Pages

Friday, January 5, 2018

మారాల్సింది క్యాలెండర్ లో డేట్ కాదు...!


మనలో మనిషిని కరిగిస్తూ
'మర' లా మారుస్తూ 
ఆ మార్పును గర్వం తో ఆస్వాదిస్తూ 
అదే గొప్ప అని భావిస్తూ 
ఎదుటి మనిషిని హీనం గా చూస్తూ 
మన అవసరాలకయి విలువిస్తూ 
మనకి నచ్చితే నానుస్తూ 
లేకుంటే ద్వేషిస్తూ 
తనలో మంచిని మరుస్తూ 
చెడునే వేలెత్తి చూపిస్తూ  
దగ్గరిని దూరం చేస్తూ 
లేనివి ఊహిస్తూ 
అందరికి అందనంత ఎత్తులో ఉన్నా అని భావిస్తూ 
నీకయి తెలీక నీకు నువ్వే శిక్ష వేస్తూ
ఒక్కొక్కిరినే అనుకుంటూ అందరిని దూరం చేస్తూ
ఒక సంవత్సరాన్ని పాతది చేస్తూ 
మరో సంవత్సరాన్ని కొత్తది చేస్తూ  HAPPY NEW YEAR!!

మీ ......సతీష్ ధనేకుల!!



 


 


2 comments: