Pages

Friday, August 9, 2013

రాష్ట్రాలు రావణ కాష్టాలు




తెలంగాణా కి ఒక్క రూపాయి కుడా ఇవ్వను, ఏమి చేసుకుంటావో చేసుకో అని ఒకడంటాడు.మీకు ఇక్కడ ఉండే హక్కు లేదు మిమ్మల్ని ఉండనివ్వం అని ఒకడంటాడు.స్టేట్ ని విడదీయకపోతే నరుకుతా అని ఒకడంటే, విడదీస్తే నరుకుతా అని ఇంకొకడంటాడు.అస్సలు ఏమనుకుంటున్నారో వీళ్ళు,కుక్కలవలె నక్కలవలె సందులలో పందుల వలె. ఎవడి నోటికి వచ్చినంత వాడు వాగడం, ఎవడికి తోచినట్లు వాడు చేయడం అలవాటుగా మారింది మన నాయకులకు. సామాన్యుడికి రోజు అన్యాయం ఏదో ఒక రూపం లో జరుగుతూనే ఉంది, కాని ఇవేమీ ఏ ఒక్క నాయకుడికి కనపడవు ఏ రోజు వాటికోసం రోడ్ ఎక్కి పోరాడిన నాయకుడు ఒక్కడు లేడు. కాని ఈ రోజులు ఆస్తులు అంతస్తులు, పదవులను కాపాడు కోవడానికి మాత్రం రోడ్ మీదకు వచ్చి కొట్టుకు చస్తున్నారు.

దేశం లో ఎన్ని రాష్ట్రాలు కలిసి ఉన్నా, ఎన్ని రాష్ట్రాలు విడిపోయినా పేద వాడు పేద వాడిగానే ఉన్నాడు తప్ప సామాన్యుడికి ఒరిగిందేమీ లేదు.వీళ్ళని ఎన్నుకోవడం వల్ల ప్రజలకి ఒరిగిందేమీ లేదు, అలానే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ దొంగ రాజి నామాలు, ధర్నాలు వలన మళ్లీ ఇంకొకసారి ప్రజలకి నామాలు పెట్టడమే తప్ప ఉపయోగమేమీ లేదు. రాజకీయ నాయకుడు గెలుపుకోసం ఆస్తులు మాత్రమె పానం గా పెట్టేవాడు ఒకప్పుడు, కాని ఇప్పుడు తన మనుగడ కోసం ప్రజల ప్రాణాలను పనంగా పెట్టడానికి కుడా వెనకాడట్లేదు.ఇక మన మీడియా విషయానికి వస్తే, అవసరమయిన న్యూస్ తక్కువ ఆవేశాన్ని రగిల్చే న్యూస్ ఎక్కువ. జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలముందు ఉన్చాల్సింది పోయి ఈ ఏరియా లో బంధు జరిగినప్పుడు ఇన్ని బస్సులు తగల పెట్టారు, కాని ఇప్పుడు జరుగుతున్న బందులో అన్ని బస్సులు తగలపెట్టారు, అప్పుడు పోలీస్ లు కాల్పులు జరిపారు కాని ఇప్పుడు జరపట్లేదు అనడం లో మన మీడియా అర్ధమెంతో ఎవరికీ అర్ధం కావట్లేదు.

మన నాయకులు ఎలా తయారంటే వాళ్లకి పదవి ఇస్తే అమ్మా అని కాళ్ళ మీద పడతారు, ఇవ్వకపోతే దానేమ్మా అని బొమ్మలు తగల పెడతారు. వాళ్ళ స్వార్ధం వాళ్ళదే తప్ప వాళ్ళని ఎన్నుకున్న, వాళ్ళని నమ్ముకున్న ఒక సామాన్యుడి జీవితం ఎమయిపొఇనా అనవసరం. నోట్ కోసం వోట్, మందు కోసం బంధు చేయడానికి ప్రజలు సిద్ధం గా ఉన్నన్న్ని రోజులు మన రాష్ట్రాలు రావణ కాష్టాలు గానే మిగిలి పోతాయి. ఒక మంచి నాయకుడికి వేసే నీ వోటు భవిష్యతు కి చూపిస్తుంది ఒక మంచి రూటు, అదే తేడా వోటు అవుతుంది నీ భవిష్యతు కి వెన్నుపోటు.


మీ...............................సతీష్

3 comments:

  1. ప్రతి ఒక్కరు ఇలా ఆలోచిస్తే మన రాజకీయనాయకులు ఇలా ఉండేవారు కాదు మన రాష్ట్రం ఇలా గొడవలతో తగల పడుతుండేది కాదు బ్లాగ్ చాల బాగుంది ప్రతి ఒక్కరు రాయలేక పోయినా రాసినవి చదివి ఆలోచించినా బాగుండును ..
    all the best Sathis

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete