Pages

Monday, May 9, 2011

స్వచ్చమైన ప్రేమ




అందరు పుట్టిన వెంటనే ఏడుస్తారు నవ్వకుండా ఎందుకో తెల్సా "ఒక అద్బుతమయిన శక్తి నుండి మనల్ని ఎవరో దూరం చేస్తున్నారని భయం తో"ఆ అద్బుత శక్తి పేరే అమ్మ.9 నెలలు ఆ శక్తితో పెనవేసుకుని ఉన్న మన పేగు బందాన్ని ఎవరో దూరం చేస్తున్నారు అనే బాధ మనల్ని ఉగ్గపెట్టుకుని ఏడ్చేలా చేస్తుంది.మన మాటలను,అభిప్రాయాలను తెల్సుకుని మనకు ఫ్రెండ్స్ దగ్గరవుతారు,మన స్టేటస్ చూసి మనకు పార్ట్నేర్స్ ఉంటారు.కాని అస్సలు మనమేమి అవుతామో మనకి ఏ పోసిషన్ వస్తుందో కూడా తెలియని వయసునుండే మన నుంచి ఏమి ఆశించకుండా మనల్ని కంటికి రెప్పలా కాపాడే ఒక అద్బుతమయిన శక్తి అమ్మ.

ఎవరికి తమ దగ్గరగా ఉన్నప్పుడు గొప్ప వాటి విలువ తెలియదు,అవి మనకు దూరం అయినప్పుడు వాటి విలువ మనకు తెలుస్తుంది.నేను చిన్నప్పుడు అల్లరి చేస్తున్నప్పుడు,స్కూల్ కి వెళ్ళను అని మారాం చేస్తున్నప్పుడు అమ్మ కొడుతూ ఉండేది(ఆ దెబ్బలు నా భవిష్యతు ని చూపే మార్గాలు అని అప్పుడు తెలియదు),అప్పుడు నేను అమ్మకు దూరం గా ఉండాలి అనుకునే వాడ్ని కాని ఇప్పుడు తెలుస్తుంది ఒక్కసారి అమ్మకు దూరం అయిన నాకు లైఫ్ లో ఇంకెప్పుడు ఆ ప్రేమకు దగ్గర అవ్వలేను అని.ఎవరు మన మీద ప్రేమ చూపించినా ఏదో ఒకటి ఆశించి మాత్రమె ప్రేమను చూపిస్తారు,అమ్మ ఒక్కతే మనగురించి మాత్రమె ఆలోచించి ప్రేమను పంచుతుంది.నిజం గా అమ్మ కు దూరం గా బ్రతికే వాళ్ళు ఈ ప్రపంచం లో కెల్లా పెద్ద దురదృష్టవంతులు.

 
మనకి ఈ రోజు ఎంతో ఆనందం కల్గినా బాద కల్గినా ఇంటికి వచ్చి వెంటనే అమ్మ తో చెప్పాలి అనుకుంటాం కాని చెప్పుకోవడానికి అమ్మ లేదు.కొంత మందికి అమ్మ ప్రేమ ఎంత దగ్గర గా ఉన్నా పట్టిచ్చుకోరు,ఎంతోమంది అనాదలు అబాగ్యులు అమ్మ ప్రేమకు దూరమయి అనాధ ఆశ్రమాలలో రోజు అమ్మ ప్రేమ కోసం తపిస్తున్నారో.అమ్మ ప్రేమ కు దూరమయిన వాళ్లకి “మనల్ని మనకంటే ప్రేమ గా బాద్యత గా చూసే ప్రతి ఒక్కరు అమ్మ తో సమానమే” అని నా ఫీలింగ్.అన్నీఉన్నా మనమే ఏదో ఒక సమయం లో ఏదో కోల్పోయాం అని ఫీల్ అవుతాం,అలాంటిది ఏ ప్రేమ లు ఏ బందాలు లేని అనాధలు వాళ్ళ పరిస్తితి ఏంటి.వాళ్ళను వోదార్చే వారెవరు.మనం కొద్ది గా మన ప్రేమను వాళ్లకి పంచితే చాలు వాళ్ళు మనలో అమ్మ ప్రేమ ను చూసుకుంటారు.ఈ ప్రపంచం లో విలువ కట్టలేనిదేదన్న ఉంది అంటే అది అమ్మ ప్రేమ ఒక్కటే.ఆ ప్రేమను మనం వేరే వాళ్లకు పంచుతున్నాం అంటే అంతకన్నా గొప్ప విషయం మన జీవితం లో ఇంకేముంటుంది.మన ఈ జీవితం లో ప్రతి రోజు అమ్మ పెట్టిన బిక్షే తనని ఏదో ఒక్కరోజు తలచుకొని మిగిలిన రోజులు మర్చిపోవద్దు.


మనకి దొరికినంత సమయం లో తోచినంత ప్రేమను అమ్మ ప్రేమ కు దూరమయి ఎంతో బాదపడుతున్న అభాగ్యులకు పంచుతూ మనం కోల్పోయిన ప్రేమను వాళ్లకు అందిద్దామని ఆసిస్తూ…………………….





Your 's ..........................................సతీష్ .


Tuesday, May 3, 2011

పాలు పోసి పెంచిన పాములు

మనకి ఒక సామెత ఉంటుంది "పాముకి పాలు పోసి పెంచినా అది విశ్వాసం మరచి పాలుపోసిన వాడినే కాటేస్తుంది"అని.అది నిజమే వీడు పోసినంత కాలం అది తాగుతూనే ఉంటుంది కాని ఏదో ఒక రోజు తప్పక కాటు వేస్తుంది అని మన చరిత్రలో రుజువైంది,మన కళ్ళ ముందు కుడా జరుగుతూనే ఉంది.

మన కళ్ళముందే జరిగిన ఇలాంటి కొన్ని సంగటనలు చూద్దాము:
చలసాని వెంకటేశ్వర రావు: 
చలసాని వెంకటేశ్వర రావు అలియాస్ పండు హత్య, స్వాప్నిక పెరల్ అపార్ట్మెంట్, హైదరాబాద్ లో జరిగింది. పండు ని అతి దారుణంగా చంపింది అతను నమ్మిన బంటు,ప్రధాన అనుచరుడైన మహేందర్ రెడ్డి. దీనికి కారణం భూ దందాలు,మనీ గొడవలే ముఖ్య కారణం.
గంగుల సూర్యనారాయణ రెడ్డి:
అలియాస్ మద్దెల చేరవు సూరి, సూరి హత్య నవోదయ కాలనీ,జూబిలీ హిల్స్,హైదరాబాద్ లో జరిగింది.సూరిని అతి కిరాతకంగా కాల్చి చంపింది సూరికి అత్యంత నమ్మకస్తుడు భానుకిరణ్.ఈ హత్యకి కుడా ప్రధాన కారణాలు భూ దందాలు,డబ్బే ప్రధాన కారణం.సూరి నమ్మేది అతి తక్కువమందిని అందులో ముఖ్యుడు భానుకిరణ్.ఆకరికి అతనే సూరిని అతి కిరాతంగా కాల్చేసాడు.

అక్బరుద్దీన్ ఒవైసీ(MLA):
అక్బరుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ MIM MLA.నడి రోడ్డు మీద కొంతమంది వ్యక్తులు అతి దారుణంగా కత్తులతో తుపాకులతో దాడి చేసి అక్బర్ను గాయపరిచారు.అదృష్టవశాత్తు అక్బర్ ప్రాణాపాయ స్థితినుండి తప్పించుకుని బయట పడ్డాడు,కాని పరిస్థితి విషమంగానే ఉంది.ఈ దాడికి ప్రధాన కారకుడు మొహమ్మేద్ పహల్వాన్.పహేల్వాన్ అక్బరుద్దీన్ తండ్రి సుల్తాన్ సలహుద్దిన్ ఒవైసీ కి అనుచరుడు ఒకప్పుడు.వీళ్ళ ద్వారానే అక్రమంగా ఎన్నో ఆస్తులు కూడపెట్టాడు.ఇప్పుడు అక్బర్ వలన ఈ ఆస్తులకు ముప్పు అని భావించి అక్బరుద్దీన్ ని అడ్డు తప్పిచడానికి ప్రయత్నించాడు.
ఒసామా బిన్ మొహమ్మేద్ బిన్ అవాద్ బిన్ లాడెన్:
అలియాస్ ఒసామా బిన్ లాడెన్ ప్రపంచ దేశాలను అందులో ముఖ్యంగా అగ్ర రాజ్యం అని పిలవబడే అమెరికాను గడగడ లాడించాడు.ఎవరూ ఉహించని రీతి లో WTO మీద దాడి చేసి అమెరికాను ఒక్కసారిగా హడలెత్తించాడు.ఇంతకీ ఎవరీ లాడెన్.....ఒక వ్యక్తి ప్రపంచ దేశాలను ఎలా భయపెట్టగలిగాడు….?లాడెన్ అనే ఒక వ్యక్తి ఒక ఉగ్రవాద శక్తిగా మారటానికి ప్రధాన కారణం ఈ అగ్రరాజ్యమే,తన స్వార్ధం కోసం సోవియట్ యునియన్ (రష్యన్) దళాలను నాశనం చేయడానికి లాడెన్ ని ఉపయోగించుకుని అతనికి ఆయుధాలు డబ్బులు సహాయంగా అందించి అతన్ని ఒక శక్తిగా మార్చింది.తన స్వార్ధం కోసం పెంచి పోషించిన ఒక శక్తి తమకే పక్కలో బల్లెంలా తయారయ్యే సరికి తట్టుకోలేకపోయిన అగ్రరాజ్యం అతనిపయి  దాడిచేసి అతన్ని అంతమొందించి మేకపోతు గామ్భిర్యాన్ని ప్రదర్శిస్తుంది ఇప్పుడు.

వీటి అన్నిటిలో నీతి ఒక్కటే తమ స్వార్ధానికి,సొంత పనులకు పాముల లాంటి వాళ్ళను పెంచి పోషించి సమాజానికి నష్టం కలగించినంత కాలం వీరు దర్జాగా బ్రతుకుతున్నాము అనే బ్రమలో ఉంటారు,కాని అదే పాముల విషపు కాటుకి ఏదో ఒకరోజు భళి అవుతారని తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. మల్లీ మన సామెత దగ్గరికి వస్తే “కత్తి పట్టిన వాడు ఆ కత్తి చేతిలోనే చస్తాడు”.అని……………………..సతీష్.



Tuesday, April 26, 2011

సాయం చేసే చేతులు మిన్న

Let it reach the 110 Crores Indians and the remaining
if any.
Kindly, share this valuable information wherever
possible.


1. If you see children Begging anywhere in TAMIL NADU:
please contact: "RED SOCIETY" at 9940217816. They will help the children for their studies.

2. Where you can search for any BLOOD GROUP:
 you will get thousands of donor address. www.friendstosupport.org

3. Engineering Students can register In:
www.campuscouncil.com
to attend Off Campus for 40 Companies.

4. Free Education and Free hostel for Handicapped/Physically Challenged children:
Contact:- 9842062501 & 9894067506.

5. If anyone met with fire accident or people born with problems in their ear, nose and mouth can get free PLASTIC SURGERY done by Kodaikanal PASAM Hospital.
From 23rd March to 4th April 2011 by German Doctors.
Everything is free. Contact : 045420-240668,245732.

6. If you find any important documents like Driving license, Ration card, Passport, Bank Pass Book, etc., missed by someone, simply put them into any near by Post Boxes. They will automatically reach the owner and Fine will be collected from them.

7. By the next 10 months, our earth will become 4 degrees hotter than what it is now. Our Himalayan glaciers are melting at rapid rate. So let all of us lend our hands to fight GLOBAL WARMING.
-Plant more Trees.
-Don't waste Water & Electricity.
-Don't use or burn Plastics.

8. It costs 38 Trillion dollars to create OXYGEN for 6 months for all Human beings on earth.
"TREES DO IT FOR FREE" "Respect them and Save them".

9. Special phone number for Eye bank and Eye donation: 044-28281919 and 044-28271616 (Sankara Nethralaya Eye Bank).
For More information about how to donate eyes plz visit these sites. http://ruraleye.org

10. Heart Surgery free of cost for children (0-10 yr) Sri Valli Baba Institute Banglore. 10.
Contact : 9916737471.

11. Medicine for Blood Cancer!!!
'Imitinef Mercilet' is a medicine which cures blood cancer. It’s available free of cost at "Adyar Cancer Institute in Chennai". Create Awareness. It might help someone.
Cancer Institute in Adyar, Chennai
Category: Cancer
Address:
East Canal Bank Road,
Gandhi Nagar, Adyar
Chennai -600020
Landmark: Near Michael School
Phone: (044) 24910754, 24910754, 24911526, 24911526,
22350241, 22350241.

12. Please CHECK WASTAGE OF FOOD
If you have a function/party at your home in India and food gets wasted, don't hesitate to call 1098 (only in India)
- It’s not a Joke, This is the number of Child helpline.They will come and collect the food. Please circulate this message which can help feed many children.


"AND LETS TRY TO HELP INDIA BE A BETTER PLACE TO LIVE IN"


Please Save Our Mother Nature for "OUR FUTURE GENERATIONS"
Let it reach the 110 Crores Indians and the remaining if any. "Helping Hands are Better than Praying Lips".


Loka Samastha Sukhino Bhavantu
(May all the people of the world be happy).....................................సతీష్.(నా Friend అందించిన విలువైన సమాచారం మీ ముందు ఉంచుతున్నాను).
                                                                    

Thursday, April 21, 2011

చెంచలంబకు జగతిలోపల శాశ్వతంబు ఒకటేదిరా….

"చెంచలంబకు జగతిలోపల శాశ్వతంబు ఒకటేదిరా….
కట్టె బొగ్గు కాలేటప్పుడు కాసునైనను రాదురా…........

నీది నాది అనుచు నరులు వాదులాడుచు ఉన్డేరా…...
చెంచలంబకు జగతిలోపల శాశ్వతంబు ఒకటేదిరా"

చిన్నపుడు ఉరిలో దశరా ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతుండేవి.అందులో పిల్లలందరూ పూజ ఎప్పుడు పుర్తవుతుందా ప్రసాదం ఎప్పుడు పెడతారా, డాన్సులు, సినిమాలు ఎప్పుడు వేస్తారా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు డాన్సు వేసేవాళ్ళు , CD ప్లయెర్స్ అన్ని ఉన్న గాని పూజ కార్యక్రమం అయ్యే టైం కి ఎక్కడి నుండి వచ్చే వాళ్ళో గాని ఊర్లో ఉన్న కాస్త వ్రుద్దులంతా చిడతలు పట్టుకుని గద్దె దగ్గరకు చేరే వాళ్ళు భజన చేయడానికి.వాళ్ళని చూడగానే వార్తలు అయ్యే అంత వరకు కర్రెంట్ ఉండి చిత్రలహరి స్టార్ట్ అవ్వగానే కరెంటు పోతే ఉండే అంత బాధ కలిగేది పిల్లలందరికీ.

పూజ అయిపోగానే ప్రసాదం తీసుకుని పెద్దవారందరూ భజన స్టార్ట్ చేసేవారు.ఆ భజన అయ్యేసరికి పిల్లలు అందరు నిద్రలోకి జారుకునే వాళ్ళు, రోజు ఇదే తంతు.అలా చూసి చూసి నేను కూడా ఆ భజన బాచ్ లో మెల్లగా జాయిన్ అయిపోయాను, తప్పులో ఒప్పులో పాడుతూ వాళ్ళతో శృతి కలపడం మొదలేసాను. అలా పాడుతూ పాడుతూ త్వరగా మంగళం పాడేసి భజనని క్లోజ్ చేసి ఇక మా డాన్సులు సినిమాలు స్టార్ట్ చేసేవాళ్ళం.

అలా పాడుకున్న రోజులలో బాగా గుర్తున్న భజన పాటే పైన చెప్పిన "చెంచలంబ" పాట.అప్పుడు అది పాడుతున్నప్పుడు దాని అర్ధం ఏమి తెలీదు ఏదో అందరు పాడుతున్నారు మనం కూడా పాడుతున్నాము అంతే.కాని దాని అర్ధం తెలిసే వయసు వచ్చే సరికి భజనలు లేవు దశరా ఉత్సవాలు లేవు ఉరిలో.నిజంగానే ఈ చెంచలం అయిన ఈ జీవితం లో శాశ్వతము అంటూ ఏముంది. ఇదేదో వైరాగ్యంతోనో విచారం తోనో చెప్తున్న మాటలు కాదు.మన జీవితం అలానే అయింది నిజంగానే. మనం పుట్టేటప్పుడు కనీసం ఒక చిన్న నూలుపోగు కూడా లేకుండా పుడతాము అలానే పోయేటప్పుడు ఒక్క నూలు పోగు కూడా తీసుకుని వెళ్ళము.ఇది జగమెరిగిన సత్యం కాని ఈ రెండిటికి మద్యలో మాత్రం దేనికో ఈ ఆరాటం ఈ పోరాటం.

ఈ ఆరాటం,పోరాటం వద్దు అనట్లేదు కాని మనిషికి మనిషికి మధ్య ఉన్న మానవతా విలువలను కూడా వదిలేసి పోరాడే అంత పోరాటాలు మనకి అవసరమా అని నా ఉద్దేశం.సాటి వాడు ఆపదలో ఉన్నాడు అంటే కనీసం వాడికి మద్దతు పలకడానికి కూడా మనసు రాణి పరిస్థుతుల మద్య మనం ఉన్నాము. ఎంతో మంది ఆకలితో మాడిపోతున్నారు రోజు కనీసం కట్టుకోడానికి గుడ్డ ఉండటానికి చిన్న గుడిస కూడా లేని స్థితి లో చాలా మంది ఉన్నారు కాని బాబాల ఆశ్రమాలలో డబ్బు,బంగారం ట్రక్కులతో తోలుతున్నారు అని TV లలో చూస్తున్నాము.అది ఎవరి డబ్బు ఎక్కడికి తోలుతున్నారు….? సాటి వాడు ఆపదలో ఉంటె ఆదుకోలేము కాని బాబాలను స్వాములను నమ్మి వారి వారి సంస్థలలో దొంగ డబ్బుని మాత్రం దాచుకుంటారు మనవారు.

అస్సలు స్వాములు బాబాలు అంటే ఏంటి " నిస్స్వార్దంగా అన్ని వదిలేసి నిరాడంబరంగా జీవితాన్ని గడపాలి" కాని మన దేశంలో స్వాములకు పెద్ద పెద్ద పీటాలు,పెద్ద పెద్ద ఆస్తులు వారి వెనక కోట్ల విలువలు చేసే సంపదలు. ఇక కొంతమంది బాబాలు అయితే చెప్పలేని పనులు కుడా చేస్తారు(కాని వాళ్ళని మన పిచ్చి జనాలు ఫోటోలు పెట్టి మరి పుజిస్తారు) ఇవ్వన్ని ఎందుకండీ వీరికి.మల్లి మన ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు కుడా వీరికి పాద దాసులు లా మారుతారు,మారి వీరి నల్ల ధనం ను దాచుకొనే పనిలో పడతారు.ఇది మన దేశ దుస్తుతి.

దేశం లో ఉన్న బాబాల ఆస్తులను జప్తు చేసి కనీసం ఒక పూట తిండి కూడా తినలేని సామాన్యుడికి ఉపయోగపడేలా చేస్తారో లేక మన నాయకులు ఆ సొమ్మును కూడా కుక్కలు చింపిన విస్తరి లా పీక్కుని తింటారో వేచి చూద్దాము………………….......సతీష్  


                                                                         

Friday, April 15, 2011

నోట్ల తో కొనలేని ఓట్లు

డబ్బు గెలుస్తుందా…?లేక అధికారం గెలుస్తుందా….? ఇప్పుడు కడప ఎన్నికలలో ఆసక్తిగా మారిన విషయం.ఈ ఎన్నికల వలన మన రాష్ట్రానికి మన రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేకపోయినా,కడప ఆదిపత్య పోరుకు సిద్దమయింది.ఇవి ఎన్నికలు అనడం కన్నా డబ్బు కి అధికారానికి మధ్య ఆదిపత్య పోరు అనడం సబబేమో.మామూలుగా రాష్ట్రం లో ఎన్నికలంటే అల్ప సంతోషి అయిన ఓటరు యాబయ్యో వందో వస్తాయని చంకలు గుద్దుకుంటాడు కాని కడపలో ఆ ఓటు విలువ వందల నుండి వేలల్లోకి దాటిపోయింది.

ఎక్కడో తమిళనాడు లోని ఎన్నికలు చూసి విరక్తి కలిగింది,ప్రజాస్వామ్యం నాశనం అయిందే అనే చిన్న బాధ కలిగింది.ఇంటికో mixi,fan,TV ఇలా నోటికి అందినన్ని ఫ్రీ బహుమతులను ఇస్తామంటే అవాక్కవడం మన వంతు అయింది.సరే ఒకందుకు ఆలోచిస్తే అది రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి మరియు ప్రభుత్వం ఏర్పరచడానికి పడే పాట్లు కాని మన రాష్ట్రం లో ఒక MLA, MP ల కోసం తమిలనాడుకంటే ఎక్కువగా స్రమిస్తున్నారంటే(డబ్బు పెట్టడానికి) మన నాయకుల లో ప్రజా సేవ కంటే అధికార దాహం,ఆధిపత్యం కోసం పడే తపన ఎంతగా పెరిగాయో అర్ధం చేసుకోవచ్చు.

ఇలాంటి ప్రమాదకర పోటి మద్యలో ఒక మంచి,నిస్వార్ధం కల్గిన నాయకులు ఎవరన్నా నిలబడగలరా…? ఒకవేళ నిలబడ్డా గాని బ్రతికి బయటపడనిస్తారా..? మన ఈ నాయకులు. ఇలా తయారయింది మన ప్రజాస్వామ్య వ్యవస్థ. ఎన్నికల అఫ్ఫిడవిట్ లో కనీసం సొంత కారు,బ్యాంకు బాలన్స్ లేదు అని చూపిచ్చుకునే మన నాయకులకు ఎన్నికలలో మాత్రం పంచడానికి కోట్లు ఎక్కడనుండి వస్తున్నాయో మన ఎన్నికల కమీషన్ కి తెలియకపోవడం వింతే మరి.

ఇంత బహిర్గతంగా అక్రమాలు జరుగుతుంటే మన చట్టాలు కాని,మన ఎన్నికల అధికారులు కాని ఏమి చేస్తున్నట్లు..!నిదురపోతున్నాయా...? అంత పెద్ద పెద్ద వారే ఏమి చేయకుండా చూస్తూ ఉంటె ఇక సామాన్యుడు ఏమి చేస్తాంలే అని తప్పక తమ ఓటు ని ఏదో ఒక దుర్మార్గుడికి వేయాల్సిన తప్పని పరిస్థితి వస్తుంది(మరి అస్సలు ఓటు వేయకపోతే అదొక నేరం కదా).


అందుకే ధైర్యం గా ఏమి చేయలేని ఈ సామాన్యుడికి ఒక అవకాశం ఇవ్వాలి,గొప్ప గొప్ప మేధావులు చెప్పినట్లు ఓటు బ్యాల్లేట్ పేపర్ లో ఓటు ఏ అబ్యర్ది కి వేయడం ఇష్టం లేదని తెలియచేయడానికి ఒక గుర్తుని కేటాయించాలి.అక్కడ ఏ నాయకుడు సరి అయిన వాడు కాకపొతే తమ ఓటు ఎవరికి వేయట్లేదని తెలియచేసే అవకాశం ఓటరుకి కల్పించాలి అలాంటి ఓట్లు ఎక్కువ వస్తే అక్కడ ఎన్నికలని రద్దు చేసి అక్కడ పోటి చేసిన అభ్యర్దులను అనర్హులగా ప్రకటించాలి.ఇలాంటి అవకాశం ఇస్తే ప్రజలు గోప్యంగా అయినా ఈ అన్యాయాన్ని ఈ అక్రమార్కులను వ్యతిరేకించే అవకాశం వస్తుందని నా అభిప్రాయం……………సతీష్.

                                                         

Thursday, April 7, 2011

జన లోక్పాల్ బిల్లు…..అవినీతికి చిల్లు

బాబా BP ఇంతుంది, షుగర్ అంతుంది,బాబా ఆరోగ్య పరిస్థితి మీద ప్రత్యేక బుల్లెటేన్. KCR ఇప్పుడు ఏమి చేస్తున్నారు.తెలుగు దేశం లో వర్గ పోరు.కడప ఎలేక్షన్స్ లో అబ్యర్దులు ఎవరు చూస్తూనే ఉండండి కాసేపట్లో.. TV ఆన్ చేస్తే చాలు ఉదయం మొదలు రాత్రి పడుకునే వరకు ఇదే వార్తలు ఒక వారం రోజులు గా. ఇవి వార్తలు కావు అని నా అభిప్రాయం కాదు.మూడు రోజులు గా ఆమరణ నిరాహార దీక్ష(మన రాజకీయ నాయకుల దీక్షల లాంటిది కాదు లెండి) చేస్తున్నా ఏ APమీడియా మిత్రులకు కనిపచ్చలేదు.

                                                                       
బాబా చాలా మంచి వ్యక్తే కాదని నేను అనను ఆయన చాలా స్వచ్చంద సేవలను చేసిన గొప్ప వ్యక్తే అందులో ఎటువంటి అనుమానం లేదు.కాని బాబా చావుని బేస్ చేసుకుని వారి ట్రస్ట్ లో ఏదో కుంబకోణం జరుగుతుంటే బాబా ఆస్తుల మీద,అది వదిలేసి ఈ మీడియా లేని పోనీ హడావుడి చేస్తూ TRP రేటింగ్ కోసం రోజంతా అదే న్యూస్.మా అంటే బాబా ఒకటి లేదా రెండు కోట్ల మంది కి ఆరద్యులు,ఇక తెలంగాణా ఉద్యమం నాలుగు కోట్ల మంది ఆశయం, కాని మన "అన్న హజారే" గారు చేసే ఉద్యమం నూట ఇరవయ్ ఒక్క కోట్ల మంది కి ఉపయోగపడే ఉద్యమం.అలాంటి ఉద్యమం గురించి ఒక్క అయిదు నిముషాలు చూపించే టైం మన AP మీడియా కి లేదు అంటే చాలా సిగ్గుగా ఉంది.

ప్రపంచం లో ఏ విషయం ఎవరికి తెలియాలన్న మీడియా నే మూలా కారణం. అలాంటిది "అన్న హజారే" గారి ఉద్యమం కాని,"జన లోక్పాల్ బిల్లు" కాని మనలో చాలా మందికి తెలీదు అంటే మన మీడియా దాని గురించి యెంత పట్టిచ్చుకుంటుందో అర్ధమవుతుంది.మల్లి మీడియా లో పెద్ద పెద్ద ప్రకటనలు "అవినీతి ని అరికడదాం","ఫ్యాక్షనిస్టుల ఆస్తులను ప్రభుత్వానికి అప్పచెప్పండి". ఇలా లేనిపోని స్పీచులు ఇవ్వడం తప్ప చేసేది ఏమి లేదు.మ్యాచ్ గెలిస్తే బట్టలు ఇప్పుకుని తిరిగుతా అని ఒక మోడల్ చెప్తే అది హెడ్ లైన్స్ లో వేసే మన మీడియా 72 సంవత్సరాల వ్యక్తి మన కోసం మన భవిష్యత్తు తరాలకోసం పోరాడుతుంటే వీరికి కనీసం చీమ కుట్టినట్లు కుడా అనిపిచ్చట్లే.ఆయన పోరాడేది అవినీతి మీద,ఆయనకు దూరం గా ఉండేది అవినీతిపరులు,అంతేలే మీడియా కుడా ఎప్పుడో అవినీతి రొచ్చు లో కూరుకుపోయింది కాబోలు అందుకే దూరం గ ఉంటున్నారు పాపం.

"జన లోక్పాల్ బిల్" 42 సంవత్సరాలు గా ఆమోధపొందని  బిల్లు.నిజంగా ఈ బిల్లు ఆమోదం పొందటానికంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కాలి ఎందుకంటె ప్రపంచం లో ఏ బిల్లు ఇన్ని సంవత్సరాలు ఆమోదం పొందకుండా లేదు అనుకుంట.ఏమవుతుంది ఈ బిల్లుని ఆమోదిస్తే ఈ రాజకీయ నాయకుల కుర్చీలు కదులుతాయి కాబోలు .. లేక చెదలు పట్టి పేరుకుపోయిన ఈ బడా బాబుల డబ్బులు చేదురుతాయి కాబోలు... ప్రతి ఒక్కడు ఏ స్టేజి లో ఉన్నాడంటే అవినీతి కి వ్యతిరేఖం గా పోరాడే "హజారే" గారికి సప్పోర్ట్ గ ఒక స్టిక్కర్ ని తన వాహనానికి అంటిచుకోమని అడిగితే నాకేమి ఇస్తారు అనే రీతిలో అవినీతి పేరుకుపోయింది మన దేశం లో.

దయచేసి ఇప్పటికన్నా "JANA  LOKPAL BILL " అవసరం ఏంటో, అసలు ఆ బిల్లు వలన మనదేశానికి ఉపయోగమెంతో తెలుసుకుందాం. ఆ బిల్లు ను ఆమోదిన్చేదాక మన వంతుగా "అన్న హజారే" గారికి మన పూర్తి మద్దతుని అందిద్దాం అని ఆసిస్తూ……………..సతీష్.

I support  JANA LOKPAL BILL...........

R U......?



జై భారత్ మాత కి జై.

Friday, April 1, 2011

నేను సైతం.....

రోజు టీవీ ల లో పేపర్ ల లో చూస్తూ ఉంటాం. మన దేశం కరప్షన్ తో నిండి పోయింది అని విని బాధ పడతాం కొద్దిసేపు తరువాత మనమేమి చేయగలం లే అని ఊరుకుని మన పనిలో మనం మునిగి పోతాం. రోజు అందరి జీవితాలలో జరిగే మామూలు విషయమే ఇది. కాని ఒకే ఒక్కడు 72 సంవత్సరాల వయసు ని మన స్వేచ్చకోసమే త్యాగం చేసి, ఈ వయసులో కుడా మన స్వేచ్చకోసం పోరాడడానికి సిద్దమయిన ఒకే ఒక వ్యక్తి "అన్న హజారే".

స్వతంత్రసమరయోధుడు, పద్మ భుషణుడు అయిన అన్న హజారే గారు ఈ నెల 8 న డిల్లి లో అవినీతి వ్యతిరేఖ చట్టం "జన లోక్పాల్ బిల్" కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.దీనికి మనం ఆనందించాలో లేక బాధపడాలో అర్ధం కావట్లే. బాధపడాలో అని ఎందుకు అన్నానంటే. వారి జీవితం మొత్తం మనకు స్వేచ్చని అందించడానికి త్యాగం చేసి ఈ దేశాన్ని మన చేతిలో పెడితే, మన రాజకీయ నాయకులు దేశాన్ని అవినీతి తో దోచుకు తింటుంటే ఈ యువత కాని ఏ పౌరుడు కాని పట్టిచుకోకుండా తన స్వార్ధానికి తను బ్రతుకుతుంటే చూడలేక ఈ వయసులో కూడా మల్లి నడుం బిగించి అవినీతి మీద పోరాడటానికి సిద్డంయ్యరంటే మనం సిగ్గుతో తల దిన్చుకోవాల్సిందే.

"నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వృష్టికి అశ్రువొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోసకు వెర్రి గొంతుక విచ్చి ఒసానూ
నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను"

ఇప్పటికయినా మన మనసులోనే అనుచుకున్న భావాన్ని బయటికి తీద్దాం. ఈ ఉద్యమానికి మనవంతు సాయాన్ని అందిద్దాం.ప్రతి పౌరుడు బాధ్యతగా కలిసికట్టుగా ఈ ఉద్యమాన్ని ఉదృతం చేసి కనీసం అవినీతి తో అంధకారం లో ఉన్న ఈ ప్రభుత్వాలకు కనువిప్పు కల్పిద్దాం.
తెలుగు వారిగా, ఆంధ్ర ప్రజల గా మనం "లోక్పాల్ బిల్" ను సమర్దిస్తూ ఈ ఏప్రిల్ 5th న KBR పార్క్ జుబ్లిహిల్ల్స్ లో జరిగే ఉద్యమానికి మద్దతుగా మనవంతు కృషి చేస్తూ ఉద్యమం లో పాల్గొనడం భారత దేశ పౌరుల గా మన బాధ్యత అని ఆసిస్తూ.........................సతీష్

ఏప్రిల్ 5th మంగళ వారం,
ఉదయం 8  గంటలకు,
KBR  పార్క్,
జుబ్లీహిల్స్,
హైదరాబాద్,
ఫోన్ : 9676360111
9849109540





                                                                  

Wednesday, March 30, 2011

వ్యక్తిగా ఓడిపోయి....శక్తి గా గెలవాలని

        
రోజు లానే ఆఫీసు నుండి బయలుదేరాను,హైటెక్ సిటీ నుండి మియాపూర్ ఆటో(AP28 TB 5950) ఎక్క్కి కూర్చున్నా. మొత్తం అయిదుగురితో ఆటో బయలుదేరింది.ఎదురు గా ఆటో లో నుండి ఒక అమ్మాయి దిగి ఆటో వాడికి డబ్బులు ఇచ్చి చిల్లర పర్సులో పెట్టుకుంటూ నడుస్తుంది. నేను ఎక్కిన ఆటో వాడు అది గమనించి కావాలని ఆ అమ్మాయి మీదకు దురుసు గా ఆటో పోనిచ్చి ఎదురుగా  వెళ్లి బ్రేక్ కొట్టాడు.ఆ అమ్మాయి షాక్ తో బయపడింది దాంతో మా ఆటో (AP28 TB 5950)వాడికి ఏదో తెలీని పయసాచిక ఆననడం వచ్చింది. అది చూసి నా ఆవేశాన్ని ఆపుకున్నాను సరేలే అని.అలా కొద్ది దూరం వెళ్ళిన తరువాత వీడి రాష్ డ్రైవింగ్ తో ఒక కార్ ని గుద్దబోయి తిరిగి ఆ కార్ వాడినే తిడుతున్నాడు వీడు.అప్పటికే నా మనసెందుకో ఊరుకోలేక పోయింది,సరేలే అని కాం గా కూర్చున్నా.

ఇంతలో కొత్తపేట సిగ్నల్ దగ్గర ఆపాడు ఆటో, సిగ్నల్ పడ్డా గాని కదలకుండా ఆటో ని నది రోడ్ మీద ఆపి కూర్చున్నాడు, ఇంతలో వెనకనుండి ఒక కార్ హారన్ మోగింది.మోగిన చాలా సేపటికి వీడు ఆటో ని పక్కకు తీసాడు వెనక కార్ మా పక్కకు రాగానే (అందులో డ్రైవింగ్ చేస్తుంది ఒక లేడీ) వీడు ఆమెదో తప్పు చేసినట్లు నోటికొచ్చిన బూతులు, కనీసం వినలేనటువంటి బాష తో తిట్టడం మొదలు పెట్టాడు.ఇక నా వల్ల అవలేదు అలా చూస్తూ ఉండటం. వెంటనే వాడిని ప్రస్నించా “ఏమి మాట్లాడుతున్నావ్, తప్పు నీది పెట్టుకుని ఎదుటి వాళ్ళ మీద అరుస్తావేంటి” అని వెంటనే వాడు నా ఆటో నా ఇష్టం ఇష్టముంటే ఉండు లేకపోతే దిగు నీకేంటి సంబంధం అన్నాడు. నాకు అడిగే హక్కు ఉంది నువ్వేది చేసిన చుస్తున్డాల్సిన అవసరం లేదు అన్నాను. అయితే దిగిపో అని నన్ను మధ్యలో దిన్చేసాడు.(మిగిలిన వాళ్ళు అలా సినిమా చూస్తున్నట్లు చూస్తూ కూర్చున్నారు).


నేను వేరే ఆటో ఎక్కి మియాపూర్ లో దిగాను. నా ముందు వాడు వచ్చి ఏమి పీకుతావ్ ఇందాకేదో వాగుతున్నావ్ అని నాకు అడ్డం తిరిగి నా మీద రివర్స్ అవడం మొదలుపెట్టాడు.వెంటనే నేను అక్కడున్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చా అప్పుడు ఆ పోలీసు నాతొ ఆ ఆటో(AP28 TB 5950) వాడి దగ్గరికి వచ్చి ఏంటి అని అడిగితే, వాడు ఎంతో ధైర్యంగా పో ఆటో తీసుకుపో పది వేలు కట్టి తెచ్చుకుంటా అని ఎంతో ధీమాగా మాట్లాడాడు. అది చూస్తూ ఆ పోలీసు నిలబడి ఉన్నాడు కాని కనీసం ఏమి అనలేక పోయాడు వాడ్ని.ఇంకా పైగా నాకే ఏదో సర్ది చెప్పి పంపడానికి ప్రయత్నిస్తున్నాడు.


నాకు ఎంతో షేం గా అనిపిస్తుంది ఏదో నా సొంత గొడవకోసమో లేక ఏదో పది రూపాయల కోసమో నేను ఆటో వాడి తో గొడవపెట్టుకుంటున్నాడు మనకెందుకు లే అని చూస్తూ కాం గా కూర్చున్నా నా తోటి ప్రయానికులను చూసి, తాగి ఆటో తోల్తున్న ఒక వ్యక్తిని కనీసం ఏమి అనలేని స్థితి లో ఉన్న ఒక పోలీసు ని చూసి. ఇలాంటి వ్యవస్థ, ఇలాంటి మనుషుల  మద్యా మనం తిరుగుతుంది,ఇవేనా మన చదువులు మనకి నేర్పుతున్న సంస్కృతీ. ఎవడో ఏమయితే మనకెందుకు లే ఎవరో ఏదో చేస్తే మనకి అనవసరంలె, మనం ఇంటికి వెళ్ళామా లేదా అని ఆలోచించే అసమర్దుల మద్య మనం బ్రతుకుతున్నందుకు బాధ గా ఉంది.

మా బావ గారు అన్నట్లు "మంచి చేద్దాం అనుకునే వాళ్ళు బయటి కుటుంబాల నుండి వస్తే సంతోషిస్తారు కాని మన కుటుంబం లో నుండి వస్తే ఒప్పుకోరు,మనకెందుకు లే అంటారు జనాలు" అని చెప్పారు అది నిజం. మా బావగారు గొప్ప గొప్ప చదువులు చదువుకోలేదు కాని నేను చెప్పిన దానికి ఆయన చాల పోసిటివ్ గా రియాక్ట్ అయ్యారు, కాని మా ఇంట్లో ఉన్న బా చదువుకున్న,జాబు లు చేస్తున్న వాళ్ళు మాత్రం నీకెందుకు అని నన్ను అపహాస్యం చేస్తూ లైట్ గా తీసుకున్నారు.కాని ఈ రోజు నేను ఒక చిన్న అన్యాయాన్ని ఒక వ్యక్తి గా ఎదుర్కోలేక పోయాను.ఆలోచిస్తే అదే ఒక శక్తి గా ఉంది ఉంటె దాన్ని ఎదుర్కోగలిగే వాడినేమో అనిపిస్తుంది నాకు. ఒక గొప్ప వ్యక్తి అన్నట్లు "ఒక్కడే  పెద్ద బండను(అన్యాయం అనే) తోయలేక మనకు అది కదలదు లే అని వదిలేస్తే అది అలానే ఉండిపోతుంది,అదే వ్యక్తీ పది మందిని కలుపుకుని దాన్ని కదపడానికి ప్రయత్నిస్తే తప్పక కదుల్తుంది". అంటే నేనే ఇంకో పదిమంది ఉన్న శక్తి తో అన్నా కలవాలి లేక నేనే పదిమంది తో ఒక శక్తి ని తయారు చేయాలి అనిపిస్తుంది. అప్పుడే నేను చేయాలనుకునే పనిని ధైర్యం గా చేయగలను లేకపోతె తల దించుకుని ఏమి చేతకాని వాడిలా బ్రతకాలి(అలా బ్రతకడం నా వల్ల కాదు). అందుకే నా స్నేహితుల తో కలిసి మేమే ఒక శక్తి గా ఎందుకు మారకూడదు మారి అన్యాయం పయిన పోరాడే వాళ్లకి ఒక ఉతం లా ఎందుకు హెల్ప్ చేయకూడదు అనే అభిప్రాయం మాలో మొదలయింది.


దీనిని ఆచరణలో పెట్టాలని అనుకుంటున్నాము, దీనికి దయచేసి మీ అమూల్యమయిన సలహాలు,సూచనలు అందిస్తారని ఆసిస్తూ……………….సతీష్.



                                                         

Wednesday, March 23, 2011

ATM రాజు నుండి…. SEPCTRUM రాజ వరకు

 
పుట్టాలంటే లంచం,పుట్టిన తరువాత బ్రతకాలంటే లంచం, ఆకరికి చావాలన్నా లంచం.నిత్యం మన జీవనం లంచం అనే చట్రం లోనే తిరుగుతుంది. ఒకప్పుడు వందలు వేలు లంచం అంటే నే వామ్మో అనుకునే మనం ఇప్పుడు లక్షల కొట్లలో లంచాలను కూడా లైట్ గ తీసుకునే స్టేజ్ కి వచ్చామంటే లంచాలు,మోసాలు ఎంత కామన్ అయిపోయాయో మన బ్రతుకుల్లో అర్ధం చేసుకోవచ్చు.

                                   
ఒక సగటు జీవి గ నా అనుభవం లో అదీ ఒక రోజు లో జరిగిన అనుభవాన్ని పంచుకుంటున్నాను. హోలీ పండుగకు మా సిస్టర్ వాళ్ళ ఉరు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను. సరే చెల్లి వాళ్ళ బాబు కోసం షాపింగ్ చేద్దాం అని చందానగర్ నుండి కుకట్పల్లి ఆటో లో బయలుదేరాను, కుకట్పల్లి లో ఆటో దిగిన తరువాత ఆటో వాడు మీటర్ మీద 10 రూపాయలు ఎకష్త్ర అడిగాడు, సరే వాడితో ఎందుకు లే గొడవ అని ఆ పది రూపాయలు ఇచ్చి షాప్ లోకి వెళ్ళాను.

షాపింగ్ చేస్తూ కొన్ని ద్రెస్సెస్ తీసుకున్నాను వాటిని సైజు చేపిచడానికి షాప్ వాడి దగ్గరికి వెళ్ళాను,అక్కడ పెద్ద క్యు ఉంది. వాడు "సార్ మీది ముందు ఇవ్వాలంటే ఏమన్నా చాయ్ కి డబ్బులు ఇవ్వండి" అన్నాడు సరే చాలా దూరం వెళ్ళాలి కదా లేట్ అవుతుందని వాడికి 20 రూపాయలు ఇస్తే వాడు 20 నిముషాలలో మన డ్రెస్ కుట్టి ఇచ్చాడు. అలా తొందరగా ఇంటికి చేరుకున్న. నెక్స్ట్ డే ఆఫీసు నుండి డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ కి వెళ్లాను,రిజర్వేషన్ దొరకలేదు, సరే జనరల్ సీట్స్ టికెట్ తీసుకుందామని చుస్తే క్యూ పెద్ద రైల్ అంత ఉంది. అప్పుడు ఒకామె వచ్చి టికెట్ కి ఎగాష్ట్రా 50 రూపాయలిస్తే 10 నిముషాలలో టికెట్ తీసుకొస్తా అని చెప్పింది సరే ఇదేదో బానే ఉంది లే పొతే పోనీ అని ఎగాష్ట్రా మనీ ఇస్తే 10 నిముషాలలో టికెట్ తెచ్చి చేతిలో పెట్టింది.

సరే ఇంకా ట్రైన్ కి టైం ఉంది గా అస్సలే మనం వెళ్ళేది పల్లెటూరు అక్కడ ATM లు ఉండవు అని రైల్వే స్టేషన్ లో ఉన్న ATM దగ్గరకు వెళ్ళాను,అక్కడ సెక్యూరిటీ అతను(పేరు రాజు) ఎంతో గౌరవం గా డోర్ తీసి సలాం కొట్టి మరి లోపలి వెళ్ళమన్నాడు, మనీ డ్రా చేసి బయటికి వచ్చేటప్పుడు అంతే గౌరవం తో డోర్ తీసి చాయికి డబ్బులు అడిగాడు,అతని చేతిలో చిల్లర 5 రూపాయలు పెట్టి ట్రైన్ దగ్గరికి వెళ్లాను. ట్రైన్ లో జనరల్ సీట్స్ అన్ని ఫుల్ అయ్యాయి, ఎటు చుసిన సీట్ దొరకలే ఇంతలో ఒకతను వచ్చి సర్ 20 రూపాయలిస్తే సీట్ ఇస్తా సర్ అన్నాడు ఇది బానే ఉందని వాడి చేతిలో 20 రూపాయలు పెట్టి సీట్ తీసుకుని కూర్చున్నాను.

ట్రైన్ స్టార్ట్ అయింది చుట్టూ పక్కల వారి పిచ్చాపాటి స్టార్ట్ అయింది.అప్పుడు కళ్ళు మూసుకుని ఆలోచించాను ఇలా నాకు లానే ఈ ట్రైన్ లో ప్రయాణిస్తున్న సగం మంది ఇలానే ATM  రాజు దగ్గరనుండి సీట్ కొనుక్కునే వరకు ఏడూ ఒక రూపం లో లంచం చుట్టూ తిరిగిన వాళ్ళే కదా.....? ఇలా రోజు ఎంతో మంది ఇలానే ఉన్నారు కదా అనిపించింది. అంటే లంచం అనేది ఒక్క రూపై నుండి మొదలయి లక్షల కోట్లలో రోజు చేతులు మారుతుంది. ఒకప్పుడు అనుకునే వాడ్ని SPECTRUM స్కాం లో లక్షల కోట్లలో Raja స్కాం చేస్తే ఏ  సామాన్యుడు సరిగా స్పందించట్లేదు అని. కాని ఇప్పుడే అర్ధమయింది ప్రతి వ్యక్తి ప్రతి రోజు లంచం అనే స్కాం లో ఏదో ఒక భాగం గా మారిపోయాడని,కాకపొతే ఒక్కోకరిని బట్టి ఒక్కో రేటు ATM Raju ది 5 రూపాయల స్కాం, ఆటో వాడిది 10 రూపాయల స్కాం, రైల్ సీట్ వాడిది 20  రూపాయల స్కాం, రైల్ టికెట్స్ వాడిది 50  రూపాయల స్కాం అయితే SPECTRUM Raja ది లక్షల కోట్ల స్కాం అదే తేడా.అందుకే ఏ వ్యక్తీ ఈ స్కాంలను ధైర్యం గా ప్రశ్నించే నైతిక హక్కు కోల్పోయాడు.

అందరం కలసి రాజ లాంటి వాళ్ళ మీదో లేక బడా బాబుల మీదో చర్య తీసుకుంటే ఈ లంచం అనే రోగం మాసిపోద్ది, అనుకునే ముందు మన మీద మనం చర్య తీసుకుని,ఎవరికి వారు వాళ్లకి పట్టిన రోగాన్ని బాగు చేసుకున్న రోజే ఈ చీడలా పట్టిన ఈ రోగం శాశ్వతంగా మనల్ని మన దేశాన్ని వీడి పోతుంది అని

ఆశిస్తూ…………….సతీష్

Friday, March 18, 2011

ఎందరో మహానుభావులు


ఎప్పుడూ వస్తున్నట్లే ఆ రోజు కూడా కొన్ని మెయిల్స్ ఉన్నాయ్ నా ఇన్ బాక్స్ లో.కాలిగానే ఉన్నాం కదా అని ఒక్కొక మెయిల్ ఓపెన్ చూస్తున్న కొన్ని ఫన్నీ మెయిల్స్ కొన్ని ఆఫీసు మెయిల్స్ అలా చూస్తుంటే మా ఫ్రెండ్ దగ్గరినుండి వచ్చిన ఒక మెయిల్ ఓపెన్ చేసాను.చూస్తే దాంట్లో  “ఇంటర్ ఎగ్జామ్స్ రాయబోతున్న అంధ విద్యార్దుల కు స్క్ర్యబ్ గ హెల్ప్ చేయాలి” అంటే అంధ విద్యార్దులు చెప్తుంటే మనం వారి ఎక్షామ్ రాసి పెట్టాలి.ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కింది నుంబెర్స్ ని కాంటాక్ట్ చేయండి అని ఉంది.

ఒక్కసారిగా ఆ మెయిల్ చూడగానే మనకి దేవుడు ఒక మంచి అవకాశం అందించాడనే ఫీలింగ్ కలిగి మా ఫ్రెండ్స్ అందరికి ఆ మెయిల్ ఫార్వార్డ్ చేసాను.వెంటనే ఆ నెంబర్ కి కాల చేసి మేము వస్తాం ఎక్షామ్ రాస్తాము అని నేను మా ఫ్రెండ్ చెప్పాము, వాళ్ళు మాకు అడ్రస్ ఇచ్చారు. ప్రొద్దున 8am కి ఈస్ట్ మారేడుపల్లి లో ఎక్షామ్.మేము ఉదయం 7:30 కి అక్కడికి చేరుకున్నాము.అక్కడ స్కూల్ ప్రిన్సిపాల్ మాడం రాజేశ్వరి గారిని కలిసాము.ఆమెను చూస్తే ఈ లోకం లో మంచితనం ఇంకా బ్రతికే ఉంది యా మంచితనం ని ఇంకో పదిమందికి పంచుతుంది అని చెప్పడానికి ఆమె ఒక గొప్ప ఉదాహరణ.ఆమె పలకరిమ్పులోనే ఏదో తెలీని ఆత్మీయత ఎదుటివారికి ఇంకా ఏదో చేయాలి, వారితో చేపిచ్చాలి అనే ఆత్రుత మనకి కనిపిస్తుంది.





నేను మా ఫ్రెండ్ ఆమెను కలవగానే ఆమె ఎంతో ప్రేమతో మమ్మలను పలకరించారు, నాకు సైదులు అనే ఒక కుర్రది ఎక్షామ్ రాసే అవకాశం ఇచ్చారు.మా ఫ్రెండ్ ని బాక్అప్ గ ఉండమన్నారు అంటే ఎక్షామ్ కి ఎవరన్నా రాలేకపోతే  తనని పార్టిసిపేట్ చేయమన్నారు. అప్పుడు మేము ఆ పిల్లలతో మాట్లాడితే వారికి అంధత్వం అనే లోపం ఉన్నట్లు వారిలో ఏ ఒక్కరి మాటల్లో మాకు కనిపిచలేదు అంటే ఆ స్కూల్ వారు ఆ మాడం వాళ్ళని ఎంతగా ఆ లోటు తెలీకుండా చుసుకున్తున్నారో అర్ధమయింది.

ఇంకా గొప్ప విషయమేంటంటే అలా హెల్ప్ చేయడానికి వచ్చిన వారందరూ కాలేజి స్టూడెంట్స్ & జాబు హోల్డర్స్.అందులో కొంతమంది సెలబ్రిటిస్ కుడా ఉన్నారు పేరు "హిమ బిందు" తను సింగర్ (సింగర్ "హేమ చందర్"  వాళ్ళ సిస్టర్ ). మిగతా వారు "మని" (INDIA INFOLINE), "రమ్య"(Honeywell),"ప్రతాప్ రెడ్డి"(MBA student), "నగేష్"(CA ). నాకు తెలిసిన వరకు వాళ్ళ వివరాలు ఇవి అలానే మిగిలిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను. మీ లోని మంచితనాన్ని ఇలానే పెంచి ఎదుటి వారికి సహాయం ఎల్లప్పుడు చేస్తారని ఆశిస్తున్నాను.

   
కొంతమందికి అవకాశం రాక చేయలేకపోయి ఉండొచ్చు. అలా చేద్దాము అని మనసులో ఉన్నవారికి కనీసం నా బ్లాగ్ ద్వారా అన్నాతెలియచేద్దామని నా చైనా ఆశ. మిగిలిన ఎక్షామ్స రాయడానికి  ఎవరికన్నా ఇంటరెస్ట్ ఉంటె మీ విలువయిన సమయాన్ని కేతాయిద్దము అనుకునే వారికి ముందుగా ధన్యవాదాలు తెలియచేస్తూ మీకు వివరాలు అందిస్తున్నాను.

Name: Abraham
Number: 9866858664

Name: Rajeswari
Number: 9440359234.



మంచితనాన్ని పెంచుకుందాం దాన్ని పదిమందికి పంచుదాం అని ఆశిస్తూ............   సతీష్                                                           

 

Tuesday, March 1, 2011

బాపు నువ్వయినా ఈ అరాచకాన్ని ఆపు


“దేన్నయిన డబ్బుతో కొనగలవేమో కాని మనిషి ప్రాణాన్ని కొనలేవు” ఇది ఒకప్పుడు పాత సినిమాలో డయలాగ్. ఒకప్పుడు అని ఎందుకు అన్నానంటే ఇప్పుడు అది నిజం కాదు గనుక. నిజమే ఇప్పుడు ప్రాణాన్ని చాలా సులువుగా లెక్క కట్టేస్తున్నారు ఎవరో కరుడ కట్టిన కసాయివాడు కాదు, మనం ఎన్నుకున్న మనల్ని పరిపాలిస్తున్న ప్రభుత్వమే మన ప్రాణానికి  లెక్క కట్టి ఇస్తుంది. త్వర లో బడ్జెట్ లో కూడా సగటు మనిషి ప్రాణానికి ఇంత అని కరీదు కట్టి బడ్జెట్ కేటాయించినా ఆశ్చర్యపడే పని లేదేమో.


మొన్న ముదిగొండ,బషీర్బాగ్ నిన్న ఉస్మానియా యునివెర్సిటీ,సోంపేట నేడు వట్టి తాండ్ర, కాకరాపల్లి.ఎక్కడయినా ఏ చోటయిన ఇదే జరుగుతుంది. పొట్ట చేత పట్టుకుని తన బ్రతుకు తను బ్రతకడం కూడా కష్టం గా మారిపోఇంది మన రాష్ట్రం లో. ఒకప్పుడు ఏ ఉప్పెన వస్తుందో ఏ గండం వస్తుందో అని సామాన్యుడు ప్రకృతి భీబత్సాలకు భయపడుతూ బ్రతికే వాడు, కాని ఇప్పుడు ఏ ప్రాజెక్టులు వస్తాయో తమ బ్రతుకుల్లో నిప్పులు పోస్తాయో తమ గుండెల్లో తుపాకు గుండ్లు దిగుతాయో అని  భయం తో బ్రతుకుతున్నారు.

మనం ఎన్నుకున్న నాయకులు,మన రక్షణ కోసం ఉన్న భటులు మనల్నే చంపుతున్నారంటే ఎంత దారుణం. ప్రజలేమి స్కాములు చేసి అడ్డంగా దోచుకున్న సొమ్ము కోసం తిరగ పడట్లేదు,వాళ్ళేమి అధికార దాహం కోసం పోరాడట్లేదు.పిడికెడు పొట్ట కోసం,వారి పిల్లల భవిష్యత్తు కోసం ప్రాణ పోరాటం చేస్తున్నారు. కాని మన స్వార్ద ప్రభుత్వాలు వారి వారి ప్రయోజనాలకోసం ప్రాజెక్టుల పేరు అడ్డం పెట్టుకుని సామాన్యుడి ప్రాణాలను ఖాతరు చేయకుండా వారిని చంపి వాళ్ళ శవాలకు లెక్క కట్టి వాటి మీద ప్రాజెక్టులను నిర్మించడానికి కూడా వెనుకాడట్లేదు. అంటే మనకి సామాన్యుడి ప్రాణం కన్నా ప్రాజెక్టులు ముఖ్యమయ్యాయా….?
అభివృద్ధి కి ఎవరూ వ్యతిరేకం కాదు అలానే అదే అభివృద్ధి కొంతమంది స్వార్ధానికి ఉపయోగపడి,సామాన్యుడి మనుగడకే ముప్పు కలిగించే లా ఉంటే ఎవరూ ఊరుకోరు దానికోసం ప్రాణాలను సైతం లెక్క చేయరు. అలాంటి పరిశ్తితులను అర్ధం చేసుకుని చర్చించి సమస్యను సామరస్యం గ పరిష్కరించాల్సిన ప్రభుత్వం అరాచకం గా సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడి ఆ ప్రాణాలను కాగితపు ముక్కలతో లెక్క కట్టడం దురద్రుష్టకరం. ఆకరికి సాటి మనిషి  ప్రాణాన్ని కూడా డబ్బుతో లెక్క కడతారని ముందే తెలిస్తే మన గాంధీ గారు తన బొమ్మ ని ఏ ఒక్క కరెన్సీ నోట్ మీద వేయొద్దని ప్రాదేయ పడేవారేమో పాపం." బాపు ఈ అరాచకాన్ని నువ్వయిన ఆపుతావని ఆశిస్తూ.........
(ఫోటోలు ఈనాడు వారి సహాయం తో) 


మీ...................................................................సతీష్.

Friday, February 25, 2011

నాగరికం లో ఆటవికం

 నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని………
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని…….


అని మన సిరివెన్నెల గారు కొన్ని సంవత్సరాల క్రితం తన ఆవేశాన్ని పాట రూపంలో మలిచారు. కాని ఇప్పుడు అగ్గితో కాదు కదా  యాసిడ్  తో కడిగినా  ఈ సమాజం మారదేమో అనిపిస్తుంది. 
మన వాళ్ళు  పాత ట్రెండ్ ని  మళ్ళీ ఇష్టపడుతున్నట్లు, ఉదాహరణకు  ఒకప్పుడు వోల్డ్ సినిమాలలో హీరోలు యూస్ చేసిన హెయిర్ స్టైల్స్ వాళ్ళ డ్రెస్సింగ్  ఇప్పుడు మళ్లీ కొత్త ట్రెండ్ గా మనం 
యూస్ చేస్తున్నాం ఇలా మనం అభివృద్ధి చెందుతున్న కొద్ది తిరిగి వెనక్కి వెళ్తూ ఆకరికి ఆటవిక సంస్కృతికే చేరుతున్నామేమో అనిపిస్తుంది.  ఆటవికుల గా మానవుడు బ్రతికినంతకాలం తన
మన బేధం లేకుండా ఒక మృగం లా బ్రతికాడు అలానే మళ్లీ మనం మానవతా విలువలను మర్చిపొఇ మనకి మనమే భాషా అభిమానం ప్రాంతీయ అభిమానం అంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళం బౌతిక దాడులకి దిగి మనిషిని మనిషే చంపుకునేలా తయారవుతున్నాం.


మొన్నటికి మొన్న జయప్రకాశ్ నారాయణ గారి మీద దాడి ఎంత బాధాకరం. ఆకరికి అసెంబ్లీ ఆవరణ లో కూడా ఒక వ్యక్తి తన అభిప్రాయాలను స్వేచ్చగా వ్యక్తపరచాలేరా ఈ స్వతంత్ర భారతం లో …? బ్రిటిష్ వారి కాలం లో కుడా ఇలా లేదేమో.ఒక సామాన్యమయిన వ్యక్తి వచ్చి ఒక మాజీ IAS అధికారి, మరియు ఒక MLA మీద  దాడి చేసే పరిస్తితి వచ్చిందంటే అదీ అసెంబ్లీ ప్రాంగణం లో...  మనం మన రాజకీయాలు ఎంత దిగజారాయో అర్ధమవుతుంది.ఎందుకు దాడి చేసారు అంటే అయన(JP ) ఒక ప్రాంతం వాళ్ళను రెచ్చకోట్టారు అందుకే అని సమాధానం ఇచ్చారు ….. వినడానికి నవ్వొస్తుంది,అంటే ఒక  రాజకీయ నాయకుడు పరుష పదజాలం,బూతులు మాట్లాడకుండా రాజ్యాంగం దానిమీద మన హక్కులు మన వ్యవస్థ గురించి స్వచ్చమయిన బాషలో మాట్లాడితే అవి బూతులు కన్నా పెద్ద పాపపు మాటల్లా వినపడ్డాయి మన నాయకులకు.



అది వారి తప్పు కాదులెండి ఏ రాజకీయ నాయకుడికి అవ్వన్నీ అవసరం లేదు ఎప్పుడు అలాంటి పదాలు వినలేదు, మాట్లాడలేదు కదా.... అందుకే  తెలీక అవేదో బూతు   పదాలల వినిపిచి ఉంటాయి పాపం. కాని అందరం సిగ్గు తో తల దించుకోవాలి ఒకప్పుడు రాజకీయ నాయకుడు అవ్వాలంటే పది మంది రౌడిల బలం ఉండాలి కాని ఇప్పుడు అసెంబ్లీ కి వెళ్ళాలంటే అతనే ఒక రౌడి అయి ఉండాలి.కుళ్ళు,స్వార్ద రాజకీయాల కోసం పాకులాడుతూ విద్యార్దుల భవిష్యత్తు, సామాన్యుడి బ్రతుకులను పాడుచేస్తూ మంచి వారి  మీద దాడి చేస్తూ ఉంటె భవిష్యత్తులో మంచి చేద్దామనుకునే వ్యక్తి అంటూ రాజకీయాలలో అడుగుపెట్టడానికి కూడా ఆలోచిస్తారేమో.....


 
ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడటం కన్నా ఎవరికి వారు ఇలాంటి రాజకీయాలకు వ్యతిరేకం గా పోరాడాలి. స్వార్ద ప్రయోజనాలకోసం చేసే బంద్ ల ను దీక్షలను మనమే స్వచ్చందం గా బహిష్కరించాలి  మనల్ని పావులుగా చేసే ఈ చదరంగం లో మనమే పోరాడాలి.మనల్ని మన సమాజాన్ని బాగు చేయకపోయినా కనీసం నైతిక విలువలను కోల్పోకుండా చూసే బాద్యత మన మీద ఉంది… మనం చదువుకున్న ఈ చదువులు మనం బ్రతుకుతున్న ఈ స్వేచ్చ ని మన భవిష్యత్తు తరాలకు అందేలా చూడాలి, అంటే మనం ఇప్పటికన్నా కళ్ళు తెరవాలి.గొర్రెల లా ఈ నాయకుల వెనుక నిలబడకుండా మనిషి లా ఆలోచిద్దామని ఆశిస్తూ……




మీ సతీష్..............................................................