Pages

Friday, July 6, 2012

ఎవరో వస్తారని ఏదో చేస్తారని....

"ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకు మిత్రమా"….. ఈ మాటలు నేను చేసే పనులకి కరెక్ట్ గా సరిపోతాయి అనిపిస్తుంది.ఎప్పుడు నాకు సమస్య వచ్చినా ముందుగ ఎవరు హెల్ప్ చేస్తారా అని ఆలోచిస్తుంట తప్ప నాకు నేను సాల్వ్ చేసుకోలేనా అని ఆలోచించట్లేదు.అలా ఆలోచించక పోవడం వల్ల సమయం వృధా అయి సమస్య ఇంకా పెద్దదిగా మారుతుంది తప్ప సమస్య తీరడం లేదు.అదే ఎవరో హెల్ప్ చేస్తారు అని ఆలోచించే లోపు,నేనే ఏదో ఒకటి చేస్తే ఆ సమస్య తీరడమో లేక సగం బారం తగ్గడమో జరుగుతుంది కదా.మనకెప్పుడు అనిపిస్తుంది నాకే ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి,అందరికి ఎందుకు రావట్లేదు అని.ఒక్కసారి మనం సమస్యలుగా ఫీల్ అవుతున్న వీటినుండి బయటి ప్రపంచం లోకి తొంగి చుస్తే ఎంతోమంది మనకంటే ఎక్కువ సమస్యలతో పోరాడి విజయాలను అందుకుంటున్నారని అర్ధమవుతుంది.అన్ని వనరులు సవ్యం గా ఉండి కుడా మనం ఇంకా చిన్న చిన్న వాటికి కుడా ఏదో బాదలు పడుతున్నట్లు ఫీల్ అవుతాం.ఏ సమస్య వచ్చినా సరే ఆ రోజు దేవుడ్ని "ఈ ఒక్క సమస్య తీర్చు దేవుడా నెక్స్ట్ ఏమయినా పర్లేదు" అని వేడుకుంటాం,ఆ సమస్య మనవల్లనో లేక దేవుని వలనో తీరిపోతుంది.మళ్లీ ఏదో ఒక సమస్య మొదలు,మళ్లీ అదే విన్నపం దేవుడికి,సమస్య తీరకపోతే బాదపడటం ఇదేనా మన జీవితం.


“అన్ని రోజులకు ఒకలానే సిద్దంగా ఉండు ...
మంటల్లో ఇనుముగా ఉన్నప్పుడు దెబ్బలకు ఓర్చుకో...
సమ్మెటగా ఉన్నప్పుడు దెబ్బ మీద దెబ్బ తీయి”.

ఒక్కసారి ఆలోచించండి ఇప్పటివరకు ఏమి సాదించాం మనం....?,ఏమి లేదు కదా, మరెందుకు ఏదో చాలా కష్టాలు పడిపోయి (ప్రపంచం లో మనం తప్ప ఎవరు పడనంత)బాదలు పడుతున్నట్లు ఫీల్ అవ్వడం.మహాత్మా గాంధీ ఒక్కరోజులో సత్యాగ్రహం చేసి స్వాతంత్రం తీసుకొచ్చారా,అబ్దుల్ కలాం ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపి ఉంటారు,మదర్ తెరీసా తన లైఫ్ లో ఎప్పుడన్నా తన సంతోషం గురించి ఆలోచించారా…? ఇలాంటి ఎంతోమంది మహానుబావులు వాళ్ళు ఎన్నో కష్టాలు పడి మనలాంటి ఎంతోమందికి స్వేచ్చ కలిగిన జీవితాన్ని అందించారు.మనం మాత్రం మన పర్సనల్ లైఫ్ ని(ఎవరికి ఉపయోగపడని)సెట్ చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతున్నాం అని ఫీల్ అవుతాం.గొప్పవాళ్ళే కష్టాలను ఫేస్ చేస్తారు మనం చేయట్లేదని నా ఉద్దేశం కాదు.సమస్యలు వచ్చినప్పుడే ధైర్యం గా ఉండాలి మన సహనాన్ని కోల్పోకూడదు అలాంటి వాడే విజయాన్ని పొందగలడు.

”దేవుడు నిన్ను నమ్మి విజయాన్ని ఇవ్వబోయే ముందు నువ్వు ఆ పెద్ద బహుమతిని నిలపెట్టుకోగలవని నిరూపించుకోవాలి”కదా....!

ఎన్నో లక్షలమంది వెంకటేశ్వర స్వామిని చూడటానికి వస్తుంటే ఈర్షతో స్వామి ముందు ఉన్న ఒక గడప స్వామి తో “స్వామీ నువ్వు నేను ఇదే కొండమీద పుట్టాము,ఒకే శిల్పి చేత చేయబడ్డాము కాని రోజు నిన్నేమో లక్షలమంది చేతులెత్తి మొక్కుతారు,నన్నేమో కాలితో తొక్కుతారు,ఎందుకింత వ్యత్యాసం"అని అడిగింది.అప్పుడు స్వామి “నువ్వు గడపగా మారడానికి శిల్పి ఉలి తో అటు ఒక దెబ్బ ఇటు ఒక దెబ్బ రెండు దెబ్బలు వేస్తె గడపగా మారావు,అదే శిల్పి నన్ను మలచడానికి కొన్ని వేల దెబ్బలు ఉలి తో వేసాడు,అన్ని దెబ్బలకు ఓర్చుకున్నాను కాబట్టే అంతమంది నన్ను పూజిస్తున్నారు”అని చెప్పాడట.ఈ స్టొరీ పాతది అయినా దాంట్లో జీవిత సత్యం దాగి ఉంది.సమస్యలు కలకాలం ఉండవు,ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు వచ్చాయ్ ఎన్నో పోయాయి,ఇవి కూడా పోతాయి.ముందు మనలో ఉన్న లోపాలేంటి అని తెల్సుకొని వాటిని సరిదిద్దుకో కల్గి,ధైర్యం గా ఎదురు తిరిగి పోరాడితే ఏ సమస్య మనల్ని ఏమి చేయలేదు.”ఇతరుల్ని అర్ధం చేసుకున్న వాడు విజ్ఞాని,కాని తనని తను తెల్సుకున్న వాడే వివేకి.వివేకం లేని విజ్ఞానం శూన్యం".

"దిగులు పడకు,చిర్రుబుర్రులాడకు,నిస్పృహ చెందకు
మన అవకాసాలిప్పుడే మొదలయ్యాయి,గుర్తుంచుకో,గొప్ప పనులింక మొదలవ లేదు గొప్ప ఉద్యమం ఇంకా పూర్తవలేదు".

రేపు తొలిగిపోయే సమస్యలకోసం ఈ రోజుని బాదగా మార్చుకోవద్దని,ఇది మీ సమస్యలను తీర్చక పోఇనా మీ సమస్యలను ఎదుర్కోవడానికి కొద్దిగా ధైర్యాన్ని ఇస్తుంది అని ఆసిస్తూ…………


Your’s…………………………………సతీష్.


3 comments:

  1. it is not about the problem... brother... it is about the solution we got to think of... we see so many faces talking about issues.. but what system need a resolver...

    ReplyDelete
  2. సతీష్ గారు,
    నిజమే, చిన్న సమస్యలు వచ్చినప్పుడు కూడా అల్లాడి పోతాము ఒకోసారి.
    మన కున్న సమస్యలు పెద్దవి కాకపోవచ్చు.
    కాని ఒక్కొకరము స్పందించే తీరులో చాలా తేడా ఉంటుంది.
    మన సమస్యలను మనమే ధైర్యం గా ఎదుర్కోవాలి, బాగా చెప్పారు.
    కోరికలనేవాటికి అంతం ఉండదు. ఉద్యోగం అసలు లేని వాడికి ఎదో ఒకటి temp జాబ్ వచ్చినా చాలు అనుకుంటాదు. వచ్చాక కొద్ది రోజులు ఆనందంగా ఉండి, వేంటనే ఈ ఉద్యోగం premanent అయితే బాగుండు అనుకుంటాడు. దేవుడా, దేవుడా..ఈ ఒక్క కోరికా తీర్చు, నా లైఫ్ సెట్ అని ప్రార్ధిస్తారు. అది కూడా దక్కాక, ఇంకేదో కోరుకుంటాడు. ఇలా...కోరుకుంటూనే ఉంటాడు.
    ఇంక కథ చెప్పారు కదా...నేను కూడా ఈ కథ రాసాను. ఇక్కడ చూడండి.
    http://maditalapulu.blogspot.com/2012/05/blog-post_25.html
    పాలరాతి శిల్పం చెప్పిన నీతి!

    ReplyDelete
  3. thanks వెన్నెల గారు...మీ పోస్ట్ చదివానండి చాలా బావుంది..

    ReplyDelete