నాలుగు చెక్క గోడల మధ్య రెక్కలు విరిగిన జీవితాలు..
నాలుగు చక్రాల మీద పరిగెడుతున్న హడావుడి ప్రయాణాలు..
నాలుగు రోజులు ఆఫీస్ లో పోరాటం, ఐదో రోజునుండి వీకెండ్ కై ఆరాటం..
నాలుగు వాట్సాప్ మెసేజీలు, రెండు ఫేసుబుక్ పోస్టులు ఇవే ప్రేమలు ఆప్యాయతలు..
నాలుగు సార్లు వచ్చే లాంగ్ వీకెండులు అవే పండగలు పబ్బాలు..
నాలుగు డాలర్ల కోసం నా అనుకున్న వారికి దూరంగా నానా అగచాట్లు..
నాలుగు నోర్లు ఊర్లో కలిస్తే సూట్లు బూట్లతో సుఖపడిపోతున్నామనే గుసగుసలు...!
ఏమీ తెలియకపోతే ఏదన్నా తెలుసుకోవాలని ప్రయత్నిస్తాం, ఏదయినా సాధిస్తాం..
అదే ఏదో ఒకటే తెలిస్తే దానితోనే కాలం గడిపేస్తాం, జీవితాన్ని వృధా చేస్తాం...!
మీ..........సతీష్!!
niceeeeeee
ReplyDeleteThank you Swetha
Delete🙏😊
Delete