దేనికోసం ఆశ లేదు..
భవిష్యత్తు అంటే భయం లేదు..
కోరికంటు కాన రాదు ..
కష్టమంటే బెదిరిపోదు..
సుఖాలకు బానిసవదు..
ఓటమికి కృంగిపోదు..
గెలుపుకంటు పొంగిపోదు..
నాది అంటు స్వార్దపడదు..
నీది అంటు దూరమవదు...!
కంటికి కనపడని దానికి ఎప్పుడూ విలువెక్కువే..
గాలి, ప్రేమ ఇలా..
కనిపించే ప్రతీది చులకనే..
మనిషి, ప్రకృతి అలా..
వినపడే వాటికే విలువిస్తాం, కనపడే వాటిని కూడా కప్పేస్తాం.
గొప్పగా ఆలోచిస్తాం కానీ, ఆచరణలో విస్మరిస్తాం...!
భక్తితో తలిస్తే దైవం
భయం తో చూస్తే దయ్యం
జాలిపడితే మానవత్వం
కన్నెర్ర చేస్తే క్రూరత్వం
మనసు పెడితే ప్రేమమ్
అదే మనసు బాధ పడితే ద్వేషం
చేయి అందిస్తే సాయం
నిరాకరిస్తే అన్యాయం
నేను అనుకుంటే స్వార్థం
మనం అనుకుంటే ఆదర్శం....!
మీ ............. సతీష్
Infact it is a fact
ReplyDeleteSuper ra
Thank you Raghu!!
Delete👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
ReplyDeleteరెండవ చరణం అద్బుతం! నీ ఆలోచనలో ఎత్తు, భావాల్లో లోతు చాలా ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి
ReplyDelete