నాలుగు చెక్క గోడల మధ్య రెక్కలు విరిగిన జీవితాలు.. నాలుగు చక్రాల మీద పరిగెడుతున్న హడావుడి ప్రయాణాలు.. నాలుగు రోజులు ఆఫీస్ లో పోరాటం, ఐదో రోజునుండి వీకెండ్ కై ఆరాటం.. నాలుగు వాట్సాప్ మెసేజీలు, రెండు ఫేసుబుక్ పోస్టులు ఇవే ప్రేమలు ఆప్యాయతలు.. నాలుగు సార్లు వచ్చే లాంగ్ వీకెండులు అవే పండగలు పబ్బాలు.. నాలుగు డాలర్ల కోసం నా అనుకున్న వారికి దూరంగా నానా అగచాట్లు.. నాలుగు నోర్లు ఊర్లో కలిస్తే సూట్లు బూట్లతో సుఖపడిపోతున్నామనే గుసగుసలు...!
ఏమీ తెలియకపోతే ఏదన్నా తెలుసుకోవాలని ప్రయత్నిస్తాం, ఏదయినా సాధిస్తాం.. అదే ఏదో ఒకటే తెలిస్తే దానితోనే కాలం గడిపేస్తాం, జీవితాన్ని వృధా చేస్తాం...! మీ..........సతీష్!!
దేనికోసం ఆశ లేదు.. భవిష్యత్తు అంటే భయం లేదు.. కోరికంటు కాన రాదు .. కష్టమంటే బెదిరిపోదు.. సుఖాలకు బానిసవదు.. ఓటమికి కృంగిపోదు.. గెలుపుకంటు పొంగిపోదు.. నాది అంటు స్వార్దపడదు.. నీది అంటు దూరమవదు...! కంటికి కనపడని దానికి ఎప్పుడూ విలువెక్కువే.. గాలి, ప్రేమ ఇలా.. కనిపించే ప్రతీది చులకనే.. మనిషి, ప్రకృతి అలా.. వినపడే వాటికే విలువిస్తాం, కనపడే వాటిని కూడా కప్పేస్తాం. గొప్పగా ఆలోచిస్తాం కానీ, ఆచరణలో విస్మరిస్తాం...! భక్తితో తలిస్తే దైవం భయం తో చూస్తే దయ్యం జాలిపడితే మానవత్వం కన్నెర్ర చేస్తే క్రూరత్వం మనసు పెడితే ప్రేమమ్ అదే మనసు బాధ పడితే ద్వేషం చేయి అందిస్తే సాయం నిరాకరిస్తే అన్యాయం నేను అనుకుంటే స్వార్థం మనం అనుకుంటే ఆదర్శం....!
కులమా కులమా ఎవరే నువ్వు అంటే, అంటరాని వాడు అనే పిలవబడే వాడి కడుపు మంట లో నుండి పుట్టా అంటుంది..! కులమా కులమా నువ్వెవరే అంటే, అగ్ర వర్ణాలుగా భావించే వాడి అధికారం నుండి పుట్టా అంటుంది..! ఆకలి లో పట్టెడన్నం పెట్టదు కులం, ఆపదలో ఏ సాయం కానిది కులం, అవసరానికి పనికి రానిది కులం. కానీ,,, పేరు వెనుక తోకలా కులం, పరువు కోసం పాకులాడే కులం, పదవి కోసం ప్రాణాలను తీసేది కులం. అనంతమంత ప్రపంచం లో ఆవగింజంత అనుభవంతో, అన్నీ నేనే అనుకునే అజ్ఞానం తో, నేనూ నాదీ అనే స్వార్థంతో, రోదిస్తూ రొప్పిస్తూ బ్రతుకుతున్నా అని నువ్వు అనుకుంటూ కుక్కలా కతుకుతున్న ఓ మనిషీ మేలుకో.... సాటివాడి బాధలకు స్పందిస్తూ, ఎదుటి వాడిని ప్రేమిస్తూ,
ఆనందం తో జీవిస్తూ...
నూతన సంవత్సరం నుండి అది సాదించాలి ఇది సాదించాలి అనే ఎప్పటి లా కలలు కనే కన్నా ముందు గా మనిషిని మనిషి గా చూసేలా మనం మారాలని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.................... మీ సతీష్