Pages

Friday, February 25, 2011

నాగరికం లో ఆటవికం

 నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని………
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని…….


అని మన సిరివెన్నెల గారు కొన్ని సంవత్సరాల క్రితం తన ఆవేశాన్ని పాట రూపంలో మలిచారు. కాని ఇప్పుడు అగ్గితో కాదు కదా  యాసిడ్  తో కడిగినా  ఈ సమాజం మారదేమో అనిపిస్తుంది. 
మన వాళ్ళు  పాత ట్రెండ్ ని  మళ్ళీ ఇష్టపడుతున్నట్లు, ఉదాహరణకు  ఒకప్పుడు వోల్డ్ సినిమాలలో హీరోలు యూస్ చేసిన హెయిర్ స్టైల్స్ వాళ్ళ డ్రెస్సింగ్  ఇప్పుడు మళ్లీ కొత్త ట్రెండ్ గా మనం 
యూస్ చేస్తున్నాం ఇలా మనం అభివృద్ధి చెందుతున్న కొద్ది తిరిగి వెనక్కి వెళ్తూ ఆకరికి ఆటవిక సంస్కృతికే చేరుతున్నామేమో అనిపిస్తుంది.  ఆటవికుల గా మానవుడు బ్రతికినంతకాలం తన
మన బేధం లేకుండా ఒక మృగం లా బ్రతికాడు అలానే మళ్లీ మనం మానవతా విలువలను మర్చిపొఇ మనకి మనమే భాషా అభిమానం ప్రాంతీయ అభిమానం అంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళం బౌతిక దాడులకి దిగి మనిషిని మనిషే చంపుకునేలా తయారవుతున్నాం.


మొన్నటికి మొన్న జయప్రకాశ్ నారాయణ గారి మీద దాడి ఎంత బాధాకరం. ఆకరికి అసెంబ్లీ ఆవరణ లో కూడా ఒక వ్యక్తి తన అభిప్రాయాలను స్వేచ్చగా వ్యక్తపరచాలేరా ఈ స్వతంత్ర భారతం లో …? బ్రిటిష్ వారి కాలం లో కుడా ఇలా లేదేమో.ఒక సామాన్యమయిన వ్యక్తి వచ్చి ఒక మాజీ IAS అధికారి, మరియు ఒక MLA మీద  దాడి చేసే పరిస్తితి వచ్చిందంటే అదీ అసెంబ్లీ ప్రాంగణం లో...  మనం మన రాజకీయాలు ఎంత దిగజారాయో అర్ధమవుతుంది.ఎందుకు దాడి చేసారు అంటే అయన(JP ) ఒక ప్రాంతం వాళ్ళను రెచ్చకోట్టారు అందుకే అని సమాధానం ఇచ్చారు ….. వినడానికి నవ్వొస్తుంది,అంటే ఒక  రాజకీయ నాయకుడు పరుష పదజాలం,బూతులు మాట్లాడకుండా రాజ్యాంగం దానిమీద మన హక్కులు మన వ్యవస్థ గురించి స్వచ్చమయిన బాషలో మాట్లాడితే అవి బూతులు కన్నా పెద్ద పాపపు మాటల్లా వినపడ్డాయి మన నాయకులకు.



అది వారి తప్పు కాదులెండి ఏ రాజకీయ నాయకుడికి అవ్వన్నీ అవసరం లేదు ఎప్పుడు అలాంటి పదాలు వినలేదు, మాట్లాడలేదు కదా.... అందుకే  తెలీక అవేదో బూతు   పదాలల వినిపిచి ఉంటాయి పాపం. కాని అందరం సిగ్గు తో తల దించుకోవాలి ఒకప్పుడు రాజకీయ నాయకుడు అవ్వాలంటే పది మంది రౌడిల బలం ఉండాలి కాని ఇప్పుడు అసెంబ్లీ కి వెళ్ళాలంటే అతనే ఒక రౌడి అయి ఉండాలి.కుళ్ళు,స్వార్ద రాజకీయాల కోసం పాకులాడుతూ విద్యార్దుల భవిష్యత్తు, సామాన్యుడి బ్రతుకులను పాడుచేస్తూ మంచి వారి  మీద దాడి చేస్తూ ఉంటె భవిష్యత్తులో మంచి చేద్దామనుకునే వ్యక్తి అంటూ రాజకీయాలలో అడుగుపెట్టడానికి కూడా ఆలోచిస్తారేమో.....


 
ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడటం కన్నా ఎవరికి వారు ఇలాంటి రాజకీయాలకు వ్యతిరేకం గా పోరాడాలి. స్వార్ద ప్రయోజనాలకోసం చేసే బంద్ ల ను దీక్షలను మనమే స్వచ్చందం గా బహిష్కరించాలి  మనల్ని పావులుగా చేసే ఈ చదరంగం లో మనమే పోరాడాలి.మనల్ని మన సమాజాన్ని బాగు చేయకపోయినా కనీసం నైతిక విలువలను కోల్పోకుండా చూసే బాద్యత మన మీద ఉంది… మనం చదువుకున్న ఈ చదువులు మనం బ్రతుకుతున్న ఈ స్వేచ్చ ని మన భవిష్యత్తు తరాలకు అందేలా చూడాలి, అంటే మనం ఇప్పటికన్నా కళ్ళు తెరవాలి.గొర్రెల లా ఈ నాయకుల వెనుక నిలబడకుండా మనిషి లా ఆలోచిద్దామని ఆశిస్తూ……




మీ సతీష్..............................................................