చిన్నప్పుడు సంక్రాంతి అంటే!!
మారిన అరిగిన చెప్పుల జోడు..
పాత పొట్టి నిక్కరుకు మరో కొత్త ప్యాంటు తోడు..
వేచి వేచి ఎదురు చూసిన సెలవు రోజులు ఏడు..
మళ్ళీ మిత్రులందరూ ఒకటిగా చేరిన తోడు..
బుడి బుడి అడుగులకు భోగి పళ్ళు గుప్పెడు..
సంక్రాంతి కి ఇంటి ముందర నాట్యం చేసే ముగ్గుల చప్పుడు..
కనుమ రోజు కంచం కంగుమనేటప్పుడు..
పండుగ అంటే తెలీదప్పుడు,
తెలుస్తుంది దాని విలువ తిరిగి బడి గంట మోగినప్పుడు..
అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ పండుగ అంటే అందరం కలిసి ఉన్నప్పుడు !!
***అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు***
మీ.......సతీష్ ధనేకుల!!
dear sir very good blog and nice telugu content
ReplyDeleteLatest Telugu News
Thank you Sam :)
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteబావుంది సతీష్. కాని ఇప్పుడు అందరు కలుసుకుంటే ఫోన్ లు ముందే. గుంపులో ఒంటరిగా ..
ReplyDelete