Pages

Wednesday, April 25, 2018

అభిమాని!!

హీరో ల, రాజకీయ పార్టీ ల మరియు కుల అభిమానులకు సూటి ప్రశ్న..!

ఒక వ్యక్తిని కాని, వ్యవస్థని కానీ తనలో ఉన్న లోపాన్ని వేలెత్తి చూపి సరిదిద్దుకునేలా చెప్పే వాడే అభిమాని. భజన చేసే వాడెవడు అభిమాని కాడు. 

ఇక్కడ నేను ముగ్గురు అభిమానుల గురించి చెప్పదలచుకున్నాను. 
తెలుగు తమ్ముళ్లు 
వైయస్ఆర్ కుటుంబం
జనసేన సైనికులు

     ఇందులో ఏ అభిమాన సంఘానికయినా ఎదుటి వాడి లోపాన్ని వేలెత్తి చూపడమే తప్ప తను అభిమానించే వారి తప్పులను వేలెత్తి చూపించే నిబద్దత ఉందా...! అలా చూపించిన సందర్భం ఎప్పుడన్నా ఉందా..!!

మనిషి అనే వాడెవడు ఎల్లప్పుడూ  కరెక్ట్ కాదు, తన నిర్ణయాలు కానీ తన చర్యలు కానీ అన్ని వేళలా సరికావు. ఏనాడన్నా ఈ అభిమాన సంఘాలు తమ వాళ్ళ గొప్పలు చెప్పడమే కానీ వాళ్ళ తప్పులను అంగీకరించగలిగారా..!  పొరపాటున ఏకవచనం తో సంబోదించినందుకు సభాముఖం గా క్షమాపణ చెప్పిన పుచ్చలపల్లి సుందరయ్య గారి లాంటి సంస్కారం నుండి ఎదుటి వాడి భార్యా పిల్లలను కూడా తిట్టుకునే కుసంస్కారాన్ని ప్రోత్సాహిస్తుంది ఎవరు...! వ్యక్తి తీసుకునే నిర్ణయాలను అంగీకరించాలి లేదా విభేదించాలి కానీ, ఆ వ్యక్తి నే ఆరాధించడం అభిమానం కాదు ధ్వాంతము. 


***సతీష్ ధనేకుల***
 
 

Sunday, April 22, 2018

పగటి కలలు

మార్కెట్ లోకి ఇంకో కొత్త చంద్రబాబు, జగన్ లాంటి నాయకుడే వస్తున్నాడేమో అనే భయాన్ని నాకు పవన్ కళ్యాణ్ కల్పిస్తున్నాడు. రాజకీయాలలోకి కొత్త రక్తం రావాలి జనాలలో చైతన్యం తేవాలి నిస్స్వార్ధమయిన నాయకులు రావాలి అని పగటి కళలు కనే ఎంతో మంది సామాన్యులలో నేను ఒకడిని. మళ్ళీ మన కలలు పగటి కల గానే మిగిలిపోతుంది  అని నాకు అనిపిస్తున్న కారణాలు..!

మన రాజకీయాలలో ఏనాటి నుండో ఫాలో అవుతున్న మొదటి సూత్రం, "మనం చేస్తే సంసారం, అదే ఎదుటి వాడు చేస్తే వ్యభిచారం". 

మొదట టీడీపీ విషయానికి వస్తే ఎలక్షన్ అవసరాలప్పుడు నరేంద్ర మోడీ ఒక గొప్ప హీరో ఈ దేశాన్ని ఉద్దరించడానికి వచ్చిన నిస్స్వార్ధమైన నాయకుడు. పవన్ కళ్యాణ్ ఒక గొప్ప త్యాగశీలి నిజాయితీకి మారు పేరు. కానీ మన అవసరాలు మారిన తరువాత, ఇప్పుడు మోడీ దేశ ద్రోహి పవన్ కళ్యాణ్ పర్సనల్ గా చెడ్డోడు అయిపోయాడు వీళ్ళకి... 

ఇక వైసీపీ విషయానికి వస్తే, ఎలక్షన్స్ ముందు బీజేపీ టీడీపీ పార్టీలు మతపూరిత పార్టీలు వీళ్లిద్దరు కలిసి దేశాన్ని దోచుకుంటారు, పవన్ కళ్యాణ్ చేతకాని వాడు ప్యాకేజీ లకు అమ్ముడు పోయాడు. కానీ ఇప్పుడు మన అవసరాల కోసం మోడీ మంచోడు అండ్ మోడీ ని డైరెక్ట్ గా పొగడకపోయినా ఎప్పుడు నోరెత్తి ప్రశ్నించము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంచోడు పవన్ కళ్యాణ్ ని ఎమన్నా అంటే మేమున్నాం అంటున్నారు.. 

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, ఆవేశం తో విప్లవ ఉద్యమాలను నడపొచ్చేమో కానీ రాజకీయ పార్టీలను నడపలేము అని నా ఉద్దేశం. మన ఆలోచన మంచిదే అవ్వొచ్చు కానీ ఆవేశం లో తీసుకునే ఏ నిర్ణయం మంచిది కాదు అని మన పెద్ద వాళ్ళు ఊరికే చెప్పలేదు. గొప్ప నాయకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం సహనం, "తన కోపమే తన శత్రువు" అన్నట్లు కోపం తో ఆవేశపడి తీసుకునే ప్రతి నిర్ణయం తన భవిషత్తుకి ఆటంకం గానే మిగిలిపోతుంది. అదే పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి అయితే ఆవేశపడి తన మీదకు వచ్చిన వాళ్ళని ఎదుర్కోవడం లో ఏ తప్పు లేదు. కానీ తాను వ్యక్తి స్థాయి నుండి ఎప్పుడో ఒక శక్తి స్థాయి కి వచ్చాడు, అలాంటి వాళ్ళు ఏదయినా సమస్య వచ్చినప్పుడు తన సొంత సమస్యలా పోరాడకూడదు. తనతో పాటు మిగిలిన ప్రతి సామాన్యుడు రోజు ఫేస్ చేస్తున్న ప్రోబ్లం లా పోరాడాలి. 

కొన్ని చానెల్స్ చంద్రబాబు భజన చేస్తూ, మరికొన్ని చానెల్స్ జగన్ ఓదార్పు యాత్రలనే చూపిస్తూ రైతుల సమస్యలు సామాన్యుడి కష్టాలను పట్టించుకోవట్లే కానీ ఏ నాడు దీని మీద గట్టిగా అడిగిన రోజు లేదు. ఈ రోజు మిమ్మల్ని పర్సనల్ గా దూషించారు మిమ్మల్ని టార్గెట్ చేశారు అని బాధ వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రతి రోజు ప్రతి ఛానల్ ప్రతి సామాన్యుడికి చేస్తుంది ఇదే సర్. మిమ్మల్ని మీ అమ్మ గారిని ఎవరో దూషించారు అని అంటున్నారు, ఒక పోలీస్ స్టేషన్ లోనో  లేక  రాజకీయ నాయకుడు దగ్గరో ఒక సామాన్యుడిని వాడి అమ్మని, చెల్లిని ప్రతి రోజు పిలిపించుకునే ఊతపదమే ఇది సర్. ఈ రాష్ట్రాన్నే తన కుటుంబముగా భావించే నాయకుడు అవ్వాల్సిన మీరు నా కుటుంబాన్ని నా అమ్మని ఏదో అంటున్నారు అని బాధపడే రాజకీయ నాయకుడు అవుతారని ఏ రోజు అనుకోలేదు నేను. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అధికారపక్షాన్ని అడిగితే ప్రతిపక్షం వాళ్ళని దూషించినట్లు, ప్రతి పక్షం వాళ్ళు అధికార పక్షాన్ని దూషించినట్లు. కాస్టింగ్ కౌచ్ సమస్యను మీరు కూడా వదిలేసి మీ ఫామిలీ సమస్యగా తీసుకుంటున్న తీరు చూస్తే మళ్ళీ నాకు పగటి కలలు కంటున్నట్లే ఉంది సర్...!

ఎప్పటికయినా నా పగటి కలలు కలలుగా మిగలకుండా ఒక గొప్ప నాయకుల గా మారుతాయి అని ఆసిస్తూ.....సతీష్ ధనేకుల !!!



Friday, April 20, 2018

దీక్షలు ఓదార్పులు ఆవేశాలు ఇవే రాజకీయాల

ప్రత్యేక హోదా చట్టం చేసి చుట్టం చూపు కూడా చూడని కేంద్రం మీద న్యాయ పోరాటం చేయకుండా ముహూర్తాలు పెట్టుకొని దీక్షలు చేసే అధికారపక్షం... 

అధికార పక్షం మొత్తం అన్యాయమే అంటూ  ఒక్క కేసు పెట్టకుండా ఓదారుస్తూ ఊర్లు పట్టుకుని తిరుగుతున్న ప్రతిపక్షం... 

 ఆడపిల్లలకు అన్యాయం జరిగితే పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాలి కానీ తన దాకా వస్తే ఆవేశం తో ఫిలింఛాంబర్ రోడ్లు ఎక్కే అజ్ఞాతవాసం... 

ఈ దీక్షలకి, ఓదార్పులకి, ఆవేశాలకి ఎప్పటిలాగే బకరాలమయ్యే అమాయకపు జనం...!


***సతీష్ ధనేకుల***

Saturday, April 14, 2018

మనిషి అనే ముసుగులో ఉన్న క్రూర మృఘాలం


మనుషులమా మనం మనుషులమా మనం,
కాదు మర మనుషులం మనం,
కాదు కాదు క్రూర మృగాలం మనం.. 
నా అనుకుంటే మనం ఏదయినా చేస్తాం,
కాదు అనుకుంటే మనం పురుగుల్లా చూస్తాం.. 
కనపడని దేవునికయి ప్రాణాలయినా ఇస్తాం,
కల్పించిన మతం కోసం పసి ప్రాణాలయినా తీస్తాం.. 
ఆ పసి ప్రాణాల మీద శవ రాజకీయాలనూ చేస్తాం. 
మొన్న ఢిల్లీ సమస్యను ఉపయోగించుకుని ఒకడు సీఎం అయ్యాడు,
నేడు కాశ్మిర్ సమస్యతో ఇంకొకడు పీఎం అవుతాడేమో,
కానీ మారాల్సింది సీఎం, పీఎం లు కాదు ఇంకా కులాలు మతాలు అంటూ మనుషులం అనే ముసుగులో తిరుగుతున్న క్రూర మృగాలమైన మనం...!