Pages

Monday, December 30, 2019

హద్దులు లేని ఆవేశం

తమ భూములకి అన్యాయం జరుగుతుంది అనే ఉద్రేకంతో ఒక టీవి యాంకర్ మీద మూకుమ్మడి దాడి అదీ ఒక అమ్మాయి అని కూడా చూడకుండ.
మొన్ననే కదా నలుగురు దుర్మార్గులు రాక్షసం గా ప్రియాంకా రెడ్డి మీద దాడి చేస్తే ఆ నలుగురిని చంపే వరకు ఉఖ్రోషం తో ఊగిపోయిన మనము, ఇప్పుడు తను కూడా అటువంటి ఆడపిల్లే అని మరచిపొయామా..!
మనకు అన్యాయం జరిగింది అనే ఆవేశం, నలుగురు గుంపు గా ఉన్నారు లే అనే ధైర్యం ఒక మనిషి మీద క్రూరం గా దాడి చేసే గుణాన్ని తీసుకు వస్తాయా..!
ఎక్కడైనా దూరం గా ఇలాంటివి జరిగితే దానికి అరాచకం అని పేరు పెట్టి బాధని చూపిస్తున్న మనం, మన వరకూ  వస్తే మాత్రం అన్యాయం, బాధ లో వచ్చిన ఆవేశం అని సర్దిచెప్పుకుంటున్నామా..!
బాధ ఆవేశం వస్తే ఎదుటి మనిషిని ఏమి చేస్తున్నామో కూడా మరచిపొయే స్తితికి ఎందుకు వస్తున్నాము, ఒక సాధారణ టీవి యాంకర్ ని కొట్టే పౌరషం ఉన్న మనకి అస్సలు ఈ సమస్యకు కారణం అయిన మీరు ఎన్నుకున్న నాయకుల చొక్కా పట్టుకుని అడిగే ధమ్ము ధైర్యం మీకు రావాలి అని కోరుకుంటూ....

***సతీష్ ధనేకుల***

2 comments:

  1. Repeating my comment on a different blog here:

    టీవీ9 నల్లమోతు దీప్తి & ఇతర జర్నలిస్టుల మీద జరిగిన దాడిని ఒక్క పచ్చ కండువా కూడా నిరసించలేదు సరికదా దారుణంగా ఎగతాళి చేసారు. కందుల రమేష్ అనబడే "జర్నలిస్ట్" సైతం వెకిలి వ్యాఖ్యలు రాసాడు.

    పచ్చమూకల దాడిలో మహా టీవీ జర్నలిస్ట్ వసంత్ కూడా గాయపడ్డాడని తెలిసినా సదరు ఛానెల్ అధినేత సుజనా చౌదరి & నియమిత చైర్మన్ పరకాల ప్రభాకర్ కనీసం నోరు మెదపలేదు.

    నిత్యం విలువలు మాట్లాడే జర్నలిజం ప్రొఫెసర్ నాగేశ్వర్ బెల్లం కొట్టిన రాయిలా మిన్నకున్నాడు.

    ReplyDelete
    Replies
    1. ఇప్పుడు టివి 9 తస్మదీయులు అయిపోయింది. ప్రవచన కర్త, పెరుగు వడ బొరియల్లోకి దూరి దాక్కున్నారు.

      అనే సీబెన్ చంద్రజ్యోతి, ఆ టీవీ మీద దాడి జరిగితే పూనకం తో. వీరంగం చేసేవారు కాదూ.

      Delete