Pages

Wednesday, February 3, 2010

బంపర్ ఆఫర్(Onsite Offer)

                                   


                        అరె మామ బంపర్ ఆఫర్ కొట్టేసావ్ ర అంటున్నాడు   ఫ్రెండ్ ప్రొద్దున్నే లేవగానే  ఫోన్ లో,ఏంట్రా అని అడిగితే  Onsite ఆఫర్ వచ్చిందటకదా నీకు, ఇన్ని years లో  మాకు ఒక్కసారి కూడా  ఛాన్స్ రాలేదు 1year లో కొట్టేసావ్ మామ నీదేరా  లక్ అంటే( నన్ను మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వట్లే ). ఎప్పుడు మామ వెళ్ళేది అనగానే ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి, ఎందుకంటే అందర్ని వదిలేసి వంటరిగా వెళ్ళాలి అని అప్పుడు గుర్తొచ్చింది. వెంటనే సరే మామ మల్లి  call చేస్తాను bye.

                    అంతలోనే అందర్ని వదిలేసి వెళ్ళే రోజు రానే వచ్చింది, ఏమి తెలియని  Country లో అడుగు పెట్టాను, Star  hotel accommodation( Bird ని తీసుకెళ్ళి గోల్డ్  బోన్ లో పెట్టినట్లు). అక్కడ  food items చూస్తే మనుషుల్ని మనుషులు తింటున్నార లేక మనుషులు జంతువుల్ని తింటున్నార అనిపిస్తుంది.అవేంటో అర్ధం కాక ఒక  Apple ఒక Bread తీసుకొని  నా రూం కి వెళ్ళా. Apple ఇండియా లో అయితే బోజనానికి ముందు ఒకటి భోజనం తరువాత ఒకటి  Easy గ తినేస్తాము, ఇక్కడ అదే భోజనం, Bread చిన్నప్పుడు అమ్మ మనకు  fever గ  ఉంటె బలవంతం గ తినిపిచ్చేది అదే  Bread ని నాకు నీను బలవంతం  గ నోట్లో పెట్టుకుంటూ  Laptop ఓపెన్ చేశా  Friends ఎవరన్న  Online లో  ఉంటారేమో బాధ ని  Share చేసుకుందామని, వెంటనే  Friend ping చేసి మళ్లీ,  మామ లైఫ్ Enjoi చేస్తున్నావా పిచ్చేక్కిస్తున్నవా అదీ ఇదీ అంటుంటే ( నన్ను చెప్పనివ్వకుండా ) ఒక్కసారి చేతిలో ఉన్న బ్రెడ్ ని చూస్తూ దిగాలుగా అవును మామ పిచ్చేకిస్తున్న నువ్వు చాలా మిస్ అవుతున్నావ్ రా అని వాడు కుల్లుకునేల ఒక message పెట్టా( ఇదేనీమో బాధ లో కూడా ఆనందమంటే ).

                                               Foreign countries లో ఉన్న వాళ్ళంటే పబ్లిక్ లో ఎంత గోప్పనో కదా, ఎందుకంత  డిమాండ్?. దీనికి మీకు ఒక చిన్న  Example చెప్తాను. “మీకు  LifeBoy soap గుర్తుండే  ఉంటుంది ప్రతి Middle class లో 5years back వరకు ఇదే  Soap ఉండేది (20yrs market లో  king లా), 5 yrs బ్యాక్ ఒక  Soap పట్టుకుని  TV లో అందం గ  Ishwarya rai (అప్పటివరకు తను వాడినది  Life boy అనుకోండి) నా  అందమయిన చర్మ సౌందర్యానికి  కారణం నీను చిన్నప్పటినుండి ఈ  Soap నే  వాడుతున్న( ఆ  Soap మార్కెట్ లోకి వచ్చి అప్పటికి  2yrs  మాత్రమె అయింది) అని చెప్తుంది, వెంటనే మన వాళ్ళు  20yrs నుండి నమ్మకం గ ఉన్న  Lifeboy ని  Handwash soap చేసీసి ( ఎందుకంటే దానికి Heroins ఎవరు add ఇవ్వట్లే  కదా)2days లో  కరిగిపోయే  Soap ని  Body soap గ చెసీసాము".  ఈ Example లో Ishwaryarai అంటే  Onsite అన్నమాట పయి పయిన చెప్పే అబద్హాలను మోజుపడి మనం విదేశాల్లో ఏదో ఉందని చెప్పి మన కన్నుల ముందు ఉన్న అందమయిన మన భారత దేశాన్ని మర్చిపోతున్నాము..........


Your's............సతీష్




                

                                    

2 comments: