ఒకప్పుడు…అనగా బాగా బ్రతికిన రోజుల్లో(ఏమి ఆలోచించకుండా ఉన్న రోజులు అవి), ఎదుటి వాడ్ని అర్ధం చేసుకోవడం చాలా కష్టం అనుకునే వాడ్ని. కాని ఇప్పుడు అర్దమవ్తుంది…అనగా మనసు చంప్కుని బ్రతుకుతున్న ఈ రోజుల్లో.. నన్ను నేను అర్ధం చేసుకోవడమే కష్టం అని అర్దమవ్తుంది. రోబో మూవీ లో ఒక డైలాగు ఉంటుంది “ఎప్పుడయితే నేను మనిషి లా ఆలోచించడం మొదలుపెట్టానో ..అప్పుడే నేను ఇలా నాసనమయ్యాను” అని రోబో చెప్తుంది. నిజమే ఎంత ఎక్కువగా ఆలోచిస్తే లైఫ్ లో అన్ని చిరాకులు ఉంటాయి… అసలే ఆలోచనలు ఈ లోపు సపోర్ట్ ప్రాజెక్ట్ లో కి వచ్చి పడ్డాను.. ఇంకా అప్పటి నుండి నా లైఫ్ కే ఒక సపోర్ట్ లేకుండా పోయింది ఈ షిఫ్ట్ లు వర్క్ తో…
చిన్నప్పుడు అనుకునే వాడ్ని ఒక 25yrs దాటితే మన లైఫ్ కి మనమే హీరో అని, పూరి జగన్నాథ్ చెప్పినట్లు ఎవడి లైఫ్ లో వాడే హీరో అని(మహేష్ బాబు హీరో అయినా కాని మహేష్ ని డైరెక్ట్ చేసింది పూరి నే గా...!) అలానే మన లైఫ్ కి మనమే హీరో అయినా కానీ, మనకిష్టం వచ్చినట్లు మనం ఉండలేము కదా ..25yrs దాటిన తరువాత తెల్సింది ,మన లైఫ్ కి మనం హీరో కాదు... అప్పట్నుండి మనమే మన లైఫ్ కి విలన్ అని. ఈ టైం లోనే ఎన్నో ఆలోచనలు ఎన్నో ఆశయాలు. మనం అనుకున్నవి చేయలేము,చేస్తున్నవి ఇష్టం లేకున్నా చేయక తప్పదు…
ఒకప్పుడు ఇలా అనుకునే వాడ్ని..అలా అనుకునే వాడ్ని అంటున్నాను…కానీ ఇప్పుడు అనుకుంటున్నాను నేను నాకు అర్ధం కావట్లేదు అని..నిజం చెప్పాలంటే ఇప్పుడు కుడా ఏమి ఆలోచిస్తున్నానో ఏమి చేస్తున్నానో తెలీట్లేదు …నన్ను నేను అర్ధం చేసుకొనే టైం నాకు ఉండట్లేదు…ఒకవేళ ఉన్నా నేను నాకు అర్ధం కావట్లేదు…
నేను నాకే అర్ధం కానప్పుడు నేను రాసిన ఈ బ్లాగ్ ఇంకా మీకేమి అర్దమవుతున్దిలే…….!
నా ఆవేదనని అర్ధం చేసుకుంటారని...అర్ధం కాకపోయినా అడ్జస్ట్ అవుతారని ఆసిస్తూ .........మీ సతీష్
Nice One
ReplyDeleteobvious, lol
ReplyDeletenuvu matalato vyakta parichina ne avedanani ardam chesukunanu,evaru emaina annani e jeevitam evariki ardam kadu babai.
ReplyDelete