Pages

Sunday, April 22, 2018

పగటి కలలు

మార్కెట్ లోకి ఇంకో కొత్త చంద్రబాబు, జగన్ లాంటి నాయకుడే వస్తున్నాడేమో అనే భయాన్ని నాకు పవన్ కళ్యాణ్ కల్పిస్తున్నాడు. రాజకీయాలలోకి కొత్త రక్తం రావాలి జనాలలో చైతన్యం తేవాలి నిస్స్వార్ధమయిన నాయకులు రావాలి అని పగటి కళలు కనే ఎంతో మంది సామాన్యులలో నేను ఒకడిని. మళ్ళీ మన కలలు పగటి కల గానే మిగిలిపోతుంది  అని నాకు అనిపిస్తున్న కారణాలు..!

మన రాజకీయాలలో ఏనాటి నుండో ఫాలో అవుతున్న మొదటి సూత్రం, "మనం చేస్తే సంసారం, అదే ఎదుటి వాడు చేస్తే వ్యభిచారం". 

మొదట టీడీపీ విషయానికి వస్తే ఎలక్షన్ అవసరాలప్పుడు నరేంద్ర మోడీ ఒక గొప్ప హీరో ఈ దేశాన్ని ఉద్దరించడానికి వచ్చిన నిస్స్వార్ధమైన నాయకుడు. పవన్ కళ్యాణ్ ఒక గొప్ప త్యాగశీలి నిజాయితీకి మారు పేరు. కానీ మన అవసరాలు మారిన తరువాత, ఇప్పుడు మోడీ దేశ ద్రోహి పవన్ కళ్యాణ్ పర్సనల్ గా చెడ్డోడు అయిపోయాడు వీళ్ళకి... 

ఇక వైసీపీ విషయానికి వస్తే, ఎలక్షన్స్ ముందు బీజేపీ టీడీపీ పార్టీలు మతపూరిత పార్టీలు వీళ్లిద్దరు కలిసి దేశాన్ని దోచుకుంటారు, పవన్ కళ్యాణ్ చేతకాని వాడు ప్యాకేజీ లకు అమ్ముడు పోయాడు. కానీ ఇప్పుడు మన అవసరాల కోసం మోడీ మంచోడు అండ్ మోడీ ని డైరెక్ట్ గా పొగడకపోయినా ఎప్పుడు నోరెత్తి ప్రశ్నించము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంచోడు పవన్ కళ్యాణ్ ని ఎమన్నా అంటే మేమున్నాం అంటున్నారు.. 

ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, ఆవేశం తో విప్లవ ఉద్యమాలను నడపొచ్చేమో కానీ రాజకీయ పార్టీలను నడపలేము అని నా ఉద్దేశం. మన ఆలోచన మంచిదే అవ్వొచ్చు కానీ ఆవేశం లో తీసుకునే ఏ నిర్ణయం మంచిది కాదు అని మన పెద్ద వాళ్ళు ఊరికే చెప్పలేదు. గొప్ప నాయకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం సహనం, "తన కోపమే తన శత్రువు" అన్నట్లు కోపం తో ఆవేశపడి తీసుకునే ప్రతి నిర్ణయం తన భవిషత్తుకి ఆటంకం గానే మిగిలిపోతుంది. అదే పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి అయితే ఆవేశపడి తన మీదకు వచ్చిన వాళ్ళని ఎదుర్కోవడం లో ఏ తప్పు లేదు. కానీ తాను వ్యక్తి స్థాయి నుండి ఎప్పుడో ఒక శక్తి స్థాయి కి వచ్చాడు, అలాంటి వాళ్ళు ఏదయినా సమస్య వచ్చినప్పుడు తన సొంత సమస్యలా పోరాడకూడదు. తనతో పాటు మిగిలిన ప్రతి సామాన్యుడు రోజు ఫేస్ చేస్తున్న ప్రోబ్లం లా పోరాడాలి. 

కొన్ని చానెల్స్ చంద్రబాబు భజన చేస్తూ, మరికొన్ని చానెల్స్ జగన్ ఓదార్పు యాత్రలనే చూపిస్తూ రైతుల సమస్యలు సామాన్యుడి కష్టాలను పట్టించుకోవట్లే కానీ ఏ నాడు దీని మీద గట్టిగా అడిగిన రోజు లేదు. ఈ రోజు మిమ్మల్ని పర్సనల్ గా దూషించారు మిమ్మల్ని టార్గెట్ చేశారు అని బాధ వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రతి రోజు ప్రతి ఛానల్ ప్రతి సామాన్యుడికి చేస్తుంది ఇదే సర్. మిమ్మల్ని మీ అమ్మ గారిని ఎవరో దూషించారు అని అంటున్నారు, ఒక పోలీస్ స్టేషన్ లోనో  లేక  రాజకీయ నాయకుడు దగ్గరో ఒక సామాన్యుడిని వాడి అమ్మని, చెల్లిని ప్రతి రోజు పిలిపించుకునే ఊతపదమే ఇది సర్. ఈ రాష్ట్రాన్నే తన కుటుంబముగా భావించే నాయకుడు అవ్వాల్సిన మీరు నా కుటుంబాన్ని నా అమ్మని ఏదో అంటున్నారు అని బాధపడే రాజకీయ నాయకుడు అవుతారని ఏ రోజు అనుకోలేదు నేను. ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అధికారపక్షాన్ని అడిగితే ప్రతిపక్షం వాళ్ళని దూషించినట్లు, ప్రతి పక్షం వాళ్ళు అధికార పక్షాన్ని దూషించినట్లు. కాస్టింగ్ కౌచ్ సమస్యను మీరు కూడా వదిలేసి మీ ఫామిలీ సమస్యగా తీసుకుంటున్న తీరు చూస్తే మళ్ళీ నాకు పగటి కలలు కంటున్నట్లే ఉంది సర్...!

ఎప్పటికయినా నా పగటి కలలు కలలుగా మిగలకుండా ఒక గొప్ప నాయకుల గా మారుతాయి అని ఆసిస్తూ.....సతీష్ ధనేకుల !!!



3 comments:

  1. బాగా చెప్పావు బయ్యా. పచ్చ మీడియా కులపిచ్చి ఒక వైపు. జగన్ బయ్యా మొండితనం ఒకవైపు. పవన్ బాబు పచ్చ మీడియా విష వ్యూహంలో చిక్కు కున్నాడు.మధ్యలో కత్తి మహేశ్ లొల్లి. ఆంధ్రాలో ప్రస్తుతం పెజానీకం బుచికోయమ్మ బుచికి.

    ReplyDelete
  2. dear sir very good blog and very good content
    Telugu News

    ReplyDelete
  3. మొన్న పవన్ మాట్లాడుతూ 10 కోట్లు ఇచ్చి చంద్రబాబు తిట్టించారు అని కూడా అన్నారు. హైదరాబాద్ లో గొడవ జరుగుతుంటే ఆంధ్రా సీ ఎం బాధ్యత తీసుకుంటారా ? తెలంగాణా సీ ఎం ని ఒక్కరు కూడా ప్రశ్నించే సాహసం చేయలేదు.ఇంకా చంద్రబాబు గారే మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా భావిస్తున్నారా ? వీళ్ళకన్నా లోకేష్ గారే కాస్త సెన్సిబుల్ గా మాట్లాడారు.ఒక వ్యక్తి వ్యక్తిత్వం అనేది ఎన్నో ఏళ్ళ శ్రమ అనీ ఆయనిని నేను గౌరవిస్తాననీ చెప్పారు.

    ReplyDelete