Pages

Monday, October 1, 2012

MASK

మాస్క్ ఇదేదో ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమా అనుకుంటున్నారేమో కాదండి.

మన ప్రభుత్వం సొంతంగా నిర్మించి ఆడిస్తున్న...ఆడించబోతున్న  రియల్ సినిమా ఇది.

మన హైదరాబాద్ మొన్నటివరకు వర్షాలకు తడుస్తూ..వరదలతో మునుగుతూ ఎంత నరకం చుపిచిందో మనకి తెల్సు.

కాని సడన్ గా పది రోజుల్లోనే మయిమరిచిపోఎలా

అయింది. ఈ హైదరాబాద్ ఏనా మొన్నటివరకు చిన్న జల్లు పడినా రోడ్లు అస్తవ్యస్తం గా మారింది అనిపించింది. ఒక్కసారిగా కొత్త ప్రపంచం ల తయారయింది, సారీ తయారవ్వలేదు ఒక మాస్క్

తొడుక్కుని మళ్ళీ సారీ...తొడుక్కోలేదు ఒక మాస్క్ కప్పబడింది అంతే.

నా చిన్నప్పుడు మా ఉరికి ఎవరన్న మంత్రులు వస్తున్నారంటే అప్పటిదాకా

నిద్రపోతున్న పంచాయితీ వాళ్ళు ఒక్కసారిగా లేచి కంపు కొట్టే రోడ్స్ ని

ఊడ్చి తెల్లటి బ్లీచింగ్ పౌడర్ తో నిమ్పేసేవాళ్ళు. మంత్రులు వెళ్ళిపోగానే

ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లు ఎప్పటి రోడ్స్ అప్పట్లానే మళ్ళీ

తయరయ్యేయి. అప్పుడు అనిపిచ్చేది రోజు మంత్రి గారు ఉరికి వస్తే ఎంత

బావుండేది అని. మళ్ళీ ఆ రోజులే గుర్తోస్తు ఉన్నాయ్

ఇప్పుడు హైదరాబాద్ ని చూస్తుంటే మొన్నటి వరకు చిన్న వర్షం పడిందంటే ఆఫీసు నుండి ఇంటికి చేరడానికి 15

నిముషాలు పట్టే రోడ్ కుడా ట్రాఫిక్ తో నిండిపోయి నాలుగు అయిదు గంటలు

పట్టేది.

అప్పుడు ఇంతమంది పిచ్చి జనాలు ఇబ్బందులు పడ్డా ఎ నాయకులు గాని ఏ ప్రభుత్వాలు గాని పట్టిచ్చుకోలేదు.

అప్పుడు నేను అనుకునే వాడ్ని పాపం గవర్నమెంట్ దగ్గర కుడా డబ్బులు లేవేమో లే ఏమి చేస్తార్లే వాళ్ళయినా మనమే

అడ్జస్ట్ అవ్వాలి అని. కాని ఒక్క వీకెండ్ గ్యాప్

తరువాత ఆఫీసు కి వెళ్తుంటే నా కళ్ళని నేనే నమ్మలేక,

మా కాబ్ డ్రైవర్ ని అడిగా.. మనం కరెక్ట్ రూట్ లోనే వేల్తున్నామా అని.

ఎందుకంటే అంతలా మారిపోయి మా ఆఫీసు కి వెళ్ళే రోడ్లు, డ్రయినెజ్ లు.

రెండు రోజుల క్రితం లేని రోడ్లు,

చెట్లు ఎక్కడనుండో తీసుకోచి పెట్టినట్లు   మారిపోయాయి. మరి ఇప్పుడు

ఇంత సడన్ గ ప్రభుత్వాలకు ఇన్ని రోజులు లేని నిధులు

ఎక్కడనుండి ఊడి పడ్డాయా అనిపిచ్చింది. ఏంటి ఈ వింత అని చూస్తే , జీవ

వైవిధ్య సదస్స్( BIO DIVORSITY CONFERNCE ) హైదరాబాద్ లో

జరగబోతుంది అని తెల్సింది.

అంటే ఏవన్నా మీటింగ్స్ జరిగినప్పుడు లేక గొప్ప గొప్ప వాళ్ళు

వచ్చినప్పుడే మన వాళ్లకు ఈ లేని పోనీ హంగులు గుర్తొస్తాయి, కాని రోజు

చస్తూ బ్రతుకుతూ ఇక్కడే ఉంటున్న జనాల ఇబ్బందులు మాత్రం వీళ్ళకు

కనిపించవు. అయినా "మింగటానికి మెతుకు లేదు గాని...మీసాలకు

సంపెంగ నూనె కావాలి " అన్నట్లు, మనకి ఉన్నదీ మనం చుపిచుకోవాలి

కాని సదస్సులు అయ్యే ఈ నాలుగు రోజులు మన హంగు చుపిచుకోవడానికి

ఈ హడావుడి ప్రయత్నాలు ఎందుకో...? జీవాలను పట్టిచ్చుకోవద్దు , బయటి

దేశాల మధ్య మనల్ని మనం తక్కువ చేసుకోవాలి అని నా ఉద్దేశం కాదు.

జీవాలతో పాటు ఇక్కడ రోజు ఇబ్బందులు పడుతున్న ప్రజల పరిస్థితి ని

కూడా ఆలోచించాలి అని నా ఉద్దేశం. ఇవే పనులు ఇంత హడావుడి గా

నాణ్యత లేకుండా చేయడం కన్నా ఎప్పుడో ప్రజలు ఇబ్బందులు

పడుతున్నప్పుడే చేసి ఉంటె అటు ప్రజలకు ఇటు ప్రపంచ దేశాల

ప్రతినిధులకు ఇద్దరికీ ఉపయోగపడేవి గా...!


ముందు "ఇంట గెలిచి, తరువాత రచ్చ గెలవాలి" అని మన పెద్దలు చెప్పారు

కాని. మన ప్రభుత్వాలు ఇటు ఇంట గెలవలేక, అటు రచ్చ గెలవలేక

హడావుడి గ ఏదో చేస్తున్నాము అనే ఈ ముసుగు వేసుకుని ఎన్నాళ్ళు

పబ్బం గడుపుదాము అనుకుంటున్నాయో అర్ధం కావట్లే. ఇక మన పోలీసు

వ్యవస్థ ని ఖయరతాబాద్  గణేష్ నిమజ్జనానికో లేకపోతే ఇలాంటి

సదస్సులకు వచ్చే VIP ల సెక్యూరిటీ కి తప్ప సామాన్యుడికి

ఉపయోగపడేలా తయారు చేయట్లే మన ప్రభుత్వం. మూగ జీవాలను

కాపాడుకోలేక ఫ్లయిఓవర్స్ గోడలపయిన  వాటి బొమ్మలు వేసి

ఆనందపడుతున్న మన ప్రభుత్వాలను చూసి సిగ్గుతో తల

దిన్చుకోవాలనిపిస్తుంది.

"పరువు కోసం పాకులాడకుండా.....ప్రజల అవసరాల కోసం పాటుపడే ప్రభుత్వాలు" కావాలని ఆసిస్తూ......మీ సతీష్.

Friday, July 6, 2012

ఎవరో వస్తారని ఏదో చేస్తారని....

"ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకు మిత్రమా"….. ఈ మాటలు నేను చేసే పనులకి కరెక్ట్ గా సరిపోతాయి అనిపిస్తుంది.ఎప్పుడు నాకు సమస్య వచ్చినా ముందుగ ఎవరు హెల్ప్ చేస్తారా అని ఆలోచిస్తుంట తప్ప నాకు నేను సాల్వ్ చేసుకోలేనా అని ఆలోచించట్లేదు.అలా ఆలోచించక పోవడం వల్ల సమయం వృధా అయి సమస్య ఇంకా పెద్దదిగా మారుతుంది తప్ప సమస్య తీరడం లేదు.అదే ఎవరో హెల్ప్ చేస్తారు అని ఆలోచించే లోపు,నేనే ఏదో ఒకటి చేస్తే ఆ సమస్య తీరడమో లేక సగం బారం తగ్గడమో జరుగుతుంది కదా.మనకెప్పుడు అనిపిస్తుంది నాకే ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి,అందరికి ఎందుకు రావట్లేదు అని.ఒక్కసారి మనం సమస్యలుగా ఫీల్ అవుతున్న వీటినుండి బయటి ప్రపంచం లోకి తొంగి చుస్తే ఎంతోమంది మనకంటే ఎక్కువ సమస్యలతో పోరాడి విజయాలను అందుకుంటున్నారని అర్ధమవుతుంది.అన్ని వనరులు సవ్యం గా ఉండి కుడా మనం ఇంకా చిన్న చిన్న వాటికి కుడా ఏదో బాదలు పడుతున్నట్లు ఫీల్ అవుతాం.ఏ సమస్య వచ్చినా సరే ఆ రోజు దేవుడ్ని "ఈ ఒక్క సమస్య తీర్చు దేవుడా నెక్స్ట్ ఏమయినా పర్లేదు" అని వేడుకుంటాం,ఆ సమస్య మనవల్లనో లేక దేవుని వలనో తీరిపోతుంది.మళ్లీ ఏదో ఒక సమస్య మొదలు,మళ్లీ అదే విన్నపం దేవుడికి,సమస్య తీరకపోతే బాదపడటం ఇదేనా మన జీవితం.


“అన్ని రోజులకు ఒకలానే సిద్దంగా ఉండు ...
మంటల్లో ఇనుముగా ఉన్నప్పుడు దెబ్బలకు ఓర్చుకో...
సమ్మెటగా ఉన్నప్పుడు దెబ్బ మీద దెబ్బ తీయి”.

ఒక్కసారి ఆలోచించండి ఇప్పటివరకు ఏమి సాదించాం మనం....?,ఏమి లేదు కదా, మరెందుకు ఏదో చాలా కష్టాలు పడిపోయి (ప్రపంచం లో మనం తప్ప ఎవరు పడనంత)బాదలు పడుతున్నట్లు ఫీల్ అవ్వడం.మహాత్మా గాంధీ ఒక్కరోజులో సత్యాగ్రహం చేసి స్వాతంత్రం తీసుకొచ్చారా,అబ్దుల్ కలాం ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపి ఉంటారు,మదర్ తెరీసా తన లైఫ్ లో ఎప్పుడన్నా తన సంతోషం గురించి ఆలోచించారా…? ఇలాంటి ఎంతోమంది మహానుబావులు వాళ్ళు ఎన్నో కష్టాలు పడి మనలాంటి ఎంతోమందికి స్వేచ్చ కలిగిన జీవితాన్ని అందించారు.మనం మాత్రం మన పర్సనల్ లైఫ్ ని(ఎవరికి ఉపయోగపడని)సెట్ చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతున్నాం అని ఫీల్ అవుతాం.గొప్పవాళ్ళే కష్టాలను ఫేస్ చేస్తారు మనం చేయట్లేదని నా ఉద్దేశం కాదు.సమస్యలు వచ్చినప్పుడే ధైర్యం గా ఉండాలి మన సహనాన్ని కోల్పోకూడదు అలాంటి వాడే విజయాన్ని పొందగలడు.

”దేవుడు నిన్ను నమ్మి విజయాన్ని ఇవ్వబోయే ముందు నువ్వు ఆ పెద్ద బహుమతిని నిలపెట్టుకోగలవని నిరూపించుకోవాలి”కదా....!

ఎన్నో లక్షలమంది వెంకటేశ్వర స్వామిని చూడటానికి వస్తుంటే ఈర్షతో స్వామి ముందు ఉన్న ఒక గడప స్వామి తో “స్వామీ నువ్వు నేను ఇదే కొండమీద పుట్టాము,ఒకే శిల్పి చేత చేయబడ్డాము కాని రోజు నిన్నేమో లక్షలమంది చేతులెత్తి మొక్కుతారు,నన్నేమో కాలితో తొక్కుతారు,ఎందుకింత వ్యత్యాసం"అని అడిగింది.అప్పుడు స్వామి “నువ్వు గడపగా మారడానికి శిల్పి ఉలి తో అటు ఒక దెబ్బ ఇటు ఒక దెబ్బ రెండు దెబ్బలు వేస్తె గడపగా మారావు,అదే శిల్పి నన్ను మలచడానికి కొన్ని వేల దెబ్బలు ఉలి తో వేసాడు,అన్ని దెబ్బలకు ఓర్చుకున్నాను కాబట్టే అంతమంది నన్ను పూజిస్తున్నారు”అని చెప్పాడట.ఈ స్టొరీ పాతది అయినా దాంట్లో జీవిత సత్యం దాగి ఉంది.సమస్యలు కలకాలం ఉండవు,ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు వచ్చాయ్ ఎన్నో పోయాయి,ఇవి కూడా పోతాయి.ముందు మనలో ఉన్న లోపాలేంటి అని తెల్సుకొని వాటిని సరిదిద్దుకో కల్గి,ధైర్యం గా ఎదురు తిరిగి పోరాడితే ఏ సమస్య మనల్ని ఏమి చేయలేదు.”ఇతరుల్ని అర్ధం చేసుకున్న వాడు విజ్ఞాని,కాని తనని తను తెల్సుకున్న వాడే వివేకి.వివేకం లేని విజ్ఞానం శూన్యం".

"దిగులు పడకు,చిర్రుబుర్రులాడకు,నిస్పృహ చెందకు
మన అవకాసాలిప్పుడే మొదలయ్యాయి,గుర్తుంచుకో,గొప్ప పనులింక మొదలవ లేదు గొప్ప ఉద్యమం ఇంకా పూర్తవలేదు".

రేపు తొలిగిపోయే సమస్యలకోసం ఈ రోజుని బాదగా మార్చుకోవద్దని,ఇది మీ సమస్యలను తీర్చక పోఇనా మీ సమస్యలను ఎదుర్కోవడానికి కొద్దిగా ధైర్యాన్ని ఇస్తుంది అని ఆసిస్తూ…………


Your’s…………………………………సతీష్.


Monday, July 2, 2012

వృక్షో రక్షతి రక్షితః

నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజులు.కాలేజ్ కి వెళ్ళగానే ఈ రోజు జన్మభూమి కార్యక్రమం ఉంది అన్నారు.మా అందరికి చాలా సంతోషం వేసింది.అస్సలు జన్మభూమి కార్యక్రమం అంటే ఏంటో మాకు తెలీదు,అందులో అస్సలేమి చేస్తారో అంతకన్నా తెలీదు.కాని క్లాసు లు జరగవు ఆ రోజు అనే చిన్న సంతోషం అంతే.అందరికి మొక్కలు ఇచ్చి రోడ్ పక్కనే నాటమని మా మేడం చెప్పారు,అప్పుడు మాకు క్లాస్సేస్ వినడం కంటే ఈ పనేమీ పెద్ద కష్టం గ కనిపిచ్చలె,అందరం మొక్కలు నాటుకుంటూ వెళ్ళాం.ఆ రోజు అలా గడిచిపోయింది.ఆ రోజునుండి మేము నాటిన మొక్కల్ని రోజు చూస్తూ అవి పెరుగుతుంటే చాలా ఆనందం గ అనిపిచ్చింది…అలా 1 మంత్ గడిచిన తరువాత గవర్నమెంట్ వారి పుక్లయినేర్ రోడ్ సైడ్ పయప్ లైన్ అంటూ కాలువలు తవ్వుకుంటూ ఈ మొక్కలను కూడా తవ్వుతూ పోయింది.మొక్కలు నాటిచ్చింది గవర్నమెంట్,మొక్కలను పికుతుంది కూడా గవర్నమెంటే.అస్సలేమి జర్గుతుందో తెలుసుకునే అంత,తెలుసుకోవాల్సిన అంత తెలివి కాని అప్పుడు మాకు లేదు.కాని ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తుంది ఆ రోజు మేము నాటిన మొక్కలు ఉండి ఉంటె ఈ రోజు అవి మహా వ్రుక్షాలై ఉండేవి.

మనం ఒక విషయాన్ని తెల్సుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది.“జోస్ థామస్”అనే వ్యక్తి చాలా కాలం క్రితం నీలగిరి కొండల మీద ఒక్కడే 10 వేల మొక్కలు నాటాడట,అప్పట్లో అతన్ని "మాడ్ థామస్"అనే వారట,20 సంవత్సరాల తరువాత అవే మొక్కలు ఇప్పుడు మనందరం లైఫ్ లో ఒక్కసారన్న పీస్ఫుల్ గ వెళ్లి చూడాలనుకునే ఊటీ లా ఫేమస్ అయ్యాయి.నేను MBA జాయిన్ అయి కాలేజ్ కి వెళ్తుంటే రోడ్ పక్కన పూల మొక్కల వాళ్ళ దగ్గర ఒక చిన్న ఎల్లో ఫ్లవేర్స్ ఉండే మొక్క చూసాను,అది చాలా నచ్చి ఇంటికి తీసుకొచ్చి నాటాను,రోజు దాన్ని చాలా జాగర్తగా వాటర్ పోసి పెంచుతున్దేవాడ్ని ఒక రోజు సడెన్గా మా లేగ దూడ హాఫ్ మొక్కని తినేసింది(పాపం దానికేమి తెల్సు ఆకలేసింది దానికి).కాలేజ్ నుండి ఇంటికి రాగానే దాన్ని చూడగానే చాలా బాధ వేసింది లేగ ని చూడగానే కోపం వేసింది,కాని ఏమి చేయలేము మళ్లీ దాన్ని జాగర్త గ పెంచాను,2years లో అది చాలా పెద్దగ అయింది.ఇంటికే అందం వచ్చింది ఈ లోపు నేను జాబ్ అంటూ హైదరాబాద్ వచ్చా,కొన్ని రోజుల తరువాత ఇంటికి వెళ్లాను,ఇంటిముందు చుస్తే ఆ మొక్క లేదు కనీసం దాని ఆనవాళ్ళు కూడా లేవు.వెంటనే మా పెద్దమ్మని అరిచా"పెద్దమ్మ మొక్క ఏమయింది"అని,పిన్ని మొక్కని నరికిచ్చేసింది ఆ మొక్క పువ్వులన్నీ గుమ్మం లో చెత్తలా పడుతున్నై అని అంది.ఒక్కసారి నాకు చాలా బాద వేసింది 4years కష్టపడి పెంచుకున్న మొక్కని నరికేసారే అని,ఎవర్ని ఎమనలేకపోయాను.ఇదంతా సిల్లీ విషయం లా ఉంది కదా….కాని ఆలోచిస్తే నాకర్ధం అయింది మనం ఇష్టపడి పెంచుకుంటే ఆ మొక్క మన జీవితం లో ఒక ఫ్రెండ్ అవుతుందని అప్పుడు అర్ధమయింది.
మనం చిన్నప్పుడు ఒక కత చదువుకొని ఉంటాము "ఒక తాత రోడ్ పక్కన ఒక మామిడి మొక్క నాతుతుంటాడు,రోడ్ పక్కన వెళ్ళే వ్యక్తి తాత తో “తాత ఇంకా నువ్వు మా అంతే రెండు,మూడేళ్ళు బ్రతుకుతావేమో,కాని మామిడి మొక్క పెరిగి కాయలు కాయలంటే 10 సంవత్సరాలు పడుతుంది,నీకెందుకు అంత ఆశ"అన్నాడు.అప్పుడు తాత ”నేను తినక పోఇన మా మనవళ్ళు లేదా ఈ రోడ్ మీద వెళ్ళే ని లాంటి బాటసారులన్న రేపు తింటారు కదా”అన్నాడు".ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన రాష్ట్రం లో సిటీ లో రోజుకి 2 గంటలు,పల్లెటూర్లలో రోజుకి 8 గంటలు కర్రెంట్ కోతలు రావడం.టైం కి వర్షాలు లేక రైతులు పంటలను నష్టపోవడం,సిటీ లో 2 డేస్ కి ఒకసారి డ్రింకింగ్ వాటర్ రావడం వీటన్నిటికి కారణం రోజు రోజు కి అడువులు తగ్గి పోవడం.మన దేశం లో పులుల సంక్య 1100 మాత్రమె,అంతే మన జాతీయ జంతువులూ 100 కోట్ల జనాబాలో 1100 పులులు మాత్రమె ఉన్నాయ్ అంటే మనకెంత సిగ్గు చేటు.భవిష్యత్తు లో మన పిల్లలికి పులి అంటే ఇలా ఉండేది అని ఏ హాలీవుడ్ సినిమా కో తీసుకెళ్ళి చూపిచ్చే రోజు రాబోతుంది త్వరలోనే.దీనంతటికి కారణం మనలో చెట్లను కాపాడాలి,చెట్లను నాటాలి అనే చిన్న ఆలోచన లేకపోవడమే.

మనం అనుకోవచ్చు తినడానికే టైం సరిపోని ఈ బిజీ లైఫ్ లో ఇంకా మొక్కల గురించి ఆలోచించడమ అని,మనం ఇప్పుడు మొక్కల గురించి ఆలోచించకపోతే మన పిల్లలకి కనీసం తాగటానికి మంచి నీళ్ళు తినడానికి తిండిని కూడా సరిగా అందించలేము.మనం కనీసం మన పుట్టిన రోజు అనేది సంవత్సరం లో ఒక్క రోజే వస్తుంది కదా ఆ ఒక్క రోజు ఒక మొక్క నాటి దాన్ని కాపాడితే,అలా ప్రతి రోజు ఏదో ఒక వ్యక్తి పుట్టిన రోజు ఉంటూనే ఉంటుంది ప్రతి వ్యక్తి అలా నాటితే రోజుకి వందల వేల మొక్కలు నాటొచ్చు,అవి మన భవిష్యత్తు కు ఎంతో ఉపయోగ పడొచ్చు.మనం ఒక్క రోజు చేసే పని మన జీవితాంతం ఉపయోగపడుతుంది కదా.”వృక్షో రక్షతి రక్షితః”మనం వృక్షాలను రక్షిస్తే అవి మనలను రక్షిస్తాయి.ఏ మనిషి ఉపయోగం లేకుండా ఏ పని చేసే రోజులు కావు ఇవి,మొక్కలు నాటడం వల్ల కూడా చాలా ఉపయోగాలున్నై కదా మనమేమి ఉరికే చేయట్లే కదా మనకోసం మన పిల్లల కోసం అని ఆలోచిద్దాం........కొంతమంది కి ఇది సిల్లీ గ ఉండొచ్చు,కాని దీని గురించి కాస్త ఆలోచించిన వాళ్లకు అర్ధమవుతుందని ఆసిస్తూ....సంవత్సరం లో ఒక్క మొక్కయినా నాటదామా.ఈ సారి మన బర్తడే కి కేకు తో పాటు ఒక మొక్కని కూడా తెప్పించుకుందాం.


Your 's ……………………………………………..సతీష్



Sunday, July 1, 2012

తాగని వాడు గాడిద....

ఒకప్పుడు పురాణాలలో చదువుకున్నాము "దేవతలు అసురులు కలిసి సముద్రాన్ని చిలికి చిలికి అమృతం కోసం పోటి పడ్డారని". మల్లి ఈ కలికాలం లో చూస్తున్నాము "మద్యం కోసం ప్రబుత్వాలు ప్రజలు కొట్టుకు చస్తున్నారని". ఒకప్పుడు మద్యం వద్దు అని ప్రజలు, మద్యం కావాలని ప్రభుత్వాలు కొట్టుకునే వాళ్ళు కాని ఇప్పుడు ఇద్దరూ కలిసి దానికోసమే కొట్టుకు చస్తున్నారు. ఇక మన పురాణం లోకి వెళ్తే ఆకరికి దేవతలు ఏదో మాయ చేసి అసురులను పిచ్చోల్లని చేసి వాళ్లకి హ్యాండ్ ఇచ్చి దేవతలే అమృతాన్ని కొట్టేసారు. అలానే ఇప్పుడు కూడా ఓపెన్ లాటరీ ద్వారా మద్యం టెండర్స్ అని చెప్పి ప్రజలను ఊరించి ఆకరికి మద్యం నిషేదించాలి అని చెప్పే మన ఆడవారితోనే మద్యం టెండర్స్ వేసేలా చేసారు. ఈ పిచ్చి జనాలను కొట్టుకు చచ్చేలా చేసి లాస్ట్ కి మన నాయకుల బినామీలకే టెండర్లు వచ్చేలా చేసుకున్నారు. సో మద్యం టెండర్స్ దక్కినందుకు నాయకులను దేవతలు అందామా లేక కొట్టుకు చచ్చి ఆబాసు పాలు అయినందుకు ఈ పిచ్చి జనాలను అసురులు అందామా...?

మన వాళ్ళు మందు కోసం ఎంత దిగాజారుతున్నారు అంటే ఇల్లు గుల్లా..వొల్లు గుల్లా అయినా పర్లేదు అన్నట్లు తయారయ్యారు.ఒకప్పుడు తాగి తాగి రోగం వచ్చి చస్తామేమో అనే భయమన్న ఉండేది, కాని ఇప్పుడు పరిస్తితి అలా లేదు..జబ్బు ఉన్న లేకపోయినా లక్షల బిల్లు వేసి(మనకి కాదులెండి మన ప్రభుత్వానికి) ఏదో ఒక ట్రీట్మెంట్(ఆరోగ్య శ్రీ లో) చేసే హాస్పిటల్స్ చాలానే ఉన్నాయ్ గా...సో తాగినా త్వరగా పోములే అన్న ధైర్యం బాగా వచ్చేసింది.(మందు అలవాటు ఉన్నోడికి ఆరోగ్య శ్రీ పథకం వర్తించదు అంటే ఎలా ఉంటుందో...!)

ఉగాండా లాంటి కొన్ని వెనకపడ్డ దేశాలలో తిండి దొరక్క ప్రజలు షాప్స్ మీద పడి లూటీ చేస్తుంటారు అని మనం అప్పుడప్పుడు చదువుతుంటాము..కాని ఈ రోజు మన దేశం లో మన రాష్ట్రం లో నెల్లూరు లో మన వాళ్ళు మద్యం దుకాణాల మీద పడి ఎవరికీ దొరికినన్ని వాళ్ళు మద్యం బాటిల్స్ ని ఎత్తుకెళ్ళారు ఆని టీవీ లలో చూపిస్తుంటే మనం ఎంత దిగాజారిపోతున్నామో అర్ధమవుతుంది. ఒకప్పుడు ఏ రాజకీయ పార్టీ నో ఏ రాజకీయ నాయకుడో సాసిస్తున్నాడు మనల్ని అనుకునే వాళ్ళం కాని ఇప్పుడు మనల్ని మన ప్రభుత్వాలను మద్యం అనే మహమ్మారి శాసించే స్టేజి కి దిగాజారాము.

నా చిన్నప్పుడు ఎవరన్నా మందు తాగుతాను అని చెప్పుకోడానికి సిగ్గుపడే వాళ్ళు, కాని ఇప్పుడు మందు అలవాటు లేదు అని చెప్పాలంటే సిగ్గుపడాల్సిన పరిస్తితికి మన సమాజం వచ్చింది. 18 సంవత్సరాల లోపు వాడికి మందు అమ్మొద్దు అని చెప్తారు గాని.. అస్సలు మందు ఎందుకు అని చెప్పరే...? మందు తాగి డ్రైవ్ చేస్తే నేరం అంటారు గాని..అస్సలు బార్ షాప్స్ కి పార్కింగ్ ఎందుకు పెడుతున్నారో చూడరే...? మందు నిషేదిస్తే మన ప్రభుత్వ ఆర్దిక వ్యవస్థ పడిపోతుంది అని ఆలోచిస్తారు తప్ప...ఈ మందు వల్ల ఎన్ని కుటుంబాల ఆర్దిక వ్యవస్థ చిన్నాబిన్నం అవుతుందో చూడరే...?

ఆర్దిక వ్యవస్థను చక్కపెట్టుకోడం చేతకాక అడ్డ దారుల మీద ఆధారపడుతున్న ఈ చేతకాని ప్రభుత్వాలకు సిగ్గు రాదు....వాళ్ళు చూపే అడ్డ దారుల్లో నడుస్తున్న మనకు అస్సలే బుద్ధి రాదు.

తాగని వాడు గాడిద అనే సామెత పోయే కాలం ఎప్పుడు వస్తున్దో అని వేచి చూస్తూ.....మీ సతీష్.

Wednesday, June 20, 2012

ఊ కొడతారా ఉలిక్కి పడతారా..


ప్రాణం పోయాక పరువు కాపాడుకోవడానికి ఉలిక్కి పడి లేస్తుంది మన ప్రభుత్వం............
నడి రోడ్ మీద మన ప్రాణాలు ఈ రోజే కొత్తగా రక్తమోడుతున్నాయా.........?
హైదరాబాద్ లో వర్షాలు కొత్తగా కురుస్తున్నాయా.......?


ఒక షిర్డీ బస్సు ప్రమాదం మన ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేసినట్లుంది. ఈ రోజే కొత్తగా మన అధికారులకు నియమ నిబంధనలు గుర్తుకొచ్చాయి... ఒక్క రోజులో 45 బస్సులు సీజ్ చేసారు అని న్యూస్ లో చూసి మన అధికారులు ఎంత బాగా పనిచేస్తున్నారో అని హ్యాపీ గా ఫీల్ అవ్వాలో లేక ఇన్ని రోజులు ఇన్ని బస్సులు నియమ నిబందనలకు విరుద్దం గా మన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా ఎవరూ పట్టిచ్చుకోలేదని బాధ పడాలో అర్ధం కావట్లే...! ఖమ్మం జిల్లాలో మూడు నెలల క్రితం స్కూల్ బస్సు ప్రమాదానికి గురయినప్పుడు రెండు రోజులు హడావుడి గా స్కూల్ బస్సుల మీద చర్యలు ప్రకటిచ్చింది మన ప్రభుత్వం. ఇక నిన్న జరిగిన షిర్డీ బస్సు ప్రమాదానికి ఉలిక్కి పడి ప్రయివేట్ ట్రావెల్స్ మీద దాడులు మొదలు పెట్టారు. అంటే విద్యార్దులు ఆత్మహత్య చేసుకున్నప్పుడే మన నాయకులకి తెలంగాణా గుర్తోచినట్లు రోడ్ మీద ఆక్సిడెంట్ లో ఎవరో ఒకరు చనిపోయిన రోజే మన ప్రభుత్వానికి మన అధికారులకు చట్టాలు గుర్తోస్తాయేమో......

ఇక మన మీడియా సోదరులకు ఒక వారం రోజులు పండగ..మన లైఫ్ టైం తగ్గుతుంటే వాళ్ళ TRP రేటింగ్ పెరుగుతుంది అన్నట్లు చేస్తున్నారు వీళ్ళు. డేంజర్ జర్నీ, బస్సు ఎక్కితే అంతేనా..? ఇలాంటి టైటిల్స్ పెట్టి కొన్ని రోజులు టైం పాస్ ప్రోగ్రామ్స్ చేసి తరువాత పనికి రాణి చెత్త లా పక్కన పడేస్తారు. పెద్దలు చెప్పినట్లు మన బంగారం మంచిదయితే గోల్డ్ స్మిత్ ని అనడం ఎందుకు...!  మన ప్రబుత్వ  బస్సులను ప్రజలకు అనుకూలంగా నడిపితే ఈ ప్రైవేటు యాజమాన్యాలు ఎందుకు పుట్టుకొస్తాయి...ఆక్సిడెంట్  లు అయ్యే అంత బిజీ ఎందుకు అవుతాయి..


ఇంక మన GHMC వాళ్ళ దగ్గరికి వస్తే... ఈ సంవత్సరమే కొత్తగా హైదరాబాద్ లో వర్షాలు వచ్చాయా...! అన్నట్లు చేస్తున్నారు మన GHMC వాళ్ళు. ఒక్క రోజు వర్షం కురిస్తేనే మన ట్రాఫిక్ అస్తవ్యస్తం గా తయారయితే...అదే ఒక పది రోజులు వరసగా కురిస్తే మన పరిస్తితి ఏంటి...! ఎప్పటికప్పుడు పాక్షిక చర్యలు చేపట్టి వర్షాకాలం అవ్వగానే చేతులు దులుపుకుంటారు మన అధికారులు. లాస్ట్ ఇయర్ మనం ఈ వర్షాల వలన ఎంత ఇబ్బందులు ఎదుర్కున్నామో మన ప్రభుత్వాలకు గుర్తు లేదా...! మల్లి వర్షాకాలం వచ్చింది కాని ఎటువంటి మార్పులు లేవు ఏ చర్యలు లేవు. వీళ్ళ లాంటి వాడే ఒకడు "వర్షం పడ్డ రోజే ఇల్లు కట్టాలి అంటాడట..తెల్లారితే మళ్ళీ మామూలే"  ఇలా ఉంది మన GHMC పని కూడా..


ప్రబుత్వ పరువు పోతే దాన్ని మల్లి వెనక్కి తీసుకు రావొచ్చు కాని..ప్రజల ప్రాణాలు పోతే మాత్రం తీసుకు రాలేము అని ఈ చేతకాని ప్రబుత్వాన్ని, ఈ చేతకాని అధికారులను హెచ్చరిస్తూ...ఊ కొడతారో లేక ఉలిక్కి పడి లేచి సరయిన చర్యలు తీసుకుంటారని ఆసిస్తూ.......... మీ సతీష్                                                                        

Saturday, June 16, 2012

ఎవడ్రా మల్లీ ఎన్నికలు పెట్టింది...


               
 
 
పబ్లిక్ నమ్మనందుకు చంద్రబాబు నీళ్ళు లేని బావిలో దూకడం మంచిది.....
అలానే జగన్ ని నమ్మినందుకు పబ్లిక్ వెళ్లి అదే బావిలో దూకడం మంచిది.
 
ఎవడు దోచుకోలేదని...వీడు దోచుకుంటే తప్పా....(పిచ్చి జనాల అభిప్రాయం)
మనం మారము మన నాయకులను అస్సలే మారనివ్వము.
 
 
నీ భలం చూపిచ్చుకోడానికి కొండల్ని బండల్ని తవ్వు...అంతే గాని ఎలక్షన్స్ పేరుతో జనాల గుండెలను తవ్వకు.
 
ఒకప్పుడు ఎన్నికలు అయిదు సంవత్సరాలకు ఒకసారి వచ్చేవి...కాని ఇప్పుడు ప్రతి పండగ కి ఒకసారి వస్తున్నాయి.
 
 
ఎన్నికల ముందు నాయకుడు ప్రతి రోజు నీ ముందే ఉంటాడు. ఎన్నికల తరువాత గూగుల్ సెర్చ్ లో కూడా దొరకడు.
 
 
బిసినెస్ లో లాభం కోసం టెండర్లు వేస్తారు....అలానే ఎన్నికలలో గెలవడానికి డబ్బులు పంచుతారు....
అధికారం = బిసినెస్
 
 
ఎన్నికల ముందు తమ జేబుల్లో నుండి పంచడానికి మన నాయకులకు మనసు వస్తుంది కాని...
గెలిచిన తరువాత మన డబ్బులు(ప్రబుత్వ ఖజానా అంటే ప్రజలదే గా..) మనకి ఇవ్వడానికి మాత్రం చేతులు రావు.
 
 
గొర్రె కసాయోడ్ని నమ్మడం...మనం మన నాయకులను నమ్మడం తప్పదేమో......
 
 
 
బర్రె ఉన్నది పాలు ఇవ్వదానికి........మన బుర్ర ఉన్నది అప్పుడప్పుడు కాస్త ఆలోచించడానికి అని ఆసిస్తూ........మీ సతీష్.
 
 
 
 
 
 
 



Friday, March 30, 2012

మనసుతో...కాసేపు...(ఒంటరిగా..)



 మనసు ఒంటరవుతుంది…..


మనుషులకు దూరం అవ్వమంటుంది….

గుండె ఉప్పెనవుతుంది……

మాట పెదవి దాటి రానంటుంది….

కాలం కదిలిపోతుంది….

మనసు మూగపోతుంది…..

చెరిగిపోని చూపులు అన్ని…

తరగిపోని కలలు కొన్ని….

నువ్వు లేని జీవితం గుర్తు కూడా లేదని….

ఈ క్షణం ఇలా గడిచిపోని…

మౌనంగా కాలం వడిలో నన్ను కరిగిపోని…..

మీ.........సతీష్

Wednesday, March 21, 2012

రెక్కలొచ్చిన పక్షులు

కనపడని దైవం ముక్యమా లేక ఎదురుగా ఉన్న మనిషి ముఖ్యమా.. అని ఎవర్నన్నా అడిగితే సమాధానం చెప్పడం కొంచెం కష్టమే…ఎందుకంటే మనిషి ముఖ్యం అంటే ఎక్కడ దేవుడు సపిస్తాడో అని భయం. అదే దేవుడే ముఖ్యం అంటే ఎ మనిషి రేపు ఎక్కడ హెల్ప్ చేయడో అని భయం. ఈ భయంతోనే మనిషి ప్రేమ అనే ఒక ముసుగుని వేసుకొని బ్రతికేస్తున్నాడు. నిజం చెప్పాలంటే ప్రేమ అనేది భయం వలెనే పుట్టుకోస్తుందేమో.. భయం లేని చోట ప్రేమ ఉండటం కష్టమేనేమో.

నేను మొన్న ఒక ఊరు వెళ్లాను…ఒకప్పుడు ఆ ఊరు చాలా ప్రశాంతం గా స్వచ్చమైన పిల్ల గాలిలా అనిపిచ్చేది, ఎప్పుడు కాలి దొరికినా అక్కడికే వెళ్ళాలి అనిపిచ్చేది కాని ఇప్పుడు అదే ఊరు  ఒక ఎందిపోఇన మోడులా, రాలిపోఇన పండులా తయారైంది.. దీనికి మూల కారణం డబ్బే... ఒకప్పుడు ఆ ఉరిలో ఎవరికీ వారు తమ రెక్కల కష్టంతో కష్టపడుతూ తమకున్నంతలో వాళ్ళు సుఖం గా ఉండే వాళ్ళు. అలా సాఫీ గా సాగుతున్న వాళ్ళ జీవితాలలోకి ఎప్పుడైతే ప్రభుత్వం నుండి తమ భుములకి నష్టపరిహారం లక్షల్లో వస్తుందని తెల్సిందో ఆ రోజు నుండే ఆ ఉరి పతనం మొదలయింది.

రూపాయి రూపాయి నువ్వేమి చేస్తావే అని అడిగితే…తండ్రి కొడుకుల మధ్య, అన్నదమ్ముల మధ్య, బార్య బర్తల మధ్య చిచ్చు పెడతా అని చెప్పిందట అలానే.. వీళ్ళ భూములకు వచ్చిన నష్టపరిహారం ఆ ఉరిలో కుటుంబాల మధ్య చిచ్చు పెట్టింది..నష్ట పరిహారం వచ్చింది ఒకటి రెండు లక్షలలోనే కాని,వీల్లనుండి వారి భూములను దూరం చేసింది మాత్రం శాశ్వతంగా..ఒకేసారి నాలుగు అయిదు లక్షలు ఎప్పుడు చూడని వీళ్ళకు అన్ని డబ్బులు ఒకేసారి చూసే సరికి చేతులు పోయి రెక్కలు వచ్చాయి…అస్సలు ఆ భూములు స్మపాదించింది వీళ్ళ తాతలు తల్లిదండ్రులు, కాని వాళ్ళు ఇప్పుడు కాస్త మెత్తబడటం వలన కొడుకులకి కోడళ్ళకి భారంగా తయారయ్యారు. ఎలాగు భూములు పోయి నాలుగు అయిదు లక్షల క్యాష్ చేతిలోకి వచ్చాయి.. ఇక ఈ ముసలి డొక్కులతో పనేముంది అనుకున్నారో ఏమో ఒక్కొకరు వాళ్ళ వాళ్ళ తల్లితండ్రులను చూడటం మానేసి..కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఈ వయసులో వాళ్ళని గాలికి వదిలేసి తిరుగుతున్నారు.

అన్ని ఉన్న ఆకు అనిగిమనిగి ఉంటుంది,ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అని మన పెద్దలు చెప్పినట్లు..కన్నతల్లి తండ్రులను, తోడపుట్టిన వాళ్ళను మరచిపోయ్ మిడి మిడి జ్ఞానంతో ఎగిరెగిరి పడుతున్నారు. పల్లెటూర్లే మనదేశానికి పట్టుకొమ్మలు అని గాంధీ గారు చెప్పారు, కాని ఇప్పుడు అవే పల్లెటూర్లు గుది బండలుగా తయారవుతున్నాయి అనడంలో ఆశ్చర్యమేమీ లేదు..డబ్బు ,స్వార్ధం అనే మహమ్మారి పల్లెటూర్లకు ఎప్పుడో పాకిపోఇంది.ఆకరికి పల్లెటూర్లలో కూడా ఓల్డ్ ఏజ్ హోం లు కట్టాల్సిన పరిస్థితి వస్తుందంటే పరిస్థితి అలా ఉందో అర్ధం చేసుకోవచ్చు..

మనం ఎక్కడినుండి వచ్చాము ఎలాంటి పరిస్థుతల నుండి వచ్చాము అన్నది,మన గతం అన్నది మర్చిపొఇ మన అన్న వాళ్ళను దూరం చేసుకోడం ఎంత వరకు కరెక్ట్ ..మన పిల్లలను పెద్ద పెద్ద స్కూల్స్ లో చదివించాలి కాస్ట్లీ గా పెంచాలి అనుకునే మనం మన తల్లితండ్రుల ను మాత్రా, పట్టిచుకోము. ఈ వయసులో వాళ్ళు మన నుండి ఏ సంపదో ఆశించారు ఒక చిన్న చల్లని పలకరింపే వాళ్లకి ఎంతో ఆనందానిస్తుంది …మనకి ఇంత చేసిన వాళ్లకి ఈ చిన్న చిన్న కోరికలను ఈ వయసులో వాళ్లకు తీర్చలేకపోతే ఇక మనం వాళ్లకి చేసేదేముంది….ఒక్కసారి ఆలోచించండి రేపు మన పిల్లలు మనల్ని ఇలానే చూస్తే మనమేవరితో చెప్పుకోవాలి….







ఒక్కసారి మనసుపెట్టి ఆలోచిస్తారని ఆసిస్తూ……………మీ సతీష్.



Wednesday, March 7, 2012

నేను నాకు తెలుసా....


 ఒకప్పుడు…అనగా బాగా బ్రతికిన రోజుల్లో(ఏమి ఆలోచించకుండా ఉన్న రోజులు అవి), ఎదుటి వాడ్ని అర్ధం చేసుకోవడం చాలా కష్టం అనుకునే వాడ్ని. కాని ఇప్పుడు అర్దమవ్తుంది…అనగా మనసు చంప్కుని బ్రతుకుతున్న ఈ రోజుల్లో.. నన్ను నేను అర్ధం చేసుకోవడమే కష్టం అని అర్దమవ్తుంది. రోబో మూవీ లో ఒక డైలాగు ఉంటుంది  “ఎప్పుడయితే  నేను మనిషి లా  ఆలోచించడం మొదలుపెట్టానో ..అప్పుడే  నేను ఇలా నాసనమయ్యాను” అని రోబో చెప్తుంది. నిజమే ఎంత ఎక్కువగా ఆలోచిస్తే లైఫ్ లో అన్ని చిరాకులు ఉంటాయి… అసలే ఆలోచనలు ఈ లోపు సపోర్ట్ ప్రాజెక్ట్ లో కి వచ్చి పడ్డాను.. ఇంకా అప్పటి నుండి నా లైఫ్ కే ఒక సపోర్ట్ లేకుండా పోయింది ఈ షిఫ్ట్ లు వర్క్ తో…


చిన్నప్పుడు అనుకునే వాడ్ని ఒక 25yrs దాటితే మన లైఫ్ కి మనమే హీరో అని, పూరి జగన్నాథ్ చెప్పినట్లు ఎవడి లైఫ్ లో వాడే హీరో అని(మహేష్  బాబు హీరో అయినా కాని మహేష్ ని డైరెక్ట్ చేసింది పూరి నే గా...!) అలానే మన లైఫ్ కి మనమే హీరో అయినా కానీ, మనకిష్టం వచ్చినట్లు మనం ఉండలేము కదా ..25yrs దాటిన తరువాత తెల్సింది ,మన లైఫ్ కి మనం హీరో కాదు... అప్పట్నుండి మనమే మన లైఫ్ కి విలన్ అని. ఈ టైం లోనే ఎన్నో ఆలోచనలు ఎన్నో ఆశయాలు. మనం అనుకున్నవి చేయలేము,చేస్తున్నవి ఇష్టం లేకున్నా చేయక తప్పదు…


ఒకప్పుడు ఇలా అనుకునే వాడ్ని..అలా అనుకునే వాడ్ని అంటున్నాను…కానీ ఇప్పుడు అనుకుంటున్నాను నేను నాకు అర్ధం కావట్లేదు అని..నిజం చెప్పాలంటే ఇప్పుడు కుడా ఏమి ఆలోచిస్తున్నానో ఏమి చేస్తున్నానో తెలీట్లేదు …నన్ను నేను అర్ధం చేసుకొనే టైం నాకు ఉండట్లేదు…ఒకవేళ ఉన్నా నేను నాకు అర్ధం కావట్లేదు…








నేను నాకే అర్ధం కానప్పుడు నేను రాసిన ఈ బ్లాగ్ ఇంకా మీకేమి అర్దమవుతున్దిలే…….!

నా ఆవేదనని అర్ధం చేసుకుంటారని...అర్ధం కాకపోయినా అడ్జస్ట్ అవుతారని  ఆసిస్తూ .........మీ సతీష్