ఆకలి లో పట్టెడన్నం పెట్టదు కులం..
ఆపదలో ఏ సాయం కానిది కులం..
అవసరానికి ఆసరా రానిది కులం..
కానీ,,,
పేరు వెనక తోకలా కులం..
ఊరు చివర పాక లా కులం..
పరువు కోసం ప్రాణం తీసేది కులం...!
కులం అనే ఒక చిన్న పదం ప్రణయ్ అనే జీవితాన్ని ముగించింది,
అమృత అనే అమ్మాయి జీవితం లో విషాన్ని చిందించింది,
తన పరువే తాను తీసుకోవడానికి కులం పరువు పేరు చెప్పి ఇద్దరి జీవితాలను నాశనం చేసింది.
ఇంకా ఇలాంటి వారు ఉన్నారా ఇంకా సమాజం మారలేదా అనుకుంటున్న వాళ్లకి ఇదొక్కటే ఉదాహరణ కాదు..!
ఈ హత్య ను కూడా సమర్థిస్తున్న వారు,
ఈ హత్య ను మతాల వారి గా వాడుకుంటున్న వారు,
ఈ హత్య ను ఒక మృగం ఒక మానవుడి కి చేసిన అన్యాయం గా చూడకుండా,
ఒకే కులం ఒకే మతం తో చూస్తూ మూగపోతున్న మిగిలిన మనమందరం మారే వరకు సమాజం మారదు...!!
మీ....... ***సతీష్ ధనేకుల***
No comments:
Post a Comment