Pages

Monday, December 30, 2019

హద్దులు లేని ఆవేశం

తమ భూములకి అన్యాయం జరుగుతుంది అనే ఉద్రేకంతో ఒక టీవి యాంకర్ మీద మూకుమ్మడి దాడి అదీ ఒక అమ్మాయి అని కూడా చూడకుండ.
మొన్ననే కదా నలుగురు దుర్మార్గులు రాక్షసం గా ప్రియాంకా రెడ్డి మీద దాడి చేస్తే ఆ నలుగురిని చంపే వరకు ఉఖ్రోషం తో ఊగిపోయిన మనము, ఇప్పుడు తను కూడా అటువంటి ఆడపిల్లే అని మరచిపొయామా..!
మనకు అన్యాయం జరిగింది అనే ఆవేశం, నలుగురు గుంపు గా ఉన్నారు లే అనే ధైర్యం ఒక మనిషి మీద క్రూరం గా దాడి చేసే గుణాన్ని తీసుకు వస్తాయా..!
ఎక్కడైనా దూరం గా ఇలాంటివి జరిగితే దానికి అరాచకం అని పేరు పెట్టి బాధని చూపిస్తున్న మనం, మన వరకూ  వస్తే మాత్రం అన్యాయం, బాధ లో వచ్చిన ఆవేశం అని సర్దిచెప్పుకుంటున్నామా..!
బాధ ఆవేశం వస్తే ఎదుటి మనిషిని ఏమి చేస్తున్నామో కూడా మరచిపొయే స్తితికి ఎందుకు వస్తున్నాము, ఒక సాధారణ టీవి యాంకర్ ని కొట్టే పౌరషం ఉన్న మనకి అస్సలు ఈ సమస్యకు కారణం అయిన మీరు ఎన్నుకున్న నాయకుల చొక్కా పట్టుకుని అడిగే ధమ్ము ధైర్యం మీకు రావాలి అని కోరుకుంటూ....

***సతీష్ ధనేకుల***

Thursday, December 12, 2019

RIP #politics

వర్ధంతి కి జయంతి కి తేడా తెలీని వాడు పప్పు అంట,
బైక్ కి టోల్ కట్టాలి అనే వాడు గన్నేరు పప్పు అంట,
ప్రతిపక్ష నాయకుడు దద్ధమ్మ అంట,
అధికారపక్ష నాయకుడు చేతకాని వాడు అంట.. 
ఎవరు పప్పో ఎవరు గన్నేరు పప్పో,
ఎవరు దద్ధమ్మో ఎవరు చేతకాని వాడో నిరూపించుకోవడానికి కోట్ల ప్రజాధనం తో అసెంబ్లి సమావేశాలంట...
పన్నుల రూపం లో ఈ ఖర్చంతా భరిస్తున్న ప్రజలు పెద్ధ పిచ్చోల్లంట...!

                                                                    ***సతీష్ ధనేకుల***

Saturday, November 30, 2019

మానవ మృగాలు


ఆడపిల్లలకు జాగర్త అని చెప్పడానికి వాళ్ళు ఏమన్నా అరన్యానికి వెల్తున్నారా..!
మనం అభివృద్ధి చెందిన అనుకుంటున్న నగరాలలోకే కదా వెల్తుంది...!!
వన్య మృగాల మద్యకి వెళ్ళినా ఇంత అరాచకం జరిగి ఉండదేమో, మానవ మృగాల మద్య తప్ప...!
మనుషులు పెట్టిన చట్టాలు మారాలా, చట్టాలకు భయపడని మనుష్యులం అనుకునే మృగాలు మారాలా..!!
ప్రాణం తీయాలి అనే భయం, హత్యాచారం చేయాలి అనే కోరికను చంపలేకపోయిందా...!!!
మొన్న డెల్లీ  ఉదంతం లో తీసుకున్న ఏ చట్టాలునేడు హైదరాబాద్ లో ఈ అన్యాయాన్ని  ఆపలేకపొయాయి,
ప్రతి వ్యక్తి వ్యక్తిత్వం మారనంత కాలం ఏ చట్టాలు ఏ అభివ్రుద్ది వీటిని ఆపలేవు.

***సతీష్ ధనేకుల***

Sunday, November 24, 2019

***తెలుగు వెలుగు కనుమరుగు***


ఆలి జీవితాంతం తోడు కాబోతుంది అని అమ్మని మరవగలమా..!
ఆంగ్లం తో భవిష్యత్తు ఉందని అమ్మలాంటి తెలుగు ను మరిపించగలమా..!!
వేల యేల్ల చరిత్ర ఉన్న తెలుగు మన మాత్రు భాష,
భావి తరాలకు దానిని ఒక చరిత్ర గా మిగల్చొద్దని ప్రతి తెలుగోని ఘోష.
తెలుగు ని ప్రతి రోజూ ప్రతి ఇంటి గుమ్మం లో మనం చంపుతూనే ఉన్నాము,
ఇప్పుడు ప్రభుత్వాలు తెలుగు ని పురిటి వడి లాంటి బడి లోనే చంపి మన భారాన్ని తగ్గిస్తున్నాయని ఆనందిద్దామా..!!
మనిషి తన ఉనికిని చాటుకోవడానికి కొత్త భాష ను నేర్చుకోవడం లో తప్పు లేదు,
కానీ, ఒక భాష ఉనికినే  కోల్పోవడానికి అదే మనిషి కారణం అవ్వడం అక్షరాలా తప్పు...!!!

                                 ***సతీష్ ధనేకుల***

Saturday, November 9, 2019

మనిషికో న్యాయం దేవునికో న్యాయం

రెండున్నర ఎకరాల భూమి రామ మందిరం కు కేటాయించి హిందువులకు,
అయిదు ఎకరాల భూమి మజీద్ కు కేటాయించి ముస్లింలకు, న్యాయం చేయడానికి రెండు దశాబ్దాలు పట్టింది.
మరి, ఆ రెండిటి కోసం కొట్టుకు చచ్చి ఆరు అడుగుల భూమి లో కలిసిపోయిన ఆవేశపు అమాయకపు కుటుంబాలకు ఏ దేవుడు ఎన్ని దశాబ్దాలకు న్యాయం చెస్తాడో వేచి చూడాలి...!!

హిందూ ముస్లిం భాయీ భాయీ...మరి మతం కోసం, భూమి కోసం కొట్టుకు చచ్చే ఈ మనుషులంతా ఎవరోయీ...!!!

***సతీష్ ధనేకుల***

Friday, May 31, 2019

బురదని బురద తోనే కడుగుతున్నామా !!


ఒక ట్వీట్ చేస్తేనే కులాల మధ్య చిచ్చు అని అంటున్నాం, ఒక వ్యక్తి పెట్టిన ట్వీట్ ని పట్టుకొని కొట్టుకు చచ్చే మనల్ని ఏమనాలి.. 
ఒక ట్వీట్ నో ఒక అభిప్రాయాన్నో చూసి influence అయ్యే పరిస్థితిలో మనం ఉండి , దాని మీద కుల సంఘ నాయకులతో చర్చలు పెడుతూ కులాలు లేని సమాజం కావాలి అని పోరాడుతున్నాం... 😅😆😅 

            బురదని బురద తోనే కడుగుతున్నామా !!


Thursday, May 23, 2019

ఒకరి కి అధికారం మరొకరికి అంధకారం

స్టేట్ రిజల్ట్స్ చూస్తుంటే అధికారపక్షాన్ని దించడానికి ప్రజలు ఎంత కసిగా ఉన్నారో అర్ధమవుతుంది.. 
కానీ, సెంట్రల్ రిజల్ట్స్ చూస్తుంటే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ని రాజకీయాలనుండే సాగనంపేలా ఉంది.. 

జగన్ నాయకుడు గా మారాడు,
చంద్రబాబు ఆలోచనలో పడ్డాడు,
పవన్ తన ఉనికిని కూడా చాటుకోలేకపోయాడు,
కేసిఆర్ ప్రతిపక్షం కూడా ఉంది అని గుర్తించాడు...!!

                                               ***సతీష్ ధనేకుల***



Wednesday, April 24, 2019

జీవితమే ఒక పెద్ద పరీక్ష

మన అవసరాలకోసం పెన్షన్స్ అంటూ ముసలి వారిని వాడుకుంటున్నాము.. 
ఓట్ల కోసం రైతులతో చెలగాటం ఆడుతున్నాం.. 
సెంటిమెంట్స్ అంటూ ఆడపడుచులతో ఆడుకుంటున్నాం.. 
జీవనోపాది అంటూ నిరుద్యోగులను బానిసలుగా మారుస్తున్నాం.. 
ఇవేమి సరిపోనట్లు ఇప్పుడు స్వార్థం తో అమాయకపు పసి ప్రాణాలను కూడా పణం గా పెడుతున్నాం..!
ఓటు హక్కు లేని ఆ పసి ప్రాణాలకు పెద్ద విలువ కూడా ఇచ్చేలా లేరు మన రాజకీయ నాయకులు... :( 

ప్రభుత్వాలు, ప్రజా నాయకులు వస్తూ పోతూ ఉంటారు. కానీ, ఈ పొరపాట్లని రాజకీయాలని అర్ధం చేసుకోలేని పసి హృదయాలకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతీ తల్లితండ్రులదే అని ఆసిస్తూ...... సతీష్ ధనేకుల!!

ఎవరో చేసిన తప్పిదాలకు తమ ప్రాణాలను తీసుకున్న ప్రతి ఇంటర్ విద్యార్థి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తూ ప్రతి విద్యార్థి మనో ధైర్యం తో ఉండాలి అని ఆసిస్తూ..

Sunday, April 21, 2019

అధికారం అంగట్లో సరుకు

నూట ముప్పయి కోట్ల ప్రజలకు ప్రధాని అయ్యి, నేను బీసీ ని అందుకే నన్ను తక్కువగా చూస్తున్నారు అంటాడు.. 
తొమ్మిది కోట్ల ప్రజలకు ముఖ్య మంత్రి గా ఉండి, అందరూ కలిసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటాడు.. 
తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్ష నేత గా చేస్తూ, నా మీద కేసులు పెట్టారు అంటాడు.. 
దేశాన్ని రాష్ట్రాన్ని శాశించే స్థాయిలో ఉన్న మీకే ఇన్ని ఇబ్బందులు ఉంటే , ఇక సామాన్యుడికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఏ రోజు అయినా ఆలోచించారా..!
మీకు ఈ ఇబ్బందులు ఎలక్షన్స్ ఉన్న నాలుగు రోజులే వస్తాయేమో.. ఈ నాలుగు రోజులే మీరు భరించలేకపోతే ప్రతి రోజు ఇవన్నీ భరిస్తున్న సామాన్యుడి పరిస్థితి ఏంటి..?
రోడ్ మీద తను పండించిన సరుకుని అమ్మడానికి రైతు ఇబ్బంది పడుతున్నాడు అంటే ఒక అర్ధం ఉంది, కానీ అధికారాన్ని అంగట్లో సరుకు ని చేసిన మీకు ఇంత ఇబ్బంది ఎందుకో మాకు అర్ధం కావట్లే...!!😡😡😡

 మీ.......సతీష్ ధనేకుల!! 

Tuesday, April 9, 2019

రాజకీయం రంగు మారుతుంది!!

మీ ఓటు ఏబియన్ ఆంధ్రజ్యోతి కి వేసి గెలిపించగలరని కోరిక.
మీ ఓటు సాక్షి కి వేసి ఈ సారి అధికారం ఇవ్వాల్సింది గా మనవి.
ఒకప్పుడు మీడియా పరోక్షం గా తమకి నచ్చిన పార్టీలకు మద్దతు తెలిపేవి.
కాని, ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికలలో వారే పోటి చేస్తున్నట్లు  ప్రచారాలు మొదలు పెట్టారు.
ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటె ప్రజల మద్ధతు, నాయకుల తోడ్పాటు ఉండాలి.
కాని, ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టాలంటె ఒక మీడియా చానెల్ ఉంటే చాలు.
రాజకీయాలు భ్రష్టు పట్టిపొయాయి అంటే బాధ కలిగేది, కాని జర్నలిజం రాజకీయం అయిపొతుంది అంటే భయం గా ఉంది.


మార్పు రావాల్సింది రాజకీయాలో, జర్నలిజాలో కాదు. మారాల్సింది ప్రజలే అని ఆసిస్తూ...........మీ సతీష్ ధనేకుల!!

Sunday, March 3, 2019

"దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్"

యుద్ధం అంటే ఇంట్లో కూర్చుని facebook లో రెండు ముక్కల పోస్ట్ పెట్టడం కాదు.. 
ఎదుగుతున్న రెండు దేశాల ఆర్థిక వ్యవస్తను వెయ్యి ముక్కలు చేయడం... 
యుద్ధం అంటే పరాయి దేశాల మీద మాటల తూటాలు పేల్చడం కాదు.. 
కోట్లమంది ప్రజల ప్రాణాలను పణం గా పెట్టడం... 
నువ్వు అనుకునే యుద్ధం అంటే పొరుగు దేశాన్ని ప్రపంచ పటం నుండి తుడిచి పెట్టడం కాదు.. 
ఎంతో మంది అమాయకపు ఆడపడుచుల నుదిటి కుంకుమ తుడిచి పెట్టడం... 
యుద్ధం అంటే నీ భలాన్ని ఆవేశం తో ప్రదర్శించడం కాదు.. 
భవిష్యత్తు తరాలకు బానిసత్వపు బాట ను వేయడం... 

అమాయకపు ఆవేశం ఉంటే మరో రెండు ఎక్కువ కొవ్వొత్తులను వెలిగించి నీ నిరసన చూపించు, అంతే కానీ ఆలోచన లేకుండా వేలమంది జీవితాలలో వెలుగుని ఆర్పాలని చూడకు మిత్రమా... 

"దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్"
యుద్ధం చేసి మట్టిని సాధించడం కోసం మనుషులను మట్టి లో కలపొద్దు అని  ఆశిస్తూ ...... 

                                       ***మీ సతీష్ ధనేకుల***