Pages

Wednesday, March 21, 2012

రెక్కలొచ్చిన పక్షులు

కనపడని దైవం ముక్యమా లేక ఎదురుగా ఉన్న మనిషి ముఖ్యమా.. అని ఎవర్నన్నా అడిగితే సమాధానం చెప్పడం కొంచెం కష్టమే…ఎందుకంటే మనిషి ముఖ్యం అంటే ఎక్కడ దేవుడు సపిస్తాడో అని భయం. అదే దేవుడే ముఖ్యం అంటే ఎ మనిషి రేపు ఎక్కడ హెల్ప్ చేయడో అని భయం. ఈ భయంతోనే మనిషి ప్రేమ అనే ఒక ముసుగుని వేసుకొని బ్రతికేస్తున్నాడు. నిజం చెప్పాలంటే ప్రేమ అనేది భయం వలెనే పుట్టుకోస్తుందేమో.. భయం లేని చోట ప్రేమ ఉండటం కష్టమేనేమో.

నేను మొన్న ఒక ఊరు వెళ్లాను…ఒకప్పుడు ఆ ఊరు చాలా ప్రశాంతం గా స్వచ్చమైన పిల్ల గాలిలా అనిపిచ్చేది, ఎప్పుడు కాలి దొరికినా అక్కడికే వెళ్ళాలి అనిపిచ్చేది కాని ఇప్పుడు అదే ఊరు  ఒక ఎందిపోఇన మోడులా, రాలిపోఇన పండులా తయారైంది.. దీనికి మూల కారణం డబ్బే... ఒకప్పుడు ఆ ఉరిలో ఎవరికీ వారు తమ రెక్కల కష్టంతో కష్టపడుతూ తమకున్నంతలో వాళ్ళు సుఖం గా ఉండే వాళ్ళు. అలా సాఫీ గా సాగుతున్న వాళ్ళ జీవితాలలోకి ఎప్పుడైతే ప్రభుత్వం నుండి తమ భుములకి నష్టపరిహారం లక్షల్లో వస్తుందని తెల్సిందో ఆ రోజు నుండే ఆ ఉరి పతనం మొదలయింది.

రూపాయి రూపాయి నువ్వేమి చేస్తావే అని అడిగితే…తండ్రి కొడుకుల మధ్య, అన్నదమ్ముల మధ్య, బార్య బర్తల మధ్య చిచ్చు పెడతా అని చెప్పిందట అలానే.. వీళ్ళ భూములకు వచ్చిన నష్టపరిహారం ఆ ఉరిలో కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది..నష్ట పరిహారం వచ్చింది ఒకటి రెండు లక్షలలోనే కాని,వీల్లనుండి వారి భూములను దూరం చేసింది మాత్రం శాశ్వతంగా..ఒకేసారి నాలుగు అయిదు లక్షలు ఎప్పుడు చూడని వీళ్ళకు అన్ని డబ్బులు ఒకేసారి చూసే సరికి చేతులు పోయి రెక్కలు వచ్చాయి…అస్సలు ఆ భూములు స్మపాదించింది వీళ్ళ తాతలు తల్లిదండ్రులు, కాని వాళ్ళు ఇప్పుడు కాస్త మెత్తబడటం వలన కొడుకులకి కోడళ్ళకి భారంగా తయారయ్యారు. ఎలాగు భూములు పోయి నాలుగు అయిదు లక్షల క్యాష్ చేతిలోకి వచ్చాయి.. ఇక ఈ ముసలి డొక్కులతో పనేముంది అనుకున్నారో ఏమో ఒక్కొకరు వాళ్ళ వాళ్ళ తల్లితండ్రులను చూడటం మానేసి..కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఈ వయసులో వాళ్ళని గాలికి వదిలేసి తిరుగుతున్నారు.

అన్ని ఉన్న ఆకు అనిగిమనిగి ఉంటుంది,ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అని మన పెద్దలు చెప్పినట్లు..కన్నతల్లి తండ్రులను, తోడపుట్టిన వాళ్ళను మరచిపోయ్ మిడి మిడి జ్ఞానంతో ఎగిరెగిరి పడుతున్నారు. పల్లెటూర్లే మనదేశానికి పట్టుకొమ్మలు అని గాంధీ గారు చెప్పారు, కాని ఇప్పుడు అవే పల్లెటూర్లు గుది బండలుగా తయారవుతున్నాయి అనడంలో ఆశ్చర్యమేమీ లేదు..డబ్బు ,స్వార్ధం అనే మహమ్మారి పల్లెటూర్లకు ఎప్పుడో పాకిపోఇంది.ఆకరికి పల్లెటూర్లలో కూడా ఓల్డ్ ఏజ్ హోం లు కట్టాల్సిన పరిస్థితి వస్తుందంటే పరిస్థితి అలా ఉందో అర్ధం చేసుకోవచ్చు..

మనం ఎక్కడినుండి వచ్చాము ఎలాంటి పరిస్థుతల నుండి వచ్చాము అన్నది,మన గతం అన్నది మర్చిపొఇ మన అన్న వాళ్ళను దూరం చేసుకోడం ఎంత వరకు కరెక్ట్ ..మన పిల్లలను పెద్ద పెద్ద స్కూల్స్ లో చదివించాలి కాస్ట్లీ గా పెంచాలి అనుకునే మనం మన తల్లితండ్రుల ను మాత్రా, పట్టిచుకోము. ఈ వయసులో వాళ్ళు మన నుండి ఏ సంపదో ఆశించారు ఒక చిన్న చల్లని పలకరింపే వాళ్లకి ఎంతో ఆనందానిస్తుంది …మనకి ఇంత చేసిన వాళ్లకి ఈ చిన్న చిన్న కోరికలను ఈ వయసులో వాళ్లకు తీర్చలేకపోతే ఇక మనం వాళ్లకి చేసేదేముంది….ఒక్కసారి ఆలోచించండి రేపు మన పిల్లలు మనల్ని ఇలానే చూస్తే మనమేవరితో చెప్పుకోవాలి….







ఒక్కసారి మనసుపెట్టి ఆలోచిస్తారని ఆసిస్తూ……………మీ సతీష్.



3 comments: