Pages

Friday, April 1, 2011

నేను సైతం.....

రోజు టీవీ ల లో పేపర్ ల లో చూస్తూ ఉంటాం. మన దేశం కరప్షన్ తో నిండి పోయింది అని విని బాధ పడతాం కొద్దిసేపు తరువాత మనమేమి చేయగలం లే అని ఊరుకుని మన పనిలో మనం మునిగి పోతాం. రోజు అందరి జీవితాలలో జరిగే మామూలు విషయమే ఇది. కాని ఒకే ఒక్కడు 72 సంవత్సరాల వయసు ని మన స్వేచ్చకోసమే త్యాగం చేసి, ఈ వయసులో కుడా మన స్వేచ్చకోసం పోరాడడానికి సిద్దమయిన ఒకే ఒక వ్యక్తి "అన్న హజారే".

స్వతంత్రసమరయోధుడు, పద్మ భుషణుడు అయిన అన్న హజారే గారు ఈ నెల 8 న డిల్లి లో అవినీతి వ్యతిరేఖ చట్టం "జన లోక్పాల్ బిల్" కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.దీనికి మనం ఆనందించాలో లేక బాధపడాలో అర్ధం కావట్లే. బాధపడాలో అని ఎందుకు అన్నానంటే. వారి జీవితం మొత్తం మనకు స్వేచ్చని అందించడానికి త్యాగం చేసి ఈ దేశాన్ని మన చేతిలో పెడితే, మన రాజకీయ నాయకులు దేశాన్ని అవినీతి తో దోచుకు తింటుంటే ఈ యువత కాని ఏ పౌరుడు కాని పట్టిచుకోకుండా తన స్వార్ధానికి తను బ్రతుకుతుంటే చూడలేక ఈ వయసులో కూడా మల్లి నడుం బిగించి అవినీతి మీద పోరాడటానికి సిద్డంయ్యరంటే మనం సిగ్గుతో తల దిన్చుకోవాల్సిందే.

"నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వృష్టికి అశ్రువొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోసకు వెర్రి గొంతుక విచ్చి ఒసానూ
నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను"

ఇప్పటికయినా మన మనసులోనే అనుచుకున్న భావాన్ని బయటికి తీద్దాం. ఈ ఉద్యమానికి మనవంతు సాయాన్ని అందిద్దాం.ప్రతి పౌరుడు బాధ్యతగా కలిసికట్టుగా ఈ ఉద్యమాన్ని ఉదృతం చేసి కనీసం అవినీతి తో అంధకారం లో ఉన్న ఈ ప్రభుత్వాలకు కనువిప్పు కల్పిద్దాం.
తెలుగు వారిగా, ఆంధ్ర ప్రజల గా మనం "లోక్పాల్ బిల్" ను సమర్దిస్తూ ఈ ఏప్రిల్ 5th న KBR పార్క్ జుబ్లిహిల్ల్స్ లో జరిగే ఉద్యమానికి మద్దతుగా మనవంతు కృషి చేస్తూ ఉద్యమం లో పాల్గొనడం భారత దేశ పౌరుల గా మన బాధ్యత అని ఆసిస్తూ.........................సతీష్

ఏప్రిల్ 5th మంగళ వారం,
ఉదయం 8  గంటలకు,
KBR  పార్క్,
జుబ్లీహిల్స్,
హైదరాబాద్,
ఫోన్ : 9676360111
9849109540





                                                                  

4 comments:

Tejaswi said...

సతీష్ గారూ, మీ ఆశయాలు చాలా బాగున్నాయి. అయితే మీరు పొరబాటున ఈ బ్లాగులో పెట్టిన స్లయిడ్ షోలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఫోటో పెట్టినట్లున్నారు...చూసుకోండి. మీ ఉద్దేశం భగత్ సింగ్ ఫోటో పెట్టాలని అయిఉంటుంది. ఆ గెటప్ లో ఉన్న బాబీ డియోల్ ఫోటో పెట్టేశారు.

Satish Kumar Dhanekula said...

Thanx for your suggestion Tejaswi gaaru. Sorry for that. I will update ASAP.

Anonymous said...

jaiiiiiiiiiiiiiiiiiiiiiii..............అన్న హజారే
...........jai jaiiiiiiiiiiiiiii........................అన్న హజారే

mani said...

well done satish.

Post a Comment