Pages

Friday, July 6, 2012

ఎవరో వస్తారని ఏదో చేస్తారని....

"ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకు మిత్రమా"….. ఈ మాటలు నేను చేసే పనులకి కరెక్ట్ గా సరిపోతాయి అనిపిస్తుంది.ఎప్పుడు నాకు సమస్య వచ్చినా ముందుగ ఎవరు హెల్ప్ చేస్తారా అని ఆలోచిస్తుంట తప్ప నాకు నేను సాల్వ్ చేసుకోలేనా అని ఆలోచించట్లేదు.అలా ఆలోచించక పోవడం వల్ల సమయం వృధా అయి సమస్య ఇంకా పెద్దదిగా మారుతుంది తప్ప సమస్య తీరడం లేదు.అదే ఎవరో హెల్ప్ చేస్తారు అని ఆలోచించే లోపు,నేనే ఏదో ఒకటి చేస్తే ఆ సమస్య తీరడమో లేక సగం బారం తగ్గడమో జరుగుతుంది కదా.మనకెప్పుడు అనిపిస్తుంది నాకే ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి,అందరికి ఎందుకు రావట్లేదు అని.ఒక్కసారి మనం సమస్యలుగా ఫీల్ అవుతున్న వీటినుండి బయటి ప్రపంచం లోకి తొంగి చుస్తే ఎంతోమంది మనకంటే ఎక్కువ సమస్యలతో పోరాడి విజయాలను అందుకుంటున్నారని అర్ధమవుతుంది.అన్ని వనరులు సవ్యం గా ఉండి కుడా మనం ఇంకా చిన్న చిన్న వాటికి కుడా ఏదో బాదలు పడుతున్నట్లు ఫీల్ అవుతాం.ఏ సమస్య వచ్చినా సరే ఆ రోజు దేవుడ్ని "ఈ ఒక్క సమస్య తీర్చు దేవుడా నెక్స్ట్ ఏమయినా పర్లేదు" అని వేడుకుంటాం,ఆ సమస్య మనవల్లనో లేక దేవుని వలనో తీరిపోతుంది.మళ్లీ ఏదో ఒక సమస్య మొదలు,మళ్లీ అదే విన్నపం దేవుడికి,సమస్య తీరకపోతే బాదపడటం ఇదేనా మన జీవితం.


“అన్ని రోజులకు ఒకలానే సిద్దంగా ఉండు ...
మంటల్లో ఇనుముగా ఉన్నప్పుడు దెబ్బలకు ఓర్చుకో...
సమ్మెటగా ఉన్నప్పుడు దెబ్బ మీద దెబ్బ తీయి”.

ఒక్కసారి ఆలోచించండి ఇప్పటివరకు ఏమి సాదించాం మనం....?,ఏమి లేదు కదా, మరెందుకు ఏదో చాలా కష్టాలు పడిపోయి (ప్రపంచం లో మనం తప్ప ఎవరు పడనంత)బాదలు పడుతున్నట్లు ఫీల్ అవ్వడం.మహాత్మా గాంధీ ఒక్కరోజులో సత్యాగ్రహం చేసి స్వాతంత్రం తీసుకొచ్చారా,అబ్దుల్ కలాం ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపి ఉంటారు,మదర్ తెరీసా తన లైఫ్ లో ఎప్పుడన్నా తన సంతోషం గురించి ఆలోచించారా…? ఇలాంటి ఎంతోమంది మహానుబావులు వాళ్ళు ఎన్నో కష్టాలు పడి మనలాంటి ఎంతోమందికి స్వేచ్చ కలిగిన జీవితాన్ని అందించారు.మనం మాత్రం మన పర్సనల్ లైఫ్ ని(ఎవరికి ఉపయోగపడని)సెట్ చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతున్నాం అని ఫీల్ అవుతాం.గొప్పవాళ్ళే కష్టాలను ఫేస్ చేస్తారు మనం చేయట్లేదని నా ఉద్దేశం కాదు.సమస్యలు వచ్చినప్పుడే ధైర్యం గా ఉండాలి మన సహనాన్ని కోల్పోకూడదు అలాంటి వాడే విజయాన్ని పొందగలడు.

”దేవుడు నిన్ను నమ్మి విజయాన్ని ఇవ్వబోయే ముందు నువ్వు ఆ పెద్ద బహుమతిని నిలపెట్టుకోగలవని నిరూపించుకోవాలి”కదా....!

ఎన్నో లక్షలమంది వెంకటేశ్వర స్వామిని చూడటానికి వస్తుంటే ఈర్షతో స్వామి ముందు ఉన్న ఒక గడప స్వామి తో “స్వామీ నువ్వు నేను ఇదే కొండమీద పుట్టాము,ఒకే శిల్పి చేత చేయబడ్డాము కాని రోజు నిన్నేమో లక్షలమంది చేతులెత్తి మొక్కుతారు,నన్నేమో కాలితో తొక్కుతారు,ఎందుకింత వ్యత్యాసం"అని అడిగింది.అప్పుడు స్వామి “నువ్వు గడపగా మారడానికి శిల్పి ఉలి తో అటు ఒక దెబ్బ ఇటు ఒక దెబ్బ రెండు దెబ్బలు వేస్తె గడపగా మారావు,అదే శిల్పి నన్ను మలచడానికి కొన్ని వేల దెబ్బలు ఉలి తో వేసాడు,అన్ని దెబ్బలకు ఓర్చుకున్నాను కాబట్టే అంతమంది నన్ను పూజిస్తున్నారు”అని చెప్పాడట.ఈ స్టొరీ పాతది అయినా దాంట్లో జీవిత సత్యం దాగి ఉంది.సమస్యలు కలకాలం ఉండవు,ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు వచ్చాయ్ ఎన్నో పోయాయి,ఇవి కూడా పోతాయి.ముందు మనలో ఉన్న లోపాలేంటి అని తెల్సుకొని వాటిని సరిదిద్దుకో కల్గి,ధైర్యం గా ఎదురు తిరిగి పోరాడితే ఏ సమస్య మనల్ని ఏమి చేయలేదు.”ఇతరుల్ని అర్ధం చేసుకున్న వాడు విజ్ఞాని,కాని తనని తను తెల్సుకున్న వాడే వివేకి.వివేకం లేని విజ్ఞానం శూన్యం".

"దిగులు పడకు,చిర్రుబుర్రులాడకు,నిస్పృహ చెందకు
మన అవకాసాలిప్పుడే మొదలయ్యాయి,గుర్తుంచుకో,గొప్ప పనులింక మొదలవ లేదు గొప్ప ఉద్యమం ఇంకా పూర్తవలేదు".

రేపు తొలిగిపోయే సమస్యలకోసం ఈ రోజుని బాదగా మార్చుకోవద్దని,ఇది మీ సమస్యలను తీర్చక పోఇనా మీ సమస్యలను ఎదుర్కోవడానికి కొద్దిగా ధైర్యాన్ని ఇస్తుంది అని ఆసిస్తూ…………


Your’s…………………………………సతీష్.


Monday, July 2, 2012

వృక్షో రక్షతి రక్షితః

నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు.కాలేజ్ కి వెళ్ళగానే ఈ రోజు జన్మభూమి కార్యక్రమం ఉంది అన్నారు.మా అందరికి చాలా సంతోషం వేసింది.అస్సలు జన్మభూమి కార్యక్రమం అంటే ఏంటో మాకు తెలీదు,అందులో అస్సలేమి చేస్తారో అంతకన్నా తెలీదు.కాని క్లాసు లు జరగవు ఆ రోజు అనే చిన్న సంతోషం అంతే.అందరికి మొక్కలు ఇచ్చి రోడ్ పక్కనే నాటమని మా మేడం చెప్పారు,అప్పుడు మాకు క్లాస్సేస్ వినడం కంటే ఈ పనేమీ పెద్ద కష్టం గ కనిపిచ్చలె,అందరం మొక్కలు నాటుకుంటూ వెళ్ళాం.ఆ రోజు అలా గడిచిపోయింది.ఆ రోజునుండి మేము నాటిన మొక్కల్ని రోజు చూస్తూ అవి పెరుగుతుంటే చాలా ఆనందం గ అనిపిచ్చింది…అలా 1 మంత్ గడిచిన తరువాత గవర్నమెంట్ వారి పుక్లయినేర్ రోడ్ సైడ్ పయప్ లైన్ అంటూ కాలువలు తవ్వుకుంటూ ఈ మొక్కలను కూడా తవ్వుతూ పోయింది.మొక్కలు నాటిచ్చింది గవర్నమెంట్,మొక్కలను పికుతుంది కూడా గవర్నమెంటే.అస్సలేమి జర్గుతుందో తెలుసుకునే అంత,తెలుసుకోవాల్సిన అంత తెలివి కాని అప్పుడు మాకు లేదు.కాని ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తుంది ఆ రోజు మేము నాటిన మొక్కలు ఉండి ఉంటె ఈ రోజు అవి మహా వ్రుక్షాలై ఉండేవి.

మనం ఒక విషయాన్ని తెల్సుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది.“జోస్ థామస్”అనే వ్యక్తి చాలా కాలం క్రితం నీలగిరి కొండల మీద ఒక్కడే 10 వేల మొక్కలు నాటాడట,అప్పట్లో అతన్ని "మాడ్ థామస్"అనే వారట,20 సంవత్సరాల తరువాత అవే మొక్కలు ఇప్పుడు మనందరం లైఫ్ లో ఒక్కసారన్న పీస్ఫుల్ గ వెళ్లి చూడాలనుకునే ఊటీ లా ఫేమస్ అయ్యాయి.నేను MBA జాయిన్ అయి కాలేజ్ కి వెళ్తుంటే రోడ్ పక్కన పూల మొక్కల వాళ్ళ దగ్గర ఒక చిన్న ఎల్లో ఫ్లవేర్స్ ఉండే మొక్క చూసాను,అది చాలా నచ్చి ఇంటికి తీసుకొచ్చి నాటాను,రోజు దాన్ని చాలా జాగర్తగా వాటర్ పోసి పెంచుతున్దేవాడ్ని ఒక రోజు సడెన్గా మా లేగ దూడ హాఫ్ మొక్కని తినేసింది(పాపం దానికేమి తెల్సు ఆకలేసింది దానికి).కాలేజ్ నుండి ఇంటికి రాగానే దాన్ని చూడగానే చాలా బాధ వేసింది లేగ ని చూడగానే కోపం వేసింది,కాని ఏమి చేయలేము మళ్లీ దాన్ని జాగర్త గ పెంచాను,2years లో అది చాలా పెద్దగ అయింది.ఇంటికే అందం వచ్చింది ఈ లోపు నేను జాబ్ అంటూ హైదరాబాద్ వచ్చా,కొన్ని రోజుల తరువాత ఇంటికి వెళ్లాను,ఇంటిముందు చుస్తే ఆ మొక్క లేదు కనీసం దాని ఆనవాళ్ళు కూడా లేవు.వెంటనే మా పెద్దమ్మని అరిచా"పెద్దమ్మ మొక్క ఏమయింది"అని,పిన్ని మొక్కని నరికిచ్చేసింది ఆ మొక్క పువ్వులన్నీ గుమ్మం లో చెత్తలా పడుతున్నై అని అంది.ఒక్కసారి నాకు చాలా బాద వేసింది 4years కష్టపడి పెంచుకున్న మొక్కని నరికేసారే అని,ఎవర్ని ఎమనలేకపోయాను.ఇదంతా సిల్లీ విషయం లా ఉంది కదా….కాని ఆలోచిస్తే నాకర్ధం అయింది మనం ఇష్టపడి పెంచుకుంటే ఆ మొక్క మన జీవితం లో ఒక ఫ్రెండ్ అవుతుందని అప్పుడు అర్ధమయింది.
మనం చిన్నప్పుడు ఒక కత చదువుకొని ఉంటాము "ఒక తాత రోడ్ పక్కన ఒక మామిడి మొక్క నాతుతుంటాడు,రోడ్ పక్కన వెళ్ళే వ్యక్తి తాత తో “తాత ఇంకా నువ్వు మా అంతే రెండు,మూడేళ్ళు బ్రతుకుతావేమో,కాని మామిడి మొక్క పెరిగి కాయలు కాయలంటే 10 సంవత్సరాలు పడుతుంది,నీకెందుకు అంత ఆశ"అన్నాడు.అప్పుడు తాత ”నేను తినక పోఇన మా మనవళ్ళు లేదా ఈ రోడ్ మీద వెళ్ళే ని లాంటి బాటసారులన్న రేపు తింటారు కదా”అన్నాడు".ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన రాష్ట్రం లో సిటీ లో రోజుకి 2 గంటలు,పల్లెటూర్లలో రోజుకి 8 గంటలు కర్రెంట్ కోతలు రావడం.టైం కి వర్షాలు లేక రైతులు పంటలను నష్టపోవడం,సిటీ లో 2 డేస్ కి ఒకసారి డ్రింకింగ్ వాటర్ రావడం వీటన్నిటికి కారణం రోజు రోజు కి అడువులు తగ్గి పోవడం.మన దేశం లో పులుల సంక్య 1100 మాత్రమె,అంతే మన జాతీయ జంతువులూ 100 కోట్ల జనాబాలో 1100 పులులు మాత్రమె ఉన్నాయ్ అంటే మనకెంత సిగ్గు చేటు.భవిష్యత్తు లో మన పిల్లలికి పులి అంటే ఇలా ఉండేది అని ఏ హాలీవుడ్ సినిమా కో తీసుకెళ్ళి చూపిచ్చే రోజు రాబోతుంది త్వరలోనే.దీనంతటికి కారణం మనలో చెట్లను కాపాడాలి,చెట్లను నాటాలి అనే చిన్న ఆలోచన లేకపోవడమే.

మనం అనుకోవచ్చు తినడానికే టైం సరిపోని ఈ బిజీ లైఫ్ లో ఇంకా మొక్కల గురించి ఆలోచించడమ అని,మనం ఇప్పుడు మొక్కల గురించి ఆలోచించకపోతే మన పిల్లలకి కనీసం తాగటానికి మంచి నీళ్ళు తినడానికి తిండిని కూడా సరిగా అందించలేము.మనం కనీసం మన పుట్టిన రోజు అనేది సంవత్సరం లో ఒక్క రోజే వస్తుంది కదా ఆ ఒక్క రోజు ఒక మొక్క నాటి దాన్ని కాపాడితే,అలా ప్రతి రోజు ఏదో ఒక వ్యక్తి పుట్టిన రోజు ఉంటూనే ఉంటుంది ప్రతి వ్యక్తి అలా నాటితే రోజుకి వందల వేల మొక్కలు నాటొచ్చు,అవి మన భవిష్యత్తు కు ఎంతో ఉపయోగ పడొచ్చు.మనం ఒక్క రోజు చేసే పని మన జీవితాంతం ఉపయోగపడుతుంది కదా.”వృక్షో రక్షతి రక్షితః”మనం వృక్షాలను రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయి.ఏ మనిషి ఉపయోగం లేకుండా ఏ పని చేసే రోజులు కావు ఇవి,మొక్కలు నాటడం వల్ల కూడా చాలా ఉపయోగాలున్నై కదా మనమేమి ఉరికే చేయట్లే కదా మనకోసం మన పిల్లల కోసం అని ఆలోచిద్దాం........కొంతమంది కి ఇది సిల్లీ గ ఉండొచ్చు,కాని దీని గురించి కాస్త ఆలోచించిన వాళ్లకు అర్ధమవుతుందని ఆసిస్తూ....సంవత్సరం లో ఒక్క మొక్కయినా నాటదామా.ఈ సారి మన బర్తడే కి కేకు తో పాటు ఒక మొక్కని కూడా తెప్పించుకుందాం.


Your 's ……………………………………………..సతీష్Sunday, July 1, 2012

తాగని వాడు గాడిద....

ఒకప్పుడు పురాణాలలో చదువుకున్నాము "దేవతలు అసురులు కలిసి సముద్రాన్ని చిలికి చిలికి అమృతం కోసం పోటి పడ్డారని". మల్లి ఈ కలికాలం లో చూస్తున్నాము "మద్యం కోసం ప్రబుత్వాలు ప్రజలు కొట్టుకు చస్తున్నారని". ఒకప్పుడు మద్యం వద్దు అని ప్రజలు, మద్యం కావాలని ప్రభుత్వాలు కొట్టుకునే వాళ్ళు కాని ఇప్పుడు ఇద్దరూ కలిసి దానికోసమే కొట్టుకు చస్తున్నారు. ఇక మన పురాణం లోకి వెళ్తే ఆకరికి దేవతలు ఏదో మాయ చేసి అసురులను పిచ్చోల్లని చేసి వాళ్లకి హ్యాండ్ ఇచ్చి దేవతలే అమృతాన్ని కొట్టేసారు. అలానే ఇప్పుడు కూడా ఓపెన్ లాటరీ ద్వారా మద్యం టెండర్స్ అని చెప్పి ప్రజలను ఊరించి ఆకరికి మద్యం నిషేదించాలి అని చెప్పే మన ఆడవారితోనే మద్యం టెండర్స్ వేసేలా చేసారు. ఈ పిచ్చి జనాలను కొట్టుకు చచ్చేలా చేసి లాస్ట్ కి మన నాయకుల బినామీలకే టెండర్లు వచ్చేలా చేసుకున్నారు. సో మద్యం టెండర్స్ దక్కినందుకు నాయకులను దేవతలు అందామా లేక కొట్టుకు చచ్చి ఆబాసు పాలు అయినందుకు ఈ పిచ్చి జనాలను అసురులు అందామా...?

మన వాళ్ళు మందు కోసం ఎంత దిగాజారుతున్నారు అంటే ఇల్లు గుల్లా..వొల్లు గుల్లా అయినా పర్లేదు అన్నట్లు తయారయ్యారు.ఒకప్పుడు తాగి తాగి రోగం వచ్చి చస్తామేమో అనే భయమన్న ఉండేది, కాని ఇప్పుడు పరిస్తితి అలా లేదు..జబ్బు ఉన్న లేకపోయినా లక్షల బిల్లు వేసి(మనకి కాదులెండి మన ప్రభుత్వానికి) ఏదో ఒక ట్రీట్మెంట్(ఆరోగ్య శ్రీ లో) చేసే హాస్పిటల్స్ చాలానే ఉన్నాయ్ గా...సో తాగినా త్వరగా పోములే అన్న ధైర్యం బాగా వచ్చేసింది.(మందు అలవాటు ఉన్నోడికి ఆరోగ్య శ్రీ పథకం వర్తించదు అంటే ఎలా ఉంటుందో...!)

ఉగాండా లాంటి కొన్ని వెనకపడ్డ దేశాలలో తిండి దొరక్క ప్రజలు షాప్స్ మీద పడి లూటీ చేస్తుంటారు అని మనం అప్పుడప్పుడు చదువుతుంటాము..కాని ఈ రోజు మన దేశం లో మన రాష్ట్రం లో నెల్లూరు లో మన వాళ్ళు మద్యం దుకాణాల మీద పడి ఎవరికీ దొరికినన్ని వాళ్ళు మద్యం బాటిల్స్ ని ఎత్తుకెళ్ళారు ఆని టీవీ లలో చూపిస్తుంటే మనం ఎంత దిగాజారిపోతున్నామో అర్ధమవుతుంది. ఒకప్పుడు ఏ రాజకీయ పార్టీ నో ఏ రాజకీయ నాయకుడో సాసిస్తున్నాడు మనల్ని అనుకునే వాళ్ళం కాని ఇప్పుడు మనల్ని మన ప్రభుత్వాలను మద్యం అనే మహమ్మారి శాసించే స్టేజి కి దిగాజారాము.

నా చిన్నప్పుడు ఎవరన్నా మందు తాగుతాను అని చెప్పుకోడానికి సిగ్గుపడే వాళ్ళు, కాని ఇప్పుడు మందు అలవాటు లేదు అని చెప్పాలంటే సిగ్గుపడాల్సిన పరిస్తితికి మన సమాజం వచ్చింది. 18 సంవత్సరాల లోపు వాడికి మందు అమ్మొద్దు అని చెప్తారు గాని.. అస్సలు మందు ఎందుకు అని చెప్పరే...? మందు తాగి డ్రైవ్ చేస్తే నేరం అంటారు గాని..అస్సలు బార్ షాప్స్ కి పార్కింగ్ ఎందుకు పెడుతున్నారో చూడరే...? మందు నిషేదిస్తే మన ప్రభుత్వ ఆర్దిక వ్యవస్థ పడిపోతుంది అని ఆలోచిస్తారు తప్ప...ఈ మందు వల్ల ఎన్ని కుటుంబాల ఆర్దిక వ్యవస్థ చిన్నాబిన్నం అవుతుందో చూడరే...?

ఆర్దిక వ్యవస్థను చక్కపెట్టుకోడం చేతకాక అడ్డ దారుల మీద ఆధారపడుతున్న ఈ చేతకాని ప్రభుత్వాలకు సిగ్గు రాదు....వాళ్ళు చూపే అడ్డ దారుల్లో నడుస్తున్న మనకు అస్సలే బుద్ధి రాదు.

తాగని వాడు గాడిద అనే సామెత పోయే కాలం ఎప్పుడు వస్తున్దో అని వేచి చూస్తూ.....మీ సతీష్.