Pages

Wednesday, September 19, 2018

వ్యక్తి పూజ..!

మన దేశం ఎంత వెనకపడుతుందో అని తెలుసుకోవడానికి ఏ జిడిపి వాల్యూ నో లేక, మన రూపాయి విలువ తెలుసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు.  ఒక్కసారి మన సోషల్ నెట్వర్క్ లోకి వెళ్లి చూడండి. 

"ఒక ప్రాణం పోయిన చోట మానవత్వం కన్నా, క్రిస్టియన్ vs హిందూ  గొడవ కనపడుతుంది"
"ఒక శీలం పోయిన చోట ఓదార్పు కన్నా, హిందూ  vs ముస్లిం హింస కనపడుతుంది"
"పెట్రోల్ ధరలు పెరిగిన చోట సామాన్యుడి బాధ కంటే, కాంగ్రెస్ vs బీజేపీ అభిమానుల రభస కనపడుతుంది"
"ఒక స్కాం జరిగింది అంటే దాని మీద విచారణ కన్నా, మీ హయాం vs మా హయాం అనే డిబేట్ కనపడుతుంది"
 
ఇప్పుడు ఏ వ్యక్తినో ఏ పార్టీ నో ప్రశ్నించాలి అంటే ఉండాల్సింది నిజాయితీ కాదు, ఆ వ్యక్తి సోషల్ నెట్వర్క్ ఫాల్లోవెర్స్ ని తట్టుకునే ధైర్యం మాత్రమే..! 

ఏ పొలిటీషియన్ తప్పు చేసినా ఒకప్పటి  లా తాను సమాధానం చెప్పాలి అని భయపడాల్సిన పని అస్సలు లేదు, ఎందుకంటే ఇప్పుడు వారి వ్యక్తి పూజలు చేసే అభిమానులే అవన్నీ చూసుకుంటున్నారు..!

ఒకప్పుడు ప్రజలు ఎక్కడ తమని ప్రశ్నిస్తారా అని రాజకీయ నాయకులలో కాస్త భయం ఉండేది, ఇప్పుడు ఆ ప్రజలే అభిమానులం అనుకుంటూ  వారికి వారే రోజూ సోషల్ నెట్వర్క్ లో కొట్టుకుంటున్నారు..!
 
రాజకీయ నాయకుల లారా మీకెటువంటి భయం ఇక లేదు, దేశానికి ఆర్మీ సరిగా న్యాయం చేస్తుందో లేదో కానీ మీ వ్యక్తి పూజలు చేయటానికి సోషల్ నెట్వర్క్ లో రోజుకొక ఆర్మీ పుట్టుకొస్తూనే ఉంది...!!

మీ........***సతీష్ ధనేకుల***


 
 
 
 

2 comments: