నీ ఊహల్లో నేను నిద్రిస్తుంటే, నీ తలపు నను తట్టి లేపీతే దాని పేరు ప్రేమ..
నను నేను మరచి, నిను నేను తలచి ఊసులాడే ఊహ పేరు ప్రేమ...
నీ మాటల సవ్వడి నా హృదయపు చప్పుడు గా మారడమే ప్రేమ..
నీ ఊసే నా స్వాసగా మారి నీకయి నా ఊపిరి వేచి ఉండటమే ప్రేమ...
దేహాలు వేరు, వాటి మధ్య సందేహాల పోరు, వాటన్నిటిని మరిపించేదే ప్రేమ..
నీకయి నేను, నాకయి నువ్వు మనకంటూ ఉండే తోడు ప్రేమ...!
ఏదో మాయ నను నేను మరిచేంతలా చేసింది..
ఏదో మాయ నను నిన్నుగా తలపిస్తుంది...!
.......సతీష్ ధనేకుల!!
No comments:
Post a Comment