Pages

Tuesday, October 10, 2017

నీ విలువ ఎంత...!





నీ చేతిలో కరెన్సీ నోటో, లేక నీ నోటి మాటో.. 
నువ్వు చేసే పనో, లేక నువ్వు వాడే వస్తువో.. 
వీటికి ఉన్న విలువ  ఓ మనిషీ నీకు ఉందని అనుకుంటున్నావా.....!
లేదని నేను భావిస్తే నువ్వు కాదని అనగలవా....!

నువ్వు చేసిన ఒక చిన్న పని లేక నువ్వు జారిన నీ నోటి మాటే నిన్ను ప్రేమించబడేలా లేదా ద్వేషించబడేలా చేస్తుంది. 
ఇన్ని రోజుల ప్రయాణం తరువాత కూడ ఎదుటి వారిని ప్రేమిస్తున్నా అనో స్నేహం చేస్తున్నా అనో నీ మాటలు, చేతల ద్వారా నిరూపించుకునే స్థానం లో నువ్వు ఇంకా ఉన్నావంటే నీకు విలువ ఉన్నట్లా లేక వాటికి నీకన్నా ఎక్కువ విలువ ఉన్నట్లా....!!! 


మీ........ సతీష్. 

Thursday, September 28, 2017

మానవ మృగం




అర్హులం కాకపోయినా.. ఉచితం గా వస్తుంది అంటే గంటలు గంటలు లైన్ ల లో నిలబడటానికి ఏ నామోషీ ఉండదు,
అదే ఉచితం గా పొందిన వాటి లో నాణ్యత లేకపోతే మన మనోభావాలు దెబ్బతింటాయి.

నీ కుల వృత్తి నీకు చేయడానికి నామోషీ అడ్డొస్తుంది,
అదే కులాన్ని వినోదానికి చూపిస్తే మాత్రం పౌరుషం పొడుచుకొస్తుంది.

సమాజం లో ఏ అన్యాయానికి మనం స్పందించం,
మన హీరో ని లేదా మన కులపోడిని  ఎవరన్నా ఏదన్నా అంటే దేశ సైనికుడి లా బయలుదేరుతాం.

కంటి ముందు ఉన్న స్త్రీ కి కనీస విలువ ఇవ్వం,
కానరాని తెర మీద స్త్రీ కి మాత్రం గోపురాలు కట్టేస్తాం .

అన్నీ నాకే తెలుసు అనే అజ్ఞానం తో,
తిరిగి మానవ మృగం లా మారిపోకు మిత్రమా...!!


  మీ...............సతీష్ ధనేకుల!!



Thursday, September 7, 2017

2+2=1

ప్రాణం రెండు అక్షరాలు,
బంధం రెండు అక్షరాలు,
తన ప్రాణమే పేగు బంధం గా పంచె అమ్మ రెండు అక్షరాలే.. 

కష్టం రెండు అక్షరాలు,
గమ్యం రెండు అక్షరాలు,
తన కష్టం తో మన గమ్యానికి మార్గం వేసే నాన్న రెండు అక్షరాలే.. 

రెండు రెక్కలు రాగానే  ఆ రెండు అక్షరాల బంధాన్ని ముక్కలు చేయొద్దని రెండు చేతులు జోడిస్తూ.....

మీ సతీష్ ధనేకుల!!   

Friday, August 25, 2017

గణపతి బప్పా మోరియా

మా బొజ్జ గణపతి చిన్నారుల చదువులకు అధిపతి.. 
ముక్కోటి దేవతల లో ముందు వరుసలో ఉంటావు,
మా అన్ని పనులకు ఆరంభం అవుతావు. 
మూడు ప్రదక్షణలతో ముల్లోఖాలను చుట్టొచ్చావు.. 
తల్లి మాట శిరసావహించి, తండ్రి ఆఖ్రోశానికి శిరశ్చేధన చేయబడ్డావు.. 
అప్పుడు చేయని తప్పుకి వికృత రూపం దాల్చావు.. 
ఇప్పుడు మేము చేసే నీ వికృత రూపాలను ఆనందంగా భరిస్తున్నావు..!

***అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు**

మీ .......... సతీష్ ధనేకుల...!

Friday, August 11, 2017

ప్రేమ అంటే...!

నన్ను నాలా చూడటమే ప్రేమ,
నేను నీలా ఉండాలనుకోవడం భ్రమ.. 

 నీ స్వార్థానికి ప్రేమ అనే పేరు పెట్టుకోకు,
అది నాలో లేదని కుమిలిపోకు.. 

ఉన్న ప్రేమను విస్మరించకు,
లేని కోపం ఊరికే ప్రదర్శించకు.. 

అవసరాన్నిబట్టి, నీ ఆలోచనలకు మెలిపెట్టి, మారేది కాదు ప్రేమ..!

అందరూ నీ వారే అనుకుంటే, నిన్ను నువ్వు దూరం గా పెట్టు,
నువ్వు నీకే కావాలి అంటే, అందరిని దూరంగా నెట్టు.. 

ఇది నీకు అర్దమవలేదు అంటే, నువ్వు అదృష్టమంతుడివి అయినట్లు.. 
అర్ధమై కూడా బాధ పడుతున్నావ్ అంటే, నిన్ను దేవుడు కూడా మార్చలేడన్నట్లు ..!

  మీ................................................సతీష్ ధనేకుల..! 


Tuesday, February 28, 2017

చేదు వార్త..!




ఉన్నప్పుడు ఊసు కూడా తీసుకు రారు,
పోయినప్పుడు మాత్రం పాపులారిటీ కోసం పాకులాడుతున్నారు. 
ప్రాణం పోకుండా చూసే పని ఒక్కటీ చేపట్టరు,
పోయాక మాత్రం TRP కోసం ప్రోగ్రాములు చేస్తారు. 
కుల మత లింగ భేదాలు మన మధ్య ఉన్నా పట్టించుకోరు,
పరాయి దేశ పాపాన్ని మాత్రం వేలెత్తి చూపుతారు. 
భయాన్ని పెంచే బ్రేకింగ్ న్యూస్ లు ఇకనన్నా ఆపండి,
చేతనయితే సాయం చేయండి,
లేకపోతే ధైర్యాన్ని చెప్పే మార్గాన్ని చూపండి,
లేదు కాదు అంటే అలవాటయిన గాసిప్స్ తో కాలాన్ని గడపండి,
అంతే కానీ అన్యాయాన్ని అవకాశం గా మార్చుకోకండి....!


కనీసం ఉన్నవాళ్లను అయినా భయం తో బెంభేలించేలా చేయొద్దని మన మీడియా కి నా మనవి...... సతీష్. 

Tuesday, February 14, 2017

ఏదో మాయ..!



నీ ఊహల్లో నేను నిద్రిస్తుంటే, నీ తలపు నను తట్టి లేపీతే దాని పేరు ప్రేమ.. 
నను నేను మరచి, నిను నేను తలచి ఊసులాడే ఊహ పేరు ప్రేమ... 

నీ మాటల సవ్వడి నా హృదయపు చప్పుడు గా మారడమే ప్రేమ.. 
నీ ఊసే నా స్వాసగా మారి నీకయి నా ఊపిరి వేచి ఉండటమే ప్రేమ...

దేహాలు వేరు, వాటి మధ్య సందేహాల పోరు, వాటన్నిటిని మరిపించేదే ప్రేమ.. 
నీకయి నేను, నాకయి నువ్వు మనకంటూ ఉండే తోడు ప్రేమ...!

ఏదో మాయ నను నేను మరిచేంతలా చేసింది..  
ఏదో మాయ నను నిన్నుగా తలపిస్తుంది...!

                                                      .......సతీష్ ధనేకుల!!




Saturday, February 4, 2017

రైతు...!!



రైతు..
మనం తినే ప్రతి మెతుకు కి ప్రాణ దాత,
ప్రతి కవి అవసరానికి ఒక ఆర్తనాథ కవిత,
ప్రభుత్వాలు భావించే ఒక భారమయిన మోత,
ఎన్నికలప్పుడు మాత్రమే వీరు వారికి చేయూత,
కానీ ఎవరూ ముందుకురారు మార్చడానికి వారి తలరాత..!

దేశానికి  వీరే వెన్నెముక అట,
కానీ వెనక్కి తిరిగి దాన్ని ఎవరూ చూడరట,
మెతుకు లేనిదే గడవదు మనకు ఒక పూట,
దానిని పండించే వాడి గొడు ఎవరికీ పట్టదట.

రైతు కష్టం ధలారి చేతిలో మాయమవుతుంది,
ప్రభుత్వాల నిర్లక్ష్యానికి భలి పసువవుతుంది.
ప్రతీ వ్రుత్తి వారసుడిని కోరుకుంటుంది,
వ్యవసాయం మాత్రమే కసాయి వాడికి కూడా వద్దు అనుకుంటుంది.
ఈ పదం భవ్యిష్యత్తు తరాలకు కనుమరుగవుతుంది...!

అని భయపడుతూ  మీ.......సతీష్!!
                                                       

Friday, February 3, 2017

శంఖారావం



పాలకుల నిర్లక్ష్యానికి బాధ పడే క్షణం..
ఆలస్యం గా ఆవేశంతో మొదలైన ప్రజా చైతన్యం..
గణతంత్ర దినమున ఆసన్నమయిన మరో అద్భుత తరునం..
చేయొద్దు ఇది ఒక కుట్ర రాజకీయ పొరాటం..
అవ్వాలి భవిష్యత్తు తరాలకు ఇదే ఆదర్శం..
కాకూడదు సామన్యుడి జీవితానికి ఇది ఒక ఆటంకం..
చట్టాలను గౌరవిద్దాం,
కష్టాలను భరిద్దాం,
తెలుగు జాతి విలువ గొంతెత్తి చాటుదాం,
ఢిల్లీ పాలకుల చెవిలో శంఖారావం పూరిద్దాం..!

.......సతీష్ ధనేకుల!!

Wednesday, January 25, 2017

నలుగురిలో నాలుగో వాడిగా..!

 


నాలుగు చెక్క గోడల మధ్య రెక్కలు విరిగిన జీవితాలు.. 
నాలుగు చక్రాల మీద పరిగెడుతున్న హడావుడి ప్రయాణాలు..
నాలుగు రోజులు ఆఫీస్ లో పోరాటం, ఐదో రోజునుండి వీకెండ్ కై ఆరాటం.. 
నాలుగు వాట్సాప్ మెసేజీలు, రెండు ఫేసుబుక్ పోస్టులు ఇవే ప్రేమలు ఆప్యాయతలు.. 
నాలుగు సార్లు వచ్చే లాంగ్ వీకెండులు అవే పండగలు పబ్బాలు.. 
నాలుగు డాలర్ల కోసం నా అనుకున్న వారికి దూరంగా నానా అగచాట్లు.. 
నాలుగు నోర్లు ఊర్లో కలిస్తే సూట్లు బూట్లతో సుఖపడిపోతున్నామనే గుసగుసలు...!
                                 


ఏమీ తెలియకపోతే ఏదన్నా తెలుసుకోవాలని ప్రయత్నిస్తాం, ఏదయినా సాధిస్తాం.. 
అదే ఏదో ఒకటే తెలిస్తే దానితోనే కాలం గడిపేస్తాం, జీవితాన్ని వృధా చేస్తాం...!


మీ..........సతీష్!!


Monday, January 16, 2017

నాలో నేను, నాతో నేను...!




దేనికోసం ఆశ లేదు.. 
భవిష్యత్తు అంటే భయం లేదు.. 
కోరికంటు కాన రాదు .. 
కష్టమంటే బెదిరిపోదు.. 
సుఖాలకు బానిసవదు.. 
ఓటమికి కృంగిపోదు.. 
గెలుపుకంటు పొంగిపోదు.. 
నాది అంటు స్వార్దపడదు.. 
నీది అంటు దూరమవదు...!

కంటికి కనపడని దానికి ఎప్పుడూ విలువెక్కువే.. 

గాలి, ప్రేమ ఇలా.. 
కనిపించే ప్రతీది చులకనే.. 
మనిషి, ప్రకృతి అలా.. 
వినపడే వాటికే విలువిస్తాం, కనపడే వాటిని కూడా కప్పేస్తాం. 
గొప్పగా ఆలోచిస్తాం కానీ, ఆచరణలో విస్మరిస్తాం...!


భక్తితో తలిస్తే దైవం

భయం తో చూస్తే దయ్యం 
జాలిపడితే మానవత్వం 
కన్నెర్ర చేస్తే క్రూరత్వం 
మనసు పెడితే ప్రేమమ్  
అదే మనసు బాధ పడితే ద్వేషం 
చేయి అందిస్తే సాయం 
నిరాకరిస్తే అన్యాయం 
నేను అనుకుంటే స్వార్థం 
మనం అనుకుంటే ఆదర్శం....!


మీ  ............. సతీష్




Monday, January 2, 2017

మార్పు కోసం మరో కొత్త సంవత్సరం


                                               


కులమా కులమా ఎవరే నువ్వు అంటే, అంటరాని వాడు అనే పిలవబడే వాడి కడుపు మంట లో నుండి పుట్టా అంటుంది..!
కులమా కులమా నువ్వెవరే అంటే, అగ్ర వర్ణాలుగా భావించే వాడి అధికారం నుండి పుట్టా అంటుంది..!

ఆకలి లో పట్టెడన్నం పెట్టదు కులం,

ఆపదలో ఏ సాయం కానిది కులం,
అవసరానికి పనికి రానిది కులం. 
కానీ,,,
పేరు వెనుక తోకలా కులం,
పరువు కోసం పాకులాడే కులం,
పదవి కోసం ప్రాణాలను తీసేది కులం. 

అనంతమంత ప్రపంచం లో ఆవగింజంత అనుభవంతో, అన్నీ నేనే అనుకునే అజ్ఞానం తో, నేనూ  నాదీ అనే స్వార్థంతో, రోదిస్తూ  రొప్పిస్తూ  బ్రతుకుతున్నా అని నువ్వు అనుకుంటూ  కుక్కలా కతుకుతున్న 
ఓ మనిషీ మేలుకో.... 
సాటివాడి బాధలకు స్పందిస్తూ,
ఎదుటి వాడిని ప్రేమిస్తూ,
ఆనందం తో జీవిస్తూ... 

నూతన సంవత్సరం నుండి అది సాదించాలి ఇది సాదించాలి అనే ఎప్పటి లా కలలు కనే కన్నా ముందు గా మనిషిని మనిషి గా చూసేలా మనం మారాలని ఆశిస్తూ నూతన సంవత్సర  శుభాకాంక్షలు.................... మీ సతీష్