మొన్ననే కదా నలుగురు దుర్మార్గులు రాక్షసం గా ప్రియాంకా రెడ్డి మీద దాడి చేస్తే ఆ నలుగురిని చంపే వరకు ఉఖ్రోషం తో ఊగిపోయిన మనము, ఇప్పుడు తను కూడా అటువంటి ఆడపిల్లే అని మరచిపొయామా..!
మనకు అన్యాయం జరిగింది అనే ఆవేశం, నలుగురు గుంపు గా ఉన్నారు లే అనే ధైర్యం ఒక మనిషి మీద క్రూరం గా దాడి చేసే గుణాన్ని తీసుకు వస్తాయా..!
ఎక్కడైనా దూరం గా ఇలాంటివి జరిగితే దానికి అరాచకం అని పేరు పెట్టి బాధని చూపిస్తున్న మనం, మన వరకూ వస్తే మాత్రం అన్యాయం, బాధ లో వచ్చిన ఆవేశం అని సర్దిచెప్పుకుంటున్నామా..!
బాధ ఆవేశం వస్తే ఎదుటి మనిషిని ఏమి చేస్తున్నామో కూడా మరచిపొయే స్తితికి ఎందుకు వస్తున్నాము, ఒక సాధారణ టీవి యాంకర్ ని కొట్టే పౌరషం ఉన్న మనకి అస్సలు ఈ సమస్యకు కారణం అయిన మీరు ఎన్నుకున్న నాయకుల చొక్కా పట్టుకుని అడిగే ధమ్ము ధైర్యం మీకు రావాలి అని కోరుకుంటూ....
***సతీష్ ధనేకుల***