టైం ఉదయం ఆరు అవుతుంది అప్పుడే లేచి హాల్ లోకి వస్తున్న నాకు ఇంట్లో ఏదో గొడవ అవుతున్న గోల వినిపిస్తుంది.ఇంత పొద్దున్నే ఎవరబ్బా అని కాస్త కంగారుగా హాల్ లోకి వెళ్లి చూస్తే, ఇంకెవరు మన టీవీ న్యూస్ చానెల్ వాళ్ళు. పని పాట లేని వో నలుగురు నాయకులు వాళ్లకి తోడు నారద ముని లాంటి(ఆ నారద ముని లోక కళ్యాణం కోసం చేస్తే వీలు మాత్రం TRP రేటింగ్స్ కోసం) ఒక యాంకర్ కల్సి కొద్దిగా కూడా ఉపయోగం లేని ఒక మేటర్ గురించి చర్చా కార్యక్రమం అంట. దాన్ని చర్చ అనడం కన్నాపనీ పాట లేని ఉప్పర మీటింగ్ అనడం కరక్టేమూ.
సరేలే అని వేరే చానెల్ మారిస్తే అక్కడ ఇదే తంతు బట్ కారక్టేర్స్ డిఫరెంట్ అనమాట.పొద్దున్నే కాకి గోల తప్ప ఆ గొడవలో లాస్ట్ కి వీళ్ళు ఏమి చెప్పదలుచుకున్నారో చెప్పేలోపే మన TV యాంకర్ గారు టైం అయిపాయింది చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు చూస్తూనే ఉండండి నిరంతరవాని మా చావుకి భాని అన్నట్లు చర్చకి వచ్చిన నాయకులని బఫ్ఫూన్ ల లా వదిలేసి ఒక యాడ్ వేసుకుంటారు, అయినా మన నాయకులు సిగ్గు ఎగ్గు లేదు అన్నట్లు పిలిచినోడే పాపం అన్నట్లు మళ్లీ వేరే చానెల్ వాడు పిలిస్తే మళ్లీ ఉరుకుతారు.
మన నాయకులే కరెక్టుగా ఉంటె ఈ గోలంతా TV వాల్లకెందుకు ఈ చావు గోల పొద్దు పొద్దున్నే మన ఇళ్ళల్లో ఎందుకు చెప్పండి. ఒకప్పుడు ఇన్-డైరక్టుగా నాయకుల పేర్లు చెప్పి కార్టూన్ బొమ్మల ద్వారా కామెంట్ చేసే TV వాళ్ళు ఇప్పుడు నాయకుల పేర్లు డైరెక్ట్ గా పెట్టి వారి ఫేస్‌లను మాస్క్ ల లా ధరించి డైరెక్ట్ గా ఒకర్ని ఒకళ్ళు మామూలు బాషలో కాకుండా చెవులకు చిల్లులు పడే బూతులలో తిట్టుకునే ప్రోగ్రామ్స్ చేస్తుంటే ఏ నాయకుడు ధైర్యంగా ముందుకొచ్చి ప్రశ్నించే హక్కు లేక "ఎవడిగోల వాడిది" అని వదిలేస్తున్నారంటే వీళ్ళెంత నీతిమంతులో అర్ధమవుతుంది మనకు.ప్రతి పార్టీ ఒక న్యూస్ చానెల్ పెట్టుకోవడం,ఒక పది మందితో ఎదుటి పార్టీలను తిట్టించడం చూస్తుంటే భావితరాల వారిని పోలిటిక్స్ నేర్చుకోవడానికి కాలేజెస్ కి పంపకుండా TV ల ముందు కుర్చోపెడితే చాలేమో అనిపిస్తుంది.
అయోధ్య తీర్పుని నాలుగు అయదు రెచ్చకొట్టే క్లిప్పింగ్స్,రెచ్చకొట్టే సాంగ్స్ బ్యాక్ గ్రౌండ్ లో వేసి ఒక గంట ప్రోగ్రాం పెట్టి అమాయక జనాలను రెచ్చకోట్టడం, డ్రగ్స్ మాఫియా అని ఒక న్యూస్ స్టార్ట్ చేయడం మా దగ్గర అందరి లిస్టు ఉంది అని బ్లాకు మెయిల్ చేయడం డబ్బులు దొబ్బడం లాస్ట్ కి జనాల్ని పిచ్చి వాళ్ళని చేయడం(ఆ లిస్టు లో ఉన్న పెద్ద వాళ్ళ పేర్లను ఫస్ట్ లోనే బయట పెట్టొచ్చుగా),ఒక అమ్మాయి మీద దాడి జరిగితే ఆ అబ్బైని పెద్ద స్టార్ ని చేయడం తరువాత కాం అవడం,ఏ TV వాడు వాళ్ళ నాయకుడి వివరాలు తప్ప సమాజం లో ఏమి అన్యాయం జరిగినా మనకి అనవసరం అనుకోవడం,తెలంగాణా లో విద్యార్దులను ఇక్కడ, ఆంధ్రాలో విద్యార్దులను అక్కడ రెచ్చ కొట్టి న్యూస్ క్రియేట్ చేసుకోవడం,అవసరమయితే హత్యను ఆత్మ హత్య గా,ఆత్మ హత్యను హత్యగా క్రియేట్ చేయగలడం,ధనం తప్ప జనం గురించి ఆలోచించకపోవడం.ఇలాంటి ఎన్నో అర్హతలు ఉంటేనే ఈ కాలం లో పోటీని తట్టుకుని TRP రేటింగ్స్ తెచ్చుకోగలరు.
200 సంవత్సరాలు మనల్ని పరిపాలించిన ఈస్ట్ ఇండియా కంపెనీ కి ఇప్పుడు CEO ఒక ఇండియన్ అయ్యాడు,30 సంవత్సరాల వయసు ఉన్న ప్రణవ్ అనే వ్యక్తి మన బాడీ నే కంప్యూటర్ గా డిజైన్ చేసాడు,ఇలాంటివి మన ఛానల్ వాలకి న్యూస్ ల కనిపిచదేమో,కనీసం మన దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుల చరిత్ర గురించి చూపిచ్చే టైం మాత్రం మన న్యూస్ చానెల్స్ కి, పేపర్స్ కి ఉండదు కాని,రాంగోపాల్ వర్మ కి విజయవాడ లో ఉన్న ఒక నాయకుడికి మద్య గొడవ లేపడం దాన్ని 24/7 చుపిచడానికి మాత్రం విసుగురాదు. ప్రతీ న్యూస్ చానెల్ ప్రజల సమస్యలను చూపిచ్చి కాష్ చేసుకుంటుంది కాని ఏ ఒక్క న్యూస్ చానెల్ ప్రజల సమస్యతీరే వరకు వారికి తోడుగా నిలవడం లేదు అన్నది జగమెరిగిన సత్యం.
మీడియా నే మన సమాజానికి నాలుగో పాదం అంటారు,నాలుగో పాదం లెకపొఇన మనం కుంటుకుంటూ గడపగలం కాని ఆ నాలుగో పాదమే మిగిలిన మూడు పాదాలను నాశనం చేస్తుంటే ఎలా.రోజు TV లో ఆ చర్చ గోష్టి చూసి బోర్ కొట్టి నేను నా ఆవేదనను రాయట్లేదు,మన సమాజానికి సమాజం లో ఉండే వ్యక్తులకి అవి ఎంత చేటు చేస్తున్నాయో ప్రత్యక్షంగా చూసి బాధపడుతూ రాస్తున్నాను, పార్టీల వారి మద్య తగాదాలు పెట్టి ఆయా పార్టీలను అభిమానించే సామాన్యుల మీద ఈ ప్రభావం పడి వారు మానవత సంబందాలు మానేసి ఏదో సొంత కక్షలులా వారి మనస్సులో పాతుకుపోయేలా ప్రేరేపిస్తున్నారని నా అభిప్రాయం, ఎలాగు మన నాయకులు,వారి న్యూస్ చానెల్లు మారే ఛాన్స్ లేదు కాని దయచేసి అదీ చూసి మనం మాత్రం మారవద్దు అని ఆసిస్తూ………
Your’s…………………………………….సతీష్.
మీ ఫస్ట్రేషన్ తో ఏకీభవిస్తున్నాను.
ReplyDeleteనేను కూడా.
ReplyDeleteఇది అందరిలో ఉన్న ఫ్రస్ట్రేషనే! ఒక్కోసారి నిస్షాయత తో విరక్తి కలుగుతుంది జీవితం మీద! వాళ్ళని మనం ఏమీ చేయలేం కనుక వాటిని చూడ్డం మానేయడం తప్ప వేరే మార్గం లేదు. చాలా మంది ఇలాగే చేస్తున్నారు కూడా! పైగా పిల్లలున్న ఇంట్లో ఈ చర్చలు, వార్తా ఛానెళ్ళు బ్లూ ఫిల్ముల కంటే ప్రమాదకరం!
ReplyDeleteఅన్నట్లు మీ బ్లాగ్ పోస్టు టైటిల్ అద్దిరి పోయింది. :-))
Appreciate your efforts. There is no substitute for lightening the lamp. Hope the "janata" also will open their eyes.
ReplyDeleteమన ఈ చిరాకు టీవీ వాళ్లకి లేదా ఈ నాయకులకు ఎప్పుడూ అర్ధమవుతుందో.........
ReplyDeleteథాంక్స్ సుజాత గారు.....
don watch such news channels.. there are so many other sites on internet to know news
ReplyDeleteBabai Feeling same ra ididvaraku News chudalante edo important News untundi kada chuddam anukunevallam Ipudu News chuste only Crimes and Politics gurinchetappa panikivache okka manchi News koda undatam ledu...............
ReplyDelete