Pages

Tuesday, December 27, 2016

తిరిగి రాని, మరచిపోని బాల్యం..
ఎలా మరచిపోగలను...!

అమ్మ ఒడిలో ఆప్యాయతను,
బావి గట్ల దగ్గర బాల్యాన్ని,
పిల్ల కాలువల వద్ద ప్రాణ స్నేహితులను,
పచ్చటి పొలాల మధ్య జీవిత పాఠాలను.

తలుచుకోకుండా ఉండగలనా...!

ఊరంతా చుట్టాలను,
ఊరేగింపుగా వచ్చే రథాలను,
ఆటపట్టించిన అల్లర్లను,
అలుపెరగని ఆట పాటలను. 

బాధ పడకుండా ఉండగలనా...!

ఊరుని విడిచి పెట్టిన ఆ రోజులను,
బందాలంటూ లేని ఈ రోజులను,
వలస పోతున్న జనాలను,
ఊరిని వల్ల కాడు చేస్తున్న రాజకీయాలను,
డబ్బు తప్ప ప్రేమ లేని మనుషులను. 

Sunday, December 18, 2016

జీవితం మధురమయిన అనుభవం...

                              

జీవితం ఒక అర్ధం కాని పుస్తకం... 
జీవనం అంతులేని కావ్యం...
ప్రేమ మధురమయిన అనుభవం... 
ద్వేషం అర్థం లేని అజ్ఞానం... 

ఈ సృష్టి ఎంతో అందమయినది, విభిన్నమయినది.. 

ప్రతీది మనలా ఉండాలనుకోవడం స్వార్ధమే అవుతుంది..
ఒకవేల ఉంటే కొన్నాళ్ళకు మనకే మొహమొత్తుతుంది...
అందుకే ఈ సృష్టి విభిన్నమయినది, అందమయినది.

దేవునికి ఆభరణాల వలె, మనకు ఈ భందాలు భాద్యతలు.. 

స్వల్పమయిన కాలం లో ఈ అల్పమయిన ఆభరణాల కోసమేనా మన ఈ ఆరాటం..!
కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం.. ఈ రెప్ప పాటు ప్రయాణానికి ఎందుకింత పోరాటం...!

తత్వాన్ని తెలుసుకోలేని వాడు తప్పులెంచుతాడు.. 

శాశ్వతమేదీ కాదు అని తెలిసి కూడా ఆశపడతాడు.. 
మనిషిని మనిషి గా చూడలేని వాడు అభ్యుదయం అంటూ ఆరాటపడతాడు.. 
ఓటమిని అంగీకరించలేని వాడు గెలుపు వెనుక పరుగెడతాడు..
భాధను భరించలేని వాడు ఆనందానికయి ఆశ పడతాడు..
ప్రేమను పంచలేని వాడు ఎప్పటికీ ప్రేమించబడడు...

నువ్వు అనుకునేదే కాదు జీవితం.. 

ఈ సృష్టి అనే పుస్తకంలో అదొక చిన్న కాగితం.. 
నీ చేతిలోనే ఉంటుంది అది మధురమయిన అనుభవం గా మిగులుతుందా, లేక అర్ధం లేని అజ్ఞానం గా మారుతుందా అని..!!


మీ................... సతీష్  
Sunday, December 4, 2016

అవును, నేను ఒంటరి నే...!

                                            

ఒంటరి.. అవును, నేను ఒంటరి నే... 
నువ్వు నా చెంత ఉండి కూడా ఒంటరినే అనే భావన కలిగినందుకు అవును నేను ఒంటరినే... 
అవసరానికి మనం, ఆహ్లాదానికి మాత్రమే మన బంధం అని భావిస్తే.. అవును నేను ఒంటరినే... 
దేహం దగ్గరగా.. మనసు దూరంగా..! అవును నేను ఒంటరినే... 
ఎడారిలా నా మనసు, ఎండమావిలా నీ ప్రేమ.. అవును నేను ఒంటరినే...!
ఒక చిన్ని ఆశ నీ శ్వాసగా నేను మారాలని, నీ ఊపిరయి జీవించాలని. అది దురాశ అని తెలియగానే అవును నేను ఒంటరినే...!

అవును నీతో నేను ఒంటరినే, కానీ కాదు నాతో నేను...!