Pages

Thursday, April 16, 2020

నేనో నువ్వో, నేడో రేపో

రోజూ చూస్తున్న వందల మరణాలు ఒక సంఖ్య లా మాత్రమే కనిపించాయి
ఆ సంఖ్యలో మన అనుకున్న వారు ఉండగానే మోయలేని భారంగా అనిపించాయి
జనించిన ప్రతి మనిషీ మరణిస్తాడని తెలుసు
ఆ మరణం మన ఇంటి తలుపు తట్టగానే తల్లడిల్లిపోతుంది మనసు
ఏదో సాదించాము అని విర్రవీగడం ఎందుకు
మన అనుకున్న వారి ఆకరి చూపు చూడలేని బ్రతుకు
నీ టైమో నా టైమో రేపో మాపో వచ్చే వరకు
తెలుసుకోలేక పోతున్నాం జీవితం విలువ ఆకరి గడియ వరకు

Sunday, April 5, 2020

మనిషి జననం కాకూడదు ప్రకృతి కి మరణం

కనపడని శక్తి మనిషి మనుగడకి కారణం అని నమ్మే మనం,
కనపడని వైరస్ ద్వారా మన మనుగడే ప్రకృతి కి ఆటంకం అని  తెలుసుకున్నాం..
మూగ జీవాలను తరిమి, చెట్లను నరికి మన నివాసాలుగా మార్చుకున్న మనం,
అదే నివాసాలలో మూగ జీవిని బోన్ల లో, చెట్లను బాల్కానీల లో బందిస్తున్నాం..


"కనపడని శక్తి కి విలువిద్దాం, అలానే కంటిముందు ఉన్న ప్రకృతి ని ఎల్లప్పుడూ ప్రేమిద్దాం"


ఇన్ని రోజులు ప్రాణం పనం గా పెట్టి పరుగులు పెట్టాం,
ఇప్పుడు ఆ ప్రాణం కోసమే అరుగు దాటి అడుగు వేయలేక పోతున్నాం..
ఎప్పుడూ ఎవరో రావాలి ఏదో చేయాలి అని ఎదురు చూసాం,
ఆకరికి మనల్ని మనమే కాపాడుకోగలము అని గ్రహించాం,
చేయి చేయి కలిపి ఏనాడు ఒకటి గా నడవలేకపోయాం,
కనీసం చేయి చేయి విడిచి దూరం గా ఉండి అయినా పొరాడి గెలుద్దాం... 


అని ఆశిస్తూ... సతీష్ ధనేకుల!!