Pages

Wednesday, March 31, 2010

అల్లారామ్

 "కన్ను మూస్తే మరణం కన్ను తెరిస్తే జననం,రెప్ప పాటు ప్రయాణమే ఈ జీవితం"
అన్నాడొక మహా కవి.మరి ఈ రెప్ప పాటు ప్రయాణం ఎందుకింత నరకం అనుకున్నాడు ఒక పాతబస్తీ అమాయక జీవి.
హైదరాబాద్ లో అల్లర్లు అని పేపర్ లో హెడ్డింగ్ చూసాడు ఒక పొలిటికల్ లీడర్,వెంటనే వాళ్ళ పార్టీ మెయిన్ లీడర్స్ అందరికి కాల్ చేసి ఇంటికి రప్పించాడు,ఎందుకంటె అల్లర్లను ఆపటానికి మాత్రం కాదు,ఆ అల్లర్లను తమ పార్టీ కి ఉపయోగపడే లా ఎలా మలుచుకోవాలి,సామాన్యులను ఎలా రెచ్చ కొట్టాలి అని ఆలోచించడానికి.
ఇదే హెడ్డింగ్ చుసిన ఒక  సామాన్యుడికి మాత్రం గుండెల్లో రైళ్ళు పరిగేడుతున్నాయ్,ఎందుకంటె "ఉరుము ఉరిమి ఎక్కడో పడ్డట్టు",ఎప్పుడు మత గర్షణలు వచ్చినా బలి అయ్యేది సామాన్యులే కదా.
మనుషుల్లో హిందూ ముస్లిం అని మనం పెట్టుకుని మన ఈ రెప్ప పాటు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం.పాపం మూగ జీవులకి కులాలు మతాలూ లేవు కదా,ఎవరో కొంత మంది స్వార్ధపరులు గోశాల మీద పడి మూగ జీవులను తగలపెట్టారు.ఇలాంటి విషయం లో మాత్రం బ్లూ క్రాస్ వారు కాని రెడ్ క్రాస్ వాళ్ళు కాని ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వరు,ఎందుకంటె అవి హిందువులవి అని ముస్లిమ్స్,తగుల పెట్టింది ముస్లిమ్స్ అని హిందువులు కొట్టుకు చస్తుంటే ఆ గొడవల్లోకి వెళ్తే మనమెక్కడ నలిగిపోతామేమో అని ఈ  బ్లూ క్రాస్ వాళ్లకి భయం పాపం.
ఎందుకు మన రాష్ట్రం లో హైదరాబాద్ లోనే మత గర్షణలు జరుగుతాయి.ఆంధ్రప్రదేశ్ లో ఇంకెక్కడా అన్ని మతాల వాళ్ళు కలిసి లేరా మరెందుకు ఇక్కడ మాత్రమె మత గర్షణలు జరుగుతున్నాయి.ఎందుకంటె దేశం లో ఎక్కడ లేని కుళ్ళు రాజకీయాలకు కేంద్రం మన హైదరాబాద్ కాబట్టే.హిందువుల వోట్లు పడకుండా ముస్లిం MLA గెలుస్తున్నాడా,ముస్లిమ్స్ వోట్లు పడకుండా హిందూ MLA గెలుస్తున్నాడా.ఒక్కసారి ఎందుకు ఈ పిచ్చి ఆవేసపరులు అర్ధం చేసుకోరు,ఎవరో స్వార్ధపరులు వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం చేసే పనులకు మతం అనే మహమ్మారిని తగిలిస్తుంటే అందులో ఆవేశం తప్ప ఆలోచన లేని పిచ్చి వాళ్ళ చేష్టలకు ఎంతో మంది అమాయకులు బలి అవుతున్నారు.అంతెందుకు గోకుల్ చాట్ లో బాంబు పెట్టి వెళ్ళిన వాడికి అక్కడికి హిందువులు వస్తారు ముస్లిమ్స్ వస్తారు అని  తెలియదా,కాని వాడు ఎవరి గురించి ఆలోచించలేదు,అంటే మారణ కాండ కి మతం తో సంబంధం లేదు,ఈ రాజకీయ నాయకులందరూ మన మంచి కోరే వారే అయ్యుంటే వీళ్ళకి ఎటువంటి స్వార్ధపూరిత ఆలోచనలు లేకుంటే హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరు నాయకులు A /C రూం లను  వదిలి బయటికి వచ్చి కలిసి కట్టుగా ఒక్క స్టేట్మెంట్ ఇస్తే ఈ పిచ్చి ఆవేసపరులు కంట్రోల్ అవ్వరా,పైకి అర్మి,పోలీసు అంటూ బలగాలను దించి సామాన్యుడ్ని చితక కొట్టడం,నాయకులు మాత్రం A/C రూం లలో కూర్చుని ఎవరి మతాల వాళ్ళను వారు రెచ్చ కొట్టడం  ఎందుకు.
ప్రపంచం లో ఎక్కడ లేని అటువంటి అన్ని మతాలూ కలిసి కట్టుగా ఉన్న గొప్ప గణతంత్ర దేశం మనది అని గొప్పగా చెప్పుకునే రోజులు ఎప్పుడో పోయాయి,రాష్ట్రం లో ఒక ప్రబుత్వం ఇంకొకళ్ళకి నచ్చలేదంటే ఆ ప్రబుత్వాన్ని కూల్చడానికి కూడా మత గర్షణలు లేపుతారని చరిత్ర సాక్షాల్లో ఉంది.నిన్నటి వరకు ప్రాంతీయ అభిమానం అని  కొట్టుకు చచ్చాము,అది సర్డుమనిగింది కదా అని సామాన్యుడు అనుకునే లోపు మత గర్షణలు స్టార్ట్ అయ్యాయి, ఇవి సర్డుమనిగితే ఇంకోటి.ఇదేనా రెప్పపాటు జీవితం కనీసం సామాన్యుడు ప్రశాంతం గ రెప్ప కూడా ముయాలన్న బయం గ ఉంది.మనం ముస్లిం హిందూ అని ఆలోచించే ముందు మనం మనుషుల్లా ఆలోచించం ఎందుకని,మతాలూ కులాలు అనేవి మనకి మనం కల్పించుకున్నవి,మనం సృష్టించిన వాటిని మనం  శాసించాలి కాని అవి మనల్ని శాసించ కూడదు,ఏ మతం చెప్పిన అవతలి వారికి మంచి చేయమనే చెప్తుంది కాని అన్యాయం చేయమని ఏ మతం లోను లేదు.
మనకీ మన దేశానికి ఆదర్శ వ్యక్తి అబ్దుల్ కలాం గారు,జన్మించింది ఒక ముస్లిం ఫ్యామిలీ లో,ఆయన పుట్టింది రామేశ్వరం లోని శివాలయం వీధి లో,వారి నాన్న గారు జైనులబ్దీన్ ఆ వీధిలో హిందు ముస్లిం అనే తేడా లేకుండా  అభిమానించే వాళ్ళు ఆయన్ను,అదే వీధిలో శివాలయం ప్రధాన అర్చకులు పేరు లక్ష్మణ శాస్త్రి గారు,వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు,వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒక చోట కూర్చుని(వారి వారి సాంప్రదాయ దుస్తుల్లో)ఇద్దరి మతాలలోని మంచిని పంచుకునే వాళ్ళు.కలాం గారు ముస్లిం వారు అని కాని,మిగిలిన వాళ్ళు హిందువులని కాని  ఎప్పుడు కనీసం మాట కూడా జారిన రోజులు లేవు,కలాం గారికి భారత రత్న అవార్డు వచ్చిందంటే ముస్లిం క హిందూ క అని  ఎవరు ఫీల్ అవ్వలే ఒక భారత మాత ముద్దు బిడ్డ కి వచ్చిందని గర్వపడ్డాము.ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అంత గొప్ప వాళ్లకు దేశానికి ఎంతో మంచి చేసిన వాళ్లకి ఎటువంటి దురుద్దేశం,మతం అనే పిచ్చి లేనప్పుడు ఏమి సాదించని మనం  కనీసం ఇంట్లో వాళ్లకి కూడా ఉపయోగ పడని మనకెందుకు ఇంత మత పిచ్చి.
రాజుల పరిపాలనలో కూడా ఏ ముస్లిం రాజు తన ప్రజలను తన మతం లోకి మారమని,ఏ హిందు రాజు ముస్లింలను హిందువుల గ మారమని గొడవలు లేపలేదు,శాసించ లేదు.మరెందుకు గొప్ప గొప్ప వాళ్ళు రచించిన రాజ్యాంగం,ప్రజా స్వామ్యం లో ఇలా జరుగుతుంది మనం ప్రజా పరిపాలనలో ఉన్నామా,పూటకి ఒక మాట మార్చే పాపాత్ముల పరిపాలనలో ఉన్నామా.....మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళ మీద తిరగపడ్డ మన వాళ్ళు ఏ మతం ఏ కులం అని ఆలోచించ లేదు కలిసి కట్టుగా పోరాడారు,వాళ్ళు కష్టపడి మనకు సంపాదించి పెట్టిన దాన్ని తినేటప్పుడు మాత్రం మనం మతం కులం అని కుక్కల్లా కొట్టుకు చస్తున్నాం.

అల్లా ఎదుటి వాడ్ని నరక మన్నాడా....? రాముడు నీ పక్క వాడ్ని పొడవామన్నాడా....? "ఆలోచన ఆయుధం లాంటిది,ఆయుధాన్ని సాన పెట్టాలి,ఆలోచనని ఆచరణలో పెట్టాలి".ఒక్క సారి ఆలోచించండి,మనమేమి అన్యాయం  మీద పోరాడట్లేదు,అన్నాదమ్ముల లా కలిసి మెలిసి ఉండాల్సిన మనం స్వార్ధపరుల మాటలు విని మనల్ని మనం సర్వ నాశనం చేసుకుంటూ మన దేశాన్ని నాశనం చేస్తున్నామేమో అని నా అభిప్రాయం......

Your 's....................................సతీష్

No comments:

Post a Comment