Pages

Saturday, June 16, 2012

ఎవడ్రా మల్లీ ఎన్నికలు పెట్టింది...


               
 
 
పబ్లిక్ నమ్మనందుకు చంద్రబాబు నీళ్ళు లేని బావిలో దూకడం మంచిది.....
అలానే జగన్ ని నమ్మినందుకు పబ్లిక్ వెళ్లి అదే బావిలో దూకడం మంచిది.
 
ఎవడు దోచుకోలేదని...వీడు దోచుకుంటే తప్పా....(పిచ్చి జనాల అభిప్రాయం)
మనం మారము మన నాయకులను అస్సలే మారనివ్వము.
 
 
నీ భలం చూపిచ్చుకోడానికి కొండల్ని బండల్ని తవ్వు...అంతే గాని ఎలక్షన్స్ పేరుతో జనాల గుండెలను తవ్వకు.
 
ఒకప్పుడు ఎన్నికలు అయిదు సంవత్సరాలకు ఒకసారి వచ్చేవి...కాని ఇప్పుడు ప్రతి పండగ కి ఒకసారి వస్తున్నాయి.
 
 
ఎన్నికల ముందు నాయకుడు ప్రతి రోజు నీ ముందే ఉంటాడు. ఎన్నికల తరువాత గూగుల్ సెర్చ్ లో కూడా దొరకడు.
 
 
బిసినెస్ లో లాభం కోసం టెండర్లు వేస్తారు....అలానే ఎన్నికలలో గెలవడానికి డబ్బులు పంచుతారు....
అధికారం = బిసినెస్
 
 
ఎన్నికల ముందు తమ జేబుల్లో నుండి పంచడానికి మన నాయకులకు మనసు వస్తుంది కాని...
గెలిచిన తరువాత మన డబ్బులు(ప్రబుత్వ ఖజానా అంటే ప్రజలదే గా..) మనకి ఇవ్వడానికి మాత్రం చేతులు రావు.
 
 
గొర్రె కసాయోడ్ని నమ్మడం...మనం మన నాయకులను నమ్మడం తప్పదేమో......
 
 
 
బర్రె ఉన్నది పాలు ఇవ్వదానికి........మన బుర్ర ఉన్నది అప్పుడప్పుడు కాస్త ఆలోచించడానికి అని ఆసిస్తూ........మీ సతీష్.
 
 
 
 
 
 
 



6 comments:

  1. ఎన్నికల రిజల్ట్స్ వచ్చినప్పట్నుండి శంకర్ దాదా లో పరేష్ రావెల్ లా నవ్వుకుంటున్నా, కోపాన్ని కంట్రోల్ చెయ్యటానికి

    ReplyDelete
  2. ఈ టపాకి మీరు ఉంచిన ఫొటో చూసి చాలా సేపు పగలబడి నవ్వు కున్నాను.

    ReplyDelete
  3. Very well said! I loved the last two lines.
    "బర్రె ఉన్నది పాలు ఇవ్వదానికి........మన బుర్ర ఉన్నది అప్పుడప్పుడు కాస్త ఆలోచించడానికి "

    ReplyDelete
  4. thanks జలతారువెన్నెల గారు

    ReplyDelete