మన రాజ్యాంగం లో మైనర్, మేజర్ అనే చట్టాలను తీసేయాల్సిన రోజు వచ్చినట్లుంది. ఎందుకంటే మనం చెప్పిన మాట వింటే బ్రతకనిస్తాం లేకపోతే చంపేస్తాం అనే మూర్ఖత్వం ఉన్న చోట మేజర్ అనే పదానికి అర్ధం లేదు. అరే ఒక ప్రాణం అన్యాయం గా తీసేసారు అనే బాధను పక్కకు నెట్టేసి, 9th క్లాస్ లో కొవ్వు పట్టి ప్రేమించుకున్నారు వాళ్లకు తగిన శాస్తి జరిగింది అనే ప్రతి మూర్కులారా..! మీరనుకునే కొవ్వు పట్టిన వారిలా తిరిగి ఎవరి దారి వాళ్ళు చూసుకోలేదు, మీరు నమ్మని మేజర్ అనే వయసు వచ్చిన తరువాత వారిద్దరి ఇష్టం తో పెళ్లి చేసుకుని వారి జీవితం వారు గడుపుతున్నారు(ఇక్కడ తల్లి తండ్రుల ఇష్టం అవసరం లేదా అని అడగొచ్చు, నీ ఇష్టాన్ని అవతలి వారి మీద కష్టం గా రుద్దే హక్కు ఈ సమాజం లో ఎవరికీ లేదు). ఎంతో మంది మేధావులు మన రాజ్యాంగాన్ని చట్టాలను పెట్టింది అందుకే అస్సలు మేజర్ అనే చట్టం పెట్టిందే ఒక వయసు దాటిన తరువాత ఎవరి జీవితం మీద వారికి హక్కు రావాలి అని. వారు తీసుకునే నిర్ణయం తప్పు, ఒప్పు అన్నది పక్కన పెడితే అది వారి జీవితం. అస్సలు వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా అని నిర్ణయించడానికి మనమెవరం?? ఇలాంటి వాళ్ళని బ్రతకానిస్తే ప్రతి తల్లి తండ్రి బాధపడాలి వాళ్లకి బ్రతికే హక్కు లేదు అనే ఆటవిక సంస్కృతి లో కి వెళ్తున్న మనమా వాళ్ళను ప్రశ్నిస్తుంది?? ఇక్కడ తల్లి తండ్రుల ప్రేమ అయినా భార్య భర్తల ప్రేమ అయినా ఒక్కటే, ఏ నిజమయిన ప్రేమ అయినా తన బిడ్డ సుఖం గా ఉండాలి అని కోరుకుంటుంది కానీ తనకి నచ్చిన వాళ్ళతో ఉండాలి అనుకోదు. మీరు అనుకునే సుఖం డబ్బు తో, కులం తో లేక మతం తో వస్తుంది అనుకుంటే దానికి ప్రేమ అనే పేరు వాడకండి. ఏ ప్రేమకు ఇంకో ప్రాణం తీసే హక్కు లేదు అది తప్పు అయినా ఒప్పు అయినా.. మీ మూర్ఖమయిన వాదనను సమర్ధించుకోవడానికి ఈ రోజు దేశ సైనికులో లేక రైతులు మీకు గుర్తొస్తున్నారు. వీళ్ళందరూ ఎటువంటి స్వార్థం లేని వాళ్ళు వీళ్ళని ప్రాణాలు తీసే మృగాలతో పోల్చి మీరే వాళ్ళ పరువు తీస్తున్నారు. ప్రేమ అంటే ప్రేమించడమే కానీ, ప్రాణం తీయడం కాదని అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ ........ మీ సతీష్ ధనేకుల
ప్రేమ పేరెత్తితేనే కంపరమొస్తుంది. అసలు చదువుకొని తమకాళ్ళమీద తాము నిలబడే వరకు ప్రేమ గీమ అంటే సున్నంలోకి ఎముకలేకుండా విరగగొట్టాలి.ఫాల్తు సినిమాలు చూసి పనికిమాలిన వెధవల ఉచ్చులో పడి అమ్మాయిలు నాశనమైపోతున్నారు.
ReplyDeleteI totally agree with you Anonymous గారు. సినిమాలకు సెన్సార్ వ్యవస్ధ సరిగా లేకపోవడం కూడా సినిమాల్లో చూపించే వికారాలకు ఒక కారణం అనిపిస్తుంది.
ReplyDeleteపరిపక్వత లోపించిన ప్రేమవివాహాల గురించి గుంటూరు వెస్ట్ డి.ఎస్.పి. గా పనిచేస్తున్న సరిత గారి ప్రసంగం వినండి 👇.
ReplyDeleteప్రేమపెళ్ళిళ్ళు :: పోలీస్ ఆఫీసర్ సరిత గారి ప్రసంగం
చదువు మానేస్తే జీవితం నాశనమైపోతుందని భయపడేది ప్రభుత్వ ఉద్యోగాలని నమ్ముకునేవాళ్ళు. వ్యస్పారాలు చేసుకునేవాళ్ళకి ఆ భయం ఉండదు. అమృత, ప్రణయ్‌ల చదువుల గురించి వీళ్ళకెందుకు బాధ?
ReplyDeleteచదువు మానేస్తే జీవితం నాశనమైపోతుందని భయపడేది ప్రభుత్వ ఉద్యోగాలని నమ్ముకునేవాళ్ళు. వ్యాపారాలు చేసుకునేవాళ్ళకి ఆ భయం ఉండదు. అమృత, ప్రణయ్‌ల చదువుల గురించి వీళ్ళకెందుకు బాధ?
ReplyDelete