Pages

Thursday, April 21, 2011

చెంచలంబకు జగతిలోపల శాశ్వతంబు ఒకటేదిరా….

"చెంచలంబకు జగతిలోపల శాశ్వతంబు ఒకటేదిరా….
కట్టె బొగ్గు కాలేటప్పుడు కాసునైనను రాదురా…........

నీది నాది అనుచు నరులు వాదులాడుచు ఉన్డేరా…...
చెంచలంబకు జగతిలోపల శాశ్వతంబు ఒకటేదిరా"

చిన్నపుడు ఉరిలో దశరా ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతుండేవి.అందులో పిల్లలందరూ పూజ ఎప్పుడు పుర్తవుతుందా ప్రసాదం ఎప్పుడు పెడతారా, డాన్సులు, సినిమాలు ఎప్పుడు వేస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు డాన్సు వేసేవాళ్ళు , CD ప్లయెర్స్ అన్ని ఉన్న గాని పూజ కార్యక్రమం అయ్యే టైం కి ఎక్కడి నుండి వచ్చే వాళ్ళో గాని ఊర్లో ఉన్న కాస్త వ్రుద్దులంతా చిడతలు పట్టుకుని గద్దె దగ్గరకు చేరే వాళ్ళు భజన చేయడానికి.వాళ్ళని చూడగానే వార్తలు అయ్యే అంత వరకు కర్రెంట్ ఉండి చిత్రలహరి స్టార్ట్ అవ్వగానే కరెంటు పోతే ఉండే అంత బాధ కలిగేది పిల్లలందరికీ.

పూజ అయిపోగానే ప్రసాదం తీసుకుని పెద్దవారందరూ భజన స్టార్ట్ చేసేవారు.ఆ భజన అయ్యేసరికి పిల్లలు అందరు నిద్రలోకి జారుకునే వాళ్ళు, రోజు ఇదే తంతు.అలా చూసి చూసి నేను కూడా ఆ భజన బాచ్ లో మెల్లగా జాయిన్ అయిపోయాను, తప్పులో ఒప్పులో పాడుతూ వాళ్ళతో శృతి కలపడం మొదలేసాను. అలా పాడుతూ పాడుతూ త్వరగా మంగళం పాడేసి భజనని క్లోజ్ చేసి ఇక మా డాన్సులు సినిమాలు స్టార్ట్ చేసేవాళ్ళం.

అలా పాడుకున్న రోజులలో బాగా గుర్తున్న భజన పాటే పైన చెప్పిన "చెంచలంబ" పాట.అప్పుడు అది పాడుతున్నప్పుడు దాని అర్ధం ఏమి తెలీదు ఏదో అందరు పాడుతున్నారు మనం కూడా పాడుతున్నాము అంతే.కాని దాని అర్ధం తెలిసే వయసు వచ్చే సరికి భజనలు లేవు దశరా ఉత్సవాలు లేవు ఉరిలో.నిజంగానే ఈ చెంచలం అయిన ఈ జీవితం లో శాశ్వతము అంటూ ఏముంది. ఇదేదో వైరాగ్యంతోనో విచారం తోనో చెప్తున్న మాటలు కాదు.మన జీవితం అలానే అయింది నిజంగానే. మనం పుట్టేటప్పుడు కనీసం ఒక చిన్న నూలుపోగు కూడా లేకుండా పుడతాము అలానే పోయేటప్పుడు ఒక్క నూలు పోగు కూడా తీసుకుని వెళ్ళము.ఇది జగమెరిగిన సత్యం కాని ఈ రెండిటికి మద్యలో మాత్రం దేనికో ఈ ఆరాటం ఈ పోరాటం.

ఈ ఆరాటం,పోరాటం వద్దు అనట్లేదు కాని మనిషికి మనిషికి మధ్య ఉన్న మానవతా విలువలను కూడా వదిలేసి పోరాడే అంత పోరాటాలు మనకి అవసరమా అని నా ఉద్దేశం.సాటి వాడు ఆపదలో ఉన్నాడు అంటే కనీసం వాడికి మద్దతు పలకడానికి కూడా మనసు రాణి పరిస్థుతుల మద్య మనం ఉన్నాము. ఎంతో మంది ఆకలితో మాడిపోతున్నారు రోజు కనీసం కట్టుకోడానికి గుడ్డ ఉండటానికి చిన్న గుడిస కూడా లేని స్థితి లో చాలా మంది ఉన్నారు కాని బాబాల ఆశ్రమాలలో డబ్బు,బంగారం ట్రక్కులతో తోలుతున్నారు అని TV లలో చూస్తున్నాము.అది ఎవరి డబ్బు ఎక్కడికి తోలుతున్నారు….? సాటి వాడు ఆపదలో ఉంటె ఆదుకోలేము కాని బాబాలను స్వాములను నమ్మి వారి వారి సంస్థలలో దొంగ డబ్బుని మాత్రం దాచుకుంటారు మనవారు.

అస్సలు స్వాములు బాబాలు అంటే ఏంటి " నిస్స్వార్దంగా అన్ని వదిలేసి నిరాడంబరంగా జీవితాన్ని గడపాలి" కాని మన దేశంలో స్వాములకు పెద్ద పెద్ద పీటాలు,పెద్ద పెద్ద ఆస్తులు వారి వెనక కోట్ల విలువలు చేసే సంపదలు. ఇక కొంతమంది బాబాలు అయితే చెప్పలేని పనులు కుడా చేస్తారు(కాని వాళ్ళని మన పిచ్చి జనాలు ఫోటోలు పెట్టి మరి పుజిస్తారు) ఇవ్వన్ని ఎందుకండీ వీరికి.మల్లి మన ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు కుడా వీరికి పాద దాసులు లా మారుతారు,మారి వీరి నల్ల ధనం ను దాచుకొనే పనిలో పడతారు.ఇది మన దేశ దుస్తుతి.

దేశం లో ఉన్న బాబాల ఆస్తులను జప్తు చేసి కనీసం ఒక పూట తిండి కూడా తినలేని సామాన్యుడికి ఉపయోగపడేలా చేస్తారో లేక మన నాయకులు ఆ సొమ్మును కూడా కుక్కలు చింపిన విస్తరి లా పీక్కుని తింటారో వేచి చూద్దాము………………….......సతీష్  


                                                                         

2 comments:

  1. We do not see things as they are. We see them as we are.
    If each man or woman could understand that every other human life is as full of sorrows, or joys, or base temptations, and of remorse as his own how much kinder, how much gentler he would be!!!!

    ReplyDelete
  2. temptation is curse.. it can be for money..or for any thing. I am not sure about the human values you are talking about.. but respecting him self is the first thing that every human being should do.. which means finding themselves clean and tidy.

    ReplyDelete