Pages

Thursday, April 7, 2011

జన లోక్పాల్ బిల్లు…..అవినీతికి చిల్లు

బాబా BP ఇంతుంది, షుగర్ అంతుంది,బాబా ఆరోగ్య పరిస్థితి మీద ప్రత్యేక బుల్లెటేన్. KCR ఇప్పుడు ఏమి చేస్తున్నారు.తెలుగు దేశం లో వర్గ పోరు.కడప ఎలేక్షన్స్ లో అబ్యర్దులు ఎవరు చూస్తూనే ఉండండి కాసేపట్లో.. TV ఆన్ చేస్తే చాలు ఉదయం మొదలు రాత్రి పడుకునే వరకు ఇదే వార్తలు ఒక వారం రోజులు గా. ఇవి వార్తలు కావు అని నా అభిప్రాయం కాదు.మూడు రోజులు గా ఆమరణ నిరాహార దీక్ష(మన రాజకీయ నాయకుల దీక్షల లాంటిది కాదు లెండి) చేస్తున్నా ఏ APమీడియా మిత్రులకు కనిపచ్చలేదు.

                                                                       
బాబా చాలా మంచి వ్యక్తే కాదని నేను అనను ఆయన చాలా స్వచ్చంద సేవలను చేసిన గొప్ప వ్యక్తే అందులో ఎటువంటి అనుమానం లేదు.కాని బాబా చావుని బేస్ చేసుకుని వారి ట్రస్ట్ లో ఏదో కుంబకోణం జరుగుతుంటే బాబా ఆస్తుల మీద,అది వదిలేసి ఈ మీడియా లేని పోనీ హడావుడి చేస్తూ TRP రేటింగ్ కోసం రోజంతా అదే న్యూస్.మా అంటే బాబా ఒకటి లేదా రెండు కోట్ల మంది కి ఆరద్యులు,ఇక తెలంగాణా ఉద్యమం నాలుగు కోట్ల మంది ఆశయం, కాని మన "అన్న హజారే" గారు చేసే ఉద్యమం నూట ఇరవయ్ ఒక్క కోట్ల మంది కి ఉపయోగపడే ఉద్యమం.అలాంటి ఉద్యమం గురించి ఒక్క అయిదు నిముషాలు చూపించే టైం మన AP మీడియా కి లేదు అంటే చాలా సిగ్గుగా ఉంది.

ప్రపంచం లో ఏ విషయం ఎవరికి తెలియాలన్న మీడియా నే మూలా కారణం. అలాంటిది "అన్న హజారే" గారి ఉద్యమం కాని,"జన లోక్పాల్ బిల్లు" కాని మనలో చాలా మందికి తెలీదు అంటే మన మీడియా దాని గురించి యెంత పట్టిచ్చుకుంటుందో అర్ధమవుతుంది.మల్లి మీడియా లో పెద్ద పెద్ద ప్రకటనలు "అవినీతి ని అరికడదాం","ఫ్యాక్షనిస్టుల ఆస్తులను ప్రభుత్వానికి అప్పచెప్పండి". ఇలా లేనిపోని స్పీచులు ఇవ్వడం తప్ప చేసేది ఏమి లేదు.మ్యాచ్ గెలిస్తే బట్టలు ఇప్పుకుని తిరిగుతా అని ఒక మోడల్ చెప్తే అది హెడ్ లైన్స్ లో వేసే మన మీడియా 72 సంవత్సరాల వ్యక్తి మన కోసం మన భవిష్యత్తు తరాలకోసం పోరాడుతుంటే వీరికి కనీసం చీమ కుట్టినట్లు కుడా అనిపిచ్చట్లే.ఆయన పోరాడేది అవినీతి మీద,ఆయనకు దూరం గా ఉండేది అవినీతిపరులు,అంతేలే మీడియా కుడా ఎప్పుడో అవినీతి రొచ్చు లో కూరుకుపోయింది కాబోలు అందుకే దూరం గ ఉంటున్నారు పాపం.

"జన లోక్పాల్ బిల్" 42 సంవత్సరాలు గా ఆమోధపొందని  బిల్లు.నిజంగా ఈ బిల్లు ఆమోదం పొందటానికంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కాలి ఎందుకంటె ప్రపంచం లో ఏ బిల్లు ఇన్ని సంవత్సరాలు ఆమోదం పొందకుండా లేదు అనుకుంట.ఏమవుతుంది ఈ బిల్లుని ఆమోదిస్తే ఈ రాజకీయ నాయకుల కుర్చీలు కదులుతాయి కాబోలు .. లేక చెదలు పట్టి పేరుకుపోయిన ఈ బడా బాబుల డబ్బులు చేదురుతాయి కాబోలు... ప్రతి ఒక్కడు ఏ స్టేజి లో ఉన్నాడంటే అవినీతి కి వ్యతిరేఖం గా పోరాడే "హజారే" గారికి సప్పోర్ట్ గ ఒక స్టిక్కర్ ని తన వాహనానికి అంటిచుకోమని అడిగితే నాకేమి ఇస్తారు అనే రీతిలో అవినీతి పేరుకుపోయింది మన దేశం లో.

దయచేసి ఇప్పటికన్నా "JANA  LOKPAL BILL " అవసరం ఏంటో, అసలు ఆ బిల్లు వలన మనదేశానికి ఉపయోగమెంతో తెలుసుకుందాం. ఆ బిల్లు ను ఆమోదిన్చేదాక మన వంతుగా "అన్న హజారే" గారికి మన పూర్తి మద్దతుని అందిద్దాం అని ఆసిస్తూ……………..సతీష్.

I support  JANA LOKPAL BILL...........

R U......?



జై భారత్ మాత కి జై.

5 comments:

  1. ఏ భాష లొ లేనన్ని వార్తా చానల్స్ - పనికిమాలిన చెత్త కబుర్లు
    జగన్, బాబు, కిరణ్, చిరంజీవి - వీళ్ళు ప్రధాన పాత్రలు
    పూర్వ జన్మ, ఆడియో ఫన్షన్లు - దిక్కు మాలిన ప్రోగ్రాములు
    హీరో గారి పెళ్ళి విడియో - అది చూడక ఫోతే సగం మంది చస్తారు
    ఈ సోది చెప్పటానికి - మరో పది చానల్స్ అవసరం

    ReplyDelete
  2. naakuu.... chalaa baadha ga anipinchndi
    assalu okka telugu news channel annaa hazaare gaari gurinchi choopinchaleydu ,anni national news channels aey choopinchaye ,yedemainaa ee sari aayana aashayam saadinchaalani ashisthunnnanu ,,,daaniki naa vanthu krushi eppudu untadhi
    "JAIHIND"

    ReplyDelete
  3. మన న్యూస్ ఛానల్ వారికి ఈ రోజు గుర్తొచ్చింది అన్న హజారే గారి ఉద్యమం.అదీ ఎందుకంటె దేశమంతా ఒక్క తాటి మీదకు వస్తుంది సో మనం కూడా చూపిస్తే TRP రేటింగ్స్ బావుంటై అని ఈ రోజు మన AP మీడియా కి గుర్తుకు వచ్చింది పాపం

    ReplyDelete
  4. hi. satish chala bagundi matter.. ila blogs lo entha cheppina tv llo cheppina sms lu panpina no change manalo.. no chala change vachindi ani evaraina anagaluguthara?..

    ReplyDelete
  5. Thanx for ur comment aunty. Hazare gaari udyamam chaala mandi yuvatha lo oka maarpu techindi. Daanni ippatikyina mana media gurthinchi support chesthe chaala santosham. Idi aarambame kaani antham kaakudadhu.

    ReplyDelete