రైతు..
మనం తినే ప్రతి మెతుకు కి ప్రాణ దాత,
ప్రతి కవి అవసరానికి ఒక ఆర్తనాథ కవిత,
ప్రభుత్వాలు భావించే ఒక భారమయిన మోత,
ఎన్నికలప్పుడు మాత్రమే వీరు వారికి చేయూత,
కానీ ఎవరూ ముందుకురారు మార్చడానికి వారి తలరాత..!
దేశానికి వీరే వెన్నెముక అట,
కానీ వెనక్కి తిరిగి దాన్ని ఎవరూ చూడరట,
మెతుకు లేనిదే గడవదు మనకు ఒక పూట,
దానిని పండించే వాడి గొడు ఎవరికీ పట్టదట.
రైతు కష్టం ధలారి చేతిలో మాయమవుతుంది,
ప్రభుత్వాల నిర్లక్ష్యానికి భలి పసువవుతుంది.
ప్రతీ వ్రుత్తి వారసుడిని కోరుకుంటుంది,
వ్యవసాయం మాత్రమే కసాయి వాడికి కూడా వద్దు అనుకుంటుంది.
ఈ పదం భవ్యిష్యత్తు తరాలకు కనుమరుగవుతుంది...!
అని భయపడుతూ మీ.......సతీష్!!
True words
ReplyDeleteThank you Swetha
DeleteWelcome 😊
Delete