Pages

Wednesday, March 30, 2011

వ్యక్తిగా ఓడిపోయి....శక్తి గా గెలవాలని

        
రోజు లానే ఆఫీసు నుండి బయలుదేరాను,హైటెక్ సిటీ నుండి మియాపూర్ ఆటో(AP28 TB 5950) ఎక్క్కి కూర్చున్నా. మొత్తం అయిదుగురితో ఆటో బయలుదేరింది.ఎదురు గా ఆటో లో నుండి ఒక అమ్మాయి దిగి ఆటో వాడికి డబ్బులు ఇచ్చి చిల్లర పర్సులో పెట్టుకుంటూ నడుస్తుంది. నేను ఎక్కిన ఆటో వాడు అది గమనించి కావాలని ఆ అమ్మాయి మీదకు దురుసు గా ఆటో పోనిచ్చి ఎదురుగా  వెళ్లి బ్రేక్ కొట్టాడు.ఆ అమ్మాయి షాక్ తో బయపడింది దాంతో మా ఆటో (AP28 TB 5950)వాడికి ఏదో తెలీని పయసాచిక ఆననడం వచ్చింది. అది చూసి నా ఆవేశాన్ని ఆపుకున్నాను సరేలే అని.అలా కొద్ది దూరం వెళ్ళిన తరువాత వీడి రాష్ డ్రైవింగ్ తో ఒక కార్ ని గుద్దబోయి తిరిగి ఆ కార్ వాడినే తిడుతున్నాడు వీడు.అప్పటికే నా మనసెందుకో ఊరుకోలేక పోయింది,సరేలే అని కాం గా కూర్చున్నా.

ఇంతలో కొత్తపేట సిగ్నల్ దగ్గర ఆపాడు ఆటో, సిగ్నల్ పడ్డా గాని కదలకుండా ఆటో ని నది రోడ్ మీద ఆపి కూర్చున్నాడు, ఇంతలో వెనకనుండి ఒక కార్ హారన్ మోగింది.మోగిన చాలా సేపటికి వీడు ఆటో ని పక్కకు తీసాడు వెనక కార్ మా పక్కకు రాగానే (అందులో డ్రైవింగ్ చేస్తుంది ఒక లేడీ) వీడు ఆమెదో తప్పు చేసినట్లు నోటికొచ్చిన బూతులు, కనీసం వినలేనటువంటి బాష తో తిట్టడం మొదలు పెట్టాడు.ఇక నా వల్ల అవలేదు అలా చూస్తూ ఉండటం. వెంటనే వాడిని ప్రస్నించా “ఏమి మాట్లాడుతున్నావ్, తప్పు నీది పెట్టుకుని ఎదుటి వాళ్ళ మీద అరుస్తావేంటి” అని వెంటనే వాడు నా ఆటో నా ఇష్టం ఇష్టముంటే ఉండు లేకపోతే దిగు నీకేంటి సంబంధం అన్నాడు. నాకు అడిగే హక్కు ఉంది నువ్వేది చేసిన చుస్తున్డాల్సిన అవసరం లేదు అన్నాను. అయితే దిగిపో అని నన్ను మధ్యలో దిన్చేసాడు.(మిగిలిన వాళ్ళు అలా సినిమా చూస్తున్నట్లు చూస్తూ కూర్చున్నారు).


నేను వేరే ఆటో ఎక్కి మియాపూర్ లో దిగాను. నా ముందు వాడు వచ్చి ఏమి పీకుతావ్ ఇందాకేదో వాగుతున్నావ్ అని నాకు అడ్డం తిరిగి నా మీద రివర్స్ అవడం మొదలుపెట్టాడు.వెంటనే నేను అక్కడున్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చా అప్పుడు ఆ పోలీసు నాతొ ఆ ఆటో(AP28 TB 5950) వాడి దగ్గరికి వచ్చి ఏంటి అని అడిగితే, వాడు ఎంతో ధైర్యంగా పో ఆటో తీసుకుపో పది వేలు కట్టి తెచ్చుకుంటా అని ఎంతో ధీమాగా మాట్లాడాడు. అది చూస్తూ ఆ పోలీసు నిలబడి ఉన్నాడు కాని కనీసం ఏమి అనలేక పోయాడు వాడ్ని.ఇంకా పైగా నాకే ఏదో సర్ది చెప్పి పంపడానికి ప్రయత్నిస్తున్నాడు.


నాకు ఎంతో షేం గా అనిపిస్తుంది ఏదో నా సొంత గొడవకోసమో లేక ఏదో పది రూపాయల కోసమో నేను ఆటో వాడి తో గొడవపెట్టుకుంటున్నాడు మనకెందుకు లే అని చూస్తూ కాం గా కూర్చున్నా నా తోటి ప్రయానికులను చూసి, తాగి ఆటో తోల్తున్న ఒక వ్యక్తిని కనీసం ఏమి అనలేని స్థితి లో ఉన్న ఒక పోలీసు ని చూసి. ఇలాంటి వ్యవస్థ, ఇలాంటి మనుషుల  మద్యా మనం తిరుగుతుంది,ఇవేనా మన చదువులు మనకి నేర్పుతున్న సంస్కృతీ. ఎవడో ఏమయితే మనకెందుకు లే ఎవరో ఏదో చేస్తే మనకి అనవసరంలె, మనం ఇంటికి వెళ్ళామా లేదా అని ఆలోచించే అసమర్దుల మద్య మనం బ్రతుకుతున్నందుకు బాధ గా ఉంది.

మా బావ గారు అన్నట్లు "మంచి చేద్దాం అనుకునే వాళ్ళు బయటి కుటుంబాల నుండి వస్తే సంతోషిస్తారు కాని మన కుటుంబం లో నుండి వస్తే ఒప్పుకోరు,మనకెందుకు లే అంటారు జనాలు" అని చెప్పారు అది నిజం. మా బావగారు గొప్ప గొప్ప చదువులు చదువుకోలేదు కాని నేను చెప్పిన దానికి ఆయన చాల పోసిటివ్ గా రియాక్ట్ అయ్యారు, కాని మా ఇంట్లో ఉన్న బా చదువుకున్న,జాబు లు చేస్తున్న వాళ్ళు మాత్రం నీకెందుకు అని నన్ను అపహాస్యం చేస్తూ లైట్ గా తీసుకున్నారు.కాని ఈ రోజు నేను ఒక చిన్న అన్యాయాన్ని ఒక వ్యక్తి గా ఎదుర్కోలేక పోయాను.ఆలోచిస్తే అదే ఒక శక్తి గా ఉంది ఉంటె దాన్ని ఎదుర్కోగలిగే వాడినేమో అనిపిస్తుంది నాకు. ఒక గొప్ప వ్యక్తి అన్నట్లు "ఒక్కడే  పెద్ద బండను(అన్యాయం అనే) తోయలేక మనకు అది కదలదు లే అని వదిలేస్తే అది అలానే ఉండిపోతుంది,అదే వ్యక్తీ పది మందిని కలుపుకుని దాన్ని కదపడానికి ప్రయత్నిస్తే తప్పక కదుల్తుంది". అంటే నేనే ఇంకో పదిమంది ఉన్న శక్తి తో అన్నా కలవాలి లేక నేనే పదిమంది తో ఒక శక్తి ని తయారు చేయాలి అనిపిస్తుంది. అప్పుడే నేను చేయాలనుకునే పనిని ధైర్యం గా చేయగలను లేకపోతె తల దించుకుని ఏమి చేతకాని వాడిలా బ్రతకాలి(అలా బ్రతకడం నా వల్ల కాదు). అందుకే నా స్నేహితుల తో కలిసి మేమే ఒక శక్తి గా ఎందుకు మారకూడదు మారి అన్యాయం పయిన పోరాడే వాళ్లకి ఒక ఉతం లా ఎందుకు హెల్ప్ చేయకూడదు అనే అభిప్రాయం మాలో మొదలయింది.


దీనిని ఆచరణలో పెట్టాలని అనుకుంటున్నాము, దీనికి దయచేసి మీ అమూల్యమయిన సలహాలు,సూచనలు అందిస్తారని ఆసిస్తూ……………….సతీష్.



                                                         

3 comments: