Pages

Wednesday, April 24, 2019

జీవితమే ఒక పెద్ద పరీక్ష

మన అవసరాలకోసం పెన్షన్స్ అంటూ ముసలి వారిని వాడుకుంటున్నాము.. 
ఓట్ల కోసం రైతులతో చెలగాటం ఆడుతున్నాం.. 
సెంటిమెంట్స్ అంటూ ఆడపడుచులతో ఆడుకుంటున్నాం.. 
జీవనోపాది అంటూ నిరుద్యోగులను బానిసలుగా మారుస్తున్నాం.. 
ఇవేమి సరిపోనట్లు ఇప్పుడు స్వార్థం తో అమాయకపు పసి ప్రాణాలను కూడా పణం గా పెడుతున్నాం..!
ఓటు హక్కు లేని ఆ పసి ప్రాణాలకు పెద్ద విలువ కూడా ఇచ్చేలా లేరు మన రాజకీయ నాయకులు... :( 

ప్రభుత్వాలు, ప్రజా నాయకులు వస్తూ పోతూ ఉంటారు. కానీ, ఈ పొరపాట్లని రాజకీయాలని అర్ధం చేసుకోలేని పసి హృదయాలకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతీ తల్లితండ్రులదే అని ఆసిస్తూ...... సతీష్ ధనేకుల!!

ఎవరో చేసిన తప్పిదాలకు తమ ప్రాణాలను తీసుకున్న ప్రతి ఇంటర్ విద్యార్థి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తూ ప్రతి విద్యార్థి మనో ధైర్యం తో ఉండాలి అని ఆసిస్తూ..

Sunday, April 21, 2019

అధికారం అంగట్లో సరుకు

నూట ముప్పయి కోట్ల ప్రజలకు ప్రధాని అయ్యి, నేను బీసీ ని అందుకే నన్ను తక్కువగా చూస్తున్నారు అంటాడు.. 
తొమ్మిది కోట్ల ప్రజలకు ముఖ్య మంత్రి గా ఉండి, అందరూ కలిసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటాడు.. 
తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్ష నేత గా చేస్తూ, నా మీద కేసులు పెట్టారు అంటాడు.. 
దేశాన్ని రాష్ట్రాన్ని శాశించే స్థాయిలో ఉన్న మీకే ఇన్ని ఇబ్బందులు ఉంటే , ఇక సామాన్యుడికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఏ రోజు అయినా ఆలోచించారా..!
మీకు ఈ ఇబ్బందులు ఎలక్షన్స్ ఉన్న నాలుగు రోజులే వస్తాయేమో.. ఈ నాలుగు రోజులే మీరు భరించలేకపోతే ప్రతి రోజు ఇవన్నీ భరిస్తున్న సామాన్యుడి పరిస్థితి ఏంటి..?
రోడ్ మీద తను పండించిన సరుకుని అమ్మడానికి రైతు ఇబ్బంది పడుతున్నాడు అంటే ఒక అర్ధం ఉంది, కానీ అధికారాన్ని అంగట్లో సరుకు ని చేసిన మీకు ఇంత ఇబ్బంది ఎందుకో మాకు అర్ధం కావట్లే...!!😡😡😡

 మీ.......సతీష్ ధనేకుల!! 

Tuesday, April 9, 2019

రాజకీయం రంగు మారుతుంది!!

మీ ఓటు ఏబియన్ ఆంధ్రజ్యోతి కి వేసి గెలిపించగలరని కోరిక.
మీ ఓటు సాక్షి కి వేసి ఈ సారి అధికారం ఇవ్వాల్సింది గా మనవి.
ఒకప్పుడు మీడియా పరోక్షం గా తమకి నచ్చిన పార్టీలకు మద్దతు తెలిపేవి.
కాని, ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికలలో వారే పోటి చేస్తున్నట్లు  ప్రచారాలు మొదలు పెట్టారు.
ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటె ప్రజల మద్ధతు, నాయకుల తోడ్పాటు ఉండాలి.
కాని, ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టాలంటె ఒక మీడియా చానెల్ ఉంటే చాలు.
రాజకీయాలు భ్రష్టు పట్టిపొయాయి అంటే బాధ కలిగేది, కాని జర్నలిజం రాజకీయం అయిపొతుంది అంటే భయం గా ఉంది.


మార్పు రావాల్సింది రాజకీయాలో, జర్నలిజాలో కాదు. మారాల్సింది ప్రజలే అని ఆసిస్తూ...........మీ సతీష్ ధనేకుల!!