ఒక వయిపు ఉప ఎన్నికలు,ఒక వయిపు బందులు మరో వయిపు యాత్రలు,ఇలా మన రాష్ట్ర నాయకులు ఎవరి పనుల్లో వారు బిజీ గా ఉన్నారు కాని మన సమస్యల ను పట్టిచుకునే తీరిక మాత్రం ఎవరికి లేదు బంధుల వల్ల మనకి ఒక్కరోజుకే 13 వేల కోట్లు నష్టం తప్ప మనకి ఒరిగిందేమీ జరగలేదు రేట్లు ఏమన్నా తగ్గిచ్చారా?.ఇక ఉప ఎన్నికల విషయానికి వస్తే వీళ్ళని ఎవరు రాజీనామా చేయమన్నారు మళ్లీ ఎవరు పోటి చేయమన్నారు మనమేమన్న బ్రతిమిలాడామా? ఈ ఉప ఎన్నికల వలన కొన్ని కోట్ల ఖర్చు ప్రభుత్వానికి(అంటే మనకే కదా).ఇక కొంతమంది మంత్రులకి,MLA ల కి అసెంబ్లీ కన్నా పర్సనల్ యాత్రలే ముఖ్యమట ఇంత ఖర్చు పెట్టి అసెంబ్లీ సమావేశాలలో మనగురించేదో చిన్చుతారంటే వారు యాత్రకే వెళ్తాం అసెంబ్లీ కి రాము అంటున్నారు వీళ్ళంతా ఒక నాయకుడికి జీతగాల్లా, మనం ఎన్నుకున్న ప్రజా నాయకులా?ఇన్ని కోట్ల డబ్బు ఇలా వృధా చేస్తున్నారు వీళ్ళు ఈ డబ్బంతా వీళ్ళ వీళ్ళ జేబుల్లో నుండి పెడుతున్నారా,లేదు కదా మన డబ్బే కదా.కాని మనం మాత్రం ఇదేదో పెద్ద వినోదం లా ఇళ్ళల్లో TV ల ముందు ఈ బాగోతాన్ని కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం.
ఇదంతా ఎందుకు జరుగుతుంది....యదా ప్రజా తదా రాజా అన్నారు.మనం అసమర్డులగా ఉన్నన్ని రోజులు ఈ స్వార్ద రాజకీయ నాయకులు పుట్టుకొస్తూనే ఉంటారు.మా హీరో ని వేరే హీరో ఫాన్స్ తిట్టారు అంటూ ఎక్కడలేని పౌరషం వస్తుంది(దాని వల్ల వీడికి కాని వీడి ఇంట్లో వాడికి కాని ఉపయోగం లేదు),కాని మనల్ని మన నాయకులు ఇలా దోచుకుంటున్నారని ఏ ఒక్కడికి పౌరషం రాదు.ఎందుకంటె ఆ నాయకులు ఇచ్చే వంద,వేయిలకు కక్కుర్తి పడతామే తప్ప మన జేబుల్లోనుండి తీసి అందులో ఒక శాతం బిక్ష మనకి వేస్తున్నారని అర్ధం చేసుకోము మనం.అస్సలు రాజకీయ నాయకులని అనే ముందు మనకి మనం ఆలోచించాలి,ఎంత మంది మనలో మనిషి గా బ్రతుకుతున్నారు….?ఆలోచించండి మనకే తెలుస్తుంది.
ఇప్పుడు మేము మనుషుల లానే ఉన్నాం గా అనిపిస్తుందా…? మనిషిగా బ్రతకడం అంటే మన స్వార్ధం మనం ఆలోచించడం,మన పొట్ట నిండితే చాలు అవతలి వాడు ఏమయితే మనకేంటి అనుకోవడం కాదు.మనం పుట్టే ముందు అందరు సంతోషిస్తారు,కాని మనం పోయాక మనస్పూర్తి గా బాధ పడే వాళ్ళు ఎంత మంది ఉంటారు మన రక్తసంబందీకులు కాకుండా…? చాలా మంది నేను చాలా గొప్ప పనులు చేశా అని చెప్పుకుంటుంటారు మదర్ తెరీసా చెప్పినట్లు “గొప్ప పనులంటూ ఏమి ఉండవు మనం ప్రేమ తో చేసే ప్రతి చిన్న పని కూడా గొప్ప పనే”.మనం మన పక్క వాడితోనే ప్రేమ గా ఉండనప్పుడు ఎవడో మనల్ని ప్రేమతో ఎలా పరిపాలిస్తాడు.
మనం అంతరిక్షం లో అడుగు పెడుతున్నాం,సముద్ర గర్బాలలోకి ఈదుకుంటూ వెళ్తున్నాం,ఎత్తయిన శిఖరాలను అధిరోహిస్తున్నాం.కాని ప్రేమతో ఎదుటి వారి మనసులో స్తానం సంపాదించ లేకపోతున్నాం ఇదేనా మన అభివృద్ధి మనిషిని మనిషే దోచుకు తినడమా…? అభివృద్ధి పేరుతొ మనుషుల్ని మనుషులే కాల్చుకు చావడమా.సోంపల్లి లో చనిపోయిన ఆ అభాగ్యుల ప్రాణాలు ఏ అభివృద్ధి తీసుకు వస్తుందో చెప్పండి.“పంచే కొద్ది తరిగేది సంపద,కాని పంచే కొద్ది పెరిగేది ప్రేమ మాత్రమె”. ఇది గుర్తు పెట్టుకున్న్న ప్రతి వాడు మహనీయుడు అవుతాడు అందరికి మహాత్ముడవుతాడు అని ఆసిస్తూ..........