Pages

Thursday, January 9, 2020

జననం గమనం మరణం

తెచ్చేదేముంది పోగొట్టుకోవడానికి,
పొయేదేముంది పాకులాడటానికి.
ఉగ్గ పెట్టుకుని ఊడిపడతాం,
ఆయాస పడుతూ ఆవిరవుతాం.
బుర్ర లోని జుర్రు కి తెలిసిందే ఈ సత్యం,
చుర్రు బుర్రు లాడుతూ మరిచేనే నిత్యం.
వేసే  ఒక్కో అడుగు నీ గమనం లో తరిగిపోతున్న ఒక్కో గడువు,
పడే ప్రతి అడుగు ఒక గుణపాఠం, తరిగే ప్రతీ గడువు నీకొక జీవిత సత్యం.
పాఠం అయినా, అది సత్యం అయినా ఆకరికి మిగిలేది సూన్యం.
అంకె కు సూన్యం కుడి కుడిగా చేరితే ఎప్పుడూ విలువే, నీకు వడి వడిగా ఈ సూన్యం అర్ధమయితే జీవితం అంతా సులువే...! 


                                                                      ***సతీష్ ధనేకుల*** 

3 comments:

  1. బుర్ర లోని జుర్రు, సూన్యం - ??

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. బుర్ర లో గుజ్జు అంటే బ్రైన్, అలానే ఎముకలో గుజ్జు జుర్రు కుంటాము కదా అందుకే ఆ పదం వాడాల్సి వచ్చింది.
      సూన్యం అంటే అంకెలలో సున్నాకి వాడాను, జీవితం లో ఆకరికి తీసుకెల్లేది సూన్యమే కదా అని అక్కడ వాడాను.

      Delete