కులమా కులమా ఎవరే నువ్వు అంటే, అంటరాని వాడు అనే పిలవబడే వాడి కడుపు మంట లో నుండి పుట్టా అంటుంది..!
కులమా కులమా నువ్వెవరే అంటే, అగ్ర వర్ణాలుగా భావించే వాడి అధికారం నుండి పుట్టా అంటుంది..!
ఆకలి లో పట్టెడన్నం పెట్టదు కులం,
ఆపదలో ఏ సాయం కానిది కులం,
అవసరానికి పనికి రానిది కులం.
కానీ,,,
పేరు వెనుక తోకలా కులం,
పరువు కోసం పాకులాడే కులం,
పదవి కోసం ప్రాణాలను తీసేది కులం.
అనంతమంత ప్రపంచం లో ఆవగింజంత అనుభవంతో, అన్నీ నేనే అనుకునే అజ్ఞానం తో, నేనూ నాదీ అనే స్వార్థంతో, రోదిస్తూ రొప్పిస్తూ బ్రతుకుతున్నా అని నువ్వు అనుకుంటూ కుక్కలా కతుకుతున్న
ఓ మనిషీ మేలుకో....
సాటివాడి బాధలకు స్పందిస్తూ,
ఎదుటి వాడిని ప్రేమిస్తూ,
ఆనందం తో జీవిస్తూ...
Nice
ReplyDeleteThanks Aunty :)
Deletesuperb lines.. True words Satish
ReplyDeleteIndia lo reservations caste politics కి, reservations కి, మనుషుల మద్య దూరాలకి బాగా పనికొస్తాయి.
ReplyDelete