స్వేచ్ఛ అనే హక్కు మనం పొంది 69 సంవత్సరాలు దాటింది,
అంటే 90 సంవత్సరాలు దాటిన మా తాత 21 సంవత్సరాలు స్వేచ్ఛ లేకుండానే గడిపాడా..!
కానీ, ఏ నాడు తన స్వేచ్ఛకు భంగం కలిగిందని చెప్పినట్లు నాకు గుర్తు లేదు.
రాజ్యాంగపు చట్టాలు లేని రోజుల్లో మనుషుల మధ్య విలువలు ఉండేవి,
ఇప్పుడు ఆ విలువలను కాపాడుటకు చట్టాలు మాత్రమే ఉన్నాయి.
విలువలను కాపాడుటకు వ్యక్తులు మారకుండా..
వ్యక్తులను కాపాడుటకు చట్టాలు మారుస్తూ గడిపేస్తున్నాము...!
***హ్యాపీ రిపబ్లిక్ డే**
మీ........సతీష్ ధనేకుల!!!
నేటి సమాజం లో తప్పు ఒప్పు అంటూ ఏమి లేదు..!
నీకు నచ్చితే ఒప్పు,
నీకు నచ్చకపోతే తప్పు.
అది కత్తి మహేష్ అయినా,
ధనేకుల సతీష్ అయినా, నువ్వు అయినా, ఇంకెవడయినా...!
ఒకప్పుడు సమాజం నీకు ఏమి చేసింది అని కాదు,
నువ్వు సమాజానికి ఏమి చేశావు అని ఆలోచించమనేవారు..
ఇప్పుడు ఎదుటి వాడు సమాజానికి ఏమి చేస్తున్నాడు అని ప్రశ్నించే ముందు నువ్వు సమాజానికి ఏమి చేస్తున్నావు అని ఆలోచించే వారు ఎవరు...!
మన మీడియా వాళ్లకి సమాజం లో ఏ ఒక్క చిన్న సమస్య కనిపించదు కానీ,
వ్యక్తుల మద్య సమస్యలు మాత్రం పెద్దవి గా కనిపిస్తున్నాయి..
ఎందుకంటే...! వీళ్ళ TRP సమస్యలు తీర్చేది ఆ వ్యక్తులే కదా...!!
మీ........సతీష్ ధనేకుల !!
చిన్నప్పుడు సంక్రాంతి అంటే!!
మారిన అరిగిన చెప్పుల జోడు..
పాత పొట్టి నిక్కరుకు మరో కొత్త ప్యాంటు తోడు..
వేచి వేచి ఎదురు చూసిన సెలవు రోజులు ఏడు..
మళ్ళీ మిత్రులందరూ ఒకటిగా చేరిన తోడు..
బుడి బుడి అడుగులకు భోగి పళ్ళు గుప్పెడు..
సంక్రాంతి కి ఇంటి ముందర నాట్యం చేసే ముగ్గుల చప్పుడు..
కనుమ రోజు కంచం కంగుమనేటప్పుడు..
పండుగ అంటే తెలీదప్పుడు,
తెలుస్తుంది దాని విలువ తిరిగి బడి గంట మోగినప్పుడు..
అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ పండుగ అంటే అందరం కలిసి ఉన్నప్పుడు !!
***అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు***
మీ.......సతీష్ ధనేకుల!!
మనలో మనిషిని కరిగిస్తూ
'మర' లా మారుస్తూ
ఆ మార్పును గర్వం తో ఆస్వాదిస్తూ
అదే గొప్ప అని భావిస్తూ
ఎదుటి మనిషిని హీనం గా చూస్తూ
మన అవసరాలకయి విలువిస్తూ
మనకి నచ్చితే నానుస్తూ
లేకుంటే ద్వేషిస్తూ
తనలో మంచిని మరుస్తూ
చెడునే వేలెత్తి చూపిస్తూ
దగ్గరిని దూరం చేస్తూ
లేనివి ఊహిస్తూ
అందరికి అందనంత ఎత్తులో ఉన్నా అని భావిస్తూ
నీకయి తెలీక నీకు నువ్వే శిక్ష వేస్తూ
ఒక్కొక్కిరినే అనుకుంటూ అందరిని దూరం చేస్తూ
ఒక సంవత్సరాన్ని పాతది చేస్తూ
మరో సంవత్సరాన్ని కొత్తది చేస్తూ HAPPY NEW YEAR!!
మీ ......సతీష్ ధనేకుల!!