డబ్బు గెలుస్తుందా…?లేక అధికారం గెలుస్తుందా….? ఇప్పుడు ఎన్నికలలో ఆసక్తిగా మారిన విషయం.ఈ ఎన్నికల వలన మన రాష్ట్రానికి మన రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేకపోయినా, ఆదిపత్య పోరుకు సిద్దమయింది.ఇవి ఎన్నికలు అనడం కన్నా డబ్బు కి అధికారానికి మధ్య ఆదిపత్య పోరు అనడం సబబేమో.మామూలుగా రాష్ట్రం లో ఎన్నికలంటే అల్ప సంతోషి అయిన ఓటరు యాబయ్యో వందో వస్తాయని చంకలు గుద్దుకుంటాడు కాని, ఆ ఓటు విలువ వందల నుండి వేలల్లోకి దాటిపోయింది.
ఎక్కడో తమిళనాడు లోని ఎన్నికలు చూసి విరక్తి కలిగింది,ప్రజాస్వామ్యం నాశనం అయిందే అనే చిన్న బాధ కలిగింది.ఇంటికో mixi,fan,TV ఇలా నోటికి అందినన్ని ఫ్రీ బహుమతులను ఇస్తామంటే అవాక్కవడం మన వంతు అయింది. కానీ ఇప్పుడు యువతను, ముసలి వారిని కూర్చోబెట్టి ఫ్రీ గా పెన్షన్ ఇస్తాము, చేతగాని దద్దమ్మల్లా చేస్తాము అని డైరెక్ట్ గా వాగ్ధానాలు ఇస్తున్న మన నాయకుల లో ప్రజా సేవ కంటే అధికార దాహం,ఆధిపత్యం కోసం పడే తపన ఎంతగా పెరిగాయో అర్ధం చేసుకోవచ్చు.
ఇలాంటి ప్రమాదకర పోటి మద్యలో ఒక మంచి చేద్దామనుకునే నాయకులు ఎవరన్నా నిలబడగలరా…? ఒకవేళ నిలబడ్డా గాని బ్రతికి బయటపడనిస్తారా..? వీళ్ళని ఇలా తయారు చేసింది మనం మన ప్రజాస్వామ్య వ్యవస్థ. ఎన్నికల అఫ్ఫిడవిట్ లో కనీసం సొంత కారు,బ్యాంకు బాలన్స్ లేదు అని చూపిచ్చుకునే మన నాయకులకు ఎన్నికలలో మాత్రం పంచడానికి కోట్లు ఎక్కడనుండి వస్తున్నాయో మన ఎన్నికల కమీషన్ కి తెలియకపోవడం వింతే మరి.
ఇంత బహిర్గతంగా అక్రమాలు జరుగుతుంటే మన చట్టాలు కాని,మన ఎన్నికల అధికారులు కాని ఏమి చేస్తున్నట్లు..!నిదురపోతున్నాయా...? అంత పెద్ద వ్యవస్తే ఏమి చేయకుండా చూస్తూ ఉంటె ఇక సామాన్యుడు ఏమి చేస్తాంలే అని తప్పక తమ ఓటు ని ఏదో ఒక దుర్మార్గుడికి వేయాల్సిన తప్పని పరిస్థితి వస్తుంది(మరి అస్సలు ఓటు వేయకపోతే అదొక నేరం కదా).
అందుకే ధైర్యం గా ఏమి చేయలేని ఈ సామాన్యుడికి ఒక అవకాశం వచ్చింది, మీ ఓటు ఏ అబ్యర్ది కి వేయడం ఇష్టం లేదని తెలియచేయడానికి ఒక గుర్తుని కేటాయించారు ఈ ఎలక్షన్ లో అదే NOTA. ఏ నాయకుడు సరి అయిన వాడు కాకపొతే తమ ఓటు ఎవరికి వేయట్లేదని తెలియచేసే ఈ అవకాశం ఓటరుకి కల్పించారు. NOTA ఓట్లు ఎక్కువ వస్తే అక్కడ ఎన్నికలని రద్దు చేసి అక్కడ పోటి చేసిన అభ్యర్దులను అనర్హులగా ప్రకటించే అవకాశం ఉంది.ఇలాంటి అవకాశం వలన ప్రజలు గోప్యంగా అయినా ఈ అన్యాయాన్ని ఈ అక్రమార్కులను వ్యతిరేకించే అవకాశం వస్తుందని నా అభిప్రాయం.
ఈ సారి ఎలక్షన్ లో మీ విలువయిన ఓట్ ని వృథా చేయకండి అని ఆసిస్తూ ……………సతీష్ ధనేకుల .