Pages

Friday, December 6, 2013

!!బంద్!! ఆలోచించండి చేసే ముందు....!!



కొన్ని రోజులుగా వార్తలు చదవడం బ్లాగులు రాయడం మానేసాను.ఈ రోజు ఒక ఆటో వాడి వల్ల మల్లి బ్లాగ్ ని ఓపెన్ చేసాను. చాలా రోజుల తరువాత ప్రజలు బంద్ అనే మాటను మర్చిపోతారేమో అనే భయం తో ఈ రోజు బంద్ ని ప్రకటించారు. బంద్ ఎందుకు అంటే సగం మందికి తెలీదు, మిగిలిన సగం మందికి ఆ ఇంకెందుకు ఏ తెలంగాణా గురించో అయి ఉంటుంది లే అని ఫిక్స్ అయిపోతున్నారు.నిజమే అస్సలు బంద్ ఎందుకు...ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నే...?

మామ రేపు బంద్ చేయాలంట అన్న ఫోన్ చేసిండు, సాయంత్రం షాప్ కి పోయి ఒక ఫుల్ బాటిల్ చికెన్ పట్టుకుని రా. అట్లనే బండి లో పెట్రోల్ లేదు ఫుల్ ట్యాంక్ కొట్టిచ్చు రేపు సిటీ మొత్తం తిరగాలి అన్న వెనకాల ర్యాలి లో. ఏ నా కొడుకన్నా షాప్ ఓపెన్ చేస్తే అద్దాలు పగలాలి సరేనా అని ఫోన్ పెట్టాసాడు ఒక అమాయకపు మూర్ఖుడు.

అరేయ్ నానా రేపు బంద్ అంట షాప్ తెరవకు మొన్ననే పది వేలు పెట్టి పగిలిన అద్దం వేపిచ్చాం, ఈ నెల షాప్ రెంట్ కట్టడమే కష్టం గా ఉంది, మల్లి ఆ అద్దం పగిలిందంటే ఇంకా అంతే మన పని జాగర్త అని ఫోన్ పెట్టేసాడు రెక్కాడితే గాని డొక్కాడని ఒక సామాన్యుడు.

ఒకప్పుడు ఏ కరెంటు చార్జీలు పెరిగినప్పుడో లేక నిత్య అవసర వస్తువుల ధరలు పెరిగినప్పుడో ప్రజలు స్వచ్చందం గా తమ నిరసనలు తెలియ చేసేవాళ్ళు. ఈ బందులు ఉద్యమాలు ఎప్పుడో ప్రజల చేతుల్లో నుండి స్వార్ద రాజకీయ నాయకుల చేతుల్లోకి జారిపోయాయి.ఒకడు నేనున్నాను అని చెప్పుకోడానికి, ఇంకొకడు తన ఉనికిని చాటుకోడానికి బందులను చేసే స్థితికి వచ్చారు. నాయకుడు చేయమంటే బందు చేయాలి వద్దు అంటే మానేయాలి.ఇలా ఎవడి అవసరాలకు వాడు బందు చేయమనే వాడే గాని ఎందుకు చేయాలో చేస్తే వచ్చే ప్రయోజనాలు ఏమిటో చెప్పే వాడు కాని చేసేవాడు కాని లేడు.

మామూలు రోజుల్లో రోడ్ మీద కానిస్టేబుల్ ని చూసి పోసుకునే వాడు కూడా బందు అనగానే రాళ్ళు కర్రలు పట్టుకుని బస్సు అద్దాలు షాప్స్ అద్దాలు పగలు కొట్టడానికి ఉరుకులు పెడుతుంటాడు. పోలీసులు చేతులు కట్టుకుని చూస్తూ ఉండిపోతారు ఎవడ్ని గెలికితే ఎవడొస్తాడో అని. కస్టపడి రూపాయి రూపాయి సంపాదించుకునే వాడికి తెల్సు ఒక్కరోజు తను పనికి పోకపోతే జరిగే నష్టమేమిటో అంతే కాని బంద్ చేపిచ్చే వాడికి ఏమి తెల్సు. ఎవడికి ఇష్టమయి వాడు చేస్తే దాన్ని నిరసన అంటారు కాని బలవంతం గా చేపిచ్చే దాన్ని ఏమంటారు.....?

బంద్ వల్ల జరిగేవి/ఒరిగేవి:


లీటర్ పెట్రోల్ బ్లాక్ లో 200 రూపాయలకు దొరుకుతుంది.

రోజు పది రూపాయలు తీసుకునే ఆటో వాడు 30 రూపాయలు తీసుకుంటాడు.

RTC బస్సు లకు రిపేర్ చేపిచ్చుకునే టైం దొరుకుతుంది

గవర్నమెంట్ ఉద్యోగులు రోజులా కాకుండా ఇంట్లోనే పడుకునే ఛాన్స్ దొరుకుతుంది.

కాలేజీ/స్కూల్ స్టూడెంట్స్ కి బుంక్ కొట్టే బాధ తప్పుతుంది.

మీడియా కి కాస్త ఎక్కువ టైం పాస్ దొరుకుతుంది.

ఫుల్ బాటిల్ రేట్ కి క్వార్టర్ బాటిల్ దొరుకుతుంది( క్వార్టర్ బాటిల్ కొనుక్కుని తాగి వాటర్ బాటిల్ దొరక్కుండా చేయడమే బంద్ అంటే)

ఇంతకన్నా బంద్ ల వల్ల ఒరిగేవి ఉంటె తెలియ చేయండి.   ఏదన్నా సాధించాలి అనుకుంటే మనల్ని నమ్ముకున్న సామన్యుడ్ని బాధ పెట్టకుండా మనం ఎన్నుకున్న కొంతమంది చేతకాని నాయకుల మీద పోరాటం చేయాలి అని ఆసిస్తూ.



మీ.......................................సతీష్.

No comments:

Post a Comment