Pages

Saturday, June 12, 2010

పారాహుషార్...పారాహుషార్

మన రాష్ట్రం లో మినరల్ వాటర్ బాటిల్ దొరకని ఊరు ఉందేమో కాని క్వార్టర్ బాటిల్ దొరకని ఊరంటు లేదు.మూతి మీద మీసం మొలవని వాడి దగ్గరి నుండి కాటికి కాలు చాచిన వాడి దాకా ఒకటే మత్తు,మద్యం అనే చిత్తు లో మునిగి తేలుతున్నారు.మన పురాణాల నుండి మొదలు ఈ మద్యం అనే మహమ్మారి మనల్ని వదిలేలా లేదు.రాజులు మారారు రాజ్యాలు మారాయి,ప్రభుత్వాలు మారాయి ప్రణాలికలు మారాయి కాని మనమీద ఈ  మందు ప్రభావం మాత్రం మారలేదు.ఒకప్పుడు మద్యం అనేది కొంతమంది జీవితాన్ని మాత్రమె శాసించేది అదే వారి జీవితాన్ని నాశనం చేసేది.కాని ఇప్పుడు అదే మద్యం మన ప్రభుత్వానికి కామధేనువు లా తయారయింది,రాష్ట్ర ఖజానాని నింపే ముఖ్యమయిన వనరు లా మారింది.ఖజానాని నింపడం లో తప్పు లేదు,కాని ఆ ఖజానా లో ఉన్న ధనం ఎవరికోసం...? ప్రజల అభివృద్ధి కోసమే కదా.మరి మన ప్రజల ఆరోగ్యం నాశనం చేసి సంపాదించి మళ్లీ ప్రజలకే పెట్టడం అనేది ఎక్కడి న్యాయమో అర్ధం కావట్లే.
మన నాయకులను ఎవరడిగారండి అన్నీ ఫ్రీ(పతకాలు)అని చెప్పి ఖజానని కాలీ చేయమని ఎవరు చెప్పారు.అన్నీ ప్రభుత్వాలు వోట్ల కోసం అన్నీ ఫ్రీ అని చెప్పి అధికారం లోకి వచ్చిన రెండు సంవత్సరాల లోనే ఆర్ధిక వ్యవస్తను అతలాకుతలం చేయడం,ఇప్పుడు ఆర్దిక వ్యవస్తను దారిలో పెట్టడానికి మన ప్రజల్ని అడ్డ దార్లో నడిపి వాళ్ళ వ్యసనాల మీద ప్రభుత్వాలు సంపాదించే ఆధునిక సూత్రం లో నడుస్తున్నాయి.లాస్ట్ ఇయర్ మద్యం టెండర లలో ప్రభుత్వ ఆదాయం 3 వేల కోట్లు ఈ సంవత్సరం అది 6 వేల కోట్లు దాటింది అని TV లలో పేపర్ లలో చాలా గొప్ప గా చెప్పుకుంటూ పోతుంది మన ప్రభుత్వం.అంటే ప్రతి సంవత్సరం మందు అమ్మే వాళ్ళ సంఖ్య దాన్ని తాగే వాళ్ళ సంఖ్య పెరుగుతూ పోతున్దనమాట సారీ మన ప్రభుత్వమే దగ్గరుండి మరీ పెంచుతున్దనమాట.గొప్ప గొప్ప నాయకులందరూ మద్యాన్ని నిషేదించండి పేద వాళ్ళ కుటుంబాలను కాపాడండి అని వాదిస్తుంటే మన ప్రభుత్వాలు మాత్రం చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇంకా పెద్ద తప్పు చేస్తున్నాయి.మన రాజకీయ నాయకులకు చిన్న లాజిక్ అర్ధం కావట్లేదు.ప్రభుత్వం ఖజానాని నింపడానికి విచ్చల విడిగా మద్యం టెండర్స్ వేసి ప్రజల సొమ్ము ని ధన్డుకుంటుంది కాని అదే ప్రజలు మద్యం అనే విషాన్ని తాగి మళ్లీ హాస్పిటల్స్ లలో చేరి(ఆరోగ్య శ్రీ)ఫ్రీ పథకాల ద్వారా మళ్లీ ప్రభుత్వ ఖజానానే కాలీ చేస్తారు కదా!!!.ఎందుకిలా మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం.మన పురాణాల లోనే ఉంది మద్యం మత్తులో అసురులు (రాక్షసులు)మహా విష్ణువు చేతిలో ఎలా మోసపోయి అమృతాన్ని చేజార్చుకున్నారో.మనిషి తయారు చేసిన పానీయం మనిషి జీవితాన్నే ఆడుకున్టుందంటే ఎంత వింత గా ఉంది కదా.మన ప్రభుత్వం సంవత్సరానికి ఎక్సైజ్ శాఖ కి 10 కోట్ల బడ్జెట్ ని కేటాయిస్తుంది ఎందుకో తెల్సా?మందు బాబులను మానిపిచ్చడానికి,కొత్తగా ఎవరు దానికి అలవాటు పడకుండా ఉండటానికి TV లు పేపర్ ల ద్వారా యాడ్స్ ఇచ్చి ప్రజల్ని చైతన్యులని చేయడానికి ఆ బడ్జెట్ ని యూస్ చేయాలి కాని ఆ విషయాలను పక్కకు నెట్టి మన ప్రభుత్వం మద్యం అమ్మకాలను ఎలా పెంచాలి,మద్యాన్ని ఎక్కువగా ప్రజలు తాగేలా ఎలా చేయాలి అనే దాని మీద ఆలోచిస్తుంది.
మందు బాటిల్ మీద“మద్యం ఆరోగ్యానికి హానికరం”అని ఒక చిన్న లైన్ రాసి మరీ అమ్మే దౌర్బాగ్య సంస్కృతిలో మనం ఉన్నాం.రాక్షసులు విజ్ఞానం అంటే తెలియని కాలం లో మత్తులో మునిగి అన్నీ కోల్పోయారు,కాని అన్నీ తెల్సి అభివృద్ధి అనే ముసుగులో మనం మన జీవితాలను కోల్పోతున్నాం అని నా అభిప్రాయం.
ఆల్కహాల్ వల్ల జరిగే అనర్దాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Your's ..........................................సతీష్

1 comment:

  1. chala baga enlaise chesavu..bagundi supurb!..but janam entha gonthu chinchukunna origedi emundadu..Govt.thaluchukundi..khajana nimpukundi.janala lo ravali maarpu..aa maarpe solution..vere inkokati ledu deeniki..

    ReplyDelete