Pages

Monday, July 27, 2020

నీ బలహీనత లో నుండి పుట్టిన జీవే RGV

కులాలను వాడుకోవడం, అభిమానులను రెచ్చ కొట్టడం ఈ రోజు కొత్తేమి కాదు..
మన రాజకీయ జీవులు ఏనాడో మనలో ఉన్న కులం అనే పిచ్చి ని అభిమానం అనే వెర్రి ని వాడుకొని మన జీవితాలను ఆట బొమ్మలుగా మార్చేసారు..
ఈ మధ్య ఆర్ జీవి అనే ఒక మేధావి అదే పిచ్చి ని వెర్రి ని తన అవసరానికి వాడుకుంటున్నాడు..
ఏ నాడు మన జీవితాలను ఆటబొమ్మలుగా చేసి ఆడుకుంటున్న రాజకీయ జీవుల మీద రాని ఆవేశం ఒక సినిమా అనే తెర మీద బొమ్మలు ఆడిస్తున్న ఆర్ జీవి మీద ఎందుకు వస్తుంది...!

              ***నీ బలహీనత లో నుండి పుట్టిన జీవే ఆర్ జీవి***

Monday, June 22, 2020

యుద్ధం వ్యర్ధం


యుద్ధం అని మాట రాగానే మేము సిద్ధం అని ఫేస్ బుక్ లో గలమెత్తుతాం,
మీడియా TRP ల కోసం చెప్పే నాలుగు మాటలు విని వాట్సాప్ గ్రూప్ ల లో తూటాలు పేలుస్తాం,
చైన వస్తువలను నిషేదిస్తాం అని మేడ్ ఇన్ చైన ఫొన్ ల నుండే సందేశాలు పంపిస్తాం.
ఏవి నిషేదించాలో ఎవరితో యుద్ధాలు చేయాలో మనం ఎన్నుకున్న నాయకులకు, మన పాలకులకు బాగా తెలుసు..!
సరిహద్దుల సమస్యలను ప్రభుత్వాలకు వదిలేసి మనం మన చుట్టూ ఉన్న సమస్యల మీద నిజాయితీగా పొరాడగలిగితే మనకి మన దేశానికి మంచిది...!! 

***యుద్ధాలు చేసి ఏ "దేశం" ప్రపంచం లో అభివ్రుద్ది చెందిన దాకలాలు లేవు*** 

Friday, June 19, 2020

మనని మనమే కాపాడుకోలేని మనం



భూమి మీద పుట్టిన ప్రతి జీవి, తన మనుగడకై ప్రతి రోజూ చేసే పొరాటమే జీవితం..!
'తెలుపు' 'నలుపు' అని ప్రాణాలు తీయడం,
అడుగు భూమి కోసం బోర్డర్ లు పెట్టుకుని కొట్టుకు చావడం,
అవకాశాలు లేవని ఆత్మహత్యలు చేసుకోవడం...
మనిషి ని మనిషి గా చుడలేని మనం,
మనిషి కన్నా మట్టికి విలువ ఇచ్చే మనం,
మనల్ని మన నుండి కూడా కాపాడుకోలేని మనం,
ఏదో సాదించేసాము ఇంకేదో సాదించేయాలి అని భూమి ని దాటి ఆకాశం వైపు పరుగులు పెడుతున్నాం....!!

Thursday, June 4, 2020

నచ్చితే ఇష్టం నచ్చంది చట్టం




జీవం లేని విగ్రహాలకు భక్తి తో లడ్డూలు తినిపిస్తాం..
జీవిస్తున్న మూగ జీవాలకు మాత్రం విషపూరిత ఫలాలు పెడతాం..
రోజూ చికెన్ మటన్ కోసుకుతినే నాకు కేరళ లో గజరాజు కి జరిగిన అన్యాయం గురించి మాట్లాడే హక్కు ఎంత మాత్రం లేదు :(

Tuesday, May 19, 2020

రెక్కలు విరిగినా డొక్కలు నిండని బ్రతుకులు...!



ప్రతి రోజు ప్రాణాలాను పనం గా పెట్టి,
కాలీ డొక్కను చేత్తో పట్టి,
ఎండకు కంది పోతున్న పసి కందులను ముందుకు నెట్టి,
బొబ్బలుడుకుతున్న పాదాల బాదలను పక్కకు నెట్టి,
ప్రతి రోజు రోడ్లన్ని వలస కార్మికుల రక్తం తో అట్టలు కట్టి పోతున్నాయి..

అర్దరాత్రి ఆడది ఒంటరి గా రోడ్ల మీద తిరిగిన రోజు మనకి స్వాతంత్ర్యం వచ్చినట్లు అని మన నాయకులు చెప్పారు,
ఇప్పుడు ఒక ఆడది రాత్రి పగలు తేడా లేకుండా తనతో పాటు తన కడుపులో బిడ్డను మోస్తూ వందల మైల్లు ఒంటరిగా నడిచినా కనుచూపు మేరలో కూడా స్వాతంత్ర్యం కనిపించేలా లేదు..!

కార్మికుల స్వేదం తో ముందుకు అడుగులు వేసిన ఈ దేశం,
అదే కార్మికుల అడుగుల రక్తం తో తడుస్తూ ఎటువైపుగా నడుస్తుందో...!! 

Monday, May 4, 2020

బార్ల ముందు బీర్ల కోసం బారులు తీస్తూనే ఉంటాం..!

ఇప్పుడున్న పరిస్తితిలో మందు దుకాణం పెట్టి,
అధిక ధరలతో సామాన్యుడి జేబు కొట్టి,
ఖాళీ  అయిన ఖజానాని మధ్యం డబ్బుతో నింపి పెట్టి,
ఇన్ని రోజులు చేసిన సామాజిక దూరాన్ని గాలికి నెట్టి,
వీటితో వచ్చే కొత్త రోగులను లెక్క కట్టి,
మళ్ళీ ఖజానాని ఖాలీ చేసి పెట్టి,
ఆర్ధిక మాంధ్యం అని అమాయకుడి నోరు కొట్టి,
ప్రజలపైన పన్నుల భారం నెట్టి,
మళ్ళీ అధికారం కోసం పిచ్చి జనాల నోట్లో పచ్చ నోటు పెట్టి,
భవిష్యత్తు తరాలను అంధకారం లోకి నెట్టి నా..... బారు షాప్ ముందు బారులు తీరి ఒక బాటిల్ బీర్ కోసం ఎదురు చూస్తూనే ఉంటాం...!!

మద్యం తాగినవాడు డ్రైవింగ్ కి దూరం గా ఉండాలి అని చట్టం చెసినోళ్ళు మేధావులు,
మద్యం కొనే వాడు లైన్ లో సామాజిక దూరం పాటిస్తాడు అనుకున్న మన నాయకులు మేథావులు..!

Thursday, April 16, 2020

నేనో నువ్వో, నేడో రేపో

రోజూ చూస్తున్న వందల మరణాలు ఒక సంఖ్య లా మాత్రమే కనిపించాయి
ఆ సంఖ్యలో మన అనుకున్న వారు ఉండగానే మోయలేని భారంగా అనిపించాయి
జనించిన ప్రతి మనిషీ మరణిస్తాడని తెలుసు
ఆ మరణం మన ఇంటి తలుపు తట్టగానే తల్లడిల్లిపోతుంది మనసు
ఏదో సాదించాము అని విర్రవీగడం ఎందుకు
మన అనుకున్న వారి ఆకరి చూపు చూడలేని బ్రతుకు
నీ టైమో నా టైమో రేపో మాపో వచ్చే వరకు
తెలుసుకోలేక పోతున్నాం జీవితం విలువ ఆకరి గడియ వరకు

Sunday, April 5, 2020

మనిషి జననం కాకూడదు ప్రకృతి కి మరణం

కనపడని శక్తి మనిషి మనుగడకి కారణం అని నమ్మే మనం,
కనపడని వైరస్ ద్వారా మన మనుగడే ప్రకృతి కి ఆటంకం అని  తెలుసుకున్నాం..
మూగ జీవాలను తరిమి, చెట్లను నరికి మన నివాసాలుగా మార్చుకున్న మనం,
అదే నివాసాలలో మూగ జీవిని బోన్ల లో, చెట్లను బాల్కానీల లో బందిస్తున్నాం..


"కనపడని శక్తి కి విలువిద్దాం, అలానే కంటిముందు ఉన్న ప్రకృతి ని ఎల్లప్పుడూ ప్రేమిద్దాం"


ఇన్ని రోజులు ప్రాణం పనం గా పెట్టి పరుగులు పెట్టాం,
ఇప్పుడు ఆ ప్రాణం కోసమే అరుగు దాటి అడుగు వేయలేక పోతున్నాం..
ఎప్పుడూ ఎవరో రావాలి ఏదో చేయాలి అని ఎదురు చూసాం,
ఆకరికి మనల్ని మనమే కాపాడుకోగలము అని గ్రహించాం,
చేయి చేయి కలిపి ఏనాడు ఒకటి గా నడవలేకపోయాం,
కనీసం చేయి చేయి విడిచి దూరం గా ఉండి అయినా పొరాడి గెలుద్దాం... 


అని ఆశిస్తూ... సతీష్ ధనేకుల!!

Monday, March 23, 2020

దేశ భక్తి చూపించే సమయం

చదువుకున్న మూర్ఖులం
అభివ్రుద్ది చెందిన అజ్ఞానులం
మనం గుంపులు గా తిరిగినా సమాజం భయం తో పోలిస్ కాపలా కావాలి
అస్సలు తిరగకుండా ఉండటానికి కూడా అదే పోలిస్ కాపలా కావాలి
మన జాగర్త మనం పాటించలేని అంధకారం లో ఉన్నాం.
దేశ భక్తి అంటే పరాయి దేశాన్ని దూషించడం కాదు,
నీ దేశ భవిష్యత్తు కి నీ వంతు క్రుషి చేయడం.
మన కోసం వేలమంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాణాలను పనం గా పెట్టి పని చేస్తున్నారు,
మన మూర్ఖత్వం తో లక్షలమంది జీవితాలను భయాందోలనకు గురి చేస్తున్నాము.
అన్యాయం జరిగినప్పుడు గడప దాటి రాని మనం ఈ అత్యవసర పరిస్తితిలో బయటకు రావాల్సిన అవసరం అస్సలు లేదు.
ప్రభుత్వం ఈ కుళ్ళుని కడిగే పని మొదలు పెట్టింది,
మనం చేయాల్సింది మన చేతులను కడుక్కోవడం మన కాళ్ళని నాలుగు రోజులు కట్టడి చేసుకోవడం మాత్రమే..
ఇన్ని రోజులు ఫేస్ బుక్ వాట్సాప్ ల లో చూపిచ్చిన మన దేశ భక్తి ఇప్పుడు మన దేశానికి చూపిచ్చే సమయం వచ్చింది...!

Thursday, March 19, 2020

జబ్బు కూడా మంచిదే

ప్రపంచ దేశాల మధ్య రాజకీయ పోరు లేదు,
నేను గొప్పా నువ్వు గొప్పా అనే భేషజం లేదు,
నీ మతం నా మతం అనే పట్టింపు అస్సలే లేదు..
అనవసరపు రాజకీయ ర్యాలీలు నిరసనలు లేవు,
అవసరం లేని తిరుగుడులు లేవు,
అతి కి మించిన కాలుష్యపు జాడలు అస్సలే లేవు..
ఇన్ని రోజులు గా ఎవరు చెప్పినా పాటించని సుభ్రత,
ఏ నాయకుడూ ఏ అగ్ర రాజ్యమో తీసుకు రాని భద్రత,
ఒక కంటికి కనపడని శక్తి తో వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.. 
ప్రతీ మనిషికి ఇది ఒక గుణపాఠం అవ్వాలి
ఒక కులం ఒక మతం ఒక రంగు అని కొట్టుకు చఛ్ఛే మనకి ఒక భయం మనుష్యులంతా ఒక్కటే అని నిరూపించింది...!

**జబ్బు కూడా మంచిదేనేమో మన కంటికి పట్టిన మబ్బును తొలిగిస్తున్నప్పుడు**

Thursday, January 9, 2020

జననం గమనం మరణం

తెచ్చేదేముంది పోగొట్టుకోవడానికి,
పొయేదేముంది పాకులాడటానికి.
ఉగ్గ పెట్టుకుని ఊడిపడతాం,
ఆయాస పడుతూ ఆవిరవుతాం.
బుర్ర లోని జుర్రు కి తెలిసిందే ఈ సత్యం,
చుర్రు బుర్రు లాడుతూ మరిచేనే నిత్యం.
వేసే  ఒక్కో అడుగు నీ గమనం లో తరిగిపోతున్న ఒక్కో గడువు,
పడే ప్రతి అడుగు ఒక గుణపాఠం, తరిగే ప్రతీ గడువు నీకొక జీవిత సత్యం.
పాఠం అయినా, అది సత్యం అయినా ఆకరికి మిగిలేది సూన్యం.
అంకె కు సూన్యం కుడి కుడిగా చేరితే ఎప్పుడూ విలువే, నీకు వడి వడిగా ఈ సూన్యం అర్ధమయితే జీవితం అంతా సులువే...! 


                                                                      ***సతీష్ ధనేకుల***