్టడమే తప్ప ఉపయోగమేమీ లేదు. రాజకీయ నాయకుడు గెలుపుకోసం ఆస్తులు మాత్రమె పానం గా పెట్టేవాడు ఒకప్పుడు, కాని ఇప్పుడు తన మనుగడ కోసం ప్రజల ప్రాణాలను పనంగా పెట్టడానికి కుడా వెనకాడట్లేదు.ఇక మన మీడియా విషయానికి వస్తే, అవసరమయిన న్యూస్ తక్కువ ఆవేశాన్ని రగిల్చే న్యూస్ ఎక్కువ. జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలముందు ఉన్చాల్సింది పోయి ఈ ఏరియా లో బంధు జరిగినప్పుడు ఇన్ని బస్సులు తగల పెట్టారు, కాని ఇప్పుడు జరుగుతున్న బందులో అన్ని బస్సులు తగలపెట్టారు, అప్పుడు పోలీస్ లు కాల్పులు జరిపారు కాని ఇప్పుడు జరపట్లేదు అనడం లో మన మీడియా అర్ధమెంతో ఎవరికీ అర్ధం కావట్లేదు.

మన నాయకులు ఎలా తయారంటే వాళ్లకి పదవి ఇస్తే అమ్మా అని కాళ్ళ మీద పడతారు, ఇవ్వకపోతే దానేమ్మా అని బొమ్మలు తగల పెడతారు. వాళ్ళ స్వార్ధం వాళ్ళదే తప్ప వాళ్ళని ఎన్నుకున్న, వాళ్ళని నమ్ముకున్న ఒక సామాన్యుడి జీవితం ఎమయిపొఇనా అనవసరం. నోట్ కోసం వోట్, మందు కోసం బంధు చేయడానికి ప్రజలు సిద్ధం గా ఉన్నన్న్ని రోజులు మన రాష్ట్రాలు రావణ కాష్టాలు గానే మిగిలి పోతాయి. ఒక మంచి నాయకుడికి వేసే నీ వోటు భవిష్యతు కి చూపిస్తుంది ఒక మంచి రూటు, అదే తేడా వోటు అవుతుంది నీ భవిష్యతు కి వెన్నుపోటు.


మీ...............................సతీష్

Monday, July 22, 2013

పరువు కోసం నీతి లేని పంచాయితి

                                పరువు కోసం నీతి లేని పంచాయితి

తొలకరి వానలు మొదలయ్యాయి... ఏటా ఈ టైం కి పచ్చని పొలాలతో, రైతులు రైతు కూలీలతో హడావుడి గ ఎంతో ఆనందం గా ఉండే పల్లెటూర్లు... ఈ సంవత్సరం మాత్రం పార్టీ జండాలతో, పనికి రాని పౌరషాలతో రణరంగం గా తయారయ్యాయి. దీనికి కారణం పంచాయతి ఎన్నికలు కావడం, నిన్న మొన్నటి దాకా అన్నదమ్ముల లా ఉన్న , కలిసి కాలక్షేపం చేసే  ఇరుగు పొరుగు ఈ ఎన్నికల పుణ్యమా అని బద్ధ శత్రువలలా మారారు. ఆకరికి వరదలు వచ్చి పంటపొలాలు మునిగిపోయినా పట్టిచుకోకుండా తమ పార్టీలను గెలిపిచ్చుకోవడానికి పిచ్చోల్లలా తిరుగుతున్నారంటే పౌరశం ఏ పీక్స్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.   

పదిమందికి పట్టెడన్నం పెట్టేవాడు నాయకుడు ఒకప్పుడు....
పదిమందికి పచ్చనోట్లు పంచేవాడే నాయకుడు ఇప్పుడు.


నాయకుడు జనాలకు నోట్ లు బాగా అలవాటు చేసాక, జనం వాడికన్నా నోట్ కి విలువేక్కువ ఇవ్వడం మొదలయింది. ఒకప్పుడు నాయకుడు జనాలను మోసం చేసేవాడు ఎలక్షన్ టైం లో, కాని ఇప్పుడు జనం నాయకుడ్ని మోసం చేయడం మొదలు పెట్టారు...!
ఇప్పటి వోటర్ ఫార్ములా ఏంటో తెల్సా...!!

ఆ పార్టీ దగ్గర తాగు, ఈ పార్టీ దగ్గర తాగు...
వాడి దగ్గర మనీ తీసుకో, వీడి దగ్గర మనీ తీసుకొ....
వోట్ మాత్రం వేస్తే వేసుకో.... లేకపోతే మూసుకొని పడుకో.

ఇలా ఉంది వోటర్ పరిస్థితి. గతం లో పలానా వర్గం పలానా పార్టీ కె వోట్ వేస్తారు అనే నమ్మకం ఉండేది, కానిఇప్పుడు ఎవడు మందు/మనీ ఇస్తే వాడికే వోట్. అలా అని తక్కువ మందు/మనీ ఇచ్చే వాడ్ని వదలరు వాడి దగ్గర తింటారు తాగుతారు. ఒక్క వ్యక్తి అన్నా గుండె మీద చేయి వేసుకొని తన ఇంటి ముందుకి వచ్చే నాయకుడితో " నేను మీరిచ్చే మందు/మనీ ముట్టుకోను" అని చెప్పగలవాడు కరువయ్యాడు అంటే అతిశయోక్తి కాదేమో.

ఈ రోజు నీ క్యారక్టర్ ని ఒక క్వార్టర్ కి,
నీ వోట్ ని ఒక నోట్ కి అమ్ముకుంటే,
రేపు నీ మాట కి చోటు ఉండదని తెల్సుకో.....

 సరే ఊర్లో ఉండే వాళ్ళు చదువుకోలేదు, లోక జ్ఞానం లేదు అనుకుందాం, కాని ఆ ఉరి నుండి కస్టపడి చదువుకుని పెద్ద పెద్ద పొసిషన్స్ లో ఉన్న వాళ్ళ గురించి ఏమనుకోవాలి...!! ఇప్పుడు ప్రతి ఉరి నుండి ఒకల్లో ఇద్దరో విదేశాలలోనో, మహా నగరాల లోనో వెళ్లి అక్కడ ఒక మంచి ఉన్నత స్థాయి లో ఉన్నారు. అలాంటి వాళ్ళు తమ ఉరిలో ఏదన్నా సమస్య వస్తే తిరిగి చూసే వాళ్ళ సంక్య చాల తక్కువ, కాని ఈ నీతిలేని పంచాయతి ఎన్నికలకు మాత్రం తమ కుల/వర్గ పార్టీలకు అక్కడి నుండి ధన బలాన్ని అందించడానికి మాత్రం వెనకాడటం లేదు. అస్సలు మన జనాలు ఏ మార్గం లో నడుస్తున్నారు.....వాళ్ళతో పాటు మన సమాజాన్ని ఎటు తీసుకు పోతున్నారో అర్ధం కావట్లేదు....!!
 మన నాయకులు ఎలాగూ మారరు, కాని ప్రజలకు పట్టెడు అన్నం పెట్టె రైతుఅన్న  కూడా ఈ నీతి లేని పంచాయతి ఎన్నికలలో పౌరశాలకు పోయి పాడవ్వద్దు అని ఆశిస్తూ......

మీ............ సతీష్

Saturday, May 11, 2013

ఊసరవెల్లి


ఒకప్పుడు నలుపు తెలుపు అని మనుషులను విడి విడి గా చూసేవారు... తరువాత అదే మనుషులు నల్ల ధనం తెల్ల ధనం అని దోచుకోడం మొదలు పెట్టారు. ఈ బ్లాక్ అండ్ వైట్ మన జీవితాలలో కొత్తేమి కాదు, వస్తూ పోతూనే ఉంది. కానీ ఈ మధ్య తెర మీదకు ఏ రంగో తెలీని కొత్త రంగు ఒకటొచ్చి పడుతుంది. ఆ రంగే రాజకీయం. ఎండకు ఎండి.. వానకు తడిచి రాజకీయ పార్టీ జెండా రంగు మారే లోపే మన నాయకులు తమ తమ పార్టీ రంగులు మార్చడం మొదలు పెట్టారు. ఒకప్పుడు ఒక ఉద్యోగి గొప్పగా చెప్పుకునే వాడు, నేను అన్ని కంపెనీలలో పని చేసాను నాకు అంత అనుభవం ఉంది మీరెంత ప్యాకేజ్ ఇస్తారు అని డిమాండ్ చేసేవాడు. కాని ఇప్పుడు ప్రజా సేవ అని గొప్పలు చెప్పే మన నాయకులకు కూడా ప్యాకేజ్ ల సంస్కృతి వచ్చిన్ది. నేను అన్ని పార్టీలు మారాను నేను ఇన్ని స్కాములు చేసాను మీ పార్టీ లోకి వస్తే నాకెంత నా కొడుకికి ఎంత ప్యాకేజ్ ఇస్తారు (ప్రజా సేవ చేయడానికి) అని డిమాండ్ చేసే రోజులోచ్చేసాయి.
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క దిద్దుకోవాలి అని మన పెద్దలు చెప్పినట్లు. ఎలక్షన్స్ వచ్చే ముందే ఆఫర్స్ వెతుక్కోవాలి అని మన నాయకులు కొత్త నీతులు చెప్తున్నారు. వాలంటరీ రిటైర్మెంట్ తప్పు అని చెప్పే నాయకులే తము కాస్త మేత్తపడగానే తమ తమ వారసులను తలో దిక్కు అన్నట్లు స్టేట్ లో ఉన్న అన్ని పార్టీలలో ఒక్కొక్కల్లను సెట్ చేస్తున్నారు. గతం లో ఒక IT జాబ్ రావాలంటే బెంగుళూరు వెళ్ళరా అక్కడికి వెళ్లి ట్రై చెసుకొ.. అక్కడయితే చాలా కంపెనీస్ ఉన్నాయ్ ఎక్కువ ఆఫర్స్  వస్తాయి అని చెప్పుకునే వాళ్ళు. కాని ఇప్పుడు ఇండియా లో డబ్బున్నోడు ఎవడన్నా పోలిటిషియన్  అవ్వాలంటే AP వెళ్ళరా అక్కడ సందుకో పార్టీ ఉంది ఏదో ఒక పార్టీ లో సీట్ ఇస్తారు వాళ్ళే కర్చు కుడా పెడతారు. అని చెప్పే దుస్థితికి మన రాష్ట్రం వచ్చింది అంటే అతిశయోక్తి కాధెమో..

దానికి తోడు పార్టీ కి ఒక చానెల్ ఉంది ఫ్రీ పబ్లిసిటి. ఇష్టం ఉన్నోడ్ని లేపి బంజారహిల్ల్స్ లో పెడతారు.. ఇష్టం లేనోడ్ని బోరబండలో వేసి తొక్కుతారు, ఇది మన మీడియా కి ఉన్న భలం. మూడ  నమ్మకాలను నమ్మొద్దు అని ప్రగల్బాలు పలికే అవే న్యూస్ చానల్స్ మూడు గంటల పాటు అంతరాలు తంత్రాలు అని ఎడ్వర్టైజ్మెంట్ వేసుకుంటారు. అది చూసి ఏడవాలో నవ్వాలో అర్ధం కాదు...! ఒక సెలబ్రిటీ మీద ఉన్న ఫోకస్ ఒక సామాన్యుడి మనుగడ మీద ఉండదు. ఒక హీరొయిన్ ఎఫ్ఫైర్ మీద ఉన్న ఆత్రుత మన యువత భవిష్యత్తు మీద ఉండదు మన మీడియా కి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం వీళ్ళకు మామూలే గా.. 

సరే మనమేమన్నా తక్కువ తిన్నామా అంటే అదీ లేదు... మా కుల నాయకుడు, మా ఏరియా నాయకుడు, మా హీరో, మీ హీరో అని సిగ్గు లేకుండా గుడ్డలు చించుకుని రోడ్ల మీద తిరుగుతూ.. వాళ్ళ చేతిలోనే ఆకరికి దెబ్బలు తింటాం. ఏ బందులు లోనయినా.. ఏ ఆడియో ఫంక్షన్స్ లోనయినా..  ఆ నాయకులకు కానీ, ఆ హీరోలకు కానీ షర్టు నలుగుతుందా..? లేదు, కానీ మనకు మాత్రం వీపు పగులుతుంది. నువ్వు కరెక్ట్ గా ఉంటె నీ నాయకుడు రంగులేందుకు మారుస్తాడు.. రంగు నోటు ఎటు ఉంటె నువ్వు కుక్కలా అటు వస్తావని నాయకులు నమ్మినంత కాలం నీకు రంగు పడుతూనే ఉంటుందని అని హెచ్చరిస్తూ.....

మీ....... సతీష్.