Pages

Monday, September 24, 2018

నేటి సమాజం..!!

పక్కన మనిషికి పిసరంత గౌరవం కూడా ఇవ్వము, జాతీయ గీతాన్ని గౌరవించడం దేశ భక్తి అని చాటుతాము.. 
ఆకలితో కనపడిన వాడికి పట్టెడన్నం పెట్టము, కనపడని రైతు మీద ముసలి కన్నీరు చూపిస్తాము.. 
రాజకీయాలకు నీతులు చెప్తాము, మనకి నచ్చిన నాయకుడు ఏ తప్పు చేసినా భుజాలమీద వేసుకుని భజన చేస్తాము.. 
మన వాడికి తప్పు జరిగితే నే అన్యాయం అని పోరాడతాము, పరాయి వాడికి జరిగితే అదే న్యాయం అని గొంతెత్తి అరుస్తాము.. 
దేశం బయట మన ప్రాణాలను కాపాడే జవానులను ప్రేమిస్తాము, 
వారు కాపాడిన ఆ ప్రాణాన్నే మన అవసరాల కోసం చంపేస్తాము.. 
ఎదుట గా ఉన్న సమస్యను మనకెందుకులే అని వదిలేస్తాము, 
TV ల లో సమస్యలకు ముసుగేసుకుని పోరాడతాము.. 
అప్పట్లో తెల్ల వాడి చేతిలో విభజించి పాలించబడ్డాము, 
ఇప్పటికీ మన పాలనలో ఎవడికి వాడు కులం మతం అని మనకి మనమే విభజించుకుని పోరాటం చేస్తున్నాము...!! 

మీ...... ***సతీష్ ధనేకుల***

Friday, September 21, 2018

ప్రేమకు ప్రాణం తీసే హక్కు లేదు

మన రాజ్యాంగం లో మైనర్, మేజర్ అనే చట్టాలను తీసేయాల్సిన రోజు వచ్చినట్లుంది. ఎందుకంటే మనం చెప్పిన మాట వింటే బ్రతకనిస్తాం లేకపోతే చంపేస్తాం అనే మూర్ఖత్వం ఉన్న చోట మేజర్ అనే పదానికి అర్ధం లేదు. అరే ఒక ప్రాణం అన్యాయం గా తీసేసారు అనే బాధను పక్కకు నెట్టేసి, 9th క్లాస్ లో కొవ్వు పట్టి ప్రేమించుకున్నారు వాళ్లకు తగిన శాస్తి జరిగింది అనే ప్రతి మూర్కులారా..! మీరనుకునే కొవ్వు పట్టిన వారిలా తిరిగి ఎవరి దారి వాళ్ళు చూసుకోలేదు, మీరు నమ్మని మేజర్ అనే వయసు వచ్చిన తరువాత వారిద్దరి ఇష్టం తో పెళ్లి చేసుకుని వారి జీవితం వారు గడుపుతున్నారు(ఇక్కడ తల్లి తండ్రుల ఇష్టం అవసరం లేదా అని అడగొచ్చు, నీ ఇష్టాన్ని అవతలి వారి మీద కష్టం గా రుద్దే హక్కు ఈ సమాజం లో ఎవరికీ లేదు). ఎంతో మంది మేధావులు మన రాజ్యాంగాన్ని చట్టాలను పెట్టింది అందుకే అస్సలు మేజర్ అనే చట్టం పెట్టిందే ఒక వయసు దాటిన తరువాత ఎవరి జీవితం మీద వారికి హక్కు రావాలి అని. వారు తీసుకునే నిర్ణయం తప్పు, ఒప్పు  అన్నది పక్కన పెడితే అది వారి జీవితం. అస్సలు వాళ్ళు తప్పు చేశారా ఒప్పు చేశారా అని నిర్ణయించడానికి మనమెవరం?? ఇలాంటి వాళ్ళని బ్రతకానిస్తే ప్రతి తల్లి తండ్రి బాధపడాలి వాళ్లకి బ్రతికే హక్కు లేదు అనే ఆటవిక సంస్కృతి లో కి వెళ్తున్న మనమా వాళ్ళను ప్రశ్నిస్తుంది?? ఇక్కడ తల్లి తండ్రుల ప్రేమ అయినా భార్య భర్తల ప్రేమ అయినా ఒక్కటే,  ఏ నిజమయిన ప్రేమ అయినా తన బిడ్డ సుఖం గా ఉండాలి అని కోరుకుంటుంది కానీ తనకి నచ్చిన వాళ్ళతో ఉండాలి అనుకోదు.  మీరు అనుకునే సుఖం డబ్బు తో, కులం తో లేక మతం తో వస్తుంది అనుకుంటే దానికి ప్రేమ అనే పేరు వాడకండి. ఏ ప్రేమకు ఇంకో ప్రాణం తీసే హక్కు లేదు అది తప్పు అయినా ఒప్పు అయినా..  మీ మూర్ఖమయిన వాదనను సమర్ధించుకోవడానికి ఈ రోజు దేశ సైనికులో లేక రైతులు మీకు గుర్తొస్తున్నారు. వీళ్ళందరూ ఎటువంటి స్వార్థం లేని వాళ్ళు వీళ్ళని ప్రాణాలు తీసే మృగాలతో  పోల్చి మీరే వాళ్ళ పరువు తీస్తున్నారు.  ప్రేమ అంటే ప్రేమించడమే కానీ, ప్రాణం తీయడం కాదని అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ ........     మీ సతీష్ ధనేకుల 

Wednesday, September 19, 2018

వ్యక్తి పూజ..!

మన దేశం ఎంత వెనకపడుతుందో అని తెలుసుకోవడానికి ఏ జిడిపి వాల్యూ నో లేక, మన రూపాయి విలువ తెలుసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు.  ఒక్కసారి మన సోషల్ నెట్వర్క్ లోకి వెళ్లి చూడండి. 

"ఒక ప్రాణం పోయిన చోట మానవత్వం కన్నా, క్రిస్టియన్ vs హిందూ  గొడవ కనపడుతుంది"
"ఒక శీలం పోయిన చోట ఓదార్పు కన్నా, హిందూ  vs ముస్లిం హింస కనపడుతుంది"
"పెట్రోల్ ధరలు పెరిగిన చోట సామాన్యుడి బాధ కంటే, కాంగ్రెస్ vs బీజేపీ అభిమానుల రభస కనపడుతుంది"
"ఒక స్కాం జరిగింది అంటే దాని మీద విచారణ కన్నా, మీ హయాం vs మా హయాం అనే డిబేట్ కనపడుతుంది"
 
ఇప్పుడు ఏ వ్యక్తినో ఏ పార్టీ నో ప్రశ్నించాలి అంటే ఉండాల్సింది నిజాయితీ కాదు, ఆ వ్యక్తి సోషల్ నెట్వర్క్ ఫాల్లోవెర్స్ ని తట్టుకునే ధైర్యం మాత్రమే..! 

ఏ పొలిటీషియన్ తప్పు చేసినా ఒకప్పటి  లా తాను సమాధానం చెప్పాలి అని భయపడాల్సిన పని అస్సలు లేదు, ఎందుకంటే ఇప్పుడు వారి వ్యక్తి పూజలు చేసే అభిమానులే అవన్నీ చూసుకుంటున్నారు..!

ఒకప్పుడు ప్రజలు ఎక్కడ తమని ప్రశ్నిస్తారా అని రాజకీయ నాయకులలో కాస్త భయం ఉండేది, ఇప్పుడు ఆ ప్రజలే అభిమానులం అనుకుంటూ  వారికి వారే రోజూ సోషల్ నెట్వర్క్ లో కొట్టుకుంటున్నారు..!
 
రాజకీయ నాయకుల లారా మీకెటువంటి భయం ఇక లేదు, దేశానికి ఆర్మీ సరిగా న్యాయం చేస్తుందో లేదో కానీ మీ వ్యక్తి పూజలు చేయటానికి సోషల్ నెట్వర్క్ లో రోజుకొక ఆర్మీ పుట్టుకొస్తూనే ఉంది...!!

మీ........***సతీష్ ధనేకుల***


 
 
 
 

Monday, September 17, 2018

పరువు కోసం ప్రాణం తీసేది కులం...!



ఆకలి లో పట్టెడన్నం పెట్టదు కులం.. 
ఆపదలో ఏ సాయం కానిది కులం.. 
అవసరానికి ఆసరా రానిది కులం.. 
కానీ,,,
పేరు వెనక తోకలా కులం..  
ఊరు చివర పాక లా కులం..
పరువు కోసం ప్రాణం తీసేది కులం...!

కులం అనే ఒక చిన్న పదం ప్రణయ్ అనే జీవితాన్ని ముగించింది,
అమృత అనే అమ్మాయి జీవితం లో విషాన్ని చిందించింది,
తన పరువే తాను తీసుకోవడానికి కులం పరువు పేరు చెప్పి ఇద్దరి జీవితాలను నాశనం చేసింది. 

ఇంకా ఇలాంటి వారు ఉన్నారా ఇంకా సమాజం మారలేదా అనుకుంటున్న వాళ్లకి ఇదొక్కటే ఉదాహరణ కాదు..!
ఈ హత్య ను కూడా సమర్థిస్తున్న వారు,
ఈ హత్య ను మతాల వారి గా వాడుకుంటున్న వారు,
ఈ హత్య ను ఒక మృగం ఒక మానవుడి కి చేసిన అన్యాయం గా చూడకుండా,
ఒకే కులం ఒకే మతం తో చూస్తూ  మూగపోతున్న మిగిలిన మనమందరం మారే వరకు సమాజం మారదు...!!
 
  మీ.......  ***సతీష్ ధనేకుల***