Pages

Tuesday, March 1, 2011

బాపు నువ్వయినా ఈ అరాచకాన్ని ఆపు


“దేన్నయిన డబ్బుతో కొనగలవేమో కాని మనిషి ప్రాణాన్ని కొనలేవు” ఇది ఒకప్పుడు పాత సినిమాలో డయలాగ్. ఒకప్పుడు అని ఎందుకు అన్నానంటే ఇప్పుడు అది నిజం కాదు గనుక. నిజమే ఇప్పుడు ప్రాణాన్ని చాలా సులువుగా లెక్క కట్టేస్తున్నారు ఎవరో కరుడ కట్టిన కసాయివాడు కాదు, మనం ఎన్నుకున్న మనల్ని పరిపాలిస్తున్న ప్రభుత్వమే మన ప్రాణానికి  లెక్క కట్టి ఇస్తుంది. త్వర లో బడ్జెట్ లో కూడా సగటు మనిషి ప్రాణానికి ఇంత అని కరీదు కట్టి బడ్జెట్ కేటాయించినా ఆశ్చర్యపడే పని లేదేమో.


మొన్న ముదిగొండ,బషీర్బాగ్ నిన్న ఉస్మానియా యునివెర్సిటీ,సోంపేట నేడు వట్టి తాండ్ర, కాకరాపల్లి.ఎక్కడయినా ఏ చోటయిన ఇదే జరుగుతుంది. పొట్ట చేత పట్టుకుని తన బ్రతుకు తను బ్రతకడం కూడా కష్టం గా మారిపోఇంది మన రాష్ట్రం లో. ఒకప్పుడు ఏ ఉప్పెన వస్తుందో ఏ గండం వస్తుందో అని సామాన్యుడు ప్రకృతి భీబత్సాలకు భయపడుతూ బ్రతికే వాడు, కాని ఇప్పుడు ఏ ప్రాజెక్టులు వస్తాయో తమ బ్రతుకుల్లో నిప్పులు పోస్తాయో తమ గుండెల్లో తుపాకు గుండ్లు దిగుతాయో అని  భయం తో బ్రతుకుతున్నారు.

మనం ఎన్నుకున్న నాయకులు,మన రక్షణ కోసం ఉన్న భటులు మనల్నే చంపుతున్నారంటే ఎంత దారుణం. ప్రజలేమి స్కాములు చేసి అడ్డంగా దోచుకున్న సొమ్ము కోసం తిరగ పడట్లేదు,వాళ్ళేమి అధికార దాహం కోసం పోరాడట్లేదు.పిడికెడు పొట్ట కోసం,వారి పిల్లల భవిష్యత్తు కోసం ప్రాణ పోరాటం చేస్తున్నారు. కాని మన స్వార్ద ప్రభుత్వాలు వారి వారి ప్రయోజనాలకోసం ప్రాజెక్టుల పేరు అడ్డం పెట్టుకుని సామాన్యుడి ప్రాణాలను ఖాతరు చేయకుండా వారిని చంపి వాళ్ళ శవాలకు లెక్క కట్టి వాటి మీద ప్రాజెక్టులను నిర్మించడానికి కూడా వెనుకాడట్లేదు. అంటే మనకి సామాన్యుడి ప్రాణం కన్నా ప్రాజెక్టులు ముఖ్యమయ్యాయా….?
అభివృద్ధి కి ఎవరూ వ్యతిరేకం కాదు అలానే అదే అభివృద్ధి కొంతమంది స్వార్ధానికి ఉపయోగపడి,సామాన్యుడి మనుగడకే ముప్పు కలిగించే లా ఉంటే ఎవరూ ఊరుకోరు దానికోసం ప్రాణాలను సైతం లెక్క చేయరు. అలాంటి పరిశ్తితులను అర్ధం చేసుకుని చర్చించి సమస్యను సామరస్యం గ పరిష్కరించాల్సిన ప్రభుత్వం అరాచకం గా సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడి ఆ ప్రాణాలను కాగితపు ముక్కలతో లెక్క కట్టడం దురద్రుష్టకరం. ఆకరికి సాటి మనిషి  ప్రాణాన్ని కూడా డబ్బుతో లెక్క కడతారని ముందే తెలిస్తే మన గాంధీ గారు తన బొమ్మ ని ఏ ఒక్క కరెన్సీ నోట్ మీద వేయొద్దని ప్రాదేయ పడేవారేమో పాపం." బాపు ఈ అరాచకాన్ని నువ్వయిన ఆపుతావని ఆశిస్తూ.........
(ఫోటోలు ఈనాడు వారి సహాయం తో) 


మీ...................................................................సతీష్.

1 comment:

  1. "మనకి సామాన్యుడి ప్రాణం కన్నా ప్రాజెక్టులు ముఖ్యమయ్యాయా….?"
    అవును మరి వెధవ సామాన్యుడి ప్రాణానిదేముంది ఖండిస్తున్నామని చెప్పి, సంతాపం ప్రకటించి లక్షో, రెండు లక్షలో ఇస్తే పోయే. ప్రాజెక్టులలో మనం దండుకోనేదాంతో పోలిస్తే ఇదో లెక్కా? ధర్మల్, ధర్మాన మనకు ముఖ్యం కానీ ధర్మం అనే పదం మర్చిపోయి చాలా ఏళ్లయిందిగా

    ReplyDelete