Pages

Saturday, June 19, 2010

తెలుగు జాతి మనది...నిండుగ వెలుగు జాతి మనది



హైదరాబాద్ అసెంబ్లీ దగ్గర గొడవ జరుగుతుంది మేటర్ ఏంటంటే తెలంగాణా వాళ్ళు ఆంధ్ర వాళ్ళు సెపరేట్ కావాలి అని కొట్టుకుంటున్నారు, ఈ లోపు ఇద్దరి నాయకులు(ఒకడు from తెలంగాణా,ఇంకొకడు from ఆంధ్ర) అలిసిపొఇ రోడ్ పక్కనే ఉన్నఒక చిన్నషాప్ దగ్గర(షాప్ వాడు తెలంగాణానో ఆంధ్రనో తెలీదు) కుర్చుని డ్రింక్ తాగుతున్నారు.ఇంతలో షాప్ వాడు పేపర్ చదువుతున్నాడు పైకి వినపడేలా "Australia లో తెలుగు విద్యర్డులపయిన దాడి"అని,వెంటనే ఇద్దరి నాయకుల్లో ఒక నాయకుడి కొడుకు Australia లో చదువుతున్నాడు,వాడికి ఫోన్ చేసి యోగ క్షేమాలు కనుక్కుని జాగర్త నాన్న అని చెప్పి ఫోన్ పెట్టాసాడు,ఇంతలో ఇంకో నాయకుడు పర్లేదా మీ వాడు సేఫ్ కదా అన్నాడు k అన్నాడు,ఏంటండి ఇంత దారుణం మనవాల్లేదో చదువుకున్దాము అని అంత దూరం వెళ్తే వాళ్లకు ఏమయింది ఇలా చేస్తున్నారు అన్నాడు ఒక నాయకుడు,ఇంకో నాయకుడు అవునండి మన ప్రబుత్వం కూడా పట్టించుకోవట్లేదు దారుణం అన్నాడు, వెంటనే షాప్ వాడు "ఏదండి దారుణం



ఎక్కడో Australia అది మన దేశం కాదు మన బాష అంతకన్న్నకాదు,అక్కడి మేటర్ పక్కన పెడితే మన కళ్ళ ముందు మీరు చేస్తున్దేంటి,మనందరం తెలుగు వాళ్ళం,ఇందులోనే మా ఏరియా కి నువ్వు రాకు అంటే మా ఏరియా కి నువ్వు రాకు అని తలలు పగల కొట్టుకు చస్తున్నాము,ఒకే బాష ఒకే రాష్ట్రం ఒకే దేశం వాళ్ళం మనమే ఇలా ఉంటె,ఎవడో వేరే దేశం వాడు మన వాళ్ళను కొట్టడం లో వింత ఏముంది సర్" అన గానే ఇద్దరి నాయకులు ఒకరి పేస్ లోకి ఇంకొకరు తెల్ల మొహమేసి చూసుకుని ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోయారు మెల్లగా….

ఇది నిజమే కదా,మన దేశం లోనే ప్రతి రాష్ట్రం లో ఒక గొడవ,మన దగ్గర తెలంగాణా ఆంధ్ర అని మనం కొట్టుకుంటాం, మహారాష్ట్ర లో మరాఠీ నే మాట్లాడాలి వేరే వాళ్ళు ఉండకూడదు అని అక్కడ శివసేన.ఇలా ప్రతి రాష్ట్రం ఇలా కొట్టుకుంటూ పొతే ఇక మిగిలేది ఎవరు,ఒకప్పుడు మన map లో AP కి ఎంతో విలువుండేది,ఇప్పుడు మన రాష్ట్రం అంటేనే బయం వేస్తుంది బయటి వాళ్ళకి,ఈ 6 నెలల బీబత్సానికే మనం 6yrs వెనక పడ్డాం అబివ్రుద్దిలో,ఒక్కసారి ఆలోచించండి మన ప్రబుత్వ ఆస్తులకి ఎన్ని కోట్ల నష్టమో అవన్నీ మనవి కాదా,ఎప్పుడు గవర్నమెంట్ ఆస్తులు నష్టం అయిన దానికి రాజకీయ నాయకులో లేక రౌడి లో కారణం,కాని ఈ సారి చాలా bad ఏంటంటే,ఈ సారి గొడవలకి students కారణం,ఇప్పటికే ఎంతో విలువయిన half year వేస్ట్ చేసుకున్నారు.అమాయకులయిన స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాని ఏ ఒక్క రాజకీయ నాయకుడయిన చెసుకున్నాడా......

ఒక్కొక ఏరియా నాయకుడు తమ తమ ఏరియా లో 10 r 15 yrs నుండి MLA’s గ ఉంటారు,మళ్లీ "మా ఏరియా వెనకబడ్డది"అంటారు అంటే ఈ 10 సంవత్సరాలనుండి మీరు ముందుకి వెళ్తూ(ప్రజల సొమ్ము ని దండుకుంటూ) మీ ఏరియా ని వెనక్కి నెడుతున్నారు,మీ ఏరియా వెనకబడుతుంటే మీ ఆస్తులెలా పెరుగుతున్నాయో ప్రజలకు అర్ధం కావట్లే....చైనా లో ఒక మంచి సామెత ఉంది.“ఒక వ్యక్తికి ఒక్కరోజు కడుపు నింపడానికి చేపల కూర పెడితే సరిపోదు అదే వ్యక్తికి ఒక వల(నెట్) ని ఇస్తే వాడి జీవితాంతం జీవనోపాది కల్పించిన వాడివవుతావ్"అని.కాని మన నాయకుల దగ్గర elections వచ్చినప్పుడు మన జనాలు ఓటు కి 100 తో త్రుప్తి పడే అంత కాలం మనం మన ఏరియా వెనక పడుతూనే ఉంటుంది.

నాకు తెలంగాణా ఆంధ్ర కలిసి ఉండాలా విడిపోతే మంచిదా అని మాట్లాడే అంత knowledge లేదు. కాని ఏది మంచిదో మేధావులు అందరు కలసి కూర్చుని సామరస్యం గ తేల్చుకోవచ్చు కదా ఇంత గొడవలు చేసి సాదిచిన్దేముంది,మన ఆస్తుల్ని మనం నాశనం చేసుకోవడం తప్ప,పూర్వం ముర్ఖం గ రాజులు యుద్హాలు చేసి సాదించింది ఏముంది,ప్రజాస్వామ్య దేశం మనది.బుర్ర తో తేల్చుకోవాల్సిన విషయాన్ని కర్రతో తేల్చుకుందాం అనుకుంటున్నారేమో అని నా ఫీలింగ్…ఏ ఏరియా వాళ్ళని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు ...కొంతమంది స్వార్ధం కోసం సామాన్యుల జీవితాలతో ఆడుకోవద్దని నా ఉద్దేశం.










Your's..........సతీష్

Saturday, June 12, 2010

పారాహుషార్...పారాహుషార్

మన రాష్ట్రం లో మినరల్ వాటర్ బాటిల్ దొరకని ఊరు ఉందేమో కాని క్వార్టర్ బాటిల్ దొరకని ఊరంటు లేదు.మూతి మీద మీసం మొలవని వాడి దగ్గరి నుండి కాటికి కాలు చాచిన వాడి దాకా ఒకటే మత్తు,మద్యం అనే చిత్తు లో మునిగి తేలుతున్నారు.మన పురాణాల నుండి మొదలు ఈ మద్యం అనే మహమ్మారి మనల్ని వదిలేలా లేదు.రాజులు మారారు రాజ్యాలు మారాయి,ప్రభుత్వాలు మారాయి ప్రణాలికలు మారాయి కాని మనమీద ఈ  మందు ప్రభావం మాత్రం మారలేదు.ఒకప్పుడు మద్యం అనేది కొంతమంది జీవితాన్ని మాత్రమె శాసించేది అదే వారి జీవితాన్ని నాశనం చేసేది.కాని ఇప్పుడు అదే మద్యం మన ప్రభుత్వానికి కామధేనువు లా తయారయింది,రాష్ట్ర ఖజానాని నింపే ముఖ్యమయిన వనరు లా మారింది.ఖజానాని నింపడం లో తప్పు లేదు,కాని ఆ ఖజానా లో ఉన్న ధనం ఎవరికోసం...? ప్రజల అభివృద్ధి కోసమే కదా.మరి మన ప్రజల ఆరోగ్యం నాశనం చేసి సంపాదించి మళ్లీ ప్రజలకే పెట్టడం అనేది ఎక్కడి న్యాయమో అర్ధం కావట్లే.
మన నాయకులను ఎవరడిగారండి అన్నీ ఫ్రీ(పతకాలు)అని చెప్పి ఖజానని కాలీ చేయమని ఎవరు చెప్పారు.అన్నీ ప్రభుత్వాలు వోట్ల కోసం అన్నీ ఫ్రీ అని చెప్పి అధికారం లోకి వచ్చిన రెండు సంవత్సరాల లోనే ఆర్ధిక వ్యవస్తను అతలాకుతలం చేయడం,ఇప్పుడు ఆర్దిక వ్యవస్తను దారిలో పెట్టడానికి మన ప్రజల్ని అడ్డ దార్లో నడిపి వాళ్ళ వ్యసనాల మీద ప్రభుత్వాలు సంపాదించే ఆధునిక సూత్రం లో నడుస్తున్నాయి.లాస్ట్ ఇయర్ మద్యం టెండర లలో ప్రభుత్వ ఆదాయం 3 వేల కోట్లు ఈ సంవత్సరం అది 6 వేల కోట్లు దాటింది అని TV లలో పేపర్ లలో చాలా గొప్ప గా చెప్పుకుంటూ పోతుంది మన ప్రభుత్వం.అంటే ప్రతి సంవత్సరం మందు అమ్మే వాళ్ళ సంఖ్య దాన్ని తాగే వాళ్ళ సంఖ్య పెరుగుతూ పోతున్దనమాట సారీ మన ప్రభుత్వమే దగ్గరుండి మరీ పెంచుతున్దనమాట.గొప్ప గొప్ప నాయకులందరూ మద్యాన్ని నిషేదించండి పేద వాళ్ళ కుటుంబాలను కాపాడండి అని వాదిస్తుంటే మన ప్రభుత్వాలు మాత్రం చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇంకా పెద్ద తప్పు చేస్తున్నాయి.మన రాజకీయ నాయకులకు చిన్న లాజిక్ అర్ధం కావట్లేదు.ప్రభుత్వం ఖజానాని నింపడానికి విచ్చల విడిగా మద్యం టెండర్స్ వేసి ప్రజల సొమ్ము ని ధన్డుకుంటుంది కాని అదే ప్రజలు మద్యం అనే విషాన్ని తాగి మళ్లీ హాస్పిటల్స్ లలో చేరి(ఆరోగ్య శ్రీ)ఫ్రీ పథకాల ద్వారా మళ్లీ ప్రభుత్వ ఖజానానే కాలీ చేస్తారు కదా!!!.ఎందుకిలా మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం.మన పురాణాల లోనే ఉంది మద్యం మత్తులో అసురులు (రాక్షసులు)మహా విష్ణువు చేతిలో ఎలా మోసపోయి అమృతాన్ని చేజార్చుకున్నారో.మనిషి తయారు చేసిన పానీయం మనిషి జీవితాన్నే ఆడుకున్టుందంటే ఎంత వింత గా ఉంది కదా.మన ప్రభుత్వం సంవత్సరానికి ఎక్సైజ్ శాఖ కి 10 కోట్ల బడ్జెట్ ని కేటాయిస్తుంది ఎందుకో తెల్సా?మందు బాబులను మానిపిచ్చడానికి,కొత్తగా ఎవరు దానికి అలవాటు పడకుండా ఉండటానికి TV లు పేపర్ ల ద్వారా యాడ్స్ ఇచ్చి ప్రజల్ని చైతన్యులని చేయడానికి ఆ బడ్జెట్ ని యూస్ చేయాలి కాని ఆ విషయాలను పక్కకు నెట్టి మన ప్రభుత్వం మద్యం అమ్మకాలను ఎలా పెంచాలి,మద్యాన్ని ఎక్కువగా ప్రజలు తాగేలా ఎలా చేయాలి అనే దాని మీద ఆలోచిస్తుంది.
మందు బాటిల్ మీద“మద్యం ఆరోగ్యానికి హానికరం”అని ఒక చిన్న లైన్ రాసి మరీ అమ్మే దౌర్బాగ్య సంస్కృతిలో మనం ఉన్నాం.రాక్షసులు విజ్ఞానం అంటే తెలియని కాలం లో మత్తులో మునిగి అన్నీ కోల్పోయారు,కాని అన్నీ తెల్సి అభివృద్ధి అనే ముసుగులో మనం మన జీవితాలను కోల్పోతున్నాం అని నా అభిప్రాయం.
ఆల్కహాల్ వల్ల జరిగే అనర్దాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Your's ..........................................సతీష్

Saturday, June 5, 2010

రేపటి పౌరులు


ఈ రోజు ఆఫీసు లో చాలా లేట్ అయింది(సమయం 12PM 03/JUNE/2010 Johannesburg (SA)),క్యాబ్ కోసం కాల్ చేసాను 15mins లో క్యాబ్ వచ్చింది,అప్పటికే చాలా అలసటగా నా కళ్ళు మూసుకుపోతున్నై.క్యాబ్లో ఎక్కి కూర్చోగానే నా కళ్ళు మత్తుగా వాలిపోయాయి సడెన్గా బ్రేక్,మెలుకువ వచ్చి చూడగానే కార్ ఆగి ఉంది.చూస్తె ట్రాఫ్ఫిక్ సిగ్నల్ రెడ్.రాత్రి 12 అవుతుంది రోడ్ మీద ఒక్క వెహికిల్ కూడా లేదు ఇక్కడ మాములుగానే 8PM దాటితే రోడ్ మీద ట్రాఫ్ఫిక్ ఉండదు,కాని క్యాబ్ డ్రైవర్ రెడ్ సిగ్నల్ పడగానే కార్ ఆపి మళ్లీ గ్రీన్ లైట్ ఆన్ అవగానే మూవ్ అయ్యాడు.చూస్తే ఆ క్యాబ్ డ్రైవర్ అంత పెద్దగా చదువుకున్న వాడిలా కూడా లేడు,కాని ట్రాఫ్ఫిక్ రూల్స్ ఎంత చక్కగా పాటిస్తున్నాడు.నాకు వెంటనే మన హైదరాబాద్ JNTU సర్కిల్ అక్కడి ట్రాఫ్ఫిక్ మన వాళ్ళ నిబద్దత గుర్తొచ్చి నవ్వుకున్నాను.JNTU ట్రాఫ్ఫిక్ సిగ్నల్ చూస్తే అర్ధమవుతుంది అక్కడ నివసించే వాళ్ళు ఆ రూట్ లో వెళ్ళే వాళ్ళు అందరు 90% చదువుకున్నవాళ్ళు అన్ని రూల్స్ తెల్సిన వాళ్ళే  ఎందుకంటె అక్కడ JNTU యునివెర్సిటీ దగ్గరిలో హైటెక్ సిటీ ఉన్నాయ్.సిగ్నల్ కి 10 అడుగుల దూరం లో JNTU పోలిస్ స్టేషన్ ఉన్నా కాని అక్కడ ఏ వ్యక్తి సిగ్నల్ రూల్స్ పాటించరు అక్కడ రోడ్ కూడా సరిపోదన్నట్లు పక్కన బండలు కొండల మీదనుండి కూడా వాహనాలను పోనిస్తారు(కొంత కాలం కిందట ఆ వ్యక్తుల్లో నేను ఒకడ్ని). ఇది ఒక JNTU లోనే కాదు మన దేశం లో ప్రతి సిటీ లో ఇలానే ఉంది.
ఇక్కడ ప్రజలకు(సౌత్ ఆఫ్రికా)స్వాతంత్ర్యం వచ్చి 10 సంవత్సరాలు మాత్రమె అయింది.మనకు స్వాతంత్ర్యమొచ్చి 60 ఏళ్ళు దాటింది.ఇక్కడ మనం ఈ దేశం కన్నా వెనక పడి ఉన్నాం అని నేను చెప్పదల్చుకోలేదు.ప్రపంచ పటం లో మనం సౌత్ ఆఫ్రికా కంటే  ఎన్నో అడుగుల ఎత్తులో (అభివృద్ధి లో)ఉన్నాం,కాని మన వ్యవహార శైలిలో మాత్రం వెనకబడే ఉన్నాం అని నా వ్యక్తిగత అభిప్రాయం.ఈ దేశం లో ఒక వ్యక్తి ఆదాయం నెలకు సగటుగా 3 వేలు కూడా లేదు,అక్షరాస్యత లో చాలా వెనకబడి ఉన్న దేశం కాని వ్యవహార శైలి లో ఎంతో ఉన్నత దేశం.మరి మనమెందుకు మన  వ్యక్తిగత అభివృద్ధి గురించే ఆలోచిస్తున్నాం మన వ్యవస్థ గురించెందుకు ఆలోచించడం లేదు.
ఇలా ఆలోచించే లోపు నా అపార్ట్మెంట్ వచ్చింది క్యాబ్ డ్రైవర్ కి మనీ ఇచ్చి అపార్ట్మెంట్ లో లిఫ్ట్ లోకి వెళ్ళాను అక్కడ ఒక వ్యక్తి తన ముక్కు మొహం నాకు తెలీదు చాలా మర్యాదపూర్వకం గా విష్ చేసాడు,మనం కనీసం ముఖ పరిచయం ఉన్న వ్యక్తి ఎదురుగా వచ్చినా ముందు వాడు నవ్వి పలకరించే దాకా మనం పలకరించం(మనకి ఈగో కొంచెం ఎక్కువ కదా).ఇక్కడి వ్యక్తులు అందరు మంచి వాళ్ళు మన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అని కాదు.ప్రతీ దేశం లో ప్రతి వ్యక్తిలో మంచి చెడు రెండు ఉంటాయి.మన దేశం అన్నా,మన ప్రజలు అన్నా,మనకి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన మన నాయకులు అన్నా బయటి ప్రపంచానికి చాలా గొప్ప అభిప్రాయం ఉంది,ఆ అభిప్రాయాన్ని మనం పాడుచేస్తున్నామేమో అని నా అభిప్రాయం.ఇక్కడి(సౌత్ ఆఫ్రికా) ప్రజలకు స్వేచ్చ పోరాటం అంటే ఏంటో నేర్పిందే మన గాంధీ గారు,ఆ గాంధీ గారి భావాలను మనలో చాలా మంది ఎప్పుడో మర్చిపోయారు కాని ఇక్కడ వ్యక్తుల్లో చాలా  మంది ఇప్పటికి వాటిని పాటిస్తున్నారు.మన పోలిస్ లు కేసుల కి బయపడి తప్పు చేయకుండా ఉండటం గొప్ప కాదు.ఒక్కసారి హైదరాబాద్ సిగ్నల్స్ లో ఒక్క ట్రాఫ్ఫిక్ పోలిస్ లేకుండా ఒక గంట చూడండి మన వాళ్ళ నిబద్దత ఎంతుందో అప్పుడే అర్ధమవుతుంది.ఎందుకు బయటి కంట్రీస్ లో ట్రాఫ్ఫిక్ సిగ్నల్స్ దగ్గర ఒక పోలిస్ కూడా కనిపిచ్చడు,మరి మనదగ్గరెందుకు సిగ్నల్స్ సరిగా పని చేస్తున్నా కాని ఇద్దరు ముగ్గురు పోలిస్ లు ఉంటారు.
"అవకాశం లేనప్పుడు తప్పు చేయకుండా ఉండటం గొప్ప కాదు అవకాశం ఉండి కూడా తప్పు చేయని వాడు గొప్ప వాడు".నేను ఈ దేశం(సౌత్ ఆఫ్రికా)వచ్చే ముందు అందరు బయపెట్టారు అక్కడ Indians మీద ఎటాక్స్ బాగా జరుగుతాయి జాగర్త అని,నిజమే ఇక్కడ ఎటాక్స్ జరుగుతాయి కాని అది ఈ దేశ ప్రజలు చేస్తున్నవి కావు వేరే దేశం నుండి వలస వచ్చి ఏ పని లేక కాలీగా ఉండే వాళ్ళు చేస్తున్న పని ఇది అని ఇక్కడికి వచ్చాక తెల్సింది,వాళ్ళు చేసే ఈ పని వలన ఈ దేశానికి ఎంతో చెడ్డ పేరు వస్తుంది.అలానే మనం చేసే తప్పుల వలన మన దేశానికి చెడ్డ పేరు రావోద్దనే నా అభిప్రాయం.జూన్ 5th ఈ రోజు నాకు ఈ దేశం లో చివరి రోజు మళ్లీ నేను ఈ దేశానికి వస్తానో లేదో తెలీదు,కాని జీవితాంతం నాతొ మిగిలి ఉండే ఎన్నో తీపి గుర్తులను మాత్రం తీసుకు వెళ్తున్నాను,కాని శాంతికి మారు రూపమయిన నెల్సన్ మండేలా గార్ని ప్రత్యక్షం గా చూడాలి అన్న నా చిన్ని కోరిక తీరకుండానే నా దేశానికి తిరిగి వెళ్తున్న అనే చిన్న బాద తో ఉన్నాను.
చిన్నప్పటి నుండి వింటున్నా మన నాయకులు చెప్తుంటారు "నేటి బాలలే రేపటి పౌరులు వారే మన దేశ భవిష్యత్తు కి బంగారు బాటలు" అని,ఆ బాలలు పెరుగుతూనే ఉన్నారు వారు కూడా మన రాజకీయ నాయకుల బాటలోనే నడుస్తున్నారు తప్ప ఎటువంటి మార్పు లేదు.నేటి బాలలు రేపటి పౌరులవుతారు నిజమే కాని వారు మన దేశ భవిష్యత్తు కి బంగారు బాట కావాలంటే ముందు మనం సరయిన బాటలో నడవాలి వాళ్ళని సరయిన బాట లో ప్రయాణించేలా చేయాలి అని ఆసిస్తూ………………………………


ఎప్పుడు మనదేశం లో అడుగుపెడతానా అనే ఆనందంతో ఊగుతూ……..






Your’s……………………………………సతీష్.