Pages

Thursday, March 19, 2020

జబ్బు కూడా మంచిదే

ప్రపంచ దేశాల మధ్య రాజకీయ పోరు లేదు,
నేను గొప్పా నువ్వు గొప్పా అనే భేషజం లేదు,
నీ మతం నా మతం అనే పట్టింపు అస్సలే లేదు..
అనవసరపు రాజకీయ ర్యాలీలు నిరసనలు లేవు,
అవసరం లేని తిరుగుడులు లేవు,
అతి కి మించిన కాలుష్యపు జాడలు అస్సలే లేవు..
ఇన్ని రోజులు గా ఎవరు చెప్పినా పాటించని సుభ్రత,
ఏ నాయకుడూ ఏ అగ్ర రాజ్యమో తీసుకు రాని భద్రత,
ఒక కంటికి కనపడని శక్తి తో వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.. 
ప్రతీ మనిషికి ఇది ఒక గుణపాఠం అవ్వాలి
ఒక కులం ఒక మతం ఒక రంగు అని కొట్టుకు చఛ్ఛే మనకి ఒక భయం మనుష్యులంతా ఒక్కటే అని నిరూపించింది...!

**జబ్బు కూడా మంచిదేనేమో మన కంటికి పట్టిన మబ్బును తొలిగిస్తున్నప్పుడు**

5 comments:

  1. బాగా చెప్పావు, కనీసం కొంతమంది అయినా మారతారని ఆశిద్దాం

    ReplyDelete
  2. ఈ కరోనా వైరస్ భయం - మిడిల్ బర్త్ లో మహాకాయం ఎక్కితే క్రింది బర్తులో ఉన్న అర్భక ప్రాణి బితుకు బితుకు మంటూ గడిపినట్లు ఉంది.

    ReplyDelete
    Replies
    1. రైల్లో అయితే పరిష్కారం ఉంది GKK గారూ. ఆ “మహాకాయానికి” తన లోయర్ బెర్త్ త్యాగం చేసేసి తను ఆ మిడిల్ బెర్త్ తీసుకోవచ్చు. ఆపై ఇక టెన్షన్ ఉండదు. కానీ ఈ కరోనా వైరస్ మహమ్మారితో అంత సులువు కాదే?

      Delete
  3. Agree with you sir. It is not correct to trivialise the huge threat of the pandemic.

    ReplyDelete