Pages

Wednesday, March 30, 2011

వ్యక్తిగా ఓడిపోయి....శక్తి గా గెలవాలని

        
రోజు లానే ఆఫీసు నుండి బయలుదేరాను,హైటెక్ సిటీ నుండి మియాపూర్ ఆటో(AP28 TB 5950) ఎక్క్కి కూర్చున్నా. మొత్తం అయిదుగురితో ఆటో బయలుదేరింది.ఎదురు గా ఆటో లో నుండి ఒక అమ్మాయి దిగి ఆటో వాడికి డబ్బులు ఇచ్చి చిల్లర పర్సులో పెట్టుకుంటూ నడుస్తుంది. నేను ఎక్కిన ఆటో వాడు అది గమనించి కావాలని ఆ అమ్మాయి మీదకు దురుసు గా ఆటో పోనిచ్చి ఎదురుగా  వెళ్లి బ్రేక్ కొట్టాడు.ఆ అమ్మాయి షాక్ తో బయపడింది దాంతో మా ఆటో (AP28 TB 5950)వాడికి ఏదో తెలీని పయసాచిక ఆననడం వచ్చింది. అది చూసి నా ఆవేశాన్ని ఆపుకున్నాను సరేలే అని.అలా కొద్ది దూరం వెళ్ళిన తరువాత వీడి రాష్ డ్రైవింగ్ తో ఒక కార్ ని గుద్దబోయి తిరిగి ఆ కార్ వాడినే తిడుతున్నాడు వీడు.అప్పటికే నా మనసెందుకో ఊరుకోలేక పోయింది,సరేలే అని కాం గా కూర్చున్నా.

ఇంతలో కొత్తపేట సిగ్నల్ దగ్గర ఆపాడు ఆటో, సిగ్నల్ పడ్డా గాని కదలకుండా ఆటో ని నది రోడ్ మీద ఆపి కూర్చున్నాడు, ఇంతలో వెనకనుండి ఒక కార్ హారన్ మోగింది.మోగిన చాలా సేపటికి వీడు ఆటో ని పక్కకు తీసాడు వెనక కార్ మా పక్కకు రాగానే (అందులో డ్రైవింగ్ చేస్తుంది ఒక లేడీ) వీడు ఆమెదో తప్పు చేసినట్లు నోటికొచ్చిన బూతులు, కనీసం వినలేనటువంటి బాష తో తిట్టడం మొదలు పెట్టాడు.ఇక నా వల్ల అవలేదు అలా చూస్తూ ఉండటం. వెంటనే వాడిని ప్రస్నించా “ఏమి మాట్లాడుతున్నావ్, తప్పు నీది పెట్టుకుని ఎదుటి వాళ్ళ మీద అరుస్తావేంటి” అని వెంటనే వాడు నా ఆటో నా ఇష్టం ఇష్టముంటే ఉండు లేకపోతే దిగు నీకేంటి సంబంధం అన్నాడు. నాకు అడిగే హక్కు ఉంది నువ్వేది చేసిన చుస్తున్డాల్సిన అవసరం లేదు అన్నాను. అయితే దిగిపో అని నన్ను మధ్యలో దిన్చేసాడు.(మిగిలిన వాళ్ళు అలా సినిమా చూస్తున్నట్లు చూస్తూ కూర్చున్నారు).


నేను వేరే ఆటో ఎక్కి మియాపూర్ లో దిగాను. నా ముందు వాడు వచ్చి ఏమి పీకుతావ్ ఇందాకేదో వాగుతున్నావ్ అని నాకు అడ్డం తిరిగి నా మీద రివర్స్ అవడం మొదలుపెట్టాడు.వెంటనే నేను అక్కడున్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చా అప్పుడు ఆ పోలీసు నాతొ ఆ ఆటో(AP28 TB 5950) వాడి దగ్గరికి వచ్చి ఏంటి అని అడిగితే, వాడు ఎంతో ధైర్యంగా పో ఆటో తీసుకుపో పది వేలు కట్టి తెచ్చుకుంటా అని ఎంతో ధీమాగా మాట్లాడాడు. అది చూస్తూ ఆ పోలీసు నిలబడి ఉన్నాడు కాని కనీసం ఏమి అనలేక పోయాడు వాడ్ని.ఇంకా పైగా నాకే ఏదో సర్ది చెప్పి పంపడానికి ప్రయత్నిస్తున్నాడు.


నాకు ఎంతో షేం గా అనిపిస్తుంది ఏదో నా సొంత గొడవకోసమో లేక ఏదో పది రూపాయల కోసమో నేను ఆటో వాడి తో గొడవపెట్టుకుంటున్నాడు మనకెందుకు లే అని చూస్తూ కాం గా కూర్చున్నా నా తోటి ప్రయానికులను చూసి, తాగి ఆటో తోల్తున్న ఒక వ్యక్తిని కనీసం ఏమి అనలేని స్థితి లో ఉన్న ఒక పోలీసు ని చూసి. ఇలాంటి వ్యవస్థ, ఇలాంటి మనుషుల  మద్యా మనం తిరుగుతుంది,ఇవేనా మన చదువులు మనకి నేర్పుతున్న సంస్కృతీ. ఎవడో ఏమయితే మనకెందుకు లే ఎవరో ఏదో చేస్తే మనకి అనవసరంలె, మనం ఇంటికి వెళ్ళామా లేదా అని ఆలోచించే అసమర్దుల మద్య మనం బ్రతుకుతున్నందుకు బాధ గా ఉంది.

మా బావ గారు అన్నట్లు "మంచి చేద్దాం అనుకునే వాళ్ళు బయటి కుటుంబాల నుండి వస్తే సంతోషిస్తారు కాని మన కుటుంబం లో నుండి వస్తే ఒప్పుకోరు,మనకెందుకు లే అంటారు జనాలు" అని చెప్పారు అది నిజం. మా బావగారు గొప్ప గొప్ప చదువులు చదువుకోలేదు కాని నేను చెప్పిన దానికి ఆయన చాల పోసిటివ్ గా రియాక్ట్ అయ్యారు, కాని మా ఇంట్లో ఉన్న బా చదువుకున్న,జాబు లు చేస్తున్న వాళ్ళు మాత్రం నీకెందుకు అని నన్ను అపహాస్యం చేస్తూ లైట్ గా తీసుకున్నారు.కాని ఈ రోజు నేను ఒక చిన్న అన్యాయాన్ని ఒక వ్యక్తి గా ఎదుర్కోలేక పోయాను.ఆలోచిస్తే అదే ఒక శక్తి గా ఉంది ఉంటె దాన్ని ఎదుర్కోగలిగే వాడినేమో అనిపిస్తుంది నాకు. ఒక గొప్ప వ్యక్తి అన్నట్లు "ఒక్కడే  పెద్ద బండను(అన్యాయం అనే) తోయలేక మనకు అది కదలదు లే అని వదిలేస్తే అది అలానే ఉండిపోతుంది,అదే వ్యక్తీ పది మందిని కలుపుకుని దాన్ని కదపడానికి ప్రయత్నిస్తే తప్పక కదుల్తుంది". అంటే నేనే ఇంకో పదిమంది ఉన్న శక్తి తో అన్నా కలవాలి లేక నేనే పదిమంది తో ఒక శక్తి ని తయారు చేయాలి అనిపిస్తుంది. అప్పుడే నేను చేయాలనుకునే పనిని ధైర్యం గా చేయగలను లేకపోతె తల దించుకుని ఏమి చేతకాని వాడిలా బ్రతకాలి(అలా బ్రతకడం నా వల్ల కాదు). అందుకే నా స్నేహితుల తో కలిసి మేమే ఒక శక్తి గా ఎందుకు మారకూడదు మారి అన్యాయం పయిన పోరాడే వాళ్లకి ఒక ఉతం లా ఎందుకు హెల్ప్ చేయకూడదు అనే అభిప్రాయం మాలో మొదలయింది.


దీనిని ఆచరణలో పెట్టాలని అనుకుంటున్నాము, దీనికి దయచేసి మీ అమూల్యమయిన సలహాలు,సూచనలు అందిస్తారని ఆసిస్తూ……………….సతీష్.



                                                         

Wednesday, March 23, 2011

ATM రాజు నుండి…. SEPCTRUM రాజ వరకు

 
పుట్టాలంటే లంచం,పుట్టిన తరువాత బ్రతకాలంటే లంచం, ఆకరికి చావాలన్నా లంచం.నిత్యం మన జీవనం లంచం అనే చట్రం లోనే తిరుగుతుంది. ఒకప్పుడు వందలు వేలు లంచం అంటే నే వామ్మో అనుకునే మనం ఇప్పుడు లక్షల కొట్లలో లంచాలను కూడా లైట్ గ తీసుకునే స్టేజ్ కి వచ్చామంటే లంచాలు,మోసాలు ఎంత కామన్ అయిపోయాయో మన బ్రతుకుల్లో అర్ధం చేసుకోవచ్చు.

                                   
ఒక సగటు జీవి గ నా అనుభవం లో అదీ ఒక రోజు లో జరిగిన అనుభవాన్ని పంచుకుంటున్నాను. హోలీ పండుగకు మా సిస్టర్ వాళ్ళ ఉరు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను. సరే చెల్లి వాళ్ళ బాబు కోసం షాపింగ్ చేద్దాం అని చందానగర్ నుండి కుకట్పల్లి ఆటో లో బయలుదేరాను, కుకట్పల్లి లో ఆటో దిగిన తరువాత ఆటో వాడు మీటర్ మీద 10 రూపాయలు ఎకష్త్ర అడిగాడు, సరే వాడితో ఎందుకు లే గొడవ అని ఆ పది రూపాయలు ఇచ్చి షాప్ లోకి వెళ్ళాను.

షాపింగ్ చేస్తూ కొన్ని ద్రెస్సెస్ తీసుకున్నాను వాటిని సైజు చేపిచడానికి షాప్ వాడి దగ్గరికి వెళ్ళాను,అక్కడ పెద్ద క్యు ఉంది. వాడు "సార్ మీది ముందు ఇవ్వాలంటే ఏమన్నా చాయ్ కి డబ్బులు ఇవ్వండి" అన్నాడు సరే చాలా దూరం వెళ్ళాలి కదా లేట్ అవుతుందని వాడికి 20 రూపాయలు ఇస్తే వాడు 20 నిముషాలలో మన డ్రెస్ కుట్టి ఇచ్చాడు. అలా తొందరగా ఇంటికి చేరుకున్న. నెక్స్ట్ డే ఆఫీసు నుండి డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ కి వెళ్లాను,రిజర్వేషన్ దొరకలేదు, సరే జనరల్ సీట్స్ టికెట్ తీసుకుందామని చుస్తే క్యూ పెద్ద రైల్ అంత ఉంది. అప్పుడు ఒకామె వచ్చి టికెట్ కి ఎగాష్ట్రా 50 రూపాయలిస్తే 10 నిముషాలలో టికెట్ తీసుకొస్తా అని చెప్పింది సరే ఇదేదో బానే ఉంది లే పొతే పోనీ అని ఎగాష్ట్రా మనీ ఇస్తే 10 నిముషాలలో టికెట్ తెచ్చి చేతిలో పెట్టింది.

సరే ఇంకా ట్రైన్ కి టైం ఉంది గా అస్సలే మనం వెళ్ళేది పల్లెటూరు అక్కడ ATM లు ఉండవు అని రైల్వే స్టేషన్ లో ఉన్న ATM దగ్గరకు వెళ్ళాను,అక్కడ సెక్యూరిటీ అతను(పేరు రాజు) ఎంతో గౌరవం గా డోర్ తీసి సలాం కొట్టి మరి లోపలి వెళ్ళమన్నాడు, మనీ డ్రా చేసి బయటికి వచ్చేటప్పుడు అంతే గౌరవం తో డోర్ తీసి చాయికి డబ్బులు అడిగాడు,అతని చేతిలో చిల్లర 5 రూపాయలు పెట్టి ట్రైన్ దగ్గరికి వెళ్లాను. ట్రైన్ లో జనరల్ సీట్స్ అన్ని ఫుల్ అయ్యాయి, ఎటు చుసిన సీట్ దొరకలే ఇంతలో ఒకతను వచ్చి సర్ 20 రూపాయలిస్తే సీట్ ఇస్తా సర్ అన్నాడు ఇది బానే ఉందని వాడి చేతిలో 20 రూపాయలు పెట్టి సీట్ తీసుకుని కూర్చున్నాను.

ట్రైన్ స్టార్ట్ అయింది చుట్టూ పక్కల వారి పిచ్చాపాటి స్టార్ట్ అయింది.అప్పుడు కళ్ళు మూసుకుని ఆలోచించాను ఇలా నాకు లానే ఈ ట్రైన్ లో ప్రయాణిస్తున్న సగం మంది ఇలానే ATM  రాజు దగ్గరనుండి సీట్ కొనుక్కునే వరకు ఏడూ ఒక రూపం లో లంచం చుట్టూ తిరిగిన వాళ్ళే కదా.....? ఇలా రోజు ఎంతో మంది ఇలానే ఉన్నారు కదా అనిపించింది. అంటే లంచం అనేది ఒక్క రూపై నుండి మొదలయి లక్షల కోట్లలో రోజు చేతులు మారుతుంది. ఒకప్పుడు అనుకునే వాడ్ని SPECTRUM స్కాం లో లక్షల కోట్లలో Raja స్కాం చేస్తే ఏ  సామాన్యుడు సరిగా స్పందించట్లేదు అని. కాని ఇప్పుడే అర్ధమయింది ప్రతి వ్యక్తి ప్రతి రోజు లంచం అనే స్కాం లో ఏదో ఒక భాగం గా మారిపోయాడని,కాకపొతే ఒక్కోకరిని బట్టి ఒక్కో రేటు ATM Raju ది 5 రూపాయల స్కాం, ఆటో వాడిది 10 రూపాయల స్కాం, రైల్ సీట్ వాడిది 20  రూపాయల స్కాం, రైల్ టికెట్స్ వాడిది 50  రూపాయల స్కాం అయితే SPECTRUM Raja ది లక్షల కోట్ల స్కాం అదే తేడా.అందుకే ఏ వ్యక్తీ ఈ స్కాంలను ధైర్యం గా ప్రశ్నించే నైతిక హక్కు కోల్పోయాడు.

అందరం కలసి రాజ లాంటి వాళ్ళ మీదో లేక బడా బాబుల మీదో చర్య తీసుకుంటే ఈ లంచం అనే రోగం మాసిపోద్ది, అనుకునే ముందు మన మీద మనం చర్య తీసుకుని,ఎవరికి వారు వాళ్లకి పట్టిన రోగాన్ని బాగు చేసుకున్న రోజే ఈ చీడలా పట్టిన ఈ రోగం శాశ్వతంగా మనల్ని మన దేశాన్ని వీడి పోతుంది అని

ఆశిస్తూ…………….సతీష్

Friday, March 18, 2011

ఎందరో మహానుభావులు


ఎప్పుడూ వస్తున్నట్లే ఆ రోజు కూడా కొన్ని మెయిల్స్ ఉన్నాయ్ నా ఇన్ బాక్స్ లో.కాలిగానే ఉన్నాం కదా అని ఒక్కొక మెయిల్ ఓపెన్ చూస్తున్న కొన్ని ఫన్నీ మెయిల్స్ కొన్ని ఆఫీసు మెయిల్స్ అలా చూస్తుంటే మా ఫ్రెండ్ దగ్గరినుండి వచ్చిన ఒక మెయిల్ ఓపెన్ చేసాను.చూస్తే దాంట్లో  “ఇంటర్ ఎగ్జామ్స్ రాయబోతున్న అంధ విద్యార్దుల కు స్క్ర్యబ్ గ హెల్ప్ చేయాలి” అంటే అంధ విద్యార్దులు చెప్తుంటే మనం వారి ఎక్షామ్ రాసి పెట్టాలి.ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కింది నుంబెర్స్ ని కాంటాక్ట్ చేయండి అని ఉంది.

ఒక్కసారిగా ఆ మెయిల్ చూడగానే మనకి దేవుడు ఒక మంచి అవకాశం అందించాడనే ఫీలింగ్ కలిగి మా ఫ్రెండ్స్ అందరికి ఆ మెయిల్ ఫార్వార్డ్ చేసాను.వెంటనే ఆ నెంబర్ కి కాల చేసి మేము వస్తాం ఎక్షామ్ రాస్తాము అని నేను మా ఫ్రెండ్ చెప్పాము, వాళ్ళు మాకు అడ్రస్ ఇచ్చారు. ప్రొద్దున 8am కి ఈస్ట్ మారేడుపల్లి లో ఎక్షామ్.మేము ఉదయం 7:30 కి అక్కడికి చేరుకున్నాము.అక్కడ స్కూల్ ప్రిన్సిపాల్ మాడం రాజేశ్వరి గారిని కలిసాము.ఆమెను చూస్తే ఈ లోకం లో మంచితనం ఇంకా బ్రతికే ఉంది యా మంచితనం ని ఇంకో పదిమందికి పంచుతుంది అని చెప్పడానికి ఆమె ఒక గొప్ప ఉదాహరణ.ఆమె పలకరిమ్పులోనే ఏదో తెలీని ఆత్మీయత ఎదుటివారికి ఇంకా ఏదో చేయాలి, వారితో చేపిచ్చాలి అనే ఆత్రుత మనకి కనిపిస్తుంది.





నేను మా ఫ్రెండ్ ఆమెను కలవగానే ఆమె ఎంతో ప్రేమతో మమ్మలను పలకరించారు, నాకు సైదులు అనే ఒక కుర్రది ఎక్షామ్ రాసే అవకాశం ఇచ్చారు.మా ఫ్రెండ్ ని బాక్అప్ గ ఉండమన్నారు అంటే ఎక్షామ్ కి ఎవరన్నా రాలేకపోతే  తనని పార్టిసిపేట్ చేయమన్నారు. అప్పుడు మేము ఆ పిల్లలతో మాట్లాడితే వారికి అంధత్వం అనే లోపం ఉన్నట్లు వారిలో ఏ ఒక్కరి మాటల్లో మాకు కనిపిచలేదు అంటే ఆ స్కూల్ వారు ఆ మాడం వాళ్ళని ఎంతగా ఆ లోటు తెలీకుండా చుసుకున్తున్నారో అర్ధమయింది.

ఇంకా గొప్ప విషయమేంటంటే అలా హెల్ప్ చేయడానికి వచ్చిన వారందరూ కాలేజి స్టూడెంట్స్ & జాబు హోల్డర్స్.అందులో కొంతమంది సెలబ్రిటిస్ కుడా ఉన్నారు పేరు "హిమ బిందు" తను సింగర్ (సింగర్ "హేమ చందర్"  వాళ్ళ సిస్టర్ ). మిగతా వారు "మని" (INDIA INFOLINE), "రమ్య"(Honeywell),"ప్రతాప్ రెడ్డి"(MBA student), "నగేష్"(CA ). నాకు తెలిసిన వరకు వాళ్ళ వివరాలు ఇవి అలానే మిగిలిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను. మీ లోని మంచితనాన్ని ఇలానే పెంచి ఎదుటి వారికి సహాయం ఎల్లప్పుడు చేస్తారని ఆశిస్తున్నాను.

   
కొంతమందికి అవకాశం రాక చేయలేకపోయి ఉండొచ్చు. అలా చేద్దాము అని మనసులో ఉన్నవారికి కనీసం నా బ్లాగ్ ద్వారా అన్నాతెలియచేద్దామని నా చైనా ఆశ. మిగిలిన ఎక్షామ్స రాయడానికి  ఎవరికన్నా ఇంటరెస్ట్ ఉంటె మీ విలువయిన సమయాన్ని కేతాయిద్దము అనుకునే వారికి ముందుగా ధన్యవాదాలు తెలియచేస్తూ మీకు వివరాలు అందిస్తున్నాను.

Name: Abraham
Number: 9866858664

Name: Rajeswari
Number: 9440359234.



మంచితనాన్ని పెంచుకుందాం దాన్ని పదిమందికి పంచుదాం అని ఆశిస్తూ............   సతీష్                                                           

 

Tuesday, March 1, 2011

బాపు నువ్వయినా ఈ అరాచకాన్ని ఆపు


“దేన్నయిన డబ్బుతో కొనగలవేమో కాని మనిషి ప్రాణాన్ని కొనలేవు” ఇది ఒకప్పుడు పాత సినిమాలో డయలాగ్. ఒకప్పుడు అని ఎందుకు అన్నానంటే ఇప్పుడు అది నిజం కాదు గనుక. నిజమే ఇప్పుడు ప్రాణాన్ని చాలా సులువుగా లెక్క కట్టేస్తున్నారు ఎవరో కరుడ కట్టిన కసాయివాడు కాదు, మనం ఎన్నుకున్న మనల్ని పరిపాలిస్తున్న ప్రభుత్వమే మన ప్రాణానికి  లెక్క కట్టి ఇస్తుంది. త్వర లో బడ్జెట్ లో కూడా సగటు మనిషి ప్రాణానికి ఇంత అని కరీదు కట్టి బడ్జెట్ కేటాయించినా ఆశ్చర్యపడే పని లేదేమో.


మొన్న ముదిగొండ,బషీర్బాగ్ నిన్న ఉస్మానియా యునివెర్సిటీ,సోంపేట నేడు వట్టి తాండ్ర, కాకరాపల్లి.ఎక్కడయినా ఏ చోటయిన ఇదే జరుగుతుంది. పొట్ట చేత పట్టుకుని తన బ్రతుకు తను బ్రతకడం కూడా కష్టం గా మారిపోఇంది మన రాష్ట్రం లో. ఒకప్పుడు ఏ ఉప్పెన వస్తుందో ఏ గండం వస్తుందో అని సామాన్యుడు ప్రకృతి భీబత్సాలకు భయపడుతూ బ్రతికే వాడు, కాని ఇప్పుడు ఏ ప్రాజెక్టులు వస్తాయో తమ బ్రతుకుల్లో నిప్పులు పోస్తాయో తమ గుండెల్లో తుపాకు గుండ్లు దిగుతాయో అని  భయం తో బ్రతుకుతున్నారు.

మనం ఎన్నుకున్న నాయకులు,మన రక్షణ కోసం ఉన్న భటులు మనల్నే చంపుతున్నారంటే ఎంత దారుణం. ప్రజలేమి స్కాములు చేసి అడ్డంగా దోచుకున్న సొమ్ము కోసం తిరగ పడట్లేదు,వాళ్ళేమి అధికార దాహం కోసం పోరాడట్లేదు.పిడికెడు పొట్ట కోసం,వారి పిల్లల భవిష్యత్తు కోసం ప్రాణ పోరాటం చేస్తున్నారు. కాని మన స్వార్ద ప్రభుత్వాలు వారి వారి ప్రయోజనాలకోసం ప్రాజెక్టుల పేరు అడ్డం పెట్టుకుని సామాన్యుడి ప్రాణాలను ఖాతరు చేయకుండా వారిని చంపి వాళ్ళ శవాలకు లెక్క కట్టి వాటి మీద ప్రాజెక్టులను నిర్మించడానికి కూడా వెనుకాడట్లేదు. అంటే మనకి సామాన్యుడి ప్రాణం కన్నా ప్రాజెక్టులు ముఖ్యమయ్యాయా….?
అభివృద్ధి కి ఎవరూ వ్యతిరేకం కాదు అలానే అదే అభివృద్ధి కొంతమంది స్వార్ధానికి ఉపయోగపడి,సామాన్యుడి మనుగడకే ముప్పు కలిగించే లా ఉంటే ఎవరూ ఊరుకోరు దానికోసం ప్రాణాలను సైతం లెక్క చేయరు. అలాంటి పరిశ్తితులను అర్ధం చేసుకుని చర్చించి సమస్యను సామరస్యం గ పరిష్కరించాల్సిన ప్రభుత్వం అరాచకం గా సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడి ఆ ప్రాణాలను కాగితపు ముక్కలతో లెక్క కట్టడం దురద్రుష్టకరం. ఆకరికి సాటి మనిషి  ప్రాణాన్ని కూడా డబ్బుతో లెక్క కడతారని ముందే తెలిస్తే మన గాంధీ గారు తన బొమ్మ ని ఏ ఒక్క కరెన్సీ నోట్ మీద వేయొద్దని ప్రాదేయ పడేవారేమో పాపం." బాపు ఈ అరాచకాన్ని నువ్వయిన ఆపుతావని ఆశిస్తూ.........
(ఫోటోలు ఈనాడు వారి సహాయం తో) 


మీ...................................................................సతీష్.