Pages

Tuesday, February 28, 2017

చేదు వార్త..!




ఉన్నప్పుడు ఊసు కూడా తీసుకు రారు,
పోయినప్పుడు మాత్రం పాపులారిటీ కోసం పాకులాడుతున్నారు. 
ప్రాణం పోకుండా చూసే పని ఒక్కటీ చేపట్టరు,
పోయాక మాత్రం TRP కోసం ప్రోగ్రాములు చేస్తారు. 
కుల మత లింగ భేదాలు మన మధ్య ఉన్నా పట్టించుకోరు,
పరాయి దేశ పాపాన్ని మాత్రం వేలెత్తి చూపుతారు. 
భయాన్ని పెంచే బ్రేకింగ్ న్యూస్ లు ఇకనన్నా ఆపండి,
చేతనయితే సాయం చేయండి,
లేకపోతే ధైర్యాన్ని చెప్పే మార్గాన్ని చూపండి,
లేదు కాదు అంటే అలవాటయిన గాసిప్స్ తో కాలాన్ని గడపండి,
అంతే కానీ అన్యాయాన్ని అవకాశం గా మార్చుకోకండి....!


కనీసం ఉన్నవాళ్లను అయినా భయం తో బెంభేలించేలా చేయొద్దని మన మీడియా కి నా మనవి...... సతీష్. 

Tuesday, February 14, 2017

ఏదో మాయ..!



నీ ఊహల్లో నేను నిద్రిస్తుంటే, నీ తలపు నను తట్టి లేపీతే దాని పేరు ప్రేమ.. 
నను నేను మరచి, నిను నేను తలచి ఊసులాడే ఊహ పేరు ప్రేమ... 

నీ మాటల సవ్వడి నా హృదయపు చప్పుడు గా మారడమే ప్రేమ.. 
నీ ఊసే నా స్వాసగా మారి నీకయి నా ఊపిరి వేచి ఉండటమే ప్రేమ...

దేహాలు వేరు, వాటి మధ్య సందేహాల పోరు, వాటన్నిటిని మరిపించేదే ప్రేమ.. 
నీకయి నేను, నాకయి నువ్వు మనకంటూ ఉండే తోడు ప్రేమ...!

ఏదో మాయ నను నేను మరిచేంతలా చేసింది..  
ఏదో మాయ నను నిన్నుగా తలపిస్తుంది...!

                                                      .......సతీష్ ధనేకుల!!




Saturday, February 4, 2017

రైతు...!!



రైతు..
మనం తినే ప్రతి మెతుకు కి ప్రాణ దాత,
ప్రతి కవి అవసరానికి ఒక ఆర్తనాథ కవిత,
ప్రభుత్వాలు భావించే ఒక భారమయిన మోత,
ఎన్నికలప్పుడు మాత్రమే వీరు వారికి చేయూత,
కానీ ఎవరూ ముందుకురారు మార్చడానికి వారి తలరాత..!

దేశానికి  వీరే వెన్నెముక అట,
కానీ వెనక్కి తిరిగి దాన్ని ఎవరూ చూడరట,
మెతుకు లేనిదే గడవదు మనకు ఒక పూట,
దానిని పండించే వాడి గొడు ఎవరికీ పట్టదట.

రైతు కష్టం ధలారి చేతిలో మాయమవుతుంది,
ప్రభుత్వాల నిర్లక్ష్యానికి భలి పసువవుతుంది.
ప్రతీ వ్రుత్తి వారసుడిని కోరుకుంటుంది,
వ్యవసాయం మాత్రమే కసాయి వాడికి కూడా వద్దు అనుకుంటుంది.
ఈ పదం భవ్యిష్యత్తు తరాలకు కనుమరుగవుతుంది...!

అని భయపడుతూ  మీ.......సతీష్!!
                                                       

Friday, February 3, 2017

శంఖారావం



పాలకుల నిర్లక్ష్యానికి బాధ పడే క్షణం..
ఆలస్యం గా ఆవేశంతో మొదలైన ప్రజా చైతన్యం..
గణతంత్ర దినమున ఆసన్నమయిన మరో అద్భుత తరునం..
చేయొద్దు ఇది ఒక కుట్ర రాజకీయ పొరాటం..
అవ్వాలి భవిష్యత్తు తరాలకు ఇదే ఆదర్శం..
కాకూడదు సామన్యుడి జీవితానికి ఇది ఒక ఆటంకం..
చట్టాలను గౌరవిద్దాం,
కష్టాలను భరిద్దాం,
తెలుగు జాతి విలువ గొంతెత్తి చాటుదాం,
ఢిల్లీ పాలకుల చెవిలో శంఖారావం పూరిద్దాం..!

.......సతీష్ ధనేకుల!!